18-09-2026, 01:05 PM
భాగం 1 — ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్
“వెన్నెలా… ఆ పూల బుట్ట ఇలా ఇవ్వమ్మా!”
అమ్మ రెండోసారి పిలిచాక గానీ వెన్నెల ఈ లోకంలోకి రాలేదు.
“ఆ… ఇదిగో.”
బుట్ట అందిస్తూనే ఆమె చూపు మళ్లీ మండపం పక్కకు వెళ్లింది.
అక్కడ అర్జున్ నిలబడి ఉన్నాడు. నల్ల చొక్కా చేతులు మోచేతుల వరకూ మడిచి, బేజ్ ప్యాంట్ వేసుకుని, ఎవరో చెప్పిన మాటకు నవ్వుతున్నాడు. చేతిలో కారు తాళాలు తిప్పుతూ మధ్యమధ్యలో పెళ్లి పనులు చూసుకుంటున్నాడు.
అర్జున్ ఆమె బావే. చిన్నప్పుడు కుటుంబ వేడుకల్లో కలిసేవాళ్లు. కానీ ఈసారి అతన్ని చూస్తుంటే వెన్నెలకు పలకరించడానికి కూడా ఏదో మొహమాటంగా ఉంది.
ఇద్దరూ అప్పుడే కాలేజీ మొదటి సంవత్సరంలో చేరారు. చిన్నప్పటిలా పరుగెత్తుకుంటూ వెళ్లి “బావా!” అని పిలవలేకపోయింది.
“ఏంటి, అక్కడే చూస్తున్నావ్?”
పక్కన నిలబడిన కజిన్ అడగడంతో వెన్నెల ఉలిక్కిపడింది.
“ఏం లేదు.”
“నేనేమైనా ఉందన్నానా?”
వెన్నెల సమాధానం చెప్పకుండా పూలు సర్దడం మొదలుపెట్టింది.
కొద్దిసేపటికి అర్జునే ఆమె దగ్గరకు వచ్చాడు.
“వెన్నెల… నీ ఫోన్ ఒకసారి ఇస్తావా? నాది ఛార్జింగ్ పెట్టాను. నాన్నకి కాల్ చేయాలి.”
ఆమె వెంటనే ఫోన్ అన్‌లాక్ చేసి ఇచ్చింది.
అతను పక్కకు వెళ్లి మాట్లాడుతుంటే, వెన్నెల తన చేతిలోని పూల దండను రెండుసార్లు విప్పి మళ్లీ చుట్టింది.
తిరిగొచ్చి ఫోన్ ఇస్తూ అడిగాడు.
“కాలేజీ ఎలా ఉంది?”
“బాగుంది బావా. నువ్వు—”
“అర్జున్! కారు తీయరా!”
అవతలి నుంచి పిలుపు వచ్చింది.
“వస్తున్నా!” అంటూ అటు చూసి, “సరే, మళ్లీ మాట్లాడదాం,” అని వెళ్లిపోయాడు.
వెన్నెల చెప్పాలనుకున్న మిగతా మాట అక్కడే ఆగిపోయింది.
ఆ రాత్రంతా ఆమెకు గుర్తుండిపోయింది అతను అడిగిన ఆ ఒక్క ప్రశ్నే.
కాలేజీ ఎలా ఉంది?
పెళ్లి నుంచి ఇంటికి వచ్చాక వెన్నెల చేసిన మొదటి పని ఫేస్‌బుక్ తెరవడం.
అర్జున్ పేరు వెతికింది. ఒకే పేరుతో ఎన్నో అకౌంట్లు వచ్చాయి. కొన్ని ప్రొఫైళ్లు తెరిచి చూసి, చివరికి కామన్ రిలేటివ్స్ ద్వారా అతని అకౌంట్ కనిపెట్టింది.
ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపే ముందు ప్రొఫైల్ ఫొటోను కాసేపు చూసింది.
తర్వాత తన ప్రొఫైల్ తెరిచింది.
పాత ఫొటో తీసేసి, పెళ్లిలో దిగిన ఫొటో పెట్టింది.
ఆ తరువాతే రిక్వెస్ట్ పంపింది.
