Thread Rating:
  • 4 Vote(s) - 2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అనైతిక బంధం ఆవిరైంది!
#1
అనైతిక బంధం ఆవిరైంది!
ప్రియురాలిని చంపి.. ప్రియుడి ఆత్మహత్య
అనాథలైన ఇరు కుటుంబాల పిల్లలు
చిత్తూరు నగరంలో దారుణం
ఇంటి ముందు రక్తపు మరకలు

వారిది వివాహేతర సంబంధమైనా.. అందులోనూ అనుమానం మొగ్గతొడిగింది. పెనుభూతమైంది. ప్రియురాలిని చంపేంతగా.. ప్రియుడు కసి పెంచుకున్నాడు. చివరకు అనుకున్నంత పని చేసి.. తానూ కడతేరాడు. చిత్తూరు నగరంలో గురువారం సాయంత్రం జరిగిన ఈ దారుణం.. సంచలనం రేపింది. - న్యూస్‌టుడే, చిత్తూరు (నేరవార్తలు)
సెక్యూరిటీ ఆఫీసర్ల కథనం మేరకు.. నగరానికి చెందిన దొరస్వామి కుమార్తె గీతారాణి (38)కి ఆర్మీ ఉద్యోగితో వివాహమైంది. వీరికి ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. భర్త విధుల నిమిత్తం ఇతర రాష్ట్రంలో ఉండగా గీతారాణికి అదే ప్రాంతానికి చెందిన హమీద్‌ (36) అనే యువకుడితో ఆరేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న గీత భర్త.. ఆమెకు దూరం కాగా.. హమీద్‌ భార్య కూడా తన కుమారున్ని వదిలిపెట్టి వెళ్లిపోయింది. అప్పటి నుంచి గీత, హమీద్‌ కలసి ఉంటున్నారు. ఇటీవల గీత ప్రవర్తనపై హమీద్‌కు అనుమానం వచ్చింది. గురువారం ఆమె ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో హమీద్‌ చాకుతో ఛాతి, తల, నడుము భాగాల్లో పొడిచి పారిపోయాడు. రక్తపు మడుగులో ఉన్న గీతారాణి అరుపులు కేకలు పెడుతూ వీధిలోకి పరుగెత్తుతూ వచ్చింది. స్థానికులు ఆటోలో ఎక్కించుకుని చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు. కొంత సేపటి తర్వాత దుర్గానగర్‌ కాలనీ సమీపంలోని అటవీ ప్రాంతంలో విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన హమీద్‌ను స్థానికులు గుర్తించి.. చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కొనప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న అతను కూడా ఆస్పత్రికి చేరుకునేలోపు మృతి చెందాడు. సమాచారం అందుకున్న చిత్తూరు డీఎస్పీ ఈశ్వరరెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించి స్థానికులతో మాట్లాడి ఘటనపై ఆరాతీశారు. చిత్తూరు రెండో పట్టణ సీఐ యుగంధర్‌ అక్కడికి వచ్ఛి. హత్య, ఆత్మహత్య వివరాలను సేకరించారు. ఇద్దరి పరిచయాలు, వారి మరణాలకు గల కారణాలపై మృతుల సన్నిహితులు, బంధుమిత్రులతో మాట్లాడి తెలుసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
అనాథలైన పిల్లలు..
గీతారాణి హత్య, హమీద్‌ ఆత్మహత్య కారణంగా ఇరు కుటుంబాలకు చెందిన ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు. వివాహేతర సంబంధం కారణంగా ఇద్దరి కుటుంబాలు విడిపోయినా.. పిల్లలు మాత్రం వారి తల్లి, వారి తండ్రి నీడలో ఉన్నారు. వారి మరణానంతరం ప్రస్తుతం ఆ ముగ్గురు పిల్లలు వీధినపడ్డారు. గీత భర్తకు దూరంగా ఉంటూ.. ఇద్దరు కూతుళ్లను చదివిస్తోంది. ఇదే విధంగా భార్య దూరమైనా హమీద్‌ ఆటో నడుపుకొంటూ కుమారున్ని పోషిస్తున్నాడు. వీరి సహజీవనంలో అనుమానం మొదలవ్వడం.. హమీద్‌ ఆవేశానికి గురై గీతారాణిని హత్య చేసి, ఆత్మహత్య చేసుకోవడంతో ఇరు కుటుంబాల్లోనూ విషాదఛాయలు అలుముకున్నాయి.
ప్రభుత్వాసుపత్రి వద్ద బంధుమిత్రుల రోదనలు
నగరంలో కొద్దిసేపట్లోనే హత్య, ఆత్మహత్య వార్తలు పొక్కడంతో.. ఆ ప్రాంతంలో సంచలనం కలిగింది. మృతుల బంధుమిత్రులు చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. మృతదేహాలను చూసి బోరున విలపించారు. వారి రోదనలు స్థానికులను కలచివేశాయి. మృతదేహాలను సెక్యూరిటీ ఆఫీసర్లు శవపరీక్ష నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాసుపత్రి శవాగారానికి తరలించారు.
[Image: anithikam.jpg]
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
అనైతిక బంధం ఆవిరైంది! - by oxy.raj - 09-08-2019, 04:40 PM



Users browsing this thread: 1 Guest(s)