Thread Rating:
  • 9 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
꧁༺ అనుమానాల నీడలో … దాగిన నిజాలెన్నో ༻꧂
పది ఇరవైకి వీధి చివర నుంచి ఆ శబ్దం వచ్చింది.

ముందు దూరంగా, దోమ రొద లాగా సన్నగా. తర్వాత దగ్గరవుతూ, గుర్రు గుర్రుమని మొరుగుతూ. నిర్మల చేతిలో గరిటె చారు గిన్నె అంచుకి తగిలి టంగుమంది. ఆ శబ్దం ఆమె చెవులకి కొత్త కాదు. షాప్ ముందు రెండుసార్లు ఆగింది. నాలుగో వీధి చీకట్లో తన తొడల కింద ఊగింది. ఆ రాత్రి నుంచి ఊళ్లో ఏ బండి వెళ్లినా ఆమె చెవులు దాన్నే వెతుకుతున్నాయి.

‘కాదు. ఊళ్లో ఆ బండి ఒక్కటే ఉంటుందా? ఎవరో ఉంటారు,’ అని తనకు తానే చెప్పుకుంది.

ఇంజిన్ గేటు ముందే ఆగింది. ఒక్కసారి రెయిజ్ అయి, ఆగిపోయింది. ఆ తర్వాత నిశ్శబ్దంలో రెండు గొంతులు. ఒకటి శ్రీనుదే. మందంగా, తడబడుతూ ఏదో పాట కూనిరాగం. ఇంకోటి పడుచు గొంతు. “అంకుల్, చూసుకుని… మెట్టు ఉంది… అలా కాదు, ఇటు…” అని నవ్వుతోంది.

ఆ నవ్వు వినగానే నిర్మల ఒంట్లో రక్తం ఒక్కసారి చల్లబడి, మరుక్షణం కాగింది. ఆ నవ్వు ఆమె మెడ వెనక ఊపిరితో సహా గుర్తుంది.

ఆమె వంటింటి గుమ్మం దగ్గరే గోడకి అతుక్కుపోయింది. కాళ్లు కదలట్లేదు. గేటు కిర్రుమని తెరుచుకుంది. వరండాలో చెప్పుల చప్పుడు. తలుపు దబదబా తట్టిన శబ్దం.

“ఏమే! తలుపు తియ్యవే! అతిథి వచ్చాడు!”

నిర్మల చేతిలో తువ్వాలు పట్టుకుని, కొంగుని భుజాల చుట్టూ బిగించుకుని, ఒక్కో అడుగు బరువుగా వేస్తూ తలుపు దగ్గరికి వెళ్లింది. గడియ మీద చేయి పెట్టింది. గడియ చల్లగా ఉంది. ఆమె అరచేయి చెమటగా ఉంది. ‘నువ్వే కాదని చెప్పు దేవుడా,’ అనుకుంటూ గడియ లాగింది.

తలుపు తెరుచుకుంది. వరండా బల్బు పసుపు వెలుతురు.

ముందు కనిపించింది శ్రీను. చొక్కా గుండీలు తప్పుగా పెట్టుకుని, ఒక చెప్పు చేతిలో పట్టుకుని, కళ్లు ఎర్రగా, మత్తుగా నవ్వుతున్నాడు. అతని ఒంటి నుంచి బ్రాందీ, సిగరెట్, చెమట కలిసిన ఘాటైన వాసన. అతని ఎడమ చేయి ఎవరిదో భుజం మీద వేలాడుతోంది.

ఆ భుజం నలుపు టీషర్ట్‌లో ఉంది. దాని మీద వెండి రంగు అక్షరాలు. కింద బిగుతైన నీలం జీన్స్. చేతికి నల్లని దారం, మణికట్టు మీద స్టీలు కడియం. జెల్ పెట్టి నిలబెట్టిన జుట్టు. చెవిలో చిన్న పోగు.

తర్వాత ముఖం.

రవి.

ఇద్దరి కళ్లూ ఒకేసారి కలిశాయి. ఒక్క క్షణం ఎవరూ కదల్లేదు. రవి కనుబొమ్మలు పైకి లేచాయి. నోరు చిన్నగా తెరుచుకుంది. తర్వాత అతని కళ్లు నిర్మల ముఖం మీంచి ఆమె తడి జుట్టు మీదికి, ఇంట్లో కట్టుకునే ఆ వెలిసిన కాటన్ చీర మీదికి, ఆమె వెనక ఖాళీ హాలు మీదికి, మళ్లీ శ్రీను ముఖం మీదికి జారాయి. ఆ కళ్లలో ఆశ్చర్యం నెమ్మదిగా కరిగి, దాని స్థానంలో ఒక కొంటె మెరుపు, ఏదో రహస్యం అర్థమైపోయినట్టు ఒక నవ్వు పెదవుల మూల నుంచి పాకింది.

‘ఓర్నీ అంకుల్! ఎంత దొంగ ముసలోడివి. ఇంట్లో ఎవరూ లేరని ఈ రోజు ఆంటీని ఏకంగా ఇంటికే తెప్పించుకున్నావా? రాత్రికి సెట్టింగ్ పెట్టుకుని నన్ను భోజనానికి పిలుస్తావా? అందుకేనా ఇందాక వైన్ షాప్‌లో ఇల్లు ఖాళీ అని అంత ఆనందంగా చెప్పావు,’ అని రవి మనసులో అనుకున్నాడు. అతని నవ్వు ఇంకా వెడల్పైంది.

నిర్మల మోకాళ్లు వణికాయి. ఆమె గుమ్మం చెక్కని పట్టుకుంది. గుండె చప్పుడు చెవుల్లో డప్పులా మోగుతోంది. ‘ఇప్పుడు ఈయన ఏదో ఒక మాట అంటాడు. మా ఆవిడ అని పరిచయం చేస్తాడు. అంతా అయిపోతుంది. ఈ కుర్రాడు నవ్వుతాడు, ఊరికి చెప్తాడు, ఈయనకి ఆ రాత్రి సంగతి చెప్తాడు,’ అని ఆమె మనసు పరిగెడుతోంది.

“రా రా రవీ! లోపలికి రా!” అని శ్రీను తడబడుతూ గడప దాటాడు. చెప్పు ఒకటి గుమ్మంలోనే జారి పడింది. “ఇదే మా ఇల్లు. రాజమహలు కాదు గానీ, మనసున్న ఇల్లు. ఈ రోజు ఇల్లంతా మనదే రా. ఎవరూ లేరు. అమ్మాయి పెళ్లికి పోయింది. అల్లుడు నైట్ డ్యూటీ. ఇక మిగిలింది నేను…” అని అతను చేయి ఊపి నిర్మల వైపు చూపించాడు, “…ఇది. ఇది అన్నం పెడుతుంది. ఏమే, మా ఫ్రెండ్. రవి.”

‘ఇది.’ నిర్మల గుండె ఆ ఒక్క మాట మీద తడబడింది. ‘మా ఆవిడ’ అనలేదు. ‘నా భార్య’ అనలేదు. మత్తులో మామూలుగా పిలిచే ‘ఇది’, ‘ఏమే’. ఆ పదం ఆమెని కాపాడింది. అదే పదం ఆమెని అవమానించింది కూడా. రెండూ ఒకేసారి ఆమె గొంతులో ముద్దలా అడ్డుపడ్డాయి.

“తెలుసు అంకుల్. షాప్‌లో చూశా,” అన్నాడు రవి. గొంతు మామూలుగా పెట్టినా, మాటల చివర తేనె కారుతోంది. అతని కళ్లు నిర్మల కళ్లలోంచి కదల్లేదు. “నమస్తే ఆంటీ.”

“ఆఁ… షాప్‌లో కూర్చుంటుంది కదా మధ్యాహ్నాలు,” అని శ్రీను హాల్ సోఫా మీద దబ్బున కూలబడ్డాడు.

రవి లోపలికి అడుగు పెట్టాడు. గుమ్మం దాటేటప్పుడు అతని భుజం నిర్మల భుజానికి రాసుకుంది. ఆ రాపిడి ఒక్క క్షణమే. బ్రాందీ, సిగరెట్, ఏదో ఘాటైన డియోడరెంట్ వాసన ఆమె ముక్కుకి కొట్టింది. ఆమె ఒళ్లంతా కరెంట్ తగిలినట్టు జలదరించింది.

“అంకుల్ మంచి సరుకు ఇంట్లో కూడా పెట్టుకున్నాడే,” అని అతను ఆమె చెవి దగ్గర, ఆమెకి మాత్రమే వినిపించేలా గుసగుసలాడి, ఏమీ అననట్టు ముందుకి నడిచాడు.

నిర్మల తలుపు మూసి గడియ పెట్టింది. ఆ గడియ చప్పుడు ఆమెకి ఏదో పంజరం మూసుకున్నట్టు వినిపించింది. లోపల ఎవరు బందీనో ఆమెకే తెలియలేదు.

హాల్లో రవి నిలబడి చుట్టూ చూస్తున్నాడు. ట్యూబ్‌లైట్, సీలింగ్ ఫ్యాన్, పాత సోఫా, టీవీ మీద లేసు గుడ్డ, దేవుడి గూడు, గోడ మీద దేవుడి క్యాలెండర్. అతని చూపు గోడ మీద వేలాడుతున్న ఒక పాత ఫోటో దగ్గర ఆగింది.

నిర్మల ఊపిరి బిగబట్టింది.

అది ఎప్పుడో తీసిన వాళ్ల పెళ్లి ఫోటో. నలుపు తెలుపు ఫోటో, అంచుల్లో పసుపు పట్టి, అద్దం లోపల తేమకి మచ్చలు పడ్డాయి. అందులో శ్రీను నల్ల జుట్టుతో, సన్నని మీసంతో, తల మీద బాసికంతో. పక్కన సన్నని పెళ్లికూతురు. బక్కపలచని ఒళ్లు, ముఖానికి పెద్ద బాసికం, కళ్ల నిండా భయం, ఒళ్లంతా నగలు. ఆ ఫోటోలోని పెళ్లికూతురికీ ఇప్పుడు గుమ్మం దగ్గర నిలబడిన ఈ నిండైన ఆడదానికీ ఒక్క పోలిక కూడా లేదు.

రవి ఆ ఫోటో దగ్గరికి వెళ్లి ముఖం దగ్గరగా పెట్టి చూశాడు. నిర్మల చేతిలో తువ్వాలు పిడికిట్లో నలిగిపోతోంది. ఆమె వీపు మీద చెమట వెన్నెముక గుంట వెంట జారింది.

“ఇది మీ పెళ్లి ఫోటోనా అంకుల్?” అని రవి వెనక్కి తిరిగి నవ్వాడు. “అప్పుడు మీకు జుట్టు ఉందే! పక్కన ఆంటీ చూడు, పాపం మిమ్మల్ని చూసి భయంతో వణుకుతోంది.”

“ఆఁ… అప్పుడు అది పుల్లలా ఉండేదిరా. ఇప్పుడు చూడు,” అని శ్రీను సోఫా మీంచే పెద్దగా నవ్వాడు. “ఇప్పుడు ఆ ఫోటో ఫ్రేము లోపల అది పట్టదు.”

నిర్మల గుండె గొంతులోకి దూకింది. ‘ఇప్పుడు చూడు’ అని ఈయన వేలు ఎవరి వైపు చూపిస్తాడో అని ఆమె కళ్లు శ్రీను చేతి మీదే ఉన్నాయి. కానీ శ్రీను చేయి గాలిలో ఏదో గుండ్రంగా తిప్పి, సోఫా మీద దబ్బున పడింది. అతని కళ్లు సగం మూసుకుపోయాయి.

రవి ఆ మాటని తనదైన అర్థంలోనే తీసుకున్నాడు. ‘ఇంట్లో ఉన్న పెళ్లాం లావెక్కిపోయిందని బాధ ముసలోడికి. అందుకే బయట నుంచి ఈ పండుని తెచ్చుకున్నాడు. పెళ్లాం ఎక్కడికి వెళ్లిందో గానీ, ఈ ఇంట్లో ఆమె ఉన్నది గోడ మీది ఫోటోలో మాత్రమే,’ అనుకుని ఫోటో వైపు ఇంకోసారి చూసి భుజాలు ఎగరేశాడు. ఆ ఫోటోలోని భయపడిన పెళ్లికూతురి కళ్లని, తనకి ఎదురుగా నిలబడి వణుకుతున్న ఈ ఆడదాని కళ్లని అతను కలిపి చూడలేదు.

నిర్మల ఊపిరి వదిలింది. ఆ ఊపిరితో పాటు మోకాళ్లలో బలం కూడా జారిపోయింది. ఆమె గోడ ఆనుకుంది.

“ఏమే, అన్నం పెట్టు. ఆకలి దంచేస్తోంది,” అని శ్రీను సోఫా మీంచి లేచి, తూలుతూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్లాడు. “రవీ, రా రా కూర్చో. ఈ రోజు ఈ రవి గాడు నాకు అసలైన ఫ్రెండ్ అయిపోయాడే,” అని నిర్మల వైపు తిరిగి చెప్పాడు. “డబ్బాలు కొరియర్‌లో ఇచ్చి షాప్‌కి వచ్చా. తొమ్మిదింటికి షట్టర్ దించుతుంటే వీడు సిగరెట్లకి వచ్చాడు. ‘పక్కనే వైన్ షాప్, రా అంకుల్, ఒక్క పెగ్’ అన్నాడు. ముప్పై ఏళ్లయింది ముట్టి. వద్దు వద్దు అన్నా. వీడు వదిలాడా? ఒక్కటి రెండైంది. రెండు… ఎన్నో తెలియదు. షాప్ కూడా వీడే కట్టేశాడు. స్కూటర్ అక్కడే షాప్ దగ్గర పెట్టించి, నన్ను బండి మీద ఎక్కించుకుని తెచ్చాడు. బంగారం లాంటి కుర్రాడు.”

“అంకుల్ రెండో పెగ్గుకే ఫ్లాట్ ఆంటీ,” అని రవి నవ్వుతూ కుర్చీ లాక్కుని కూర్చున్నాడు. “దారిలో మూడుసార్లు నా నడుము గట్టిగా పట్టుకున్నాడు. పడిపోతానని భయం. నేను బండి నడిపేటప్పుడు వెనక కూర్చున్నవాళ్లు అలాగే గట్టిగా పట్టుకుంటారు. కొందరు నడుము పట్టుకుంటారు, కొందరు ఇంకా కింద పట్టుకుంటారు. అలవాటైపోయింది.”

ఆ మాట నిర్మల వీపు మీద చురుక్కున తగిలింది. ఆ రాత్రి బైక్ మీద తను పట్టుకున్న అతని నడుము, వాడు ‘గట్టిగా పట్టుకుని విను’ అన్న మాట. ఆమె ఏమీ మాట్లాడకుండా వంటింట్లోకి నడిచింది.

వంటింట్లో గిన్నెలు సర్దుతుంటే ఆమె చేతులు ఆమె మాట వినడం లేదు. అన్నం గిన్నె మూత రెండుసార్లు జారింది. చారు గిన్నె పట్టుకున్నప్పుడు వేడికి వేళ్లు కాలాయి. ఆ మంట కూడా ఆమెకు సరిగ్గా తెలియలేదు. ‘ఇప్పుడు ఏం చేయాలి? వాడి ముందుకి వెళ్లి అన్నం పెట్టాలి. ఈయన పక్కనే. ఈయన నోరు జారితే? వాడు నోరు జారితే? పన్నెండున్నరకి జానకి వస్తుంది. అప్పుడు ఇక్కడ ఏ దృశ్యం ఉంటుందో?’ ఆమె గోడ గడియారం వైపు చూసింది. పది ముప్పై ఐదు.

పళ్లేలు, గిన్నెలు ఒక్కొక్కటిగా టేబుల్ మీద పెట్టింది. శ్రీను టేబుల్ తల వైపు కుర్చీలో, రవి అతని కుడి పక్క కుర్చీలో. ట్యూబ్‌లైట్ తెల్లని వెలుగు స్టీలు పళ్లేల మీద పడి కళ్లకి గుచ్చుకుంటోంది. ఫ్యాన్ గాలికి వంకాయ కూర మసాలా వాసన, చారులో వేగిన వెల్లుల్లి, ఇంగువ ఘాటు, రవి ఒంటి నుంచి వస్తున్న సిగరెట్ వాసన, అన్నీ కలిసిపోయాయి.

నిర్మల రవి పక్కన నిలబడి, అతని పళ్లెంలో అన్నం వడ్డించింది. వంగినప్పుడు కొంగు భుజం మీంచి కొంచెం జారింది. ఆమె గబుక్కున సర్దుకుంది. రవి కళ్లు ఆ సర్దుకోవడం కంటే ముందే అక్కడికి చేరాయి.

ఆమె వంకాయ కూర గిన్నె తెచ్చి, గరిటెతో ఒక నిండు వంకాయ తీసి అతని పళ్లెంలో వేసింది. ఆ వంకాయ నూనెలో మగ్గి, మసాలాతో ఉబ్బి, చీలిన చోట నుంచి ఎర్రని కూరు బయటికి తొంగిచూస్తోంది.

రవి దాన్ని చూసి ఈల వేసినట్టు పెదవులు గుండ్రంగా చేశాడు. “సూపర్ ఆంటీ. ఇంత లేత వంకాయ ఎక్కడ దొరికింది? నాలుగు పక్కలా చీల్చి లోపల కారం కూరారు. నోట్లో పెట్టకముందే నీళ్లూరుతున్నాయి.”

“మా ఊరి సంతలోదే. లేతది అయితేనే మసాలా లోపలికి ఇంకుతుంది,” అంది నిర్మల, గరిటె గిన్నెలోకి దించుతూ. చూపు పళ్లెం మీదే.

“నిజమే ఆంటీ. ముదిరిపోయిన వంకాయలో గింజలు ఎక్కువ, రుచి తక్కువ,” అని రవి ఒక ముక్క విరిచి నోట్లో పెట్టుకుని, కళ్లు మూసుకుని నమిలాడు. “కానీ నా ఉద్దేశంలో వంకాయ కంటే వంట చేసినవాళ్ల చేయి ముఖ్యం. కొందరి చేతిలో ఎంత ముదిరిన కూరగాయ పడినా వెన్నలా మెత్తబడిపోతుంది. నా దగ్గర కూడా ఒక పెద్ద వంకాయ ఉంది ఆంటీ. పొడుగ్గా, లావుగా, నిగనిగలాడుతూ. ఎవరూ దాన్ని సరిగ్గా వండలేదు ఇంతవరకు. మీ చేతికి ఇస్తే మీరు ఎలా వండుతారో చూడాలని ఉంది.”

నిర్మల చేతిలో గరిటె గిన్నె అంచుకి తగిలి ఖంగుమంది. ఆమె చెంపలు కాలాయి. శ్రీను వైపు ఓరగా చూసింది. శ్రీను పళ్లెంలో అన్నం కలుపుతూ, తల ఊపుతూ, “సంతలో మన వెంకటేశ్వర్లు దగ్గరే రా మేము కొనేది,” అని అర్థం లేకుండా నవ్వుతున్నాడు.

ఒక్క క్షణం నిర్మల ఏమీ అనకుండా ఉండిపోయింది. తర్వాత ఎక్కడి నుంచి వచ్చిందో ఆమెకే తెలియని ధైర్యం నాలుక మీదికి వచ్చింది. పొద్దున వంటింట్లో వదిన ముందు నోరు విప్పిన తర్వాత ఏదో తలుపు తెరుచుకుంది. ఆ తలుపు ఇప్పుడు మూసుకోవడం లేదు.

“పెద్దదని గొప్పలు చెప్పుకోవడం ఎందుకు బాబూ,” అంది, అతని పళ్లెంలో ముద్దపప్పు వేస్తూ. గొంతు తగ్గించలేదు, పెంచలేదు. ఆడవాళ్లు కూరగాయల గురించి మాట్లాడుకునే గొంతే. “వంకాయ ఎంత పొడుగున్నా లోపల పుచ్చు లేకుండా ఉండాలి. పైకి నిగనిగలాడేవి చాలామట్టుకు పొయ్యి మీద పెట్టగానే చప్పబడిపోతాయి. బాణలిలో ఎంతసేపు నిలబడుతుందో చూసి చెప్పాలి దాని గొప్ప.”

రవి కళ్లు మెరిశాయి. ఆ మాట అతను ఊహించలేదు. అతను కుర్చీలో కొంచెం వెనక్కి వాలి, ఆమె ముఖంలోకి సూటిగా చూశాడు. “చప్పబడదు ఆంటీ. ఎంత మంట పెట్టినా, ఎంతసేపు మగ్గపెట్టినా గట్టిగానే ఉంటుంది. పైగా వేడి తగిలే కొద్దీ ఇంకా ఉబ్బుతుంది. కావాలంటే ఒకసారి మీ బాణలిలో వేసి చూడండి. రాత్రంతా పొయ్యి మీదే ఉంచినా మీకే ఓపిక అయిపోతుంది గానీ దానికి కాదు.”

“ఏంట్రా మీ ఇద్దరూ వంకాయల గోల?” అని శ్రీను ముద్ద నోట్లో పెట్టుకుంటూ నవ్వాడు. అన్నం మెతుకులు మీసానికి అంటుకున్నాయి. “రవీ, నీకు వంట కూడా వచ్చా ఏంటి?”

“వంట రాదు అంకుల్. తినడం మాత్రం బాగా వచ్చు,” అని రవి నవ్వాడు. “అదీ ఇంట్లో వండినవి కాదు. పక్కింట్లో వండినవి.”

శ్రీను పకపకా నవ్వి టేబుల్ మీద చేత్తో చరిచాడు. పళ్లేలు ఝల్లుమన్నాయి. ఆ జోక్ ఏంటో అతనికి అర్థం కాకపోయినా, మత్తులో నవ్వు తనంతట తనే ఉబికి వస్తోంది.

నిర్మల నెయ్యి గిన్నె తెచ్చి, చెంచాతో రవి అన్నం మీద నెయ్యి వేసింది. బంగారు రంగు నెయ్యి వేడి అన్నం మీద కరిగి, మెతుకుల మధ్యకి జారుతోంది.

“ఇంకొంచెం వేయండి ఆంటీ,” అన్నాడు రవి. “నాకు నెయ్యి ఎక్కువ ఉంటేనే ముద్ద సాఫీగా లోపలికి జారుతుంది. పొడి అన్నం గొంతులో ఇరుక్కుంటుంది.”

ఆమె ఇంకో చెంచా వేసింది.

“ఇంకా,” అన్నాడు. గొంతు బొంగురుగా ఉంది.

“చాలు. ఎక్కువైతే అరగదు,” అంది నిర్మల.

“నాకు అరుగుతుంది ఆంటీ. నా ఒంట్లో వేడి ఎక్కువ. ఎంత జిడ్డు పడినా కరిగించేస్తా,” అని రవి నెయ్యి అంటిన వేళ్లని నెమ్మదిగా నోట్లో పెట్టుకుని, ఒక్కో వేలు చప్పరిస్తూ, ఆమె కళ్లలోకే చూస్తూ నాకాడు. చప్పరింపు చప్పుడు చిన్నగా వినిపించింది.

నిర్మల చూపు ఆ వేళ్ల మీద అతుక్కుపోయింది. ఆ పెదవులు. ఆ నాలుక. పొద్దున మొగుడి నోట్లోంచి వచ్చిన కథ. ‘నోట్లో పెట్టుకుని చీకాడంట…’ ఆమె జాకెట్ లోపల రెండు చనుమొనలూ ఒక్కసారిగా బిగుసుకుని, పాత కాటన్ గుడ్డకి గుచ్చుకున్నాయి. జాకెట్‌కి లోపల ఏమీ లేదని ఆమెకు అప్పుడే గుర్తొచ్చింది. ఆమె నెయ్యి గిన్నెని ఛాతీకి అడ్డంగా పట్టుకుంది.

“ఏంటే, నిలబడే ఉంటావా? నువ్వూ కూర్చోవే, తిను,” అని శ్రీను తన ఎడమ పక్క కుర్చీ వైపు చేయి ఊపాడు. “ఇవాళ మనం అందరం ఫ్రెండ్సే. ఫ్రెండ్స్ మధ్య మర్యాదలేంటి?”

“నేను తర్వాత తింటాను,” అంది నిర్మల.

“కూర్చోమంటే కూర్చోవే!” అని శ్రీను గట్టిగా అన్నాడు. మత్తులో గొంతు అదుపు తప్పింది. తర్వాత వెంటనే మెత్తబడి, “రవీ, ఇది ఎప్పుడూ ఇంతే. అందరికీ పెట్టి తను చివర్లో మిగిలింది తింటుంది. పిచ్చిది,” అని నవ్వాడు.

“అలా మిగిలింది తినకూడదు ఆంటీ,” అన్నాడు రవి. “మీలాంటి వాళ్లు అందరికంటే ముందు, కడుపు నిండా తినాలి. ఆకలిని దాచుకుంటే ఒంటికి మంచిది కాదు.”

నిర్మల శ్రీను ఎడమ పక్క కుర్చీలో కూర్చుంది. అంటే సరిగ్గా రవికి ఎదురుగా. ఇద్దరి మధ్య టేబుల్ వెడల్పు రెండడుగులు కూడా లేదు. ఆమె తన పళ్లెంలో కొంచెం అన్నం, చారు వేసుకుంది. ముద్ద కలిపింది. నోట్లో పెట్టుకోలేదు.

టేబుల్ కింద ఏదో కదిలింది.

ముందు ఆమెకు అది ఫ్యాన్ గాలి అనిపించింది. తర్వాత ఆమె కుడి పాదం బొటనవేలి మీద ఏదో వెచ్చగా, గరుకుగా తగిలింది. ఆమె పాదం చటుక్కున వెనక్కి జరిగింది. ఆ వెచ్చదనం కూడా వెనక్కి వెళ్లిపోయింది.

ఆమె తల ఎత్తలేదు. చారన్నం కలుపుతూనే ఉంది. ఒక నిమిషం గడిచింది. ఆమె పాదం తెలియకుండానే మళ్లీ ముందుకి, తను మామూలుగా కూర్చునే చోటికి జరిగింది.

మళ్లీ ఆ వెచ్చదనం. ఈసారి బొటనవేలి మీద కాదు, చీలమండ మీద. రవి పాదం. అతని బొటనవేలు ఆమె చీలమండ ఎముక చుట్టూ చిన్నగా ఒక గుండ్రం గీసింది. ఆమె కాలి వెండి పట్టీల చిరుగజ్జెలు ఒకసారి సన్నగా గలగలమన్నాయి.

నిర్మల ఊపిరి గొంతులో చిక్కుకుంది. ఆమె ఈసారి పాదం వెనక్కి తీయలేదు. తీయాలని అనుకుంది. మెదడు ఆజ్ఞ ఇచ్చింది. కాలు మాత్రం కదల్లేదు. ఆ వెచ్చని గరుకు బొటనవేలు చీలమండ నుంచి నెమ్మదిగా పైకి పాకింది. పిక్క మీదుగా. చీర అంచుని కొంచెం కొంచెం పైకి నెడుతూ. ఆమె పిక్క కండ బిగుసుకుంది. కాలి వేళ్లు నేల మీద ముడుచుకున్నాయి.

ఆమె కళ్లు పైకి లేచాయి. రవి ఆమె వైపే చూస్తున్నాడు. పెదవుల మీద ఏ నవ్వూ లేదు. కళ్లలో మాత్రం ఆకలి. ఆ రాత్రి నాలుగో వీధిలో స్ట్రీట్‌లైట్ వైపు నుంచి తన వైపు తిరిగిన అదే చూపు. ఆమె కళ్లు దించుకుంది. అయినా పాదం తీయలేదు.

‘తియ్యి నిర్మలా. ఈయన పక్కనే కూర్చున్నాడు. ఒక్కసారి వంగి కింద చూస్తే?’ అని లోపల ఒక గొంతు అరుస్తోంది. ఇంకో గొంతు, సన్నగా, మెత్తగా, ‘ఈయన తల ఎత్తి కూడా చూడట్లేదు. ఇన్నేళ్లలో ఈయన కాలు నా కాలికి టేబుల్ కింద ఒక్కసారైనా తగిలిందా?’ అని గుసగుసలాడుతోంది.

“రవీ!” అని శ్రీను ఒక్కసారిగా అరిచాడు.
[+] 2 users Like 12345677889's post
Like Reply


Messages In This Thread
RE: ꧁༺ అనుమానాల నీడలో … దాగిన నిజాలెన్నో ༻꧂ - by 12345677889 - 17-10-2026, 06:05 PM



Users browsing this thread: 7 Guest(s)