Thread Rating:
  • 40 Vote(s) - 2.63 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
#12
తెల్లవారకముందే లేచి రెడి అయ్యి అమ్మానాన్నలిద్దరూ లేవగానే అమ్మా నేను గుడికి వెళుతున్నాను మీరు నెమ్మదిగా రెడి అయ్యి వచ్చెయ్యండి అని చెప్పి హుషారుగా చేరుకొని హడావిడిగా పెళ్లి పనుల్లో అందరూ అటూ ఇటూ తిరుగుతూ పెద్దమ్మ , చెల్లి చూసి రా అన్నయ్యా అని పిలువగా మీరు కానివ్వండి అని చెప్పి చుట్టూ తిరుగుతూ సువర్ణ సుందరి కోసం తిరుగుతుండగా , పెళ్ళికొడుకు మరియు వాడి తండ్రి కనిపించగా ఇద్దరికి ఇద్దరు బంధిపోటు ముఖాలతో వొళ్ళంతా కన్నింగ్ తో ఏవో లెక్కలు వేసుకుంటూ నన్ను గుర్తుపట్టకుండా వెళ్లిపోగా సంతోషిస్తూ నా పనిలో నేను ఉండగా , ఎక్కడా కనపడకపోగా నిరాశతో పెళ్లి మండపం ఎదురుగా కూర్చునగా ముహూర్తం దగ్గరపడుతున్నట్లుగా హడావిడి పెరుగగా అమ్మానాన్నలు కూడా వచ్చి నిరాశతో ఉన్న నన్ను చూసి భుజం తడుతూ ప్రక్కనే కూర్చోగా , 



అమ్మా నాన్న తిన్నారా అని అడుగగా నా చెయ్యి అందుకొని నా కన్నయ్య మంచితనానికి నా కోడలు తప్పకుండా కనిపిస్తుంది అని ధైర్యాన్ని ఇస్తూ నువ్వు తిన్నావా అని అడుగగా బయట తినేసి ఇక్కడకు వచ్చాను అని చెప్పగా , ఈ అమ్మకే అపద్దo చెబుతావా రా తిందాము అంటూ పిలుచుకోవెల్లగా పంక్తులలో కూర్చోగానే చెల్లి చూసి సంతోషిస్తూ కూలీచేతిలోని పాత్రను అందుకొని మా అన్నయ్యకు అమ్మానాన్నలకు నాచేతులతో స్వయంగా వడ్డిస్తాను అంటూ నవ్వుతూ వడ్డించగా ప్రమీలా నువ్వు తిన్నావా అమ్మా అని అమ్మ అడుగగా , తిన్నానమ్మా అమ్మ , అన్నయ్యా తినండి అంటూ వడ్డించగా తినేసి పెళ్లి దగ్గరకు రాగా , 



అప్పటికే రౌడీ పెళ్ళికొడుకు పెళ్లిపీటలపై కూర్చుని ఉండగా పంతులు గారు మంత్రాలు చదువుతుండగా ముందర అంతా చాలామంది అమ్మాయిలు గలగలా నవ్వుతుండగా దూరం నుండే అందరినీ చూస్తూ అక్కడ కూడా లేకపోవడంతో వెనుదిరుగుతుండగా పంతులు గారు పెళ్లికూతురుని పిలుచుకొని రండి అని చెప్పగా ముందు ఉన్న అందమైన అమ్మాయిలు పరుగుపెట్టగా కొద్దిసేపటి తరువాత పెళ్లికూతురుని గంపలో ఎత్తుకొని మగవాళ్ళు వస్తుండగా చిన్నపిల్లలు అమ్మాయిలు చూసి నవ్వుతుండగా , ఏమిటా అన్నట్లుగా తిరిగి చూడగానే షాక్ గంపలో ఎత్తుకొస్తున్న అమ్మాయే నేను చూసి ఇష్టపడిన అందలరాశి ఆని ఆనందించేలోపు తనే పెళ్లికూతురు అని తెలిసి గుండె వెయ్యిముక్కలైపోయింది , నాకు తెలియకుండానే నా హృదయం బాధపడుతూ కన్నీళ్ళరూపంలో కరిగిపోసాగింది. వెంటనే భారంగా కన్నీళ్లను తుదుచుకొని తన ఆనందం చూసి ఒక అమ్మాయికి పెళ్లి కంటే గొప్ప ఆనందం ఎక్కడ ఉంటుంది అని తన సంతోషాన్ని చూసి ఒకేసారి సంతోషం మరియు ఇక జీవితంలో తనను చూడలేను అనే బాధతో దుఃఖం వస్తూ కదలకుండా తన సంతోషాన్నే చూస్తూ ప్రేమించిన అమ్మాయి సంతోషం కంటే ఆనందం మరొకటి ఏమిటి ఉంటుంది అని బాధతో వణుకుతున్న శరీరంతో ఆగకుండా కారుతున్న కన్నీటిని వెనువెంటనే తుడుచుకుంటూ నిలబడగా ,



  ఇంతలో పెద్దవాళ్ళ ఆశీర్వాదం కోసం మంగళసూత్రం ఒకొక్కరి దగ్గర నుండే నాదగ్గరకు తీసుకొచ్చి బాబు అనగానే చూసి ఒక్కసారిగా వొళ్ళంతా బాధతో జలదరిస్తూ మళ్లీ బాబు అని వినిపించగా తను సంతోషన్గా ఉండాలని మనసులో అనుకుని ఇక అక్కడ ఉండలేక అమ్మవాళ్లను చూసి బాధపెట్టడం ఇష్టం లేక భారమైన గుండెతో కన్నీళ్లను దిగమింగుకుంటు బయటకు వచ్చి కారులో కూర్చొని అన్నీ తలుపులు మూసుకొని ప్రేమలో విఫలమైతే ఇలా ఉంటుందా అని బాధతో విలవిలలాడిపోతూ ఆ ఊరులోనే ఉండటం ఇష్టం లేక అమ్మా కాస్త ఇంపార్టెంట్ ఆఫీస్ పని పడింది తిరుపతికి వెళుతున్నాను పెళ్లి అవ్వగానే కాల్ చెయ్యండి వచ్చి తిరుమలకు తీసుకెళతాను అని చెప్పి స్టార్ట్ చేయడమే అమితమైన వేగంతో ఊరు నుండి బయటకు వచ్చి మందు తాగాలని మనసు ప్రోత్సహించినా అమ్మకిచ్చిన మాట గుర్తుకువచ్చి హైవే లో కారును ప్రక్కకు ఆపి కిందకు దిగి oh god what did you do అంటూ రోడ్డులోని గట్టిగా అరుస్తూ కారుని కొడుతూ ఏమిచెయ్యాలో తెలియక కారులో వెనుక కూర్చుని ఒంటరిగా బాధపడ్డాను.
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 11-07-2019, 10:36 AM



Users browsing this thread: 187 Guest(s)