19-08-2019, 10:48 PM
(19-08-2019, 07:14 PM)stories1968 Wrote: తీరని కోరిక
చిన్నప్పుడెప్పుడో ఎవరో అనుకుంటుంటే విన్న మాటలు
సింధూరంలా పూస్తే మంచి మొగుడొస్తాడు
అమ్మలక్కలు చేరి గోరింట పండగానే
ఒకరి చేతులు మరొకరు చూసుకొని
మాటల రూపంలో
పాటల రూపంలో సరదాగా వ్యక్తీకరిస్తుంటే
నాకెలాంటి మొగుడు వస్తాడో అని
ఎదురు చూడని రోజు లేదు
పెళ్లి చూపుల కబురందంగానే
ఒళ్ళంతా పులకింత మల్లెల కవ్వింత
చీకట్లో పెళ్లి చూపులేంటో విచిత్రంగా
అబ్బాయిని చూడడానికి వచ్చినవారి వెటకారం
అమ్మాయి వెన్నెలటగా చీకటైతే మాత్రమేం మరొకరి సరసం
అతన్ని చూసింది లేదు ఆతను మాత్రం అమ్మాయి నచ్చిందని
చేసుకుంటే ఈ అమ్మాయినేనని
నిశ్చితార్ధం పెళ్లి వైగారా అన్ని జరిగిపోయాయి
మధ్యతరగతి ఆడపిల్లకు కలలకు లోటుండదు
జరగకపోవటమే పెద్ద లోతు
ఇంతకుముందు నచ్చిన మనిషి ఇప్పుడొక యంత్రం
ఎపుడైనా అవసరానికే మల్లెపూలు ఒక్కసారైనా
తలలో తురిమితే ఆయన్ని చూసి ముసిముసి నవ్వులు నవ్వాలని
మహరాణిలా మెరవాలని అనుకోని రోజులేదు
యాంత్రిక జీవనంలో తాంత్రిక యవ్వనంలో
అలా రోజులు గడవడమే బూజు దులిపి కోరికలకు
కొత్త చొక్కా తొడిగింది ఎపుడని కాలం గడుస్తున్న కొద్ది
పాతబడుతున్న పరువం రోతగా మారుతున్న జీవితం
తను మారలేదు ..నేను కూడా ఒక్కరోజు
ఒక్కమాట అడగాలి మిమ్ముల్ని అన్నాను
ఏంట చెత్త మాట వికారంగా చూస్తూ
ఒక మనిషిలా ఎప్పుడు ప్రవర్తిస్తారు అని గట్టిగా అడగాలని
నా మాటలు నాగొంతులోనే తన పనిలో తాను
వినే అలవాటు ఆయనకు లేదు చెప్పే తీరిక నాకు లేదు
మౌనమే ఇద్దరిమధ్య దూరమే మనసుల వ్యధ
ఇది కావాలని అడిగింది లేదు ఇది కావాలా అని తెలుసుకుంది లేదు
రోజులు గడుస్తున్నాయి సింధూరం దూరమయ్యింది
మల్లె పూలు చేదయ్యాయి కోరిక మాత్రం అలాగే ఉండిపోయింది
ఒక్క నవ్వు నవ్వి నా వాడు ఒక్క పువ్వు తలలో తురిమి నీకోసమే అంటే
చాలు ఏ ఆడదైనా బానిసే కాదు కాదు ఇష్ట దాసి
ఓ మగమహారాజులు మహరాణిలా కాకపోయినా
కనీసం ఒక మనసున్న మనిషిగా అక్కున చేర్చుకోండి
జీవితం ఇక చాలనిపిస్తుంది .....
ఒక స్త్రీ మనసుని ఎంత గొప్పగా వర్ణించారండీ..
మీకు శతకోటి వందనాలు..
మీ వర్ణనని చదివిన ఎవరైనా తమ తమ జీవిత భాగస్వాములతో మంచిగా ఉండడానికి ప్రయత్నిస్తారు..