Thread Rating:
  • 7 Vote(s) - 2.71 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery సేల్స్ స్టార్
#6
----------------------- "సారీ రా, దేవుడి మీద నీకు అంత భరోసా లేదని నాకు తెలుసు, కానీ, జరుగుతున్నది చూస్తుంటే, ఇదేదో పై వాడి మాస్టర్ ప్లాన్ లాగే కనిపిస్తోంది" అంది నీలూ నవ్వుతూ. "మళ్ళీ మొదలెట్టావా? ఉదయ్, నేను ఒక ఎకౌంటు మీద పని చేస్తున్నాం అంతే. అంత కంటే ఏమీ లేదు." "ఇంత కంటే మంచి అవకాశం ఎక్కడ దొరుకుతుంది?" "సర్లే, ఇంకేదైనా చెప్పు" అంటూ నేను టాపిక్ మార్చాను. అన్నానే గానీ, ఉదయ్ తో పని చేస్తానని తలుచుకుంటే, కొంచం ఎక్సైటింగ్ గానే వుంది. కడుపు లో అనీజీ గా ఏదో తిమ్మిరీగలు తిరుగుతున్న ఫీలింగ్.


వారం రోజుల తర్వాత. బుధ వారం సాయంత్రం 9 గంటలు అయ్యిది అనుకుంటా. ఉదయ్, నేను, ఆఫీసు కాన్ఫరెన్స్ రూం లో తర్వాతి రోజు జినో కార్ప్ మీటింగ్ కి రెడీ అవుతున్నాం. గత కొద్ది రోజులు గా ఇద్దరం మా స్ట్రాటజీ గురించి మాట్లాడుకుంటున్నాం. జినో కార్ప్ గురించి నాకు తెలిసిన విషయాలన్నీ నేను తనకు విడమరచి చెప్పాను. మా ఇద్దరి మధ్య మొదట్లో ఉన్న అనీజీనెస్స్ కొద్ది కొద్ది గా తగ్గుతూ వచ్చింది. ఆ రోజు రాత్రి జినో కార్ప్ కొత్త ప్లాంట్ల గురించి, వాళ్ళ మెషీన్స్ గురించి, మాట్లాడుతూ, వాళ్ళ కొత్త ఆఫీసు ఆర్గనైజేషన్ ఎలా వుంటుందో ఊహిస్తున్నాం. కుర్చీ లో వెనక్కి వాలి నా మెడ ని అటూ ఇటూ ఊపాను, నొప్పి అన్నట్టు గా. "మెడ నెప్పి?" అన్నాడు ఉదయ్, నా ఎదురు సీట్ లో కూర్చుని. "అనుకుంటా. రాత్రి నిద్ర లో పట్టేసైనట్టుంది." "ఆలో మీ" అంటూ ఉదయ్ కుర్చీ లోంచి లేచి నా వెనక్కి చేరాడు. నేను వారించే లోపల తన చేతులు నా భుజాల మీద వున్నాయి.

"హేయ్... ఏం చేస్తున్నావ్" అంటూ నేను తన చేతులు తోసెయ్యతానికి ప్రయత్నించాను. 

వేసుకున్న టాప్ లైట్ ఫాబ్రిక్ కావటం తో, నా భుజాలకి తన చేతుల వెచ్చదనం తెలుస్తోంది. 

"రిలాక్స్, ఏం చెయ్యాలో నాకు తెలుసు" అంటూ ఉదయ్ తన రెండు బొటన వేళ్ళని, వెన్నెముక వైపు జరిపి గట్టిగా వత్తాడు.

"ఓహ్..." అంటూ మూలిగాను నొప్పి తో.

"మొదట కాసేపే నొప్పి గా వుంటుంది. అంతే.." 

తను అన్నట్టు గానే, కాసేపటికి నొప్పి తగ్గి రిలాక్స్ అయినట్టు అనిపించింది. ఉదయ్ వేళ్ళు ఎక్స్పర్ట్ గా నా మెడ నరాల్ని, నాట్స్, మజిల్స్ ని జంటిల్ గా మసాజ్ చేస్తున్నాయి.

"మ్.. చాలా రిలాక్సింగ్ గా వుంది" సన్న గా మూలుగుతూ మెడ వెనక్కి వాల్చాను. 

ఉదయ్ నెమ్మది గా తన వెళ్ళని నా మెడ నించి భుజాల అంచుల వైపు కదుపుతూ కంటిన్యూ చేసాడు.

"ఎక్కడ నేర్చుకున్నావ్, ఇవన్నీ?" 

"నా పద్ధతులు నాకున్నాయి, సీక్రెట్.." అన్నాడు గుసగుసలాడుతున్నట్టు, తన ముఖాన్ని నా చెవి దగ్గరికి తెచ్చి.

కళ్ళు తెరిచాను. మెడ వెనక్కి వాల్చి ఉండటం తో వెనకాల నిలబడ్డ తన ముఖం నా ముఖం పైన ఎదురు గా కనిపిస్తోంది, తల్లకిందులుగా. తన కళ్ళు నా కళ్ళల్లోకి సూటి గా చూస్తున్నాయి. నేనూ తన కళ్ళల్లోకి చూపు తిప్పకుండా చూస్తూ ఉండి పోయాను. తన ముఖం నా ముఖానికి చేరువగా రావటం తెలుస్తూనే వుంది, కానీ ఎందుకో నా బ్రెయిన్ పని చెయ్యటం ఆగి పోయినట్టు అనిపించింది. లేక కావాలని పట్టించుకోవటం మానేశానో తెలీదు. తన దవడలు నా బుగ్గలకి దగ్గరై తన ఊపిరి వెచ్చగా నా గడ్డం మీద తగులుతోంది. ఇంకొద్ది క్షణాల తర్వాత ఉదయ్ పెదాలు సున్నితం గా నా పెదాల మీద వాలాయి.

తన వేళ్ళు నా భుజాల మీదే వున్నాయి, తను మసాజ్ చెయ్యట ఆపేసి కొన్ని క్షణాలు అయింది. తన పెదాల స్పర్స నా పెదాల మీద తెలుస్తోంది. కాలం స్తంభించినట్టు అనిపించింది. తను నెమ్మది గా నా పెదాలని ముద్దు పెట్టుకుంటున్నాడు. ఏ మూలో నా మనసు తనని వారించమని, తోసేయ్యమని చెబుతోంది. కానీ, నా పెదాలు నా మాట వినటం మానేశాయి. నా పెదాలు అతనికి చేరువ అవటం, నేను అతని పెదాల్ని ముద్దు పెట్టుకోవటానికి ప్రయత్నించటం తలుచుకుంటే నా మీద నాకే ఆశ్చర్యం కలుగుతోంది. ముందు తనే తేరుకున్నాడు.

"సారీ.. నువ్వు చాల అందంగా వున్నావు." 

ఏమీ అనకుండా అతని వైపు చూస్తూ ఉండిపోయాను. తను నా వైపు నించి రియాక్షన్ కోసం చూస్తున్నట్టున్నాడు. నేను నా రియాక్షన్ ఎలా వుండాలో తెలిసే పరిస్థితి లో లేను. నా బరువైన శ్వాస, ఎగిరే గుండె చప్పుళ్ళు మాత్రమె వినిపిస్తున్నాయి.
[+] 1 user Likes Virinchi's post
Like Reply


Messages In This Thread
RE: సేల్స్ స్టార్ - by Virinchi - 15-11-2018, 07:16 AM



Users browsing this thread: 1 Guest(s)