Thread Rating:
  • 40 Vote(s) - 2.63 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
#54
రాత్రి ఆలస్యం అవ్వడం వల్ల అలారం పెట్టకపోవడంతో కమ్మటి కాఫీ వాసనకు మెలకువ వచ్చి సోఫాలో లేచి కూర్చోగా నామీద దుప్పటి ఎదురుగా టీ టేబుల్ పై వేడివేడిగా బెడ్  కాఫీ ,చుట్టూ చూడగా ఇల్లంతా శుభ్రన్గా ఊడ్చేసి పూజ కూడా చేసినట్లుగా దేవుడి గదిలో నుండి హారతి పొగ వస్తుండగా లేచి వొళ్ళువిరుచుకొని కాఫీ తాగుతూ d విటమిన్ కోసం బయటకు రాగా వరండాలో రంగురంగుల ముగ్గు తొక్కబోతూ వెంటనే ఆగిపోయి ప్రక్కకు వచ్చేసి wow బ్యూటిఫుల్ అంటూ పెదాలపై చిరునవ్వుతో మహి అంటూ గుండెలపై చేతిని వేసుకొని మురిసిపోతుండగా  వంట గదిలో చప్పుడుకు వెంటనే వెళ్లగా తలంటు స్నానం చేసినట్లుగా టవల్ కురులకు చుట్టుకొని టిఫిన్ కూడా ప్రిపేర్ చేస్తుండగా ,



ఒక్కరోజులోనే ఇన్ని అదృష్టాలా అంటూ లోపలకు వెళ్లగా నా అడుగుల చప్పుడుకే గుడ్ మార్నింగ్ my బెస్ట్ ఫ్రెండ్ అంటూ నవ్వుతూ నావైపుకు తిరుగగా కళ్ళల్లో చెమ్మతో కనిపించగా , మహేష్ ఏమయ్యింది ఏమైనా ఎక్కువ చేశానా అని తలదించుకొని అడుగగా , మహి ఇంటి వాతావరణాన్ని , అమ్మను గుర్తుకుతెస్తున్నావు అంటూ సంతోషిస్తూ గుడ్ మార్నింగ్ మహి ఏంటి టిఫిన్ అని అడుగగా థాంక్స్ మహేష్ అంటూ నవ్వుతూ దోస అనగా , wow నాకు చాలా ఇష్టం వెంటనే రెడీ అయ్యి వచ్చేస్తాను అంటూ బయట బాత్రూం లోకి వెళ్లి ఫ్రెష్ గా స్నానం చేసి అక్కడే బట్టలు కూడ వేసుకొని రాగా వేడివేడిగా దోసెలు వెయ్యగా నేను తిన్న తరువాత తానూ తింటుండగా , 



మహి బయట వేయడానికి ముగ్గు , పూజా సామాగ్రి , నిన్న మరియు ఇప్పుడు దోసకు కావాల్సిన వస్తువులు ఇంట్లో లేవే అని అడుగగా , నిన్న ఆఫీస్ నుండి ఇంటికి వచ్చాక నువ్వు రావడం ఆలస్యం అవుతుందని చెప్పడంతో మధ్యాహ్నం నేను తిన్నవి నీకు కూడా వండుదామని బస్ స్టాప్ దగ్గరకు వెళ్లి కావాల్సినవన్నీ తీసుకువచ్చాను అని బదులివ్వగా , మహి నాకోసం ఇవన్నీ చేశావా అంటూ  ఆనందంలో నాకు మాట కూడా రావడం లేదు అంటూ మురిసిపోతుండగా , తను మాత్రం అందంగా నవ్వుతూ తినేసి క్లోజ్ ఫ్రెండ్ కోసం ఆ మాత్రం చెయ్యకపోతే ఎలా అంటూ మొత్తం శుభ్రం చేసి ఆఫీస్ కు బయలేదేరుతునట్లుగా చెప్పగా , మహి కారులో వదలనా అని అడగబోయి మళ్లీ అపార్థం చేసుకుంటుందేమో , friendship ఎక్కడ చెడిపోతుందో అని ఆగిపోగా , తను బయటకు వెళుతూ వెనక్కు తిరిగి తిరిగి నావైపు చూస్తూ వెళ్లిపోగా ,



