28-07-2019, 01:28 PM
(24-07-2019, 06:19 PM)Vikatakavi02 Wrote:మను ధర్మ శాస్త్రము
మనుస్మృతిలో ఏముంది...?
మనుధర్మశాస్త్రం కృతయుగం లోనూ, గౌతమస్మృతి త్రేతాయుగంలోనూ, శంఖలిఖితుల రచన ద్వాపరయుగంలోనూ ప్రామాణికం కాగా (ఈ) కలియుగంలో పారాశరస్మృతికే ప్రాధాన్యముంది. యుగధర్మాలను పరిగణించినట్లయితే మనుధర్మశాస్త్రం ఈ యుగానికి సందర్బించదని పై మాటలు నిరూపిస్తు న్నాయి. అయినా బ్రిటిష్ వాళ్ళు కూడా పౌరస్మృతి శిక్షాస్మృతుల రచనలో మనుస్మృతిని ఒక ఆధార గ్రంథంగా పరిగణించారు.
ఈ గ్రంథంలో పన్నెండు అధ్యాయాలున్నాయి. ప్రతి అధ్యాయం చివరా భృగు మహర్షి చెప్పిన మానవధర్మశాస్త్రమనే సంహితలో ఇన్నో అధ్యాయం సంపూర్ణమయిందని కనిపిస్తుంది. మనువు నేరుగా చెప్పింది కాదుగాని ఆయన బ్రహ్మదేవుడినుంచి మౌఖికంగా తెలుసుకొని మరీచి మొదలైన మహర్పులకు ఉపదేశించగా ఆ వివరాలను భృగువు చెప్పిన తీరున ఈ గ్రంథం రూపుకట్టింది.
మొదటి ఆరు అధ్యాయాల్లో కులాచారం వంటి వాటి ప్రస్తావన ఉండగా సప్తమాధ్యాయం పాలకుల విధులను, అష్టమం వ్యవహారపద్దతులను, నవమం ఆస్తిపంపకం సంగతులను, దశమం ఆపద్ధర్మాలను, ఏకాదశం ప్రాయశ్చిత్తాదులను, చివరిది శుభాశుభ కర్మలను, తత్వాన్ని వివరిస్తుంది.
ఇందులోని విధిని షేధాలు వర్తమాన సమాజాలకు ఎంతవరకు వర్తిస్తాయో గ్రంథం చదివి తర్కించటం మంచిది. ధర్మ సూక్ష్మ నిర్ణయానికి ఎటువంటి పరిషత్తు (జ్యూరీ) పనికివస్తుందో చివరి అధ్యాయంలో చర్చించింది.
ఇప్పటి సమాజానికి, మనం రాజ్యాంగరీత్యా శాసనరీత్యా అనుసరిస్తున్న పౌర శిక్షాస్మృతులకుగాని ఈ గ్రంథ విషయాలు ప్రత్యక్షంగా ఉపయోగం ఏ మేరకు ఉన్నదీ విజులే నిర్ణయించాలి.
స్మృతి అంటే...?
వేదానికి 'శ్రుతి' అని పేరు. దీనికి అర్ధం 'వినబడినది' అని. మహర్పులకు వేద శబ్దం వినబడింది. దీనికి కర్తలెవరూ లేరు. అందుకే వేదం అపౌరుషేయమన్నారు.
ఆ వేదాన్ని వినిన మహరులు, అందులో తెలుపబడిన విషయాలను గుర్తు పెట్టుకుని లోకానికి అందించారు. అందువలన వాటికి స్మృతులని పేరు. వాటిలో మన జీవనవిధానం ఎలా ఉండాలో, ఏమేమి ఆచరించాలో, ఏవి పనికిరావో తదితర వివరాలన్నీ ఉన్నాయి. అందువలన వాటికి ధర్మశాస్త్రాలని పేరు. అటువంటి స్మృతులు చాలా ఉన్నాయి. మనుస్మృతి, యాజ్ఞవల్క్యస్మృతి, గౌతమ ధర్మస్మృతి, పరాశరస్మృతి, మొదలైనవన్నీ ఉన్నాయి.
ఇక్కడ ఒక ప్రధాన విషయాన్ని గ్రహించాలి. మనం సనాతన, వైదిక ధర్మానికి చెందినవారం. ధర్మమన్నది గడచిన, గడుస్తున్న, గడువబోయే మూడు కాలాలకు వర్తిస్తుంది. అదే విధంగా అన్ని దేశాలకు, అన్ని ప్రాంతాలకు వర్తిస్తుంది.. ఉదాహరణకు నిప్పుకు కాలడం ధర్మం. నిన్న, నేడు, రేపు నిప్పుకు కాలడమనే ధర్మమున్నది. అదెక్కడైనా కాలుతుంది. అలాంటిదే మనం అనుసరించే సనాతన ధర్మం. సనాతన మంటే పాతదన్న అర్థం కాదు. సనాతనమంటే, ఎంత పాతదో, అంత కొత్తదని అర్థం. అటువంటి ధర్మాన్ని దేశకాలాలకు అనుగుణంగా కొద్దిపాటి, మార్పులు చేర్పులతో ఎప్పటికప్పుడు సరిదిద్ది, సమాజ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని నూతన స్మృతిని రూపొందిస్తుంటారు మహరులు. అందుకే అన్ని స్మృతులు వచ్చాయి. ఇవాళ సనాతన ధర్మాన్ని ఆచరించే మనలను కొందరు 'మనువాదులు' అని పిలుస్తున్నారు. కానీ, చిరకాలంగా మనం మనుస్మృతిని ప్రమాణంగా భావించాం! 'కలౌ పారాశర స్మృతిః', అనీ చెప్పారు. అందువల్ల ఈ కలియుగంలో అనుసరించవలసిన స్మృతి పరాశరస్మృతిగా గుర్తించారు.
ఇంకా చదవాలంటే, క్రింది డౌన్లోడ్ లింక్ ని క్లిక్ చెయ్యండి...
>>> మను ధర్మ శాస్త్రము — స్మృతులు <<<
Thanks కవి గాారు