15-11-2018, 06:42 PM
లేత గులాబిరంగు చుడీదార్ ..దాని మీద తెల్లని దుపట్టా..నిజంగానే ఆ డ్రెస్ పూజకి చాలా బావుంటుంది..పూజ హెయిర్ తనే సరిచేసి..తృప్తిగా చూసి..బుగ్గ మీద చిన్నగా ముద్దు పెట్టి..ఇప్పుడు అచ్చు అమీషా పటేల్ లా వున్నావ్..ఏ హ్రితిక్ రోషన్ చూసినా ఎగరేసుకుపోతాడే..అని నవ్వింది..పూజ కి అంతా అయోమయం గా వుంది.. "ఏంటే పవీ ...కొంపదీసి నువ్వు కూడా చెన్నై లో విజయ..సుమనల అలవాట్లు నేర్చుకున్నావా? పాపం కిరణ్" అంది ఉడికిస్తూ.. పవిత్ర పూజ తలమీద చిన్నగా మొట్టి.."నోరు ముయ్యవే.. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్..చెన్నై వెళ్ళాకా నిన్ను చాల మిస్ అవుతున్నానే.. అందుకే కొంచం ప్రేమ ఎక్కువైంది అంతే" అంది.
ఇద్దరూ నవ్వుకుంటూ షాపింగ్ కి బయలుదేరారు..కొంత దూరం వెళ్ళాకా..పవిత్ర తన ప్లాన్ బయటకు తీసింది.."అర్రేరే పూజా..నీదగ్గర మనీ ఎంతుందే అంది.." ఆత్రుతగా.. "ఎందుకే? మొన్నే అన్నీ కట్టేసాను హాస్టల్ లో..ఇంకా 1500 వరకు వుంటాయి..ఏంటి? మనీ లేకుండానే షాపింగ్ కి బయలుదేరావా అంది"..నవ్వుతూ.. పవిత్ర ఏదో ఆలోచిస్తున్నట్టు మొహం పెట్టి.. "అది కాదే... నా దగ్గర 2000 వున్నాయి.. కాని వచ్చే నెలలో కిరణ్ పుట్టిన రోజు వుంది.. వాడికి జీన్స్ అంటే చాల ఇష్టం..జీన్స్ లో చాలా బావుంటాడు కూడా కదా...ఇప్పుడు అనిపిస్తుంది..నాకు కొనుక్కోడం మానేసి..వాడికే బట్టలు కొందాం అని..మళ్లీ కుదురుతుందో లేదో..కొనడం..మనిద్దరి దగ్గరా కలిపితే 3500 అవుతాయి..దానికి బట్టలు వస్తాయి..వాడికి ఇష్టమైన గాగుల్స్ కూడా కొందామని వుందే..తప్పా?" అంది గోముగా.. "అమ్మో..మీ అమర ప్రేమ గురించి నేనేమీ మాట్లాడనే బాబు..నీ ఇష్టం..కొంటే బానే వుంటుంది..ఎప్పుడు అబ్బాయిలే మనకు కొనాలా? కానీ ఎలా? " అంది.. కాసేపు దీర్ఘంగా ఆలోచించి పవిత్ర "వావ్..సూపెర్ అని గట్టిగా అరిచింది. "పూజ...నిజంగా లక్కీ నే.. మొన్నసారి వచ్చినప్పుడు కిరణ్ తో కలిసి మహీ వాళ్ళ ఫ్లాట్ కి వెళ్ళాం కదా..అక్కడ నా చిన్న పర్స్ మర్చిపోయాను.. గుర్తుందా? వైలెట్ కలర్ లో వుంటుంది..నువ్వు కూడా బావుందన్నావ్..ఒకసారి..ఆ పర్స్.. అందులో 2000 ఉంటాయే.." అంది.. పూజ అనుమానం గా చూసి " పవీ... కొంపదీసి ఇప్పుడు అక్కడికి వెళ్దామని అడగవుకదా..ఇదిగో ఇప్పుడే చెబుతున్నా.. నేను మాత్రం రాను...వెళ్తే నువ్వే వెళ్ళు నేను ఇక్కడే ఎక్కడైనా వెయిట్ చేస్తాను" అంది.. పవిత్ర పూజ గడ్డం పట్టుకుని.."మా బంగారు పూజ కదూ...ఈ ఒక్క సాయం చేసిపెట్టవే..ప్లీజ్.. నేను ఒక్కదాన్నే కిరణ్ లేనప్పుడు వెళ్తే బాగోదు..నువ్వు పక్కనుంటే పరవాలేదు..రావే..ప్లీజ్.." అని బ్రతిమలాడింది.. ఇక పూజ మెత్తబడక తప్పలేదు.. "కానీ రెండే నిమిషాలు..అంతే.." అని వెళ్ళడానికి వప్పుకుంది.. మహీని కలవడానికి అంటే పూజ ఒప్పుకోదు అని తెలిసి పవిత్ర ఈ నాటకం ఆడింది..
పూజా..పవిత్రా .ఇద్దరూ కాస్సేపటిలో మహీ ఫ్లాట్ ముందు వున్నారు..పవిత్ర ని వాచ్ మెన్ అంతకుముందే చూడడంతో..ఏమి అడగకుండానే పంపించాడు పైకి.. బెల్ కొట్టిన కాస్సేపటికి తలుపు తెరుచుకుంది..