రెండు నిమిషాల్లో రెడి అయ్యి కారు తాళాలు అందుకొని ఇంటికి తాళాలు వేసి కారులో బస్ స్టాప్ గుండా ఆఫీస్ కు బయలుదేరుతూ మహి ఇంకా బస్ స్టాప్ లోనే బస్ కోసం ఎదురుచూస్తుండగా , తన బస్ వచ్చేవరకూ అక్కడే ఆగి తననే చూస్తుండగా ఎందుకో ముఖంలో కోపం కనిపిస్తూ వెంటనే బస్ స్టాప్ అటు చివరకు వేగంగా వెళ్లి కాలేజ్ అమ్మాయిలను అల్లరి చేస్తున్న ఇద్దరు పోకిరీలను తిడుతూ అమ్మాయిలను వాళ్ళ నుండి దూరంగా తీసుకురాగా , వాళ్ళ వెనుకే పోకిరీ వెధవలు వస్తూ వాళ్ళను కాదే నిన్ను ఏదైనా చేస్తే నిన్ను ఎవడు కాపాడతాడే అంటూ ముందుకువచ్చి మహి మీదకు చెయ్యివేయ్యబోతుండగా , మెరుపువేగంతో అక్కడకు చేరి వెయ్యబోతున్న చేతిని పట్టుకొని వాడివెనక్కు వేగంగా లాగగా ఎముక విరిగినట్లుగా చప్పుడు వినిపించి నొప్పితో వాడు గట్టిగా కేకలువేస్తుండగా పక్కకు తోసేసి మావాణ్ణే కొడతావారా అంటూ ముందుకువస్తున్న వాడి కడుపులో ఒక్క గుద్దు గుద్దగా నోటిలో నుండి రక్తం కారుతూ అమ్మా అంటూ నేలపై పడి ఇద్దరూ వివిలలాడుతుండగా ,



అల్లరి చెయ్యడం చూసి ఎవరో సెక్యూరిటీ అధికారి లకు కాల్ చేసినట్లుగా వెంటనే సైరెన్ మ్రోగుతూ జీప్ రాగా ఎవరు ఇక్కడ అల్లరి చేస్తున్నది అని అడుగగా అక్కడ ఉన్నవారంతా కిందపడి దొర్లుతున్న ఇద్దరినీ చూపించగా , చూసి మంచిపని చేశారు మళ్లీ ఎవరువచ్చినా కుమ్మేయ్యండి మిగతాది నేను చూసుకుంటాను ఈ సర్కిల్ లో ఒక కానిస్టేబుల్ ను పెడతాను అంటూ ఇద్దరినీ జీప్ లో ఎక్కించుకొనివెళ్లిపోగా అందరూ మంచిపని చేసావు బాబు రోజూ ఇలాగే వచ్చి కాలేజ్ పిల్లలను అల్లరి చేస్తున్నారు అంటూ అభినందించగా , మహి పిల్లలతో మాట్లాడుతూ కారు దగ్గరకు పిలుచుకొనివచ్చి కారులో వెనుక కూర్చోబెట్టి ఒక్క మాట కూడా మాట్లాడకుండా చిరుకోపంతో నన్ను చూస్తూ కారులో ముందు కూర్చోగా , నవ్వుతూ వెళ్లి కూర్చుని కారు స్టార్ట్ చేసి , గర్ల్స్ ఎక్కడ మీ కాలేజ్ అని అడుగగా పేరు చెప్పగా దారిలోనే అయితే అంటూ పోనిస్తూ ,



మహి దెబ్బలేమైనా తగిలాయా అని అడుగగా చిన్నపిల్లలా నా చేతిపై సున్నితంగా కొడుతూ కారు ఉంది కదా ఇద్దరి ఆఫీస్ లు కూడా దగ్గరే కదా డ్రాప్ చేస్తాను అని ఒక్కమాటైనా ఆడిగావా , అలా అడుగుతావని ఇంటి గుమ్మం నుండి లిఫ్ట్ వరకూ వెనక్కు ఎన్నిసార్లు తిరిగి చూసాను , సరైన సమయానికి వచ్చావు కాబట్టి సరిపోయింది లేకపోతే ఎంత భయం వేసిందో తెలుసా, నిన్న హీరోలాగా సిటీలో అమ్మాయిలకు అంత సేఫ్ కాదని లెటర్ కూడా పంపావుగా , ఫ్రెండ్ కోసం ఒక అర గంట సమయం కూడా కేటాయించలేవా ? , అంటూ ఆపకుండా చిరుకోపంతో మాట్లాడుతూనే ఉండగా ,



నవ్వుతూ మహి నువ్వు చాలా ధైర్యవంతురాలు తెలుసా , బస్ స్టాప్ లో వందలమంది ఉన్నా పట్టించుకోకపోయినా దైర్యంగా వాళ్లకు ఎదురునిలిచి ఇద్దరు స్టూడెంట్స్ ను ప్రొటెక్ట్ చేసావు ఏమంటారు గర్ల్స్ అనగా , అవ్వునక్కా చాలా చాలా థాంక్స్ నువ్వు లేకపోతే వాళ్ళు మమ్మల్ని ఎక్కడెక్కడో తాకేవాళ్ళు మీరు నిజంగా చాలా దైర్యంగా మమ్మల్ని వారిబారి నుండి కాపాడారు , అన్నయ్యా మీకు కూడా థాంక్స్ అనగా మహి మురిసిపోతూ అటువైపు తిరిగి చిన్నగా నవ్వగా , హమ్మయ్యా నా ఫ్రెండ్ నవ్వింది ఈ రోజు నుండి నేనే కారులో తీసుకువెళతాను , ఆఫీస్ అవ్వగానే వచ్చి రిసీవ్ చేసుకుంటాను అనగానే నవ్వగా , కాలేజ్ దగ్గర కారు ఆపగా చాలా థాంక్స్ అక్కా , అన్నయ్యా అంటూ లోపలికివెల్లగా , 



