Thread Rating:
  • 4 Vote(s) - 2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అనైతిక బంధం ఆవిరైంది!
#6
ప్రాణం తీసిన వివాహేతర సంబంధం
మహిళకు పురుగు మందు మింగించి.. తానూ తాగి...



దుగ్గిరాల, న్యూస్‌టుడే: వివాహేతర సంబంధం ఒక నిండు ప్రాణాన్ని బలిగొంటే..మరొకరిని ప్రాణాపాయ స్థితిలోకి నెట్టింది. సెక్యూరిటీ ఆఫీసర్ల కథనం ప్రకారం దుగ్గిరాల చెన్నకేశవనగర్‌కు చెందిన వెంకటపద్మావతి(32)కి, పెనుమూలికి చెందిన సుబ్బారెడ్డికి కొన్నేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగుతోంది. దీంతో పాటు వీరి మధ్య కొంత ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి. పద్మావతి వేరొకరితో సన్నిహితంగా ఉంటున్నట్లు సుబ్బారెడ్డి భావించారు. ఈ నేపథ్యంలో ఏడాదిన్నర నుంచి వారి మధ్య విభేదాలు నడుస్తున్నాయి. ఈ విషయంలో ఒకసారి ఆమెను సుబ్బారెడ్డి కర్రతో దాడి చేశాడు. దీనిపై స్థానిక ఠాణాలో కేసు నమోదైంది. ఇది ఇలా ఉండగా శనివారం ఉదయం సుబ్బారెడ్డి పసుపు, ధాన్యం బస్తాలకు పురుగు పట్టకుండా ఉండేందుకు బస్తాల మధ్య వేసే సల్ఫాస్‌ మాత్రలు తీసుకుని పద్మావతి ఇంటికి శనివారం ఉదయం 7 గంటల సమయంలో వచ్చాడు. అప్పుడే ఆమె బాత్‌రూమ్‌కి వెళ్లి వస్తుండగా గట్టిగా పట్టుకుని సల్ఫాస్‌ మాత్రను ఆమె నోట్లో వేసి మింగించాడు. అరవకుండా గట్టిగా నోరు, ముక్కు మూయడంతో ఆమె సంఘటనా స్థలంలోనే మరణించారు. ఆమె చనిపోయిందని నిర్ధరించుకుని సుబ్బారెడ్డి తన వెంట తెచ్చుకున్న మాత్రలను మింగేశాడు గొడవ జరుగుతున్న విషయం విని ఆమె కుమారుడు హేమంత్‌ తలుపు వేసి కేకలు వేస్తూ బయటవారిని పిలిచాడు. వారంతా వచ్చేసరికి లోపల ఉన్న సుబ్బారెడ్డి తలుపు పగులగొట్టుకుని బయటకు వచ్చాడు. ఈ సమయంలో మృతురాలి కుమారుడు, మరొకరు కలిసి సుబ్బారెడ్డిని తీవ్రంగా గాయపర్చారు. విషయం తెలుసుకున్న వెంటనే ఎస్సై అనిల్‌కుమార్‌రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని తీవ్రంగా గాయపడిన సుబ్బారెడ్డిని 108 వాహనంలో తెనాలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి సుబ్బారెడ్డి బంధువులు తాడేపల్లిలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ అతనికి ఐదారుసార్లు రక్తవాంతులు జరిగాయి. సంఘటనా స్థలాన్ని డీఎస్పీ శ్రీలక్ష్మి, గ్రామీణ సీఐ అశోక్‌ పరిశీలించారు. పద్మావతి కుమారుడు ఫిర్యాదు మేరకు ఒక కేసును, సుబ్బారెడ్డి కుమారుడు ఫిర్యాదు మేరకు మరో కేసును నమోదైంది..
Like Reply


Messages In This Thread
RE: అనైతిక బంధం ఆవిరైంది! - by oxy.raj - 11-08-2019, 10:35 AM



Users browsing this thread: 1 Guest(s)