54 minutes ago
[b]అత్తింటి అవమానాలు[/b]
![[Image: Picture2.png]](https://i.ibb.co/mrwMHQQK/Picture2.png)
రచన: నీరజ హరి ప్రభల
(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)
"ఏయ్! సుజీ! కాఫీ తీసుకురా!" హాలులో భర్త విజయ్ పెద్దగా వేసిన కేక వంటింట్లో పనిచేస్తున్న సుజాతకి వినబడింది.
చేస్తున్న పనిని ఆపి గబగబా కాఫీ చేసి తీసుకుని వెళ్లి ఆయనకి ఇచ్చి వచ్చింది.
కాసేపటికి బ్రేక్ఫాస్ట్ తయారుచేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టి భర్తను పిలిచింది.
"వస్తున్నా!" అంటూ హడావుడిగా వచ్చి కూర్చోగానే ఆయనకి పెట్టి తనూ కూర్చుంది. కాసేపటి తర్వాత విజయ్ ఆఫీసుకు వెళ్గగానే తను వంటింట్లోకి వచ్చి వంట పని గావించి కాసేపు విశ్రాంతిగా కూర్చుంది సుజాత.
క్రితం రోజున అత్తగారి తిధి. ఆ హడావిడి, వచ్చిన బంధువులకు తనే స్వయంగా వంటివార్పు, భోజనాలతో సాయంత్రం వాళ్లందరూ వెళ్లేదాకా క్షణం తీరికలేకుండా అయింది సుజాతకి.
ఒళ్లంతా బాగా అలసటగా ఉండి కాసేపు టి.వి. చూద్దామని అది ఆన్ చేయగానే "గుర్తుకొస్తున్నాయి…. గుర్తుకొస్తున్నాయీ…" పాట వస్తోంది. ఆ పాట అంటే చాలా ఇష్టంగా చూస్తున్న సుజాత పాట అయిపోగానే టి.వి. ఆఫ్ చేసింది. సుజాత మనసు అప్రయత్నంగా తన మదిలోని జ్ఞాపకాలు గుర్తొచ్చి గతస్మృతులలోకి పరుగుతీసింది.
అవి తన పెళ్లైన క్రొత్తరోజులు. అప్పుడు తనకు పదహారు సంవత్సరాల వయస్సు.. క్రొత్త పెళ్లికూతురైన తను భయంభయంగా అత్తవారింట్లో అడుగుపెట్టింది. తనకు స్వతహాగా సిగ్గు, బిడియము ఎక్కువ. క్రితం రోజు తల్లి తండ్రులు వచ్చి దించి వెళ్లగానే మనసులో ఎంతో దిగులనిపించింది. అప్పటిదాకా తను పుట్టిపెరిగిన ఇంట్లో అమ్మానాన్నలతో వాళ్ల ప్రేమానురాగాలతో హాయిగా గడిపింది.
పచ్చని ప్రకృతి, ఆహ్లాదకరమైనగాలి, చిన్న చిన్న సెలయేర్లు, ఆకుపచ్చని వరిచేలు, ఊరిమధ్యన శివ,విష్ణాలయాలు, హైకాలేజీ, బాల్యస్నేహితుల మధ్యన ఆటపాటలతో ఎంతో సంతోషంగా గడిపింది. పదవతరగతి మంచి మార్కులతో పాసవగానే తండ్రి ఈ సంబంధం చూడడం, జాతకాలు కలవడం, ఉమ్మడి కుటుంబం, అందరిమధ్యన సంతోషంగా తన కూతురు సుఖపడుతుందని ఆశించి పెళ్లిచూపులు ఏర్పాట్లు చేశారు.
పెళ్లి వారందరూ రావడం, వాళ్లకు తను నచ్చడం జరిగింది. ఆ మరుసటి నెలలో ఇరువైపులా పెద్దలు పెళ్లిలో ఇచ్చిపుచ్చుకోవడాలు, మర్యాదలు, లాంఛనాలు వగైరా మాట్లాడుకుని తాంబూలాలు పుచ్చుకున్నారు. తర్వాత ఇరవై రోజులకు తల్లిదండ్రులు ఘనంగా పెళ్లి చేసి అత్తవారింట కాపురానికి దించి వెళ్లడం జరిగింది.
అత్తగారు, ఇద్దరు బావగార్లు, తోడికోడళ్లు, వాళ్లకి ఇద్దరేసి మగపిల్లలు ఉన్న ఉమ్మడి కుటుంబం కావడంతో నెమ్మదిగా ఆ ఇంటి వాతావరణం, పధ్ధతులు, ఇంట్లోని మనుషులను అర్ధం చేసుకుని ఆ ప్రకారం నడుచుకుంటూఉంది. తోడికోడళ్లిద్దరూ అత్తగారికి మేనకోడళ్లే కనుక ఆవిడ వాళ్లను చాలా ప్రేమగా, ఆదరంగా చూసుకోవడాన్ని గ్రహించింది సుజాత. తనకి కూడా అలాంటి అలాంటి ఆదరణ లభిస్తుందని ఎంతగానో సంబరపడింది సుజాత.
[b]ఆ ఇంట అత్తగారి మాటకు ఎదురులేదు. అందరితో మంచిగా, వినయవిధేయతలతో ఉంటూ ఇంట్లో ఎవరేంచెప్పినా వాళ్లకు అణకువగా పనిచేసేది సుజాత. స్వతహాగా మెత్తని స్వభావం, ఎదురుచెప్పే ధైర్యం లేనందున అది అలుసుగా తీసుకుని అందరూ ఆమెచేత వెట్టి చాకిరీ చేయించుకునేవాళ్లు. [/b]
"మాకోడలు చామన ఛాయ, అయినా కోడలిగా చేసుకున్నాము" అని కావాలని తన ముందే అందరికీ గొప్పగా చెప్పేది అత్తగారు.
వింటున్న సుజాతకి చాలా బాధేసేది. చాలా చులకనగా కూడా మాట్లాడేవాళ్లు. వాళ్ల ప్రవర్తనకు చాలా బాధపడేది సుజాత. తన బాధని భర్తతో చెప్పుకుందామని ప్రయత్నం చేస్తే అతను అర్థం చేసుకోకపోగా వాళ్లనే వెనకేసుకొచ్చేవాడు. అతనికి తల్లిమాటే వేదం. ఆవిడ మాటను జవదాటడు. ఇది గ్రహించిన సుజాత తన బాధలన్నీ మనసులోనే దాచుకుంటూ ఓర్పుగా సంసారం చేస్తోంది.
ఇలా ఉండగా కొన్నాళ్లకి సుజాత గర్భవతైంది. విషయం తెలిసి అందరూ సంతోషించారు. సుజాత తల్లితండ్రులకు తెలిసి సంతోషంగా వచ్చి కూతుర్ని చూసి వెళ్లారు. రోజులు గడుస్తున్నాయి. ఏడవనెలలో సీమంతం వేడుకలని చాలా ఘనంగా చేశారు సుజాత తల్లి తండ్రులు. అత్తవారింట్లో ఆనవాయితీ లేదుట. కూతురిని పురిటికి పంపమని వాళ్లు
అడిగితే 'తొమ్మిదవనెల వచ్చాక తీసికెళ్లండి' అని అత్తగారి ఆర్డరు. చేసేదిలేక తలిదండ్రులు మిన్నకుండిపోయి వాళ్ల ఊరెళ్లారు. 'గర్భవతైన సుజాత పనిచేస్తే ఆమెకు కాన్పు సులభం' అన్న వంకతో చాకిరీచేయించుకునేవాళ్లు.
'ఎప్పుడు తొమ్మిదవనెల వస్తుందా? అమ్మ వద్దకు వెళ్లి విశ్రాంతి తీసుకుందామా!' అని ఎదురుచూసేది సుజాత. తొమ్మిదవనెల రానే వచ్చింది. సుజాత తల్లితండ్రులు వచ్చి ఆమెని పుట్టింటికి తీసికెళ్లారు. ఒక శుభముహూర్తాన చక్కటి ఆడపిల్లకు జన్మనిచ్చింది సుజాత. విషయాన్ని సంతోషంగా అత్తింటివారికి కబురుచేసి చూడటానికి రమ్మన్నారు సుజాత తల్లి తండ్రులు.
ఆడపిల్ల పుట్టిందన్న సాకు చెప్పి భర్త విజయ్ కూడా చూడటానికి రాలేదు. వాళ్ల ప్రవర్తనకు సుజాత, వాళ్ల తల్లి తండ్రులు చాలా బాధపడ్డారు. చివరకు 21 వరోజున పాపకు 'దివ్య' అని పేరు పెట్టి ఎలాగో బారసాల అయిందనిపించి సుజాతను, దివ్యను తీసికెళ్లారు విజయ్ వాళ్లు.
ఇంక అక్కడికి వెళ్లినాక ముద్దులొలికే దివ్య ను చూసైనా తన పరిస్థితి బావుంటుంది అనుకున్న సుజాత ఆశ నిరాశే అయింది. దివ్య క్రమేణా పెరుగుతూ తన ముద్దు ముద్దు మాటలతో అలరిస్తోంది. తనకి మూడవసం… నిండగానే అక్షరాభ్యాసం చేసి మంచి కాలేజీలో చేర్చారు. దివ్య చక్కగా చదువుతూ మంచి మార్కులతో పాసవుతోంది.
కాలం గడుస్తోంది. ఇంకో సం… తర్వాత సుజాత గర్భం దాల్చగానే ఇంట్లో అందరూ సంతోషించారు. నెలలు నిండగానే సుజాతను పురిటికి పుట్టింటికి తీసుకెళ్లారు వాళ్ల తల్లితండ్రులు. ఒక శుభముహూర్తాన సుజాత మరో ఆడపిల్లకు జన్మనిచ్చింది.
ఆ శుభవార్తను సుజాత తండ్రి వాళ్లకు చెప్పగానే "అయ్యో! ఈసారి ఆడపిల్లేనా!" అనే నిష్టూరాలు.
ఇవన్నీ ఊహించినదే కనుక సుజాత వాళ్ల మాటలకు ఈసారి అంతగా బాధపడలేదు. ఆ పాపకు "రమ్య" అని పేరుపెట్టారు. ఎప్పటిలాగే అత్తారింట్లో అదే చాకిరీ, అదే పరిస్థితి. విజయ్ ప్రవర్తన ఏం మారలేదు. అతను తల్లి చాటువాడు. ఏదో అంటీముట్టనట్లుగా పిల్లలను చూసేవాడు. ఇంక వాళ్ల స్వభావం మారదు అనుకుని తన బిడ్డలను ప్రాణంగా పెంచుకుంటోంది సుజాత.
ఇంట్లో ఏ శుభకార్యాలైనా సుజాత చేత నూతన దంపతులకు మంగళహారతిని కూడా పట్టనిచ్చేవాళ్లుకారు అత్త, తోడికోడళ్లు. అక్షింతలు వేసి దీవిస్తే వాళ్లకి కూడా నీకు లాగే ఆడపిల్లలు పుడతారనేది అత్తగారు. ఆవిడ మాటలకు, చేసే అవమానాలకు సుజాత ఎంతో బాధపడేది.
విజయ్ తో చెబుదామనుకుని ధైర్యం చేసి ఒకసారి అతనితో చెప్పగా అతను తల్లిని వెనకేసుకొచ్చి తనపై చేయికూడా చేసుకున్నాడు. ఇంక 'తన ఖర్మ ఇంతే' అనుకుని ఎంతో ఓర్పుగా ఆ ఇంట్లో ఉంటూ తన పిల్లలను పెంచుతోంది సుజాత.
కాలం గడుస్తోంది. విజయ్ అన్నల పిల్లల చదువులు పూర్తయి వాళ్లకి వేరే చోట్ల ఉద్యోగాలు కూడా వచ్చాయి.
దివ్య, రమ్యలు చక్కగా చదువుతూ మంచిగా వృధ్ధిలోకి వస్తున్నారు. వాళ్ల అభివృద్దినిచూస్తూ తన బాధలన్నిటినీ మర్చిపోతూ పిల్లలే ప్రాణంగా బ్రతుకుతోంది సుజాత. పిల్లలుకూడా ఎదుగుతూన్న కొలదీ ఇంటి పరిస్థితిని అర్ధం చేసుకున్నారు. ముందుగా తండ్రిని మార్చే ప్రయత్నం చేశారు కానీ ప్రయోజనం శూన్యం.
ఇంట్లో వాళ్లు కూడా అదే తీరు. ఇంక పిల్లలు తమ తల్లిని, ఆమె పరిస్థితిని అర్ధం చేసుకుని తల్లిని ఊరడించి సంతోషపెట్టేవారు.
కాలం వేగంగా సాగుతోంది. చూస్తూ ఉండగానే దివ్య, రమ్యలు చక్కగా మెరిట్ మార్కులను తెచ్చుకుంటూ ఇంజనీరింగ్ ను పూర్తిచేశారు. సుజాతావాళ్లు వాళ్లకు మంచి సంబంధాలను చూసి పెళ్లి చేశారు. కానీ అల్లుళ్లు అమెరికాలో ఉద్యోగాలు. బుధ్ధిమంతులు, మంచి అల్లుళ్లు దొరికారు అని సుజాత సంతోషపడి ఆ భగవంతునికి కృతజ్ఞతలను తెలుపుకుంది.
దివ్య, రమ్యలు వాళ్ల భర్తలతో అమెరికా వెళ్లారు. కన్న పిల్లలను అంత దూరంగా పంపుతున్నందుకు బాధపడుతున్న తల్లిని వాళ్లిద్దరూ ఓదార్చి "వాట్సాప్, వీడియో కాల్స్ ఉంటాయి కదమ్మా! ఏమీ బాధపడకు. కొన్నాళ్ళకి నీవే మా వద్దకు వచ్చి ఉండచ్చు" అన్న వాళ్ల మాటలకు తనకి తనే నిబ్బరించుకుని వాళ్లను సంతోషంగా అమెరికా పంపింది.

ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
మా తెలుగు తల్లికి మల్లె పూదండ

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)