మహి ఆఫీస్ వైపుకు పోనివ్వగా మహేష్ వాళ్ళను అంతలా రక్తం వచ్చేలా కొట్టాలా , ఇంతకీ వాళ్ళు అల్లరి చేశారని కొట్టావా లేక లేక..............నామీద చెయ్యి వెయ్యబోతే కొట్టావా అని అడుగగా , నవ్వుతూ వదిలేయ్ మహి అంటూ ముందుచూస్తూ డ్రైవ్ చేస్తుండగా , ఆరాధనగా నావైపే కన్నార్పకుండా చూస్తుండగా తన ఆఫీస్ దగ్గర కారు ఆపగా నేను చూసేలోపల వెంటనే తేరుకొని తడబడుతూ కాపాడినందుకు థాంక్స్ అని చెప్పగా , ఫ్రెండ్స్ మధ్యలో థాంక్స్ , sorry లు ఉండవు అని చెప్పగా , నవ్వుతూ కారు దిగి సాయంత్రం కాల్ చేస్తాను వచ్చేయ్యాలి అని ఆర్డర్ వెయ్యగా , అలాగే మేడం గారు అంటూ నవ్వుతూ తను లోపలకు వెళ్ళేoతవరకూ ఉండి 20 నిమిషాలలో ఆఫీస్ చేరుకొని వర్క్ లో మునిగిపోగా , లంచ్ టైం లో మహి నుండి కాల్ లంచ్ ఆర్డర్ చేసి హలో అనగా మహేష్ తిన్నావా అని అడుగగా , ఇప్పుడే ఆర్డర్ చేసాను నువ్వు అని అడుగగా తీసుకొంటున్నాను అంటూ తినేంతవరకూ మాట్లాడగా తనే కాల్ చేసినందుకు మురిసిపోతూ ఆఫీస్ ముగించుకొని తను వేచి చూస్తుంటుంది అని వేగంగా తన ఆఫీస్ దగ్గరకు వెళ్లగా ,



నాకు సహాయం చేసిన లేడీ సెక్యూరిటీతో మాట్లాడుతుండగా వచ్చి కారు ఎక్కగా , మహి ఒక్కనిమిషం అంటూ సెక్యూరిటీ దగ్గరకువెళ్లి రోజూ  నేను వచ్చేవరకూ తనను సేఫ్ గా చూసుకోండి అంటూ పర్సు లోనుండి కొంత డబ్బును తీసి వారించినా ఇవ్వగా , నేను చూసుకుంటాను అంటూ అభయం ఇవ్వగా థాంక్స్ మేడం అంటూ నవ్వుతూ వచ్చి కారు స్టార్ట్ చేసి మహి ఆఫీస్ వర్క్ ఎలా ఉంది అని అడుగగా టీం లో ఎక్కువమంది మన తెలుగువాళ్లే నాకు చాలా సపోర్ట్ ఇస్తున్నారు టెన్షన్ ఏమీ లేదు అంటూ నవ్వుతూ చెప్పి మహేష్ నాకు గుడికి వెళ్లాలని ఉంది అని అడుగగా , ఏంటి మేడం స్పెషల్ అని అడుగగా నన్ను ఇంత జాగ్రత్తగా చూసుకుంటున్న మంచి ఫ్రెండ్ దొరికినందుకు దేవుళ్ళకు థాంక్స్ చెప్పుకోవాలి అందుకు అనగా అయితే నేను కూడా థాంక్స్ చెప్పుకోవాలి అనగా ఎందుకు అన్నట్లుగా నావైపు చూస్తుండగా , నీలాంటి మంచి ఫ్రెండ్ తోపాటుగా మంచి అమ్మ చేతి రుచిని చూపిస్తున్న అంటూ చిలిపిగా నవ్వుతూ వంట మనిషి , ఇంటిని శుభ్రం చేసే ఇంటి మనిషి మరీ ముఖ్యన్గా ఎవరైనా రౌడీలు నన్ను అల్లరి చెయ్యడానికి వస్తే కాపాడటానికి ఒక daring అండ్ డైనమిక్ ఫ్రెండ్ ను ఇచ్చినందుకు అనగానే , మహేష్...........అంటూ నా చేతిపై , భుజం పై కొడుతుండగా నువ్వు కొట్టినా సరే దేవుడికి ఇలాగే థాంక్స్ చెబుతాను అనగా కళ్ళల్లో నీళ్ళు వచ్చేలాగా సంతోషంగా నవ్వుతూనే ఉండగా , మహి....... నువ్వు ఎప్పుడూ ఇలా సంతోషంగా నవ్వుతూనే ఉండాలి అని చెప్పగా , నేను ఇక్కడ ఉండేంతవరకే ఈ సంతోషం మహేష్ అక్కడికి వెళ్ళానో బాధ తప్ప నాలో ఏమీ మిగలదు అంటూ మనసులో ఆనుకొని కన్నీళ్ళతో బాధపడుతుండగా వెంటనే మాటమార్చి తను నవ్వేలా చేసి ఇంటికి చేరుకొని స్నానం చేసి దారిలో పూజ వస్తువులు తీసుకొని దగ్గరలోని గుడికివెళ్లి ప్రార్థించి ప్రశాంతంగా కొద్దిసేపు కూర్చొని ఆలస్యం అవ్వడం వల్ల హోటల్ లో భోజనం చేసి ఇంటికి చేరుకునేసరికి అలసిపోయినట్లుగా మహేష్ నాకు నిద్రవస్తుంది అంటూ సోఫాలోనే పడుకొంటుండగా , రూంలోకి వెళ్లి పడుకొమ్మని ఎంతచెప్పినా ఉలుకూ పలుకూ లేకుండా హాయిగా నిద్రపోగా మళ్లీ తప్పదని ఎత్తుకొని వెళ్లి పడుకోబెట్టి తియ్యగా జలధరించినట్లుగా ఫీల్ అయ్యి వెంటనే బయటకువచ్చి సోఫాలో వాలిపోయాను.



