08-10-2026, 11:13 PM
(08-10-2026, 08:56 PM)srinivas_k Wrote: అసలే తెలుగులో రచయితలు కథలు సగంలో వదిలేసి పోతున్నారు
మీ కథను ఒరిజినల్ కొంత చదివాను కాని అసౌకర్యం గా ఉంది అందుకని మీరు రాసింది చదువుతున్నాను, హర్ట్ చెయ్యడం నా ఆభిమతం కాదు.
మీరు నిజంగా అంటున్నారో లేక కావాలని తప్పుదారి పట్టిస్తున్నారో నాకు తెలియదు కానీ మీరు మీ మొదటి కామెంట్ పెట్టినప్పుడే నేను అక్కడే క్లియర్ గా చెప్పాను - నేను అడ్మిన్ కి చెప్పే సెక్షన్ కి మార్చుకున్నానని. అయినా మీరు అడ్మిన్ కి చెప్పుకుందాం అనే థ్రెడ్ లో రెండుసార్లు కంప్లైంట్ చేశారు, మళ్ళీ ఈరోజు ఇక్కడ.
అడ్మిన్ కి ఆ మాత్రం తెలియదని అనుకుంటున్నారా ? లేక మీరు పోస్ట్ చేసిన కామెంట్స్ వేరే థ్రెడ్ లలో ఉంటే తెలియదని అనుకుంటున్నారా ? లేక మీరే అడ్మిన్ లా ఫీల్ అవుతుంటారా ? మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. అయినా మీకు అంత ఇబ్బందిగా ఉంటే చదవడం మానేయొచ్చుగా.
కథలు మధ్యలోనే మానేసి వెళ్లిపోతున్నారు అని మీరే అంటారు, మళ్ళీ మీరే రెగ్యులర్ గా అప్డేట్ లు ఇచ్చే నాలాంటి వాళ్ళ మీద కంప్లైంట్ లు చేస్తుంటారు. ఎందుకీ డబల్ స్టాండర్డ్స్ ? చివర్లో హర్ట్ చెయ్యడం నా అభిమతం కాదంటారు. హర్ట్ చెయ్యాలని మీరు అనుకున్నా, పట్టించుకునేంత టైం నాకు లేదు. కామెంట్ పెట్టారు కాబట్టి clarify చేసాను.
ఇక ఈ టాపిక్ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. మీరు ఎన్ని కంప్లైంట్ లు చేసుకుంటారో చేసుకోండి, సెక్షన్ మార్చినప్పుడు నేను చెప్పింది చేసి చూపిస్తాను.

![[+]](https://xossipy.com/images/bootbb/collapse_collapsed.png)