Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అనైతిక బంధం ఆవిరైంది!
#7
చంపడమా.. చావడమా..
వివాహేతర సంబంధాలతో చేటు
ఆందోళన కలిగిస్తున్న బలవంతపు చావులు
సామాజిక మాధ్యమాల ప్రభావమూ కారణమే
విచ్ఛిన్నమవుతున్న కుటుంబ వ్యవస్థ
ఈనాడు డిజిటల్‌, గుంటూరు



దుగ్గిరాల చెన్నకేశవనగర్‌కు చెందిన ఓ మహిళకు, పెనుమూలికి చెందిన ఓ వ్యక్తికి కొన్నాళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగుతోంది. సదరు మహిళ మరొకరితో సన్నిహితంగా ఉంటున్నట్టు అనుమానించిన ఆ వ్యక్తి పైరుకు పురుగు పట్టకుండా వినియోగించే విషపు మాత్రలను ఆమె నోట్లో వేసి మింగించాడు. అతను కూడా ఆ మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. మృతురాలి కుమారుడు ఈ విషయాన్ని తెలుసుకుని సదరు వ్యక్తిని తీవ్రంగా గాయపరిచాడు.

బొల్లాపల్లిలోని అటవీ ప్రాంతంలో వస్త్రంలో మూటకట్టి ఉన్న ఓ వ్యక్తి మొండెం కనిపించింది. వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని ప్రియురాలి భర్తను దారుణంగా హతమార్చాడు. తల నరికేసి అడవిలో పాతి పెట్టి, మొండేన్ని మూట కట్టి పడేశాడు.

శనివారం అత్యంత పాశవికంగా జరిగిన ఈ సంఘటనలు జిల్లాలో చర్చనీయాంశమయ్యాయి.. శారీరక సంబంధాల నేపథ్యంలో దారుణంగా హత మార్చడం, చావడానికి ప్రయత్నించడం ఆందోళన కలిగిస్తోంది.

ఆదివారం విజయవాడలో ఓ వ్యక్తి తన భార్య తలను నరికి చేత్తో పట్టుకుని రోడ్డు మీద సంచరించడంతో స్థానికులు భయంతో పరుగులుదీయాల్సి వచ్చింది. ఈ ఘటనకు వారిద్దరి మధ్య గొడవలే కారణం.

ఇటీవల కాలంలో వివాహేతర సంబంధాల నేపథ్యంలో హత్యలు, ఆత్మహత్యలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. తమ సంబంధానికి అడ్డువస్తున్నారని భార్య లేదా భర్త ఒకరినొకరు చంపేందుకు వెనకాడట్లేదు. కొంతమంది కన్న బిడ్డలను సైతం వదిలించుకోవాలని భావిస్తున్నారు. గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేటప్పుడు పెద్దలు ఏది మంచో, ఏది చెడో చెప్పేవారు. నేడు చిన్న కుటుంబాల వలన చెప్పేవారు కరవయ్యారు.. ఇంట్లో భార్యాభర్తలు పెడదోవ పట్టినా హెచ్చరించేవారు లేకుండా పోయారు. దీంతో చిన్న సమస్యలు ఎదురైనా పెద్దవై చంపుకొనే వరకు వెళ్తున్నారు. వివాహేతర సంబంధాలు వంటివి పెట్టుకొని హతమార్చేందుకు కూడా వెనకాడటం లేదు. కొన్ని నెలల క్రితం జిల్లాలో ఓ ప్రభుత్వాధికారి భార్యతో ఓ వ్యక్తి వివాహేతర సంబంధం కొనసాగిస్తూ.. ఓ రోజు పట్టుబడటంతో ఆ ప్రభుత్వాధికారిపైనే దాడి చేసి పారిపోయేందుకు సదరు వ్యక్తి ప్రయత్నించాడు. అధికారి సెక్యూరిటీ ఆఫీసర్లకు ఫిర్యాదు చేయడంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఇదే మాదిరి బొల్లాపల్లిలో ప్రియురాలి భర్తనే హతమార్చడం ఆందోళన కలిగించింది. ప్రధానంగా సామాజిక మాధ్యమాల ప్రభావం ఎంతో ప్రభావం చూపుతున్నట్లు సెక్యూరిటీ ఆఫీసర్లు చెబుతున్నారు. మాధ్యమాల్లో పెంచుకొన్న పరిచయాలు అక్రమ సంబంధాలకు దారితీస్తున్నాయి. సంబంధం ఇంట్లో వాళ్లకి తెలిసినప్పుడు ఆత్మహత్యకు పాల్పడటమో, లేదా అడ్డు తొలగించుకొనేందుకు హత్య చేయడమో చేస్తున్నారు. ఫేస్‌బుక్‌లో పరిచయమైన ఓ వ్యక్తి తనను దారుణంగా వంచించాడని సోమవారం జరిగే గ్రీవెన్స్‌లో ఓ మహిళ సెక్యూరిటీ ఆఫీసర్లు ఫిర్యాదు చేసింది.