అలారం చప్పుడుకు లెవగా అప్పటికే మహి లేచినట్లుగా బాత్రూమ్ నుండి నీళ్లచెప్పుడు వినిపించగా వాకింగ్ వెళుతున్నానని లెటర్ రాసి ఫ్రిడ్జ్ పై అంటించి తలుపు ముందుకువేసుకొని బయటకు వచ్చి దగ్గరలోని గ్రౌండ్ లో రన్నింగ్ చేసివచ్చి అపార్ట్మెంట్ జిమ్ లో జిమ్ చేసి పైకివచ్చేసరికి నిన్నటిలాగే శుభ్రం చేసి ముగ్గులువేసి టిఫిన్ ప్రిపేర్ చేస్తూ గుడ్ మార్నింగ్ అంటూ కాఫీ  అందివ్వగా గుడ్ మార్నింగ్ మహి అంటూ తాగేసి స్నానం చేసివచ్చి తినేసి ఇద్దరమూ ఆఫీస్ కు బయలుదేరుతూ బస్ స్టాప్ లో కానిస్టేబుల్ ను చూసి అంతా మీవల్లనే మేడం చూడండి బస్ స్టాప్ ఎంత ప్రశాంతంగా ఉందొ అంటుండగా , మహేష్ పిల్లలు అని చూపించగా కారు ఆపగా దిగి రండి అంటూ పిలువగా , వచ్చి అక్కా మాకు ఇంకేమీ భయం లేదు బస్ లో వెళతాము అనగా ఏమీ పర్లేదు ఎక్కండి అంటూ డోర్స్ తెరిచి ఎక్కగానే వెళుతూ , అక్కా మీవల్ల సెక్యూరిటీ అధికారి ని కూడా ఏర్పాటుచేశారు అక్కడ ఉన్నవాళ్ళంతా మిమ్మల్నే తలుచుకుంటున్నారు అని సంతోషంగా చెప్పగా , చెప్పానా మేడం మీవల్ల మీ ధైర్యం వల్ల ఎంతమందికి మంచి కలిగింది అనగా , అంతా నీవల్లనే రా అంటూ మనసులో అనుకోని నావైపే చూస్తుండగా పిల్లలను వదిలి , తననూ వదిలి నా ఆఫీస్ చేరుకున్నాను. 



ఇలాగే సంతోషన్గా రోజులు గడిచిపోతూ శుక్రవారం సాయంత్రం మహిని రిసీవ్ చేసుకొని ఆఫీస్ గురించి మాట్లాడుతూ అపార్ట్మెంట్ చేరుకొని కారు పార్క్ చేసి ఇద్దరమూ లిఫ్ట్ లో పైకి రాగా అంటీ అంటూ కీర్తి పరిగెత్తుకుంటూ వచ్చి అమాంతం హత్తుకొని చాలా చాలా థాంక్స్ అంటీ అంటూ సంతోషంతో చెప్పగా , మహి మోకాళ్లపై కూర్చొని ఎందుకురా కీర్తి అని అడుగగా ఈరోజు exam పేపర్స్ ఇచ్చారు అంటీ ఏమి జరిగిందో తెలుసా ముందుగా మాథ్స్ పేపర్స్ తీసుకొని సర్ క్లాస్ లోకి వచ్చి రాగానే కీర్తి స్టాండ్ అప్ అనగానే classmates అందరూ లాస్ట్ లాస్ట్ ........ఫెయిల్ ఫెయిల్............... అంటూ హేళన చేస్తుండగా , స్టూడెంట్స్ సైలెన్స్ అనగా క్లాస్ మొత్తం నిశ్శబ్దం అయిపోగా నాకేమి భయం నవ్వుతూ లేచి నిలబడగా ,



