Thread Rating:
  • 40 Vote(s) - 2.63 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
మహేష్ I LOVE YOU అన్నమాట నా ప్రాణానికి ప్రాణమైన నా హృదయమంతా ప్రేమతో ఆక్రమించిన నా మహి నోటి నుండి మనసారా అదికూడా నన్ను ప్రేమతో ఘాడంగా చెబుతూ నాకోసం కన్నీళ్లు కారుస్తుండటం చూసి నా హృదయం పరవశించిపోతూ వర్ణింలేనంత సంతోషంతో నా వొళ్ళంతా పులకరించిపోసాగింది. నువ్వు ప్రేమిస్తున్నది , ఆరాధిస్తున్నది, నీ హృదయమంతా నింపుకున్నది నన్నే కదరా నెల రోజుల నుండి ఎందుకురా నాకు చెప్పలేదు అంటూ కళ్ళల్లో ఆపకుండా ఆనందబాస్పాలు కారుస్తూనే నాచాతీపై ప్రియమైన కోపంతో కొట్టి , నాకు నొప్పి కలిగిందేమో అనుకొని మృదువైన వేళ్ళతో కొట్టిన దగ్గర స్పృశిస్తూ, అది చూసి ప్రేమగా నవ్వుతుండగా , కొట్టిన చోట తియ్యగా ముద్దుపెట్టగానే , ఒక ఫీలింగ్ కలిగింది దానిని వర్ణించడానికి అష్టదిగ్గజకవులకు కూడా పాండిత్యం సరిపోదు .



ఎందుకు మహేష్ నవ్వుతున్నావు అంటూ తలెత్తి బాస్పాలతో నాకళ్ళల్లోకి ప్రాణంగా చూస్తూ , నేను వచ్చి నెలరోజులయ్యింది ఒక్కరోజైనా నీ మనసంతా  నిండిన ప్రేమను నాకు చెప్పాలనిపించలేదా అంటూ ప్రాణంగా అడిగింది. చెప్పలేని సంతోషంతో ఆనందబాస్పాలతో తన కల్లోల్లోకే అంతే ప్రాణంగా చూస్తూ ఇదిగో ఇలాంటి క్షణం కోసమేరా నీ కళ్ళల్లో నాపై అంతులేని ప్రేమతో నన్ను ఇలా కౌగిలించుకొని ప్రేమను వ్యక్తపరిచే సమయం కోసం నెల ఏంటి మహి సంవత్సరాలైనా , యుగాలైనా , జన్మలైనా సంతోషంగా వేచిచూస్తూ ఉండిపోయేవాణ్ణి.



ప్రేమించడం గొప్ప కాదు ఎవరైనా ప్రేమిస్తారు కానీ ప్రేమించబడటం గొప్ప అదృష్టం , అది ఇప్పుడు నాకు లభించింది . ఇప్పుడు చెబుతున్నాను అంటూ తన కన్నీళ్లను తుడిచి మహి I LOVE YOU sooooooooo మచ్ రా నువ్వు లేకపోతే నేను జీవించడం వ్యర్థం అంటూ నా రెండు చేతులతో ప్రేమగా తన ముఖాన్ని అందుకొని కళ్ళల్లో చెమ్మతో తన నుదుటిపై ప్రాణంగా ముద్దుపెట్టగానే , కళ్ళల్లో కన్నీళ్ళతోనే వర్ణించలేనంత సంతోషంతో నవ్వుతూ పోరా .......అంటూ గట్టిగా కౌగిలించుకొని నా గుండెలపై ఆపకుండా ముద్దులుపెడుతూనే ఉండగా , నా రెండుచేతులు తనచుట్టూ వేసి గట్టిగా నాకౌగిలిలో బంధించేసి ప్రేమగా తలపై ముద్దులుపెడుతూ ఇద్దరమూ ప్రపంచాన్నే మరిచిపోయాము.



 మా ఇద్దరి సంతోషాన్ని చూసి కీర్తి సంతోషం పట్టలేక ఎగిరెగిరి చప్పట్లుకొట్టింది. కీర్తిని చూసి మురిసిపోతూ మరింత గట్టిగా ఇద్దరమూ ప్రేమతో కౌగిలించుకొని కదలకుండా తను నా గుండెలపై నేను తన నుదుటిపై ప్రాణంగా ముద్దులుపెట్టుకుంటూ పరవశించిపోసాగాము. కింద అందరూ soooo tasty అంటూ వెజ్ మరియు నాన్ వెజ్ కలిపి ఇష్టంగా కుమ్ముతుండటం చూసి కృష్ణగాడికి నోరూరుతున్నట్లుగా , పైకివెళ్లి చాలాసేపు అయ్యింది ఏమిచేస్తున్నారు అంటూ పరిగెత్తుకుంటూ పైకివచ్చి , మేమిద్దరూ ప్రేమగా ఒకరికౌగిలిలో ఒకరు ఉండటం మరియు మమ్మల్ని చూసి కీర్తి సంతోషన్గా నవ్వుతూ చప్పట్లు కొట్టడం చూసి షాక్ తిన్నట్లుగా కదలకుండా ఉండిపోగా , కీర్తి చూసి అన్నయ్యా , అన్నయ్యా....... అంటూ చేతిని కదిలించడంతో తేరుకొని , 