పది నిమిషాలకు ఒకసారి ఫోన్ చూసుకుంది. రాత్రి పడుకునే ముందూ చూసింది. ఉదయం లేచాక కూడా నోటిఫికేషన్ లేదు.
కాలేజీలో వర్ష ఆమె పక్కన కూర్చోగానే అడిగింది.
“పెళ్లి విశేషాలేంటి?”
“బాగానే జరిగింది.”
“అంతేనా? నిన్న ఫొటోలు పంపమంటే పంపలేదు.”
వెన్నెల గ్యాలరీ తెరిచింది. ఒక్కో ఫొటో చూపిస్తూ ఉండగా, గ్రూప్ ఫొటో దగ్గర ఆమె వేలు ఆగింది.
వర్ష వెంటనే గమనించింది.
“ఎవరు?”
“ఎవరు అంటే?”
“నువ్వు జూమ్ చేసిన అబ్బాయి.”
వెన్నెల ఫోన్ వెనక్కి తీసుకుంది.
“మా బావ. అర్జున్.”
“ఓహో… బావా?”
“నువ్వు అలా అనకు.”
“నేను ఎలా అన్నాను?”
వెన్నెల నవ్వు ఆపుకోలేకపోయింది. వర్ష ఆమె భుజాన్ని తన భుజంతో తట్టింది.
“సరే. విషయం అర్థమైంది.”
ఆ సాయంత్రం నోటిఫికేషన్ వచ్చింది.
Arjun accepted your friend request.
వెన్నెల వెంటనే వర్షకు స్క్రీన్‌షాట్ పంపింది.
“యాక్సెప్ట్ చేశాడు!”
“నీ రిక్వెస్టే కదా. పెళ్లి ప్రపోజల్ కాదు. ముందు హాయ్ చెప్పు.”
వెన్నెల చాట్ తెరిచింది.
హాయ్ బావా.
పంపేసి ఫోన్ పక్కన పెట్టింది. మళ్లీ తీసుకుంది.
పావుగంట తర్వాత సమాధానం వచ్చింది.
హాయ్.
ఏం చేస్తున్నావ్?
ఫ్రెండ్స్‌తో బయట ఉన్నా.
ఓకే బావా.
ఇంకో మెసేజ్ వస్తుందేమోనని ఎదురుచూసింది. రాలేదు.
మరుసటి రోజు ఆమెనే మాట్లాడించింది. ఆ తర్వాతి రోజూ ఆమెనే.
అతను సమాధానం ఇచ్చేవాడు. కొన్నిసార్లు వెంటనే, కొన్నిసార్లు గంటల తర్వాత. ఆమె అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పి ఆపేసేవాడు. తన గురించి ఏదైనా అడుగుతాడేమోనని వెన్నెల మరో ప్రశ్న వెతుక్కునేది.
“ఎప్పుడూ నువ్వే మెసేజ్ చేస్తున్నావా?” ఒకరోజు వర్ష అడిగింది.
“అతను కొంచెం బిజీ.”
“సరే. ఈరోజు నువ్వు పంపకు. అతనే చేస్తాడేమో చూద్దాం.”
వెన్నెల ఒప్పుకుంది.
ఆ రాత్రి తొమ్మిదింటికి చాట్ తెరిచింది. తొమ్మిదిన్నరకు మళ్లీ తెరిచింది.
పదింటికి—
తిన్నావా బావా?
అని పంపేసింది.
వర్షకు మాత్రం చెప్పలేదు.
కొన్ని రోజుల తర్వాత, లంచ్ బ్రేక్‌లో వర్ష వెన్నెల ఫోన్ తీసుకుని పెళ్లి ఫొటోలు చూస్తోంది.
“మీ బావ ఈ ఫొటోలో బాగున్నాడు,” అంది.
వెన్నెల దగ్గరగా జరిగి చూసింది.
“నాకూ ఇదే ఇష్టం.”
“పంపు నాకు.”
“ఎందుకు?”
వర్ష ఆమెవైపు చూసి నవ్వింది.
“నీకు నచ్చిన ఫొటో ఏదో అడిగితే ఇంత విచారణా?”