డిసెండింగ్ ఆర్డర్లో తక్కువ వచ్చిన మార్కుల నుండి పేర్లు చదువుతాను వచ్చి పేపర్స్ తీసుకోండి ముందుగా అనగానే క్లాస్ మొత్తం కీర్తి కీర్తి..........అంటుండగా , హర్ష 10 ఔట్ ఆఫ్ హండ్రెడ్ ఫైల్ అంటూ వాడు రాగానే 10 టైమ్స్ క్వశ్చన్ పేపర్ ఆన్సర్స్ రాసుకొనిరా అనటమే కాకుండా కర్రతో దెబ్బలు కూడా పడగా , నేను కాకపోయేసరికి అందరూ నిశ్శబ్దం అయిపోయి , నెక్స్ట్ అనగానే ఇది కచ్చితంగా కీర్తినే అంటూ సగం మంది అరవగా అది కూడా కాక వాళ్లకు పనిష్మెంట్ ఇస్తూ ఫెయిల్ నుండి పాస్ మార్కుల వాళ్ళను పిలిచి ఇంకా బాగా చదవాలి అంటూ చిన్న చిన్న హోమ్ వర్క్ ఇస్తున్న ప్రతిసారి క్లాస్ లో కీర్తి కీర్తి అనేవారి సంఖ్య తగ్గిపోతూ చివరగా టాప్ three ఆఫ్ the క్లాస్ థర్డ్ ప్లేస్ అనగానే ఆశ్చర్యంగా అందరూ నావైపు చూస్తుండగా , అది కూడా కాక , సెకండ్ ప్లేస్ అనగానే క్లాస్ మొత్తం నిట్టూరుస్తూ నావైపు చూడగా అదికూడా కాక , నౌ టాపర్ of the క్లాస్ హండ్రెడ్ ఔట్ ఆఫ్ హండ్రెడ్ is none other than అంటుండగా ఇక మిగిలింది నేనే కాబట్టి చాలామంది నెమ్మదిగా  కీర్తి అని తలలు దించుకోగా సర్ గట్టిగా yes yes.......... క్లాస్ new టాపర్ కీర్తి give her big క్లాప్స్ అంటూ తానూ చప్పట్లుకొడుతూ అభినందిస్తూ దగ్గరకు పిలిచి పేపర్ అందించి కీర్తి keep it up , i am impressed your solving స్కిల్స్ అంటూ మళ్లీ చప్పట్లతో అభినందించగా ,



మేము ఒప్పుకొము సర్ అంటూ థర్డ్ వచ్చిన అమ్మాయి , సెకండ్ వచ్చిన అబ్బాయి లేచి అసూయతో ప్రతి మాథ్స్ exam లో చివర వచ్చే కీర్తి ఇప్పుడు టాపర్ అంటే మేము నమ్మము కాపీ కొట్టి అన్ని మార్కులు తెచ్చుకొంది అనగా , క్లాస్ మొత్తం వంతపాడగా , సర్ ఇద్దరినీ పిలిచి కాపీనా ఎవరి దాంట్లో అని అడుగగా ఇంకెవరు exam లో తన చుట్టూ పడిన ఫ్రెండ్స్ పేపర్స్ నుండి అనగా , సర్ నావైపు చూసి నవ్వుతూ కీర్తి నెనున్నానుగా అంటూ వారిని లేపి మార్కులు అడుగగా ఇద్దరు ఫెయిల్ , ఇద్దరు జస్ట్ పాస్ అని తెలియగానే ఫెయిల్ అయిన వాళ్ళ నుoడి హండ్రెడ్ మర్క్స్ ఎలా కాపీ కొట్టవచ్చో మీరే చెప్పండి అనగానే అందరూ ఆ ఇద్దరినీ చూసి నవ్వగా , తడబడుతూ చిట్స్ తెచ్చి రాసి ఉంటుంది సర్ అనగా ఒకసారి తన solving methods చూడండి చాలా అడ్వాన్స్డ్ గా ఉన్నాయి నేను కూడా టీచ్ చెయ్యలేదు , గైడ్స్ లో కూడా ఉండవు మీకు ఇలా చెబితే అర్థం కాదు కీర్తి బోర్డ్ దగ్గరకు వెళ్లు క్లాస్ అంతా నాతోపాటుగా ఒకవైపు తను ఒకవైపు మీకు మాథ్స్ లో తెలిసినవి , కష్టమైనవి ఫార్ములాస్ , problems ఏవైనా తనను అడగండి ఒకటి తప్పుచేప్పినా ఇక్కడే తనకు హండ్రెడ్ కు జీరో వేస్తాను సరేనా అనగా , yes సర్ అంటూ కన్నింగ్ గా నవ్వుతూ వెళ్లి కూర్చోగా , కీర్తి are you ready అని అడుగగా మిమ్మల్ని తలుచుకొని yes సర్ అంటూ కాన్ఫిడెంట్ గా చెప్పగా , 



I know కీర్తి అంటూ సర్ కూడా క్లాస్ మధ్యలో కూర్చొని go ahead అనగా ముందుగా ఆ ఇద్దరు తమకు తెలిసిన మధ్యలో కూర్చొని go ahead అనగా ముందుగా ఆ ఇద్దరు తమకు తెలిసిన కష్టమైనవి అడుగగా ఆలోచించకుండా చెప్పెయ్యగా ముందుగా నాకే ఆశ్చర్యం వేసిందక్కా , ఇక ధైర్యం రాగా క్లాస్ మొత్తమే కాకుండా సర్ అడిగిన వాటికి కూడా చకచకా చెబుతూ బోర్డ్ పై solve చేసేయ్యగానే క్లాస్ మొత్తం అమాంతం లేచి కీర్తి కీర్తి ...........అంటూ చప్పట్లతో రూమ్ దద్దరిల్లిపోయిందనుకో చాలా చాలా థాంక్స్ అంటీ కాదు కాదు మేడం అనగా , మేడం ఏంటి కొత్తగా , ఓహ్........ఆదా కీర్తి నీ సక్సెస్ కు ఎవరు కారణం అని అడుగగా మా అంటీ , అంకుల్ అని చెప్పగా , అయితే వాళ్ళు నాకన్నా గొప్పవాళ్ళు వాళ్ళను సర్ , మేడం అని పిలవాలి అని చెప్పారనగా , మాకు అంటీ అని ప్రేమగా పిలవడమే బాగుంది అనగా , అయితే అలాగే పిలుస్తాను అంటీ అనగా మా మంచి కీర్తి అంటూ నావైపు చూస్తూ కీర్తికి ముద్దుపెట్టి , చుట్టూ చాలామంది పిల్లలను చూసి వీళ్లంతా ఎవరు నీ స్నేహితులా అని అడుగగా మీ గురించి తెలియగానే అపార్ట్మెంట్ పిల్లలంతా మీతోనే నేర్చుకోవాలని వచ్చారు అనగా అలాగే అంటూ కీర్తిని ఎత్తుకోగా , వెనుక ఉన్న కీర్తి అమ్మ వచ్చి చాలా సంతోషం మహి అంటూ పిల్లల అమ్మలకు పరిచయం చెయ్యగా నిన్నటివరకూ ఒక్కరే ఇపుడు అపార్ట్మెంట్ మొత్తం మహికి క్లోజ్ అయిపోగా , పిల్లలకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నా దగ్గరకు రండి అని చెప్పగా అలాగే మేడం అంటూ వెళ్లిపోగా , కీర్తి అమ్మ స్వప్న గారు డిన్నర్ కు ఆహ్వానించగా మహి నావైపు చూసి వెళదాము అంటూ కళ్ళతోనే అడుగగా నీ కోరిక కాదంటానా అంటూ నవ్వగా, రెడీ అయ్యి ఫ్లవర్స్ తో వెళ్లగా కీర్తి అమ్మానాన్నలు సంతోషంగా ఆహ్వానించి పరిచయాలు తరువాత తినేసి కాసేపు మాట్లాడి ఇక ఉంటాము అని చెప్పి కీర్తికి ముద్దుపెట్టి పైకి స్టెప్స్ ఎక్కుతూ వస్తుండగా అమ్మ నుండి కాల్ రేపు ఉదయమే మహిని చూడటానికి వస్తున్నాను అని చెప్పగా మహికి చెప్పగా చాలా చాలా సంతోషిస్తూ tired అయినట్లుగా మళ్లీ సోఫాలోనే నిద్రపోగా యధావిధిగా ఎత్తుకొని రూంలో పడుకోబెట్టి సోఫాలో పడుకున్నాను.



ఉదయం నేను లేచేసరికి ఇప్పటివరకూ కంటే ఇంకా శుభ్రన్గా ఇంటిని మార్చేసినట్లుగా ఎక్కడికక్కడ అందంగా సెట్ చేసి బయట రంగురంగుల ముగ్గువేసి ఉండగా , ఏమిటి విషయం ఏదైనా పండగనా నా కాఫీ ఏది అని అడుగగా , అవును పండగే అంటీ వస్తున్నారుగా అంటూ సంతోషన్గా నవ్వుతూ చెప్పగా , ఎవరి అంటీ అంటూ నిద్రమత్తులో అడుగగా , నిన్న అంటీ కాల్ చేశారు కదా మహేష్ వస్తున్నారని మరిచిపోయావా అనగానే , అమ్మ...........అంటూ సమయం చూడగా 5 గంటలు అవుతుండగా ఫ్లైట్ మరో గంటలో వచ్చేస్తుంది , నీ friendship తో అమ్మానాన్నలనే మైమరిపించావు ఈ విషయం కూడా అమ్మకు చెప్పాలి అంటూ నవ్వుతూ ఆత్రంగా లేచి ముఖానికి నీళ్లు కొట్టుకొని బయటకు వస్తుండగా తానూ రాగా ,



మహి నువ్వుకూడా వస్తావా ఇంత పొద్దున్నే మరి ఊరికే రెడీ అయ్యాను అనుకుంటున్నావా అంటీని కలవడం కోసం ఆరోజు నుండి ఎదురుచూస్తున్నాను పదా అంటూ నన్ను తోసుకుని లిఫ్ట్ దగ్గరకు వెళ్లగా , ok అంటూ కిందకువచ్చి కారులో మాట్లాడుతూ ఎయిర్పోర్ట్ చేరుకునేసరికి గంట దాటగా మహి నువ్వు లోపలకువెల్లు నేను పార్క్ చేసేసి వస్తాను అనగానే అమ్మ ను ఎలా గుర్తుపట్టడం అని అడగకుండా ఆత్రంగా లోపలకువెల్లగా , వైజాగ్ ఫ్లైట్ ల్యాండ్ అయినట్లుగా బయటకు అందరూ వస్తుండగా , అమ్మను మా అమ్మ అని తెలియని మహి పెళ్లిలో పెళ్లికూతురు రూంలో తనతో మాట్లాడిన అంటీ అంటూ దగ్గరకు వెళ్లి అంటీ నన్ను గుర్తుపట్టారా అని అడుగగా , మహి అనేంతలో నేను అంటీ మీరు మా పెళ్లికి కూడా వచ్చారు రూంలో చాలాసేపు మాట్లాడాము అనగా , అంటే మహేష్ తన కొడుకు అని ఇంకా చెప్పలేదన్నమాట , అయినా ఎందుకు చెప్పలేదు కన్నయ్య ఏదో దాస్తున్నాడు తరువాత ఒంటరిగా ఉన్నప్పుడు కనుక్కోవాలి అని మనసులో ఆనుకొని మహి ఎలా ఉన్నావు నన్ను ఇంకా గుర్తుపెట్టుకున్నావన్నమాట , ఎలా మరిచిపోతాను అంటీ నామాటలకు మీరు నన్ను పొగుడుతుంటే నేను అంత మంచిదాన్నా అని నాకే డౌట్ వచ్చింది ఆరోజు మీతో మాట్లాడిన కొద్దిసేపే అయినా చాలా ప్రేమగా మాట్లాడారు అంటూ అమ్మచేతిలోని బ్యాగు అందుకొని ,



ఒక్క నిమిషం అంటీ మా అంటీ కూడా ఇదే ఫ్లైట్ లో వచ్చారు ఎక్కడా కనిపించడం లేదు అనగా తను నీకు తెలుసా అని అడుగగా లేదు అంటీ మా ఫ్రెండ్ అమ్మగారు మొదటిసారి కలవబోతున్నాము , ఫ్రెండ్ అంటే అమ్మాయా కాదు అంటీ మహేష్ ఏదీ ఎక్కడ అని అడుగగా , వాళ్ళ అమ్మగారు రాత్రి కాల్ చేసి వస్తున్నాను అని చెప్పినా ఉదయం లేవకుండా హాయిగా నిద్రపోతుండగా లేపగా , అమ్మ వస్తున్నారనే విషయం మరిచిపోయి రోజూ ఆడిగినట్లుగా కాఫీ అడిగాడు అంటూ తియ్యగా నవ్వుతూ విషయం చెప్పగానే నీతో ఉంటే అమ్మానాన్నలనే మరిచిపోయాను అన్నాడు అంటీ అంత మంచి ఫ్రెండ్ వారం రోజుల్లోనే నన్ను ఇంత సంతోషంగా ఉండేలా మార్చేశాడు బంగారం తను అంటూ తల్లిముందే కొడుకు మంచితనాన్ని ఎవరెస్టు అంత పొగుడుతుండగా మురిసిపోతూ ,మొదటిది మహికి నేనెవరో చెప్పలేదు రెండవది రోజుకు రెండు మూడు సార్లు నాతో మాట్లాడకుండా ఉందని కన్నయ్య నాలుగురోజులు ఒక మెసేజ్ కూడా పెట్టలేదు మూడవది తనని సంతోషన్గా మార్చేశాడు అంటోంది కచ్చితంగా ఏదో ఉంది అంటూ ఆలోచిస్తుండగా ,



అంటీ అంటీ ........అంటూ పిలువగా , తేరుకొని చూస్తాను ఉండు మహి అంటూ ఆవిడా , ఈవిడా ........అంటూ చూపించగా ఏమో అంటీ పార్క్ చెయ్యడానికి వెళ్లిన మహేష్ రావాల్సిందే అంటూ లోపల నుండి వస్తున్న వారినీ , నాకోసం గేట్ వంక మార్చి మార్చి చూస్తుండగా , అప్పుడే నేను లోపలకు రాగా అమ్మ దూరం నుండే తల అడ్డంగా ఊపుతుండగా , మహేష్ అంటీ ఎవరో గుర్తుపట్టలేకపోతున్నాను అంటూ అంటీ మహేష్ చెప్పానుకదా ఫ్రెండ్ అని పరిచయం చెయ్యగా అమ్మా అని పిలువగా , షాక్ కొట్టినట్లుగా నెమ్మదిగా మహేష్ వంక చూస్తూ అమ్మ అదే అంటీ అని అడుగగా , అవును అమ్మ వైజాగ్ నుండి వచ్చింది అనగానే వెంటనే నావెనుక  సిగ్గుపడుతూ దాచుకోగా , మహి ఇటు రా అని అడుగగా నెమ్మదిగా వచ్చి అంటీ అంటూ పాదాలకు నమస్కరించగా , సంతోషంగా ఉండు తల్లి అని ఆశీర్వదించి లేపి కౌగిలించుకోగా , అంటీ నేను పొగిడినట్లుగా మహేష్ కు చెప్పొద్దు నాకు సిగ్గు అనగా , కళ్ళతోనే సరే అంటూ మనసారా కౌగిలించుకొని ,