నేను చూస్తున్నది నిజమా లేక నా మనసంతా వాళ్లిద్దరూ కలవాలని ఉండటంతో నాకు అలా కనిపిస్తోందా అంటూ చెంపపై గట్టిగా ఒక దెబ్బ వేసుకున్నాడు.కృష్ణా  అన్నయ్యా నువ్వు చూస్తున్నది అక్షరాలా నిజం అన్నయ్యా , అక్కయ్యా ప్రేమతో ప్రాణంగా కలిసిపోయారు , ముందు అక్కయ్య అన్నయ్యకు I Love you అని చెప్పింది దానికి అన్నయ్య ప్రపంచాన్ని గెలిచినంతగా సంతోషంతో గాల్లో తెలిపోతూ అక్కయ్యకు తన ప్రేమావిషయాన్ని ఇప్పటివరకూ ఎవ్వరూ చెప్పనంత ప్రాణంగా చెప్పగానే ఇద్దరూ చాలాసేపటినుండి ఇలా ఒకరికొకరు ప్రేమ కొగిలిలో ఉండిపోయారు. యాహూ.............అంటూ టాప్ లేచిపోయేలా సంతోషంతో అరిచి thank you god , thank you sooooo much గాడ్ అంటూ , నా చెల్లికి తన ప్రేమ విషయం చెప్పకుండా ఒక్కడే లోలోపల ఎంత వేదన అనుభవించాడో నాకు తెలుసు , నాకే కోపం వచ్చి వాణ్ణి చాలాసార్లు తిట్టుకున్నాను , కానీ నా చెల్లెలే స్వయంగా ప్రేమిస్తున్నాను అని చెప్పడంతో వాడి కళ్ళల్లో తేజస్సును ,అమితమైన  సంతోషాన్ని చూస్తుంటే వాడే కరెక్ట్ అనిపిస్తోంది. ఇంత తొందరగా వాళ్ళిద్దరినీ ఏకం చేసినందుకు తిరుమలకు కాలినడకన వచ్చి గుండు కొట్టించుకుంటాను స్వామి అంటూ కీర్తిని అమాంతం ఎత్తుకొని సంతోషం పట్టలేక పైపైకి ఎగరేయ్యడం చూసి,



 మహితోపాటుగా చిరునవ్వులు చిందిస్తూ , I లవ్ యు రా ఇక జీవితంలో ఈ చిరునవ్వుని నీ నుండి దూరం కానివ్వను అంటూ మనసారా తన నవ్వుని చూస్తూ కళ్లపై తియ్యగా ముద్దులుపెట్టాను. లవ్ యు బేబీ అంటూ నాపెదాలపై సడెన్ గా చుప్ మంటూ  ముద్దుపెట్టి సిగ్గుపడుతూ నా గుండెల్లో తలదాచుకొంది. నేనైతే షాక్ తో కల్లుతేలేసి ఆ క్షణకాలం తియ్యటి ముద్దును పదే పదే నెమరువేసుకుంటూ పెదాలపై చిరునవ్వుతో కదలకుండా ఉండిపోయాను. కృష్ణగాడు కీర్తి కళ్ళను మూసి సడెన్ గా అటువైపు తిరిగి , కీర్తి మనం చూడకూడదు సినిమా A సెన్సార్ లోకి మారిపోతోంది అని నవ్వుతూ ఏదో కింద వంటకాలు రుచిగా ఉన్నాయి కలిసి తిందామని మీ ముగ్గురినీ పిలవడానికి వచ్చాను , పదా మనం వెళ్లి తిందాము అంటూ బయటకు నడిచాడు. మహి అన్నయ్యా , అక్కయ్యా వాళ్ళు తినరా అని అడిగింది. వాళ్ళకు ఇక ఉదయం వరకూ ఆకలివెయ్యదు , వేసినా ముద్దు........ సెన్సార్ ..........ఆకలి తీర్చుకుంటారులే అంటూ కీర్తి బుగ్గపై ఆప్యాయంగా ముద్దుపెట్టి కిందకువెళ్లిపోయారు.



వాడిమాటలకు ఇద్దరమూ నవ్వుతూ లవ్లీ కిస్ థాంక్స్ లవ్ యు రా అంటూ తనను అమాంతం గాలిలోకి ఎత్తి సంతోషంగా నవ్వుతూ నెమ్మదిగా చుట్టూ తిప్పి తన నవ్వుని చూసి మురిసిపోతూ కిందకు దించుతుండగా, నా నుదుటిపై మరొక ముద్దును ప్రాణంగా పెట్టి నా గుండెలపై వాలిపోయి గట్టిగా కౌగిలించుకుంది. తనకంటే గట్టిగా నా కౌగిలిలో ఏకమయ్యేలా హత్తుకొని తలపై ప్రేమగా ముద్దులుపెడుతూ మనం కూడా వెళ్లి తిందామా అని అడిగాను. ఎక్కడ నా నుండి వేరవ్వాల్సివస్తుందని ఇంకా ఇంకా నా చుట్టూ చేతులు బిగించింది. వద్దులే నిన్ను వదిలి నేను ఎక్కడికీ వెళ్ళను అని చెప్పగానే నవ్వుతూ తలెత్తి నాకళ్ళల్లోకి ప్రేమగా చూసి మురిసిపోయింది. 



నా అందమైన birthday పాపాయి అర్ధరాత్రి నుండి కేక్ లను ఒకటి తరువాత ఒకటి కోయడం కోసం నిలబడే ఉంది , కాళ్ళు నొప్పిపుడుతుంటాయి అంటూ రెండుచేతులతో అడ్డంగా ఎత్తుకొని వచ్చి సోఫాలో కూర్చుని నా ఒడిలో కూర్చోబెట్టుకొన్నాను. నా కౌగిలిని విడిచి ఉండలేను అన్నట్లు ఆత్రంగా నా మెడ చుట్టూ చేతులు వేసి ఛాతీపై వాలిపోయి ఇప్పుడు మరింత హాయిగా ఉంది అంటూ బుగ్గపై , మెడపై తియ్యగా లేత లేతగా ప్రేమగా మాట్లాడుతూనే ముద్దులుపెడుతూనే ఉంది. తన ప్రేమలో పరవశించిపోతూ కరిగిపోవడం నా వంతు అయ్యింది. 



ఈ విషయం మీ ఫ్రెండ్ కు తెలిస్తే తట్టుకుంటుందంటావా రా అంటూ వెచ్చగా తన కౌగిలిని ఫీల్ అవుతూ తడబడుతూ మాట్లాడగా , అత్తయ్యకు అప్పుడే తెలుసు , అత్తయ్యా ...............ఉమ్మ్............అంటూ సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతూ బుగ్గపై గట్టిగా ముద్దుపెట్టాను.సిగ్గుపడుతూ నా గుండెలపై వాలిపోయి అత్తయ్యకే ముందుగా చెప్పాను అని వెచ్చగా ముద్దుపెట్టి చెప్పింది. అమ్మో......అమ్మో....... నాకు తెలియకుండా చాలా జరుగుతున్నాయన్నమాట, అవును రా ఒకటా రెండా చాలా సర్ప్రైజ్ లు ఉన్నాయి అని చెప్పింది . మహి please please చెప్పవా అంటూ గడ్డం పట్టుకొని ప్రేమగా బ్రతిమాలాను. నా birthday కు బోలెడన్ని సర్ప్రైజ్ లు ప్లాన్ చేసి నాకేమైనా చెప్పావా రా కాబట్టి నేను కూడా చెప్పను అంటూ చిలిపిగా నవ్వుకొంది. నేను నిరాశ చెందకూడదని ఒకటి మాత్రం చెబుతాను అనగానే , నాకు తెలుసు మహి నా మహి బంగారం అంటూ గట్టిగా హత్తుకొని సంతోషం పట్టలేక బుగ్గను సున్నితంగా కొరికేసాను. 



అత్తయ్యా ..........నొప్పి.......అంటూ చేతితో రాసుకుంటూ పోరా నేను చెప్పను అంటూ చిరుకోపంతో చూసింది. ఇలా కూడా నా దేవకన్య అందంగా ఉంది అంటూ కళ్లపై వెచ్చగా చెరొక ముద్దుపెట్టి , ఇక్కడేనా నొప్పి అంటూ బుగ్గపై ప్రేమగా ముద్దులుపెట్టడంతో అందంగా నవ్వుతూ లవ్ యు రా అంటూ మళ్లీ సడెన్ గా నా పెదాలపై తాకీతాకనట్లుగా పెదాలను తాకించి నా మెడపై తల వాల్చింది. సర్ప్రైజ్ చెబుతానన్నావుగా మన విషయం అత్తయ్యకు చెప్పగానే రెండు గంటల్లో బెంగళూరులో ఉంటామని చెప్పారు , అయితే అమ్మావాళ్ళు వచ్చేస్తున్నారా అని అడుగగా , వద్దు అత్తయ్యా నన్ను ప్రాణంగా ప్రేమిస్తున్న నా ఫ్రెండ్ అర్ధరాత్రి నుండి వరుసపెట్టి సర్ప్రైజ్ లు మరియు గిఫ్ట్ లు క్షణం కూడా తీరికలేకుండా సంతోషన్గా ఇస్తూనే ఉన్నాడు , బదులుగా వాడికి అంటే నీకే అంటూ నాబుగ్గపై ముద్దుపెట్టి ఒక birthday ట్రీట్ ఇవ్వాలి రాత్రికి ఇచ్చేస్తాను మీరు ఉదయం వచ్చెయ్యండి అని చెప్పాను.
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 30-07-2019, 10:33 AM



Users browsing this thread: 196 Guest(s)