తీరని నష్టం ; భార్యభర్తలు తమ సుఖం కోసమే కాకుండా వివాహ బంధాన్ని గౌరవించాలని మానసిక నిపుణులు చెబుతున్నారు. వివాహేతర సంబంధాల కారణంగా అనారోగ్య సమస్యలే గాకుండా సామాజిక సమస్యలు తలెత్తుతాయని వివరిస్తున్నారు. కుటుంబ గౌరవం నాశనమవుతుంది. ఈ సంబంధం ఒక్కసారి బయటపడితే సమాజంలో వ్యక్తిగత గౌరవం కూడా ఉండదు. అందరూ అవహేళనగా మాట్లాడటం చేస్తుంటారు. భార్య, భర్త ఒక్కసారి వివాహేతర సంబంధం ఏర్పరచుకోవాలన్నా, దాన్ని కొనసాగించాలన్నా పిల్లలు, కుటుంబాన్ని గుర్తుచేసుకుంటే వారికి ఆ విధమైన ఆలోచనలు దరిచేరవని పేర్కొంటున్నారు. వివాహేతర సంబంధనాలు కలిగే పరిణామాలపై ఇప్పటికే పలు అధ్యయనాలు సాగించారు. ప్రధానంగా ఆలోచన శక్తిని కోల్పొయి ఈ సంబంధాల్లో ఇరుక్కుంటున్నారని, వివేకంతో ఆలోచించి బయటపడాలని నిపుణులు సూచిస్తున్నారు.

అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే..
* చిన్న వయసులోనే పెళ్లి చేయడంతో వారికి 35 ఏళ్లు వచ్చే సరికి జీవితంలో ఏదో నిర్లిప్తత ఆవహిస్తుంది. జీవితాన్ని సంతోషంగా గడప లేదు. పిల్లలు, కుటుంబమే సర్వస్వం అయిపోయిందనే భావన వారి మనసులో వచ్చి ఎవరైతే ఆ వయస్సులో ప్రేమగా, ఆప్యాయంగా మాట్లాడతారో వారి పట్ల ఆకర్షితులవుతారు. అటునుంచి వివాహేతర సంబంధం పెట్టుకోవడానికి దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు.
* ప్రేమించిన వారిని కాకుండా తల్లిదండ్రుల ఒత్తిడి వల్ల బలవంతంగా పెళ్లి చేసుకున్నవారు తల్లిదండ్రులను బాధ పెట్టాలనే ఉద్దేశంతో వివాహేతర సంబంధం పెట్టుకునేందుకు తహతహలాడిన వారూ ఉన్నట్లు వెల్లడైంది.
* ఇంట్లో పెద్ద దిక్కు చనిపోవడం, వ్యాపారంలో ఆర్థికంగా నష్టపోవడం, ఉద్యోగం రాకపోవడంతో ఏం చేయాలో తెలియక వాటిని భర్తీ చేసుకునేందుకు వాటన్నింటినీ తీర్చగలిగే వారున్నారని నమ్మినప్పుడు కొంతమంది ఇలా తప్పుడు మార్గాన్ని ఎంచుకుంటారని తేలింది.
* భార్య లేదా భర్త, ఎవరైనా సరే మానసికంగా, శారీరకంగా సంతృప్తి చెందనపుడు మరొకరు దాన్ని అందిస్తారనే ఆశతో అక్రమ సంబంధాలు ఏర్పరచుకునేవారు ఎక్కువగా ఉన్నారని అధ్యయనం గుర్తించారు.
* భార్యభర్తల మధ్య ఆత్మీయ అనుబంధం లేనపుడు, ప్రతి చిన్న విషయానికి గొడవ పడటం, ఒకరినొకరు అర్థం చేసుకోని పక్షంలో మానసికంగా కుంగిపోతుంటారు. మనసు విప్పి మాట్లాడుకోవడానికి అవకాశం ఇవ్వట్లేదని లోలోన మథనపడ్తుంటారు. ఆ సమయంలో చనువుగా మాట్లాడేవారుంటే వారితో దగ్గరై తప్పుడు దోవలోకి వెళ్తున్నారు.
* మహిళలు మోనోపాజ్‌ దశలో ఉన్నప్పుడు వారు పడుతున్న ఇబ్బందులను పట్టించుకోకుండా సహకరించట్లేదని భావిస్తూ కొంతమంది మరొకరితో వివాహేతర సంబంధం ఏర్పరచుకొనేందుకు ఆసక్తిచూపుతున్నారని తేలింది.
* సాంకేతికత అందుబాటులోకి వచ్చిన తరవాత నీలి చిత్రాలను సెల్‌ఫోన్‌లోనే చూస్తున్నారు. అదే మాదిరి చేయాలని భార్యని ఇబ్బంది పెడుతున్న వారూ ఉన్నారు. వారు సహకరించని పక్షంలో మరొకరితో అలా చేసేందుకు ఉవ్విళ్లూరుతున్నారన్న విషయం అధ్యయనంలో బయటపడింది.
* సామాజిక మాధ్యమాల్లో పరిచయాలు ఏర్పరచుకుని, వ్యక్తిగతంగా కలవడం.. ఆ సమయంలో ఫొటోలు తీసుకుని వాటిని అడ్డం పెట్టుకుని బ్లాక్‌మెయిల్‌ చేస్తూ అక్రమ సంబంధాలని కొనసాగిస్తున్నవారు ఇటీవల కాలంలో పెరిగారని సెక్యూరిటీ ఆఫీసర్లు చెబుతున్నారు.

వివాహ బంధాన్ని గౌరవించాలి
భార్యాభర్తలు చేసే తప్పు కారణంగా పిల్లలు అనాథలవుతున్నారు. కుటుంబ వ్యవస్థ నాశనమై వ్యక్తిగత కుటుంబాలు వస్తున్నాయి. ఏదైనా తప్పు చేస్తే మందలించే వారు లేకపోవడంతో వారు ఇష్టారీతిన ప్రవర్తిస్తున్నారు. ఆర్థికంగా, జీవితంలో ఉన్నతంగా ఎదిగేందుకు వినియోగించుకోవాల్సిన స్వేచ్ఛను అక్రమ మార్గాలకు వినియోగించుకుంటున్నారు. ఈ సంబంధాల వల్ల వారిలో ప్రతీకారేచ్ఛ పేట్రేగిపోతోంది. భార్య, భర్తలను వదిలించుకోవడానికి, కన్నబిడ్డలను చంపుకోవడానికి వెనకాడట్లేదు. భార్యభర్తలు తమ హక్కులు, వివాహ బంధాన్ని గౌరవిస్తూ ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలి. కుటుంబ వ్యవస్థ ప్రాధాన్యం తెలుసుకుని దాన్ని గౌరవించాలి

- సరిత, అడిషనల్‌ ఎసీˆ్ప సీˆఐడీ, విమెన్‌ ప్రొటెక్షన్‌ సెల్‌

భావోద్వేగాలను అదుపు చేసుకోలేరు
వివాహేతర సంబంధాన్ని ఏర్పరచుకున్న వాళ్లల్లో మొదట్లో చిన్నగా దిగజారడం మొదలై తరువాత అదుపు చేయలేని స్థితికి వస్తారు. భావోద్వేగాలను అదుపు చేయలేక వారి సంబంధానికి అడ్డువస్తున్న వారిని చంపేందుకు సిద్ధపడతారు. కొన్నిసార్లు ఆత్మహత్యలకు పాల్పడతారు. ఏమవుతుందిలే అని మొదలుపెట్టే చిన్న తప్పు ఇరు కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తుంది. సమాజంలో వారికున్న గౌరవాన్ని నాశనం చేస్తుంది. ఈ సంబంధాల వల్ల అనారోగ్య, ఆర్థిక, సామాజిక ఇబ్బందులు తప్పవు. తల్లి, తండ్రి అలాంటి సంబంధంలో కొనసాగుతున్నారని పిల్లలకు తెలిస్తే వారి మనసులో మాయని మచ్చ ఏర్పడుతుంది. ఏమైనా మనస్పర్థలు వచ్చినట్టయితే కూర్చొని మాట్లాడి వాటి పరిష్కారాన్ని కనుక్కొని దాంపత్య జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలి.

- పెద్ది సాంబశివరావు, లైంగిక సంబంధాలతో దుష్ప్రరిణామాలపై అధ్యయనం చేసిన అధికారి

మనసు విప్పి మాట్లాడుకోవాలి
ఎంత పని ఒత్తిడిలో ఉన్నా భార్యభర్తలు రోజూ మనసువిప్పి మాట్లాడుకోవడానికి కొంత సమయం కేటాయించుకోవాలి. ఏదైనా తప్పు చేయాలనే భావన వచ్చినప్పుడు ఆ విషయం బయటపడితే కుటుంబ గౌరవం ఏమవుతుందో ఆలోచించాలి. పిల్లల భవిష్యత్తు అంధకారమవుతుందని గ్రహించాలి. తమ పిల్లలు తప్పుడు మార్గాన్ని ఎంచుకున్నారని తెలియగానే తల్లిదండ్రులు వారితో మాట్లాడి మరోసారి ఆ తప్పు చేయకుండా హెచ్చరించాలి. తల్లిదండ్రులు వివాహేతర సంబంధం పెట్టుకున్న పిల్లలు సంఘ విద్రోహ శక్తులుగా ఎదుగుతారు. దొంగతనాలు చేయడం, చిన్న పిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడటం వంటి క్రూరమైన చర్యలకు పాల్పడే అవకాశం ఉంది. కుటుంబంలో అనుమానానికి తావులేకుండా ఒకరి మీద ఒకరు నమ్మకంతో బంధాన్ని బలంగా ఉంచుకునేందుకు పాటుపడితే ఎటువంటి ఇబ్బందులు ఉండవని గుర్తించాలి.

- ప్రసాదబాబు, మనస్తత్వ నిపుణులు, ఇగ్నో, విజయవాడ
Like Reply


Messages In This Thread
RE: అనైతిక బంధం ఆవిరైంది! - by oxy.raj - 12-08-2019, 09:08 AM



Users browsing this thread: 1 Guest(s)