ఏంటి కన్నయ్యా లేట్ ఫ్లైట్ ల్యాండ్ అయ్యి చాలాసమయం అయ్యింది తెలుసా ఈ మధ్యన అమ్మ మీద ప్రేమ తగ్గినట్లుంది అనగా , మా అమ్మ మీదనా నువ్వు నా ప్రాణం అమ్మా నేను ఎప్పుడూ నీబుజ్జికన్నయ్యనే అంటూ అమ్మను కౌగిలించుకోగా ,చూద్దాము ఏమి చెబుతాడో అని మరి అయితే నువ్వు నాకు కాల్ చేసి నాలుగు రోజులవుతోంది తెలుసా అని బుంగమూతి పెట్టుకోగా , లేదమ్మా ఆఫీస్ లో వర్క్ ఎక్కువగా ఉంది అంటూ అపద్దo చెబుతున్నట్లుగా తల దించుకోగా , మహి కూడా ఆశ్చర్యపోగా , ఫిక్స్ ఏదో ఉంది సరే వెళదామా అనగా అమ్మా నాన్నగారు ఎక్కడ అని అడుగగా , కొత్త బిసినెస్ పనులలో బిజీగా ఉండటంతో నేను మాత్రం నిన్ను కాదులే మహిని నా ఫ్రెండ్ ను చూడటానికి వచ్చేసాను అంటూ బ్యాగు క్రిందపడేసి తీసుకురా కన్నయ్యా అంటూ మహితో మాట్లాడుతూ బయటకు నడువగా , నాన్నకు ఫోన్ చేసి మాట్లాడుతూ బ్యాగు అందుకొని కారు తీసుకొనిరాగా , ఇద్దరూ వెనుక కూర్చొని మాట్లాడుతూ , సంతోషంగా నవ్వుతూ ఇంటికి చేరుకోగా బయట నుండి లోపలివరకూ చూసి మురిసిపోతూ నిజమే మహి ఇంటివాతావరణాన్నే మార్చేసింది అంటూ చాలా చాలా థాంక్స్ మహి నువ్వు వచ్చాక కన్నయ్య ఇక్కడ ఒంటరిగా ఎలా ఉంటాడు అన్న ఆలోచనే రావడం లేదు నువ్వు చెప్పినది కూడా నిజమే అంటూ కన్నుకొట్టి మహి బుగ్గలను అందుకొని నుదుటిపై ప్రేమగా ముద్దుపెట్టగా , థాంక్స్ అంటీ ప్రయాణంలో అలసిపోయి ఉంటారు స్నానం చేసి రండి టిఫిన్ చేసేస్తాను అనగా అలాగే అంటూ రూంలోకి వెళ్ళింది , 



మహేష్ నువ్వు కూడా అనగా అలాగే మేడం అంటూ టవల్ మరియు బట్టలు అందుకొని బయట బాత్రూం లోకి వెళ్లి రెడీ అయ్యి వచ్చి హాల్ లో టీవీ చూస్తూ కూర్చోగా , అమ్మ వచ్చి వంటలో సహాయం చెయ్యగా ముగ్గురూ తిన్న తరువాత వంట గది శుభ్రం చేస్తూ మహి వచ్చిన దగ్గర నుండి బెంగళూరులో ఏమేమి చూశావు అని అడుగగా , ఎక్కడ అంటీ ఆఫీస్ నుండి వచ్చేసరికి అలసిపోతాము ఒకరోజు మాత్రం గుడికి వెళ్ళాము అనగా , కన్నయ్యా ఉండు నీపని చెబుతాను అంటూ హాల్ లోకి వచ్చి మహిని ఎక్కడికీ పిలుచుకొని వెళ్లలేదంట మాకు బెంగళూరు మొత్తం చుట్టేయాలని ఉంది అనగా నేను ఎప్పుడో రెడీ మీరే రెడీ అవ్వాలి అని చెప్పగా , మా కన్నయ్య బంగారం అంటూ నుదుటిపై ప్రాణంగా ముద్దుపెట్టి బెడ్రూం లోకి పిలుచుకొనివెల్లి తన బట్టలన్నీ చూసి మహి నువ్వు సిటీ లో ఉంటున్నావా అసలు అనగా అధికాదు అంటీ ఇప్పుడు ఏదో ఒకటి కట్టుకొని రెడీ అవ్వు అంటూ రెడీ అయ్యి కిందకు వచ్చి కారులో కూర్చోగా ముందు ఎక్కడికి అమ్మ అని అడుగగా ఇస్కాన్ టెంపుల్ బుజ్జి అనగా పోనివ్వగా ,
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 18-07-2019, 10:30 AM



Users browsing this thread: 196 Guest(s)