Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
మహాభారతం సత్యాలు---అందరు తెలుసుకోవలసినవి
#15
భలే ఉంది  Cool .
సూత స్పటికం ఎక్కడో విన్నాను. కానీ దాని గురించి ఏమీ తెలియదు.Exclamation
విష్ణు సహస్ర నామాల్లో కానీ...
అచమ్య మంత్రాల్లో కానీ శ్రీ రామ శబ్దం ఉండదు. ఎందుకో  Huh
విష్ణు సహస్ర నామాలు అన్నీ చెప్పిన తరువాత ఉత్తరపీఠిక లో అంటే ప్రభావం/ఫలితం చెప్పేటప్పుడు మాత్రం 
శ్రీ రామ రామేతి రామ్ రామ్ మనోరమే 
సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే అంటూ ఈశ్వర ఉవాచగా తెలియజేస్తారు.
అందులోనే విష్ణు సహస్రనామాలు వెయ్య మార్లు జపిస్తే ఒక్కసారి శివసహస్రనామాలు జపించిన ఫలితం 
వెయ్యి శివ సహస్రనామాలు జపించి నట్లయితే ఒక్క సారి లలిత సహస్ర నామాలు జపించిన ఫలితం వస్తుంది. అని చెబుతారు.

శుక్లాంబరధరం 
శశివర్ణం 
చతుర్భుజం 
ప్రసన్న వదనం 
ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే 

తెల్లని వస్తాన్ని ధరించినవాడు 
తెల్లని రంగు కలవాడు
4 భుజములు కలవాడు 
ప్రసన్నమైన ముఖము
ని ధ్యానం చేయండి అందువల్ల విఘ్నములు ఉపశమిస్తాయి.

లక్ష్మీమ్ 
క్షీర సముద్రరాజతనయా 
శ్రీరంగ ధామేశ్వరి 
దాసీభూత సమస్త దేవా వనితాం.
లోకైక దీపాంకురాం 
శ్రీమన్మంద కటాక్ష 
లభ్దవిభవత్ భ్రమింద్ర గంగాధరాం 
త్వామ్ త్రైలోక్య కుటుంబినీం 
సరసిజాం వందే ముకుంద ప్రియాం 

క్షీర సముద్రం లో పుట్టినది., శ్రీ రంగంలో సదా ఉండేధీ.., 
ఆ తల్లికి అందరు దేవీ దేవతలూ సేవ చేస్తూ ఉంటారు.(డబ్బుకు లోకం దాస్యమే కదా)
మనసులో తలుస్తేనే కాటాక్షించే తల్లి లెక్కలేనంత గా వైభవం ఇచ్చే తల్లిని 
బ్రహ్మ, ఇంద్ర, గంగను ధరించిన శివుడు ప్రభుతులు, మూడు లోకములకు ఆరాధ్య అయిన ముకుందునికి  ఇల్లాలు ఆ తల్లిని కొలవండి మనస్సులో తలుస్తేనే కటాక్షిస్తుంది.
Like Reply


Messages In This Thread
RE: మహాభారతం సత్యాలు---అందరు తెలుసుకోవలసినవి - by kamal kishan - 08-01-2019, 06:50 PM



Users browsing this thread: