Yesterday, 10:30 PM
“నాకైతే బాగుంటుంది.”
అర్జున్ అలా అన్నప్పుడు వర్ష చూపు పుస్తకంలోనే ఉంది. కానీ అతను ఇంకా తననే చూస్తున్నాడని ఆమెకు తెలుసు.
వెన్నెల మాత్రం సంతోషంగా తలూపింది.
“అయితే రేపు కూడా ఇలాగే వచ్చేద్దాం.”
వర్ష ఏమీ అనలేదు.
పుస్తకంలో ఒక వాక్యం కింద అనవసరంగా గీత గీసింది.
అప్పుడే బయట బెల్ మోగింది.
లైబ్రరీలో కూర్చున్న కొద్దిమంది ఒక్కొక్కరుగా లేవడం మొదలుపెట్టారు. వెన్నెల పుస్తకాలు సర్దుకుంటూ, తెచ్చుకున్న పుస్తకంలో చివరిసారి పేజీ నంబర్ చూసుకుంది.
అర్జున్ తన నోట్‌బుక్ తీసుకోవడానికి చేయి చాపాడు.
వర్ష అతనికంటే ముందే దాన్ని అందుకుంది.
అతను ఆగాడు.
ఆమె నోట్‌బుక్ తెరిచి, తాము రాసుకున్న రెండు వాక్యాల మీద పెన్‌తో అడ్డంగా గీతలు పెట్టింది.
అర్జున్‌కు నవ్వొచ్చింది.
“అంత కష్టపడి రాశాను.”
వర్ష అతని వైపు చూడలేదు.
“క్లాస్ నోట్స్ కూడా అంత కష్టపడి రాయి.”
“ఏం రాశాడు?” వెన్నెల అడిగింది.
వర్ష చేతిలో పెన్ ఆగింది.
అర్జున్ నోట్‌బుక్ తీసుకుని మూసేశాడు.
“నా హ్యాండ్‌రైటింగ్ బాగోలేదట.”
వెన్నెల వెంటనే నవ్వింది.
“అది నిజమే బావ. నిన్న నీ నోట్స్ చూశాను. నువ్వెలా చదువుకుంటావో!”
“అందుకే మీ ఇద్దరితో తిరుగుతున్నా.”
“అవసరానికి మాత్రం బాగా మాట్లాడతావు.”
వెన్నెల బ్యాగ్ భుజాన వేసుకుని ముందుకు నడిచింది.
వర్ష కూడా లేవబోతుండగా అర్జున్ నెమ్మదిగా అన్నాడు—
“చదివాక కొట్టేసినా పర్లేదు.”
ఆమె అతని వైపు చూసింది.
అతను నోట్‌బుక్‌ను బ్యాగ్‌లో పెడుతున్నాడు. ఏమీ జరగనట్టే.
వర్ష తన పెన్ మూతను కాస్త గట్టిగా పెట్టింది.
క్లాస్‌రూమ్ దగ్గరకు వచ్చేసరికి లోపల సందడి మొదలైంది.
వెన్నెల వాళ్ల బెంచ్ దగ్గరకు వెళ్లింది. వర్ష వెనకే వెళ్లబోతుంటే, తలుపు పక్కన నిలబడ్డ ఒక అమ్మాయి అర్జున్‌ను పిలిచింది.
“హాయ్. నిన్న చెప్పిన రూమ్ దొరికింది.”
అర్జున్ ఆగాడు.
“అయితే నా డైరెక్షన్స్ బాగున్నట్టే.”
“మొదట వేరే ఫ్లోర్‌కి వెళ్లాను.”
“అది నీ సొంత ప్రయోగం అయి ఉంటుంది.”
ఆ అమ్మాయి నవ్వింది.
వర్ష లోపలికి నడుస్తూ ఆమె భుజానికి ఉన్న నీలం బ్యాగ్‌ను చూసింది.
అదే అమ్మాయి.
“ఈరోజు మళ్లీ అక్కడికే వెళ్లాలి,” అంది ఆమె.
“ఈసారి సరిగ్గా వెళ్తావులే.”
“మళ్లీ తప్పిపోతే?”
అర్జున్ తల కొద్దిగా వంచి—
“అప్పుడు నన్ను వెతుకు.”
వర్ష నడక ఆపలేదు.
తన బెంచ్ దగ్గరకు వచ్చి బ్యాగ్‌ను కింద పెట్టింది. పుస్తకం తీసే ప్రయత్నంలో జిప్ పూర్తిగా తెరవకుండానే లాగింది.
“ఏమైంది?” వెన్నెల అడిగింది.
“ఏం లేదు. ఇరుక్కుంది.”
వెన్నెల బ్యాగ్ పట్టుకుంది.
“ఆగు. నేనుతీస్తా.”
వర్ష చేతులు వదిలేసింది.
తలుపు దగ్గర ఇంకా నవ్వులు వినిపిస్తున్నాయి.
ఆమె అటు చూడలేదు.
అర్జున్ లోపలికి వచ్చేసరికి లెక్చరర్ కూడా వచ్చారు.
అతను వెనక బెంచ్‌లో కూర్చున్నాడు.
వర్షకు వెనక్కి చూడాల్సిన అవసరం లేదు. అతని గొంతు, కుర్చీ లాగిన శబ్దం, పక్కనున్న అబ్బాయితో అన్న చిన్న మాట—అన్నీ వినిపించాయి.
క్లాస్ మొదలైంది.
మొదటి పది నిమిషాలు ఆమె బాగా రాసుకుంది. బోర్డు మీదున్నదంతా నోట్‌బుక్‌లోకి దించింది.
ఫోన్ బ్యాగ్‌లో కదిలింది.
తీయలేదు.
కొద్దిసేపటికి మళ్లీ కదిలింది.
ఈసారి బ్యాగ్ జిప్ కొద్దిగా తెరిచి చూసింది.
అర్జున్.
‘నీలం బ్యాగ్.’
దాని కింద—
‘ఈసారి కూడా చూశావా?’
వర్ష ముఖం మీదికి చిరునవ్వు రాబోయి ఆగిపోయింది.
ఆమె సమాధానం రాసింది.
‘క్లాస్ విను.’
‘నువ్వు వినట్లేదా?’
‘నీ మెసేజ్‌ల వల్ల.’
‘సరే.’
అతను మళ్లీ పంపలేదు.
వర్ష ఫోన్ పెట్టేసింది.
ఆ తరువాత వెనక నుంచి చిన్న శబ్దం వచ్చిన ప్రతిసారీ, అది అతనేనా అని గమనిస్తున్న తనను తాను ఆమె ఆపలేకపోయింది.
మొదటి క్లాస్ అయిపోయాక వెన్నెల నోట్‌బుక్ తీసుకుని ముందున్న అమ్మాయి దగ్గరకు వెళ్లింది. మధ్యలో మిస్సయిన రెండు లైన్లు రాసుకోవాలి.
వర్ష వాటర్ బాటిల్ తెరిచింది.
అర్జున్ వచ్చి పక్కనున్న ఖాళీ బెంచ్ అంచున కూర్చున్నాడు.
“క్లాస్ విన్నాను,” అన్నాడు.
వర్ష నీళ్లు తాగి మూత పెట్టింది.
“మంచిది.”
“ఇప్పుడైనా మాట్లాడొచ్చా?”
“మాట్లాడుతున్నావుగా.”
అతను కాసేపు ఆమెను చూసాడు.
“నువ్వు మెసేజ్‌లో ఒకలా ఉంటావు. ఎదురుగా ఇంకోలా ఉంటావు.”
“నువ్వు అందరి దగ్గరా ఒకేలా ఉంటావు.”
మాట బయటకు వచ్చాక వర్ష పుస్తకాలు సర్దడం మొదలుపెట్టింది.
అర్జున్ వెంటనే స్పందించలేదు.
ఆమె చేతిలోని పుస్తకాన్ని చూసి, తరువాత ముఖంలోకి చూసాడు.
“ఆ అమ్మాయితో మాట్లాడాననా?”
“ఎవరితో మాట్లాడితే నాకేంటి?”
“అదే. మరి ఈ మాట ఎందుకు వచ్చింది?”
వర్ష అతని వైపు తిరిగింది.
“నువ్వు ఏం మాట్లాడినా ఎదుటివాళ్లు నమ్మేస్తారని అనుకుంటావా?”
అతని ముఖంలో నవ్వు కొద్దిగా తగ్గింది.
“నేను అబద్ధం ఏం చెప్పాను?”
ఆ ప్రశ్నకు ఆమె దగ్గర స్పష్టమైన సమాధానం లేదు.
అతను తనకు ఏమీ చెప్పలేదు.
నచ్చావని అనలేదు. తనతో మాత్రమే మాట్లాడుతున్నానని అనలేదు.
అయినా—
వర్ష చూపు దించింది.
అర్జున్ ఆమె సమాధానం కోసం తొందరపెట్టలేదు.
కొద్దిసేపటికి ఆమెనే అంది.
“నువ్వు సరదాగా అంటావు. అవతలివాళ్లు కూడా సరదాగానే తీసుకోవాలి కదా.”
అతను కాస్త నిటారుగా కూర్చున్నాడు.
“నువ్వు అలా తీసుకుంటున్నావా?”
వర్ష ఒక్కసారిగా అతని వైపు చూసింది.
అతని ప్రశ్నలో ఆటపట్టించడం ఇంకా ఉంది. కానీ ఈసారి ఆమె తప్పించుకునే అవకాశం కోసం ఎదురుచూస్తున్నట్టుగా కూడా కనిపించాడు.
ఆమె పుస్తకం మూసింది.
“తీసుకోవాలి అనుకుంటున్నాను.”
అర్జున్ చూపు ఆమె మీదే నిలిచింది.
ఆ సమాధానం అతను ఊహించలేదు.
వెన్నెల తిరిగొచ్చే అడుగులు వినిపించడంతో వర్ష కొద్దిగా పక్కకు జరిగి చోటిచ్చింది.
“ఏం మాట్లాడుకుంటున్నారు?” అంటూ వెన్నెల కూర్చుంది.
“మీ ఫ్రెండ్ నన్ను విచారణ చేస్తోంది,” అన్నాడు అర్జున్.
వర్ష అతని వైపు చూసింది.
“సమాధానాలు చెప్పడం చేతకాక అలా అంటున్నాడు.”
వెన్నెల నవ్వింది.
“వర్షతో జాగ్రత్త బావ. ప్రశ్న అడిగితే వదలదు.”
అర్జున్ వర్షను చూస్తూ తలూపాడు.
“అర్థమవుతోంది.”
ఇంటర్వెల్‌లో ముగ్గురూ క్యాంటీన్‌కు వెళ్లారు.
వెన్నెలకు ఆకలిగా ఉందని చెప్పడంతో అర్జున్ కౌంటర్ దగ్గరకు వెళ్లాడు. వర్ష, వెన్నెల కిటికీ పక్కన ఉన్న చిన్న టేబుల్ దగ్గర కూర్చున్నారు.
“ఏం తెమ్మంటావు?” అతను వెనక్కి తిరిగి అడిగాడు.
“నాకు సమోసా,” అంది వెన్నెల.
అతని చూపు వర్ష వైపు వెళ్లింది.
“నాకు టీ చాలు.”
“తినవా?”
“వద్దు.”
“ఖచ్చితంగా?”
వర్ష కనుబొమలు పైకెత్తింది.
“టీ.”
అతను నవ్వుకుని వెళ్లిపోయాడు.
వెన్నెల టేబుల్ మీద మోచేతులు పెట్టి వర్షకు దగ్గరగా వంగింది.
“ఈరోజు బావతో బాగా మాట్లాడాను.”
“చూశాను.”
“ఏమన్నాడో తెలుసా? సాయంత్రం తనే ఫోన్ చేస్తానన్నాడు.”
వర్ష వేళ్లు బ్యాగ్ పట్టీ మీద బిగిశాయి.
“అవునా?”
“నేనే అడిగా. ఎప్పుడూ నేనే చేస్తున్నానని.”
ఆమె ముఖంలో కొద్దిగా సిగ్గు, దానికంటే ఎక్కువ సంతోషం కనిపించాయి.
వర్ష నిజంగానే నవ్వడానికి ప్రయత్నించింది.
“మంచిదే.”
“నీ వల్లే.”
వర్ష తలెత్తింది.
“నా వల్ల ఏంటి?”
“నువ్వు మమ్మల్ని వదిలి వెళ్లావుగా. లేకపోతే నేను అడిగేదాన్ని కాదు.”
వర్ష ఏం చెప్పాలో ఆలోచిస్తుండగా అర్జున్ వచ్చాడు.
మూడు టీలు. ఒక ప్లేట్‌లో సమోసాలు.
వెన్నెల పక్కన ఖాళీ కుర్చీ ఉంది. వర్ష ఎదురుగా కూడా ఒకటి ఉంది.
అర్జున్ ట్రే పెట్టి ఎదురుగా కూర్చున్నాడు.
ప్లేట్‌ను మధ్యకు జరిపాడు.
వెన్నెల వెంటనే ఒకటి తీసుకుంది.
“నువ్వు తీసుకో,” అంటూ వర్షను అడిగింది.
“వద్దే.”
అర్జున్ తన టీ తీసుకుంటూ అన్నాడు—
“వదిలేయ్. ఖచ్చితంగా అడిగాను.”
వర్ష అతని వైపు చూసింది.
అతను కప్పు వెనక నవ్వుతున్నాడు.
వెన్నెల వాళ్లిద్దరినీ చూసి తల ఊపింది.
“మీ ఇద్దరికీ ఈరోజు ఏమైంది? పొద్దున్నుంచీ ఒకరి మీద ఒకరు మాటలు వేసుకుంటున్నారు.”
“నీ ఫ్రెండ్ మొదలుపెట్టింది,” అన్నాడు అర్జున్.
“అవును,” అంది వర్ష. “నేనే.”
ఆమె అంత తేలిగ్గా ఒప్పుకోవడంతో అతనికి మళ్లీ నవ్వొచ్చింది.
టేబుల్ మీద పడిన టీ చుక్కను వర్ష టిష్యూతో తుడిచింది. తరువాత తన కప్పును కొద్దిగా దగ్గరకు జరుపుకుంది.
ఆమె తలెత్తేసరికి అర్జున్ చూస్తున్నాడు.
ఈసారి వర్ష వెంటనే చూపు దించలేదు.
రెండు క్షణాలు.
అతని నవ్వు నెమ్మదిగా తగ్గింది.
ఆమె కప్పు అందుకుని ప్రశాంతంగా టీ తాగింది.
వెన్నెల మాత్రం సమోసా వేడిగా ఉందని ఊదుకుంటోంది.
క్యాంటీన్ నుంచి బయటకు వచ్చేటప్పుడు వెన్నెలకు ఫోన్ వచ్చింది.
“అమ్మ,” అంటూ కొంచెం వెనక ఆగింది.
వర్ష నడక నెమ్మదించింది.
అర్జున్ ఆమె పక్కన చేరాడు.
కొన్ని అడుగులు ఇద్దరూ మౌనంగా నడిచారు.
“ఇప్పుడేంటి?” అడిగాడు అతను.
“ఏంటి?”
“క్యాంటీన్‌లో అలా చూశావు.”
వర్ష అతని వైపు తిరగకుండా నడుస్తూనే అంది—
“నువ్వేగా చూడట్లేదని అడిగావు.”
అర్జున్‌కు సమాధానం రావడానికి ఒక క్షణం పట్టింది.
ఆ లోపే ఆమె అతని వైపు చూసింది.
అతని ముఖంలో కనిపించిన చిన్న ఆశ్చర్యం ఆమెకు నచ్చింది.
మొదటిసారి, ఆ ఉదయం అతన్ని చూసి ఆమె ఎలాంటి సంకోచం లేకుండా నవ్వింది.
అర్జున్ కూడా నవ్వాడు.
“ఇలా అయితే కష్టం.”
“ఏమైంది?”
“నువ్వు కూడా మొదలుపెట్టావు.”
వర్ష అడుగులు ఆపి, వెనక వస్తున్న వెన్నెల వైపు చూసింది.
తరువాత అర్జున్‌కు మాత్రమే వినిపించేలా అంది—
“నువ్వు సరదాగా తీసుకుంటావుగా.”
వెన్నెల కాల్ ముగించి దగ్గరకు వచ్చేసరికి, వర్ష ముందుకు నడిచింది.
ఈసారి ఆమె వెనక్కి చూడలేదు.
అర్జున్ మాత్రం ఆమె పక్కన చేరడానికి తన నడక కొద్దిగా వేగం చేశాడు.
కాలేజీ నుంచి ఇంటికొచ్చేసరికి హాల్లో రెండు బ్యాగులు సిద్ధంగా ఉన్నాయి.
వర్ష చెప్పులు విడుస్తూ వాటివైపు చూసింది.
“ఎక్కడికైనా వెళ్తున్నారా?”
వంటగదిలోంచి అమ్మ బయటకు వచ్చింది.
“కర్నూలు వెళ్తున్నాం. పెద్దమ్మ దగ్గర పని ఉందని చెప్పాను కదా. రేపు మధ్యాహ్నానికి వచ్చేస్తాం.”
“ఈరోజేనా?”
“నువ్వు కూడా వస్తావా?”
వర్ష భుజం మీదున్న బ్యాగ్‌ను సోఫాలో పెట్టింది.
“రేపు కాలేజీ ఉందమ్మా. నోట్స్ కూడా పూర్తి చేయాలి.”
“అయితే అన్నం పెట్టి ఉంచాను. రాత్రి బయట ఏమీ తెప్పించుకోకు.”
అమ్మ మిగతా విషయాలు చెప్తుంటే వర్ష తలూపుతూ విన్నది. నాన్న ఫోన్‌లో కారు డ్రైవర్‌తో మాట్లాడుతున్నారు.
ఇంట్లో వాళ్లు బయలుదేరే ముందు ఉండే చిన్న హడావుడి మొదలైంది. ఛార్జర్ ఎక్కడుందో వెతకడం, మందుల సంచి తీసుకున్నామో లేదో చూసుకోవడం, చివరి నిమిషంలో నీళ్ల బాటిల్ నింపడం.
వాళ్లు వెళ్లిపోయేసరికి ఏడున్నర దాటింది.
గేటు మూసి లోపలికి వచ్చిన వర్ష, హాల్లో లైట్ వేసింది.
కొద్దిసేపటి క్రితం మాటలతో నిండిపోయిన ఇల్లు ఒక్కసారిగా నిశ్శబ్దంగా అనిపించింది.
టీవీ ఆన్ చేసి శబ్దం కొద్దిగా తగ్గించింది. గదిలోకి వెళ్లి కాలేజీ దుస్తులు మార్చుకుని, మెత్తటి లేత నీలం కాటన్ కుర్తా వేసుకుంది. బిగించి కట్టుకున్న జుట్టును విప్పి, మళ్లీ వదులుగా క్లిప్ పెట్టుకుంది.
ఫోన్ తీసుకునేసరికి వెన్నెల మెసేజ్ కనిపించింది.
‘బావ ఫోన్ చేశాడు ?’
వర్ష ఆ మెసేజ్‌ను కాసేపు చూసింది.
‘మరి ఇంకా నిద్రపోలేదా?’ అని పంపింది.
‘ఇప్పుడే తింటున్నా. నువ్వు?’
‘ఇంకా లేదు.’
వెన్నెల నుంచి సమాధానం రాకముందే అర్జున్ మెసేజ్ వచ్చింది.
‘ఈరోజు కూడా చదువుతున్నావా?’
వర్ష సోఫాలో కూర్చుంది.
‘లేదు. ఇంట్లో పనులయ్యాయి ఇప్పుడే.’
‘అంత బిజీనా?’
‘అమ్మానాన్న కర్నూలు వెళ్లారు. వాళ్లని పంపించేసరికి ఆలస్యమైంది.’
అతని సమాధానం వెంటనే వచ్చింది.
‘నువ్వు వెళ్లలేదా?’
‘రేపు కాలేజీ ఉందిగా.’
‘అయితే ఇంట్లో ఒక్కదానివేనా?’
‘హ్మ్. టీవీ కూడా ఉంది తోడుగా.’
‘అది నీతో వాదించదు. బోర్ కొడుతుంది.’
వర్ష నవ్వుకుంది.
‘అందుకే ప్రశాంతంగా ఉంది.’
అతను నవ్వుతున్న ఎమోజీ పంపాడు.
ఆ తరువాత కాసేపు మెసేజ్ లేదు.
వర్ష వంటగదిలోకి వెళ్లి తన కోసం ప్లేట్ తీసింది.
ఎనిమిది గంటల ఏడు నిమిషాలకు ఫోన్ మళ్లీ వెలిగింది.
‘మీ వీధి చివర టీ బండి దగ్గర టీ బాగుంటుందా?’
వర్ష చేతిలోని స్పూన్ ప్లేట్‌లో పెట్టింది.
‘ఏ టీ బండి?’
‘మెయిన్ రోడ్ నుంచి మీ వీధిలోకి తిరిగే దగ్గర ఉన్నది.’
ఆమె నిటారుగా కూర్చుంది.
‘నువ్వెక్కడున్నావు?’
‘అక్కడే.’
వర్ష లేచి హాల్లోకి వచ్చింది. కర్టెన్ వైపు రెండు అడుగులు వేసి ఆగిపోయింది.
‘ఇక్కడేం చేస్తున్నావు?’
‘బయటికి వచ్చాను.’
‘మా వీధిలోకే ఎందుకు?’
కొన్ని క్షణాలు టైపింగ్ అని కనిపించింది.
‘నిన్ను చూడాలనిపించింది.’
వర్ష ఆ వాక్యాన్ని మళ్లీ చదివింది.
వెంటనే ఏం రాయాలో తోచలేదు.
ఇప్పటివరకు అతను సరదాగా అన్న ప్రతిమాటకు మరో అర్థం వెతుక్కోవచ్చు. కానీ ఈసారి అతనే అంత స్పష్టంగా చెప్పేశాడు.
‘కాలేజీలో పొద్దున్నుంచీ చూశావుగా.’
‘అప్పుడు నువ్వు నన్ను చూసి వెంటనే తల తిప్పుకునేదానివి.’
‘క్యాంటీన్‌లో చూశాను.’
‘అదే గుర్తొచ్చింది.’
ఆమె పెదవుల మీద నవ్వు వచ్చింది.
‘అందుకే ఇంతదూరం వచ్చావా?’
‘ఇప్పుడు అవునంటే నమ్ముతావా?’
వర్ష సోఫా అంచున కూర్చుంది.
‘నీ గురించి ఇంకా నిర్ణయించుకోలేదు.’
‘సరే. నిర్ణయించుకునేలోపు ఒకసారి కనిపించొచ్చు.’
ఆమె కర్టెన్ వైపు చూసింది.
‘నేను బయటికి రాను.’
‘రమ్మనలేదు. నేను ఇక్కడున్నానని చెప్పాను.’
ఆ సమాధానం చదివాక ఆమె భుజాల్లోని బిగువు కొద్దిగా తగ్గింది.
అయినా గుండె వేగం మాత్రం తగ్గలేదు.
ఎనిమిది పన్నెండు.
వర్ష భోజనం ప్లేట్ మీద మూత పెట్టి వచ్చింది.
‘తిన్నావా?’ అని అడిగింది.
‘ఇంకా లేదు. నువ్వు?’
‘తింటుంటే నువ్వు ఇక్కడున్నానన్నావు.’
‘అయితే ముందు తిను.’
‘ఇప్పుడు తినాలనిపించడం లేదు.’
పంపిన వెంటనే ఆమె కళ్లుమూసుకుంది.
అర్జున్ దాన్ని వదిలిపెట్టలేదు.
‘ఎందుకు?’
‘ఎక్కువ ప్రశ్నలు అడగకు.’
‘నీకు ఇబ్బందిగా ఉంటే వెళ్తాను, వర్ష.’
ఆమె వెంటనే టైప్ చేసింది.
‘నేనలా అనలేదు.’
సెండ్ చేసిన తరువాత ఆ మెసేజ్‌ను చూసి కిందిపెదవి కొరుక్కుంది.
అతని సమాధానం రావడానికి కొన్ని క్షణాలు పట్టింది.
‘అయితే కాసేపు ఉంటాను.’
వర్ష ఫోన్‌ను గుండెల దగ్గర ఉంచుకుంది. టీవీలో ఎవరో గట్టిగా నవ్వుతున్నారు. ఆమెకు ఆ శబ్దం అనవసరంగా అనిపించి రిమోట్‌తో మ్యూట్ చేసింది.
‘నీకు ఎదురుగా మాట్లాడటం కంటే ఇలా మెసేజ్ చేయడమే బాగా వచ్చు,’ అని పంపింది.
‘ఎదురుగా ఉంటే నువ్వు మాట్లాడనివ్వవు.’
‘నేనేం చేస్తాను?’
‘మధ్యలో అలా చూస్తావు. అనాలనుకున్నది మర్చిపోతాను.’
వర్ష ముఖం వేడెక్కింది.
‘ఇది మాత్రం అబద్ధం. నీకు మాటలు తగ్గిన రోజు చూడలేదు.’
‘ఈరోజు క్యాంటీన్ బయట తగ్గాయిగా.’
ఆమెకు ఆ క్షణం గుర్తొచ్చింది. తన మాటకు అతను కాసేపు సమాధానం చెప్పలేకపోవడం. తరువాత తనతో పాటు నడవడానికి వేగంగా రావడం.
‘అది నాకు నచ్చింది,’ అని రాసింది.
ఈసారి తుడిచేయలేదు.
అర్జున్ వెంటనే చదివాడు.
‘ఏది? నేను మాట్లాడలేకపోవడమా?’
‘నువ్వు కూడా కొంచెం తడబడగలవని తెలియడం.’
ఎనిమిది పద్దెనిమిది.
వర్ష గదిలోని అద్దం ముందు నిలబడింది.
ముఖం మీదికి వచ్చిన చిన్న జుట్టు పాయను చెవి వెనక్కి పెట్టుకుంది. వెంటనే తనను తాను చూసి నవ్వుకుంది.
అతను ఇంకా వీధి చివరే ఉన్నాడు.
తాను బయటికి రానని కూడా చెప్పింది.
మరి ఎందుకు సర్దుకుంటోంది?
ఫోన్ మళ్లీ వెలిగింది.
‘ఇప్పుడు నన్ను చూస్తే ఇంకా బాగా నచ్చుతుందేమో.’
‘ఎందుకు?’
‘మీ ఇంటివైపు నడవాలా, వద్దా అని పది నిమిషాల నుంచి ఇక్కడే నిలబడ్డాను.’
వర్ష అద్దం నుంచి చూపు తిప్పుకుంది.
‘కాలేజీలో అంత ధైర్యంగా ఉంటావు?’
‘అక్కడ రేపు మళ్లీ మాట్లాడొచ్చని తెలుసు. ఇక్కడ నువ్వు వెళ్లిపొమ్మంటే వెళ్లాలి.’
ఆమె కాసేపు ఆలోచించింది.
‘నేను వెళ్లిపొమ్మంటే నిజంగా వెళ్తావా?’
‘వెళ్తాను.’
ఆ చిన్న సమాధానం ఆమెకు నచ్చింది.
సోఫా దగ్గరకు తిరిగొచ్చి కూర్చుంది.
‘ఇంకా అనలేదు కదా.’
అర్జున్ నుంచి వెంటనే సమాధానం రాలేదు.
ఈసారి అతను ఏం రాస్తాడో చూడాలని ఆమెకు తొందరగా ఉంది.
చివరికి—
‘వర్ష… ఇలా మాట్లాడితే నీ దగ్గరకు రావాలనిపిస్తోంది.’
ఆమె వేళ్లు స్క్రీన్ మీద ఆగాయి.
‘వచ్చాక కూడా ఇలాగే మాట్లాడతావా?’
‘కొంచెం తక్కువ మాట్లాడతానేమో.’
‘మరి?’
‘నువ్వు నవ్వుతుంటే చూస్తాను. మెసేజ్‌లో నవ్వుతున్నావో లేదో ఊహించుకోవాల్సి వస్తోంది.’
వర్షకు తెలియకుండానే నవ్వు పెద్దదైంది.
‘ఇప్పుడు నవ్వట్లేదు.’
‘నమ్మను.’
‘అంత బాగా తెలుసా నీకు?’
‘నీకు నవ్వొచ్చినప్పుడు ముందు కోపంగా ఏదో అంటావు. తరువాత చూపు పక్కకు తిప్పుకుంటావు.’
ఆమె ఫోన్ నుంచి చూపు ఎత్తి ఎదురుగా ఉన్న ఖాళీ గోడను చూసింది.
అతను అంత గమనించాడా?
‘మరి నీకు?’ అని అడిగింది.
‘నాకేంటి?’
‘నేను దగ్గరుంటే ఏం చేస్తావు?’
ఆ మెసేజ్ పంపాక వర్ష ఫోన్‌ను ఒడిలో పెట్టేసింది. వెంటనే మళ్లీ తీసుకుంది.
‘ఇప్పుడైతే… నీ పక్కన కూర్చుంటాను. నువ్వు ఇంత ధైర్యంగా అడిగిన ప్రశ్నను మళ్లీ అడగగలవేమో చూస్తాను.’
‘అడుగుతాను.’
‘నా వైపు చూస్తూ?’
వర్ష రాయబోయి ఆగింది.
అతను మరో మెసేజ్ పంపాడు.
‘చూశావా. అప్పుడే ఆలోచిస్తున్నావు.’
ఎనిమిది ఇరవై ఐదు.
వర్ష కర్టెన్ అంచును కొద్దిగా జరిపింది.
గేటు బయట వీధి దీపం వెలుగుతోంది. ఎదురింటి తలుపులు మూసి ఉన్నాయి. దూరంగా ఒక బైక్ వెళ్లింది.
అతను కనిపించలేదు.
ఆమెకు చిన్న నిరాశ కలిగింది.
‘ఇంకా టీ బండి దగ్గరే ఉన్నావా?’
‘హ్మ్.’
‘టీ తాగావా కనీసం?’
‘ఎప్పుడో అయిపోయింది.’
‘మరి ఇంకా అక్కడే ఎందుకు?’
‘నువ్వు బయటికి రానన్నావు. నేను మీ ఇంటి దగ్గరకు రావచ్చో లేదో చెప్పలేదు.’
వర్ష కర్టెన్ వదిలేసింది.
ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చిందని అర్థమైంది.
గదిలోని గడియారం వైపు చూసింది. అమ్మానాన్న వెళ్లి గంట కూడా కాలేదు. తాను మాత్రం ఈ సాయంత్రాన్ని చాలాసేపటి నుంచి ఎదురుచూస్తున్నట్టుగా ఉంది.
వెన్నెల పేరు ఒక్కసారి మనసులోకి వచ్చింది.
ఫోన్‌ను కిందికి దించింది.
కొన్ని క్షణాలు అర్జున్ మెసేజ్ అలాగే తెరిచి ఉంది.
తరువాత ఆమె రాసింది—
‘గేటు దగ్గరకు రా.’
సెండ్ చేసిన వెంటనే గుండె బలంగా కొట్టుకుంది.
‘నిజంగానా?’
ఆమె నవ్వింది.
‘ఇప్పుడెవరు ఎక్కువ ప్రశ్నలు అడుగుతున్నారు?’
అర్జున్ టీ బండి దగ్గర నుంచి నడవడం మొదలుపెట్టాడు.
వర్ష కిటికీ దగ్గర నిలబడింది.
వీధి మలుపు తిరిగి అతను కనిపించగానే, ఆమె కర్టెన్ వెనక్కి జరిగిపోయింది.
ఫోన్ కదిలింది.
‘వచ్చాను.’
ఆమె మళ్లీ నెమ్మదిగా చూసింది.
అతను గేటుకు కొద్దిగా దూరంగా నిలబడి ఉన్నాడు. ఒకసారి ఇంటివైపు, మరోసారి ఫోన్ వైపు చూస్తున్నాడు.
కాలేజీలో కనిపించే ఆ నిర్లక్ష్యపు ధైర్యం ఇప్పుడు కొంచెం తగ్గినట్టుగా ఉంది.
వర్షకు అది నచ్చింది.
‘చూస్తున్నాను,’ అని పంపింది.
అతను తలెత్తాడు.
ఆమె కర్టెన్ వెనక్కి లాక్కుంది.
వెంటనే మెసేజ్.
‘అది అన్యాయం. నువ్వు నన్ను చూడొచ్చు. నాకు మాత్రం కనిపించవా?’
‘కాస్త కంగారుగా ఉన్నట్టున్నావు.’
‘ఉన్నాను.’
ఆమె నవ్వు మెల్లగా ఆగింది.
అతను మళ్లీ సరదా సమాధానం చెప్తాడనుకుంది.
‘ఎందుకు?’
‘ఇప్పటివరకు నీకు ఏం చెప్పినా ఫోన్ వెనక దాక్కోవచ్చు. ఇప్పుడు తలుపు తీస్తే నువ్వు ఎదురుగా ఉంటావు.’
వర్ష తన చేతిలోని ఫోన్‌ను కొద్దిగా బిగించింది.
‘నేను కూడా అంత ధైర్యంగా ఏమీ లేను.’
ఆ మెసేజ్ చదివాక అర్జున్ గేటు దగ్గరకు ఒక అడుగు వేశాడు.
‘మరి ఇద్దరం కాసేపు మాట్లాడకుండా ఉంటాం.’
‘నువ్వు ఉండగలవా?’
‘నీ పక్కన కూర్చోనిస్తే ప్రయత్నిస్తాను.’
వర్ష కళ్లుమూసుకుని చిన్నగా నవ్వింది.
ఆమెకు ఇప్పుడు అతని గొంతు వినాలనిపించింది. ఫోన్‌లో కూడా కాదు.
తన ఎదురుగా నిలబడి, అదే మాట చెప్తే వినాలని ఉంది.
ఎనిమిది ముప్పై నాలుగు.
వర్ష తలుపు దగ్గరకు వచ్చింది.
తెరవలేదు.
‘ఇంకా గేటు బయటే ఉన్నావా?’
‘అవును.’
‘ఇక్కడి నుంచి వెళ్లమంటే?’
అతని సమాధానం రావడానికి ఈసారి కొంచెం సమయం పట్టింది.
‘వెళ్తాను. కానీ ముందు ఒకటి అడుగుతాను.’
‘ఏంటి?’
‘నిజంగా వెళ్లిపోవాలనుకుంటున్నావా?’
వర్ష తలుపుకు నుదురు కొద్దిగా ఆనించింది.
బయట అతని అడుగుల శబ్దం కూడా లేదు. అతను అక్కడే నిలబడి తన సమాధానం కోసం ఎదురుచూస్తున్నాడు.
ఆమె నెమ్మదిగా టైప్ చేసింది.
‘లేదు.’
ఆ ఒక్క మాట పంపిన తరువాత ఆమెకు మళ్లీ ఏదీ దాచుకోవాలని అనిపించలేదు.
వెంటనే మరో మెసేజ్ రాసింది.
‘లోపలికి రా, అర్జున్.’
అతను చదివాడు.
‘తలుపు దగ్గరికి వచ్చాక కూడా నన్ను ఆటపట్టిస్తావా?’
వర్ష పెదవుల మీదికి మళ్లీ నవ్వు వచ్చింది.
‘ముందు వచ్చి చూడు.’
గేటు తెరుచుకున్న శబ్దం వినిపించింది.
ఆమె తలుపు నుంచి ఒక అడుగు వెనక్కి జరిగింది.
అడుగులు దగ్గరవుతున్నాయి.
ఫోన్ స్క్రీన్ మీద ఎనిమిది ముప్పై ఏడు కనిపిస్తోంది.
వీధి చివర ఉన్నానని అతను చెప్పి సరిగ్గా అరగంట అయింది.
తలుపు అవతల అర్జున్ ఆగాడు.
ఒక్క క్షణం ఇద్దరివైపులా నిశ్శబ్దం.
తరువాత బెల్ మోగింది.
వర్ష చేతిని గడియ మీద పెట్టింది.
ఇప్పటివరకు అతనికి పంపిన మాటలన్నీ ఒక్కసారిగా గుర్తొచ్చి, ఆమె ముఖం మీద సిగ్గుతో కలిసిన నవ్వు విరిసింది.

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)