15-11-2018, 07:14 AM
ప్రతి ఏడాది లాగే, సంవత్సరాంతం పార్టీ తర్వాత మా ఆఫీసు లో సేల్స్ ప్లానింగ్ మీటింగ్ వుంటుంది. కంట్రీ, రీజనల్ మానేజర్స్, సేల్స్ వైస్ ప్రెసిడెంట్లు, ఇంకా కొంత మంది ఇంపార్టెంట్ పెద్ద వాళ్ళు అంతా ఈ మీటింగు లకి వస్తారు. సేల్స్ లో పని చేసే వాళ్లంతా, వొచ్చే సంవత్సరానికి మా ప్లాన్స్ ని ప్రెసెంట్ చేస్తే, పెద్ద వాళ్ళు రివ్యూ చేసి వాళ్ళ అభిప్రాయలు, సూచనలు, మార్పులు, చేర్పులు అన్నీ చెబుతారు. మధ్యాహ్నం లంచ్ తర్వాత నా ప్రెజెంటేషన్. క్రితం సంవత్సరం విజయాల తో మొదలెట్టాన్నేను. నా కోటా ని మించి సేల్స్ టార్గెట్లు (114%) సాధించాను. క్రితం సంవత్సరం చాల బాగా చేసానన్నట్టే. కొత్త సంవత్సరంలో ఏ ఏ కొత్త క్లైంట్ లు, మార్కెట్లు టార్గెట్ చెయ్యాలో, నా నెల నెలా, క్వార్టర్లీ సేల్స్ టార్గెట్ ప్లాన్స్ గురించి విడమరిచి చెప్పాను, పవర్ పాయింట్ చార్ట్ లు ఉపయోగిస్తూ. "ఎక్స్కుస్ మీ, ప్రియా", సేల్స్ వి.పి. రాజీవ్ గొంతు విప్పాడు. "జినో కార్ప్ ఎకౌంటు ఇంకా మన చేతికి రాలేదు. గత రెండేళ్ళ లాగానే.. " నేను ఒక పేలవమైన నవ్వు నవ్వాను. రాజీవ్ ని మనసు లోనే తిట్టుకున్నాను. ఈ సంవత్సరం జినో కార్ప్ టాపిక్ రాగూడదని ఏ మూలో ఆశ పడ్డాను. జినో కార్ప్ యౌరప్ లో పెద్ద కంపెనీ. ఈ మధ్య ఇండియా లో బాగా పెరుగుతున్నారు. నేను ఈ ఎకౌంటు కోసం సాయశక్తులా ప్రయత్నించాను, కానీ సాధించలేక పోయాను. "అవును రాజీవ్! ఈ సంవత్సరం తప్పకుండా మనం సాధించి తీరతాం.. కింద సంవత్సరం మనం ఆ కంపెనీ ప్రోక్యుర్మేంట్ డిపార్టుమెంటు తో మంచి రిలేషన్ డెవలప్ చేసాం. ఈ సంవత్సరం గారంటీ గా... " "ఎలా? నాక కథలు చెప్పకు. ఈ సంవత్సరం నీ ప్రయత్నాలకి ఇంతకూ ముందుకి ఏమిటి తేడా?"నా మేనేజర్ సతీష్ నన్ను సమర్దిచాడు. "టు బి హానెస్ట్, ప్రియా చాలా ట్రై చేసింది. కానీ, ఆ ప్రోకుర్మేంట్ లో వున్న అతని తో డీల్ చెయ్యటం చాల కష్టం." "ప్రియ ఈ ఎకౌంటు మీద మూడేళ్ళు గా ట్రై చేస్తోంది. తను చెబుతున్నట్టు గా, తానేమీ మంచి రిలేషన్స్ డెవలప్ చేసినట్టు నాకైతే అనిపించటం లేదు." "ప్రియ సమర్ధత మీద నాకు పూర్తి భరోసా వుంది. తన రికార్డు చూస్తె మీకే అర్థం అవుతుంది." అన్నాడు సతీష్ కాన్ఫిడెంట్ గా. రాజీవ్ కొద్ది గా ఆలోచిస్తున్నట్టు నా వైపు తిరిగాడు. "నన్ను తప్పు గా అర్ధం చేసుకోకు ప్రియా. నాకూ నీ వర్క్ మీద, సత్తా మీద చాల కాన్ఫిడెన్స్ వుంది. నువ్వు నీ జాబ్ ని చాల సమర్దవంతం గా చేస్తావని నాకు తెలుసు." "థాంక్ యు సర్" "నా వర్రీ అల్లా జినో కార్ప్ ఎకౌంటు మనకి వస్తుందా లేదా అనే.. వాళ్ళు నాసిక్ లోను, పూణే లోను రెండు ఫ్యాక్టరీలు మొదలేడుతున్నట్టు తెలిసింది. ఈ కొత్త ప్లాంట్స్ కాంట్రాక్ట్స్ మనకి వస్తే, మన గోల్స్, నీ టార్గెట్లు కూడా తేలిగ్గా సాధించచ్చు." "నేను ఈ ఎకౌంటు సాధించటానికి పూర్తి ప్రయత్నం చేస్తాను సర్. ""సతీష్, నాకు మైక్రో మేనేజ్ చెయ్యటం ఇష్టం లేదని నీకు తెలుసు. కాని ఈ ఎకౌంటు మనకి చాలా ఇంపార్టెంట్. అందుకే, నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఇప్పటి నించి జినో కార్ప్ ఎకౌంటు ని ఉదయ్ హేండిల్ చేస్తాడు" ఉదయ్ సడన్ గా తన పేరు వినేసరికి అలెర్ట్ అయ్యాడు. "ఇది అంత మంచి ఐడియా కాదేమో సర్, ఉదయ్ ఇప్పడికే, చాల అకౌంట్ లు హేండిల్ చేస్తున్నాడు, మరీ స్ట్రెచ్ అవుతాడేమో.." అన్నాడు సతీష్. "ఉదయ్ చాలా కష్ట పడతాడు. తన కొత్త అకౌంట్ ల ట్రాక్ రికార్డు చాలా బావుంది. నా వుద్దేశం లో ఈ ఎకౌంటు ని సాధించాలంటే ఉదయ్ ఏ సరియైన వాడు. నో అఫెన్స్ ప్రియా" అన్నాడు రాజీవ్. "అంత గా అయితే, ఉదయ్ ఎకౌంటు లు కొన్ని మిగిలిన వాళ్లకి ఇవ్వండి." "నాకేం ప్రాబ్లం లేదు సర్" అన్నాను భుజాలు ఎగరేసి. నిజంగా నే, నాకు ఈ తల నెప్పి వదిలించుకోవటం మంచిది అనిపించింది." "ఓకే. అయితే మనం ఒక నిర్ణయానికి వచ్చినట్టే. ఉదయ్ జినో కార్ప్ ఎకౌంటు హేండిల్ చేస్తాడు ఇవ్వాళ నించి" "థాంక్ యు" అంటూ ఉదయ్ లేచి నిలబడ్డాడు, తన షర్టు మడతలు సరి చేసుకుంటూ. ఇంత టెన్షన్ లో నూ, నా మనసు తన బేర్ చస్ట్ మీదకే మళ్ళింది. ఛ! అనుకుంటూ కళ్ళు తిప్పుకున్నాను."నాదో చిన్న రిక్వెస్ట్" అన్నాడు ఉదయ్. "ప్రియా ఈ ఎకౌంటు మీద నాతొ పని చేస్తే బావుంటుంది. జినో కార్ప్ చాలా పెద్ద కంపెనీ, ప్రియా కి చాల మంది తెలుసు. తన నాలెడ్జ్ నాకు చాలా ఉపయోగకరం గా వుంటుంది. " "పర్వాలేదు ఉదయ్" నాకు ఈ సముదాయింపు ధోరణి నచ్చలేదు. "నీకు నేనేమీ అంత తప్పని సరి కాదు. నాకేమీ ఫేవర్స్ అక్కర్లేదు. థాంక్స్ ఎనీ వే." అన్నాను, కొంచెం అసహనంగా. "ఫేవర్ ఏం కాదు. నేను చెప్పింది అక్షరాలా నిజం. నాకు నిజం గా నీ అవరసరం వుంది" ఉదయ్ మాటల్లో నిజాయితీ కనిపించింది. "సరే, దీనిమీద మన ఇప్పటికే చాల టైం గడిపాం. ఈ ఎకౌంటు మీద ప్రియ, ఉదయ్ ఇద్దరూ కలిసి పని చేస్తారు. సతీష్, క్రెడిట్ ఎవరికి ఎలా ఇస్తావో, నీ బాధ్యత" అంటూ ముగించాడు రాజీవ్. ఉదయ్ నా వేపు చూసి చిరునవ్వు నవ్వాడు. నేను కూడా తన వేపు చూసి స్మైల్ చేసాను.