వెన్నెల కూడా నవ్వేసింది. ఫొటో పంపింది.
ఆ రాత్రి అర్జున్ నుంచి మొదటిసారి మెసేజ్ వచ్చింది.
వెన్నెల గుండె వేగంగా కొట్టుకుంది. వెంటనే తెరిచింది.
నీ ఫొటోలో నీ పక్కన ఉన్న అమ్మాయి ఎవరు?
ఆమె చిరునవ్వు నెమ్మదిగా తగ్గింది.
నా బెస్ట్ ఫ్రెండ్. వర్ష.
అవతల వెంటనే టైపింగ్ కనిపించింది.
మీ క్లాసేనా?
వెన్నెల ఆ మెసేజ్‌ను మరోసారి చదివింది.
ఇన్నిరోజుల్లో అతను తనను అడిగిన ప్రశ్నలు వేళ్లపై లెక్కపెట్టొచ్చు.
ఆ రాత్రి మాత్రం అతనికి మాట్లాడాలనిపిస్తోంది.
వర్ష గురించి!!!!
"మీ క్లాసేనా?"
అర్జున్ పంపిన మెసేజ్‌కి వెన్నెల వెంటనే సమాధానం ఇవ్వలేదు.
కొద్దిసేపటి క్రితం వరకూ అతనితో ఏం మాట్లాడాలా అని ఆలోచించింది. ఇప్పుడు అతనే మాట్లాడుతుంటే, ఆమెకు మాటలు రావడం లేదు.
అవును. నా పక్కనే కూర్చుంటుంది.
ఓహ్.
మళ్లీ ఏదైనా అడుగుతాడేమోనని చాట్ చూస్తూ ఉండిపోయింది.
బెంగళూరులో నీ కాలేజీ ఎలా ఉంది బావా?
బానే ఉంది.
హాస్టల్ ఫుడ్?
అలవాటైంది.
వర్ష గురించి అడిగినప్పుడు కనిపించిన ఉత్సాహం, ఆ రెండు సమాధానాల్లో వెన్నెలకు కనిపించలేదు.
సరే బావా. గుడ్ నైట్.
గుడ్ నైట్.
ఫోన్ పక్కన పెట్టి పడుకుంది. ఐదు నిమిషాల తర్వాత మళ్లీ తీసుకుని, తను పంపిన ఫొటో తెరిచింది.
ఆ ఫొటోలో తనకు నచ్చినది తన నవ్వు.
అతనికి కనిపించింది తన పక్కనున్న వర్ష!!
మరుసటి రోజు నంద్యాలలో ఎండ ఉదయం నుంచే మండిపోతోంది.
కాలేజీ గేటు దాటి వచ్చిన వర్ష, బ్యాగ్‌ను బెంచ్ మీద పడేసి వెన్నెల పక్కన కూర్చుంది.
“ఇవాళ కూడా ఆటో దొరకలేదు. సగం దూరం నడిచా.”
వెన్నెల వాటర్ బాటిల్ అందించింది.
వర్ష నీళ్లు తాగుతూ ఆమె ముఖం చూసింది.
“ఏంటి? ఇంట్లో ఏమైనా అన్నారా?”
“లేదు.”
“మరి?”
వెన్నెల నోటుబుక్ అంచు మడుస్తూ చెప్పింది.
“నిన్న మా బావ నీ గురించి అడిగాడు.”
“నా గురించా? ఏం అడిగాడు?”
“ఫొటోలో నా పక్కన ఉన్నది ఎవరని.”
“మరి చెప్పావా?”
“నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పా.”
“అంతే కదా.”
వర్ష బాటిల్ మూత పెట్టి ఆమెకిచ్చింది. వెన్నెల ఇంకా తనవైపే చూస్తుండటంతో చిన్నగా నవ్వింది.
“ఏయ్… ఎవరని అడిగాడని నేనేమైనా మీ బావని ఎత్తుకెళ్లిపోతానా?”
“నేనలా అనలేదు.”
“నీ మొహం అలా ఉంది.”
వెన్నెల పెదవుల మీద చిన్న నవ్వు వచ్చింది.
లెక్చరర్ లోపలికి రావడంతో ఇద్దరూ పుస్తకాలు తీశారు. వర్ష తన పెన్ను కోసం బ్యాగ్ అంతా వెతికి, చివరికి వెన్నెల పెన్నే తీసుకుంది.
అప్పటికి వెన్నెల మనసు కొంచెం తేలికపడింది.
ఆ తర్వాత కొన్ని వారాలు అర్జున్‌తో మాటలు అలాగే సాగాయి.
వెన్నెల తన రోజులో జరిగిన చిన్న విషయాలన్నీ అతనికి చెప్పేది. క్లాసులో జరిగిన గొడవ, బస్సు మిస్సయిన సంగతి, ఇంట్లో అమ్మ చేసిన పాయసం—ఏదైనా అతనితో మాట్లాడడానికి ఒక కారణమే.
అర్జున్ అప్పుడప్పుడు మాత్రమే ఎక్కువగా మాట్లాడేవాడు.
ఒక రాత్రి మాత్రం అతనే కాల్ చేశాడు.
స్క్రీన్ మీద అతని పేరు చూడగానే వెన్నెల మంచం మీద నుంచి లేచి కూర్చుంది.
“హలో?”
“పడుకున్నావా?”
“లేదు బావా.”
గదిలో అమ్మ ఉందేమోనని తలుపువైపు చూసి, బయట వరండాలోకి వచ్చింది.
అవతల ట్రాఫిక్ శబ్దం వినిపిస్తోంది.
“ఎక్కడున్నావ్?”
“హాస్టల్ దగ్గర. బయటికి వచ్చా.”
“ఈ టైంలోనా?”
“ఇక్కడ ఇంకా జనాలు తిరుగుతూనే ఉంటారు.”
కాసేపు ఇద్దరూ ఏమీ మాట్లాడలేదు. అయినా వెన్నెలకు ఆ నిశ్శబ్దం ఇబ్బందిగా అనిపించలేదు.
“మీ కాలేజీ ఎలా ఉంటుంది?” అతను అడిగాడు.
“బాగుంటుంది. ఎందుకు?”
“ఊరికే. లెక్చరర్లు బాగా చెప్తారా?”
వెన్నెల ఒక్కసారిగా ఉత్సాహంగా మాట్లాడటం మొదలుపెట్టింది. ఎవరు బాగా చెప్తారో, ఎవరి క్లాసులో నిద్ర వస్తుందో, క్యాంటీన్‌లో ఏది తినకూడదో కూడా చెప్పింది.
అర్జున్ నవ్వాడు.
“కాలేజీ గురించి అడిగితే మొత్తం రిపోర్ట్ ఇచ్చేస్తున్నావ్.”
“నువ్వే అడిగావుగా.”
“సరే. మీ దగ్గర సీట్లు ఖాళీ ఉన్నాయేమో తెలుసా?”
వెన్నెల మాట ఆగిపోయింది.
“ఎందుకు బావా?”
“ఇంకా ఏమీ అనుకోకు. ఇంట్లో నంద్యాలకు వచ్చేస్తే ఎలా ఉంటుందని మాట్లాడుతున్నారు.”
“నిజంగా?”
ఆమె గొంతులో వచ్చిన ఆనందం తనకే స్పష్టంగా వినిపించింది.
“ఇంకా నిర్ణయించలేదు, వెన్నెల.”
“కానీ… వస్తే బాగుంటుంది.”
“ఏం? రోజూ కాలేజీ రిపోర్ట్ ఇవ్వక్కర్లేదనా?”
వెన్నెల నవ్వింది.
“అవును. నువ్వే చూసుకోవచ్చు.”
కాల్ అయిపోయాక కూడా ఆమె వరండాలోనే నిలబడింది.
వీధిలో దాదాపు అన్ని ఇళ్ల లైట్లు ఆరిపోయాయి. లోపలి నుంచి అమ్మ పడుకోమని పిలిచింది.
“వస్తున్నా,” అంది.
వర్ష చాట్ తెరిచి టైప్ చేసింది.
మా బావ మన కాలేజీకి రావచ్చు.
వెంటనే ఇంకో మెసేజ్ పంపింది.
ఇంకా ఎవరికీ చెప్పకు.
తర్వాతి రోజు నుంచి వెన్నెలకు కాలేజీలో కనిపించే ప్రతి చోటూ అర్జున్ గుర్తొచ్చేవాడు.
క్యాంటీన్ చివర ఉన్న టేబుల్ దగ్గర కూర్చుంటాడా? మధ్యాహ్నం తమతోనే భోజనం చేస్తాడా? ఇంటికి వెళ్లేటప్పుడు గేటు దగ్గర తన కోసం ఆగుతాడా?
ఆమె ఊహల్లో అతను అప్పటికే నంద్యాలకు వచ్చేశాడు.
నిజానికి మాత్రం ఇంకా బెంగళూరులోనే ఉన్నాడు.
ఆఫీసులో ఎవరిని కలవాలో వెన్నెల తెలుసుకుంది. ట్రాన్స్‌ఫర్‌కు సంబంధించిన వివరాలు అడిగి, చెప్పినవన్నీ ఒక కాగితం మీద రాసుకుంది. వర్ష కూడా ఆమెతోనే తిరిగింది.
“ఇంత శ్రద్ధ నీ అసైన్‌మెంట్ మీద పెడితే బాగుండు,” అంది వర్ష.
“అది కూడా నువ్వే రాసిస్తావుగా.”
“అవును మరి. బావ వచ్చాక నన్ను మర్చిపోతావ్. ఇప్పుడే పని చేయించుకో.”
వెన్నెల ఆమె చేతిని పట్టుకుంది.
“నిన్నెందుకు మర్చిపోతాను?”
వర్ష నవ్వుతూ చేయి విడిపించుకుంది.
“సరే, సరే. ముందు మెట్లు చూసి నడువు.”
ఇంట్లో పెద్దల మాటల ద్వారా వెన్నెలకు మిగతా విషయాలు తెలిసాయి.
బెంగళూరులో ఉండే ఖర్చు, ప్రయాణాలు, దూరంగా ఉండటం—అన్నీ ఆలోచించి అర్జున్ తల్లిదండ్రులు అతన్ని నంద్యాలకు తీసుకురావాలనుకుంటున్నారు. అర్జున్ కూడా గట్టిగా వద్దనలేదు.
కాలేజీల మధ్య అనుమతులు, పత్రాల పని పూర్తయ్యే వరకు కొన్ని వారాలు పట్టింది.
ఆ రోజుల్లో వెన్నెల దాదాపు ప్రతిరోజూ అడిగేది.
ఏమైంది బావా?
ఇంకా పని జరుగుతోంది.
ఎప్పుడు వస్తావ్?
తెలిశాక చెప్తా కదా.
ఆ సమాధానం చదివిన రోజు ఆమె మళ్లీ మెసేజ్ చేయలేదు.
రాత్రి అతని నుంచి కాల్ వచ్చింది.
“కోపమా?”
“లేదు.”
“మరి మెసేజ్ లేదు?”
వెన్నెల గోడకు ఆనుకుని నిలబడింది.
“తెలిశాక చెప్తానన్నావుగా.”
అర్జున్ చిన్నగా నవ్వాడు.
“సోమవారం వస్తున్నా.”
ఆమె నిటారుగా నిలబడింది.
“మన కాలేజీకా?”
“అవును. పని అయిపోయింది.”
వెన్నెలకు ఒకేసారి ఎన్నో ప్రశ్నలు వచ్చాయి. ఎప్పుడు బయలుదేరుతున్నాడు, ఎక్కడ ఉంటాడు, మొదటి రోజు ఎవరితో వస్తాడు—
కానీ ఆమె అడిగింది ఒక్కటే.
“నిజంగానేనా బావా?”
“అబద్ధం చెప్పి సోమవారం బెంగళూరులో కూర్చుంటానా?”
ఆమె నవ్వింది. ఆ నవ్వు విని అతనూ నవ్వాడు.
ఆ రాత్రి తొలిసారి, కాల్ ముగించింది అర్జున్ కాదు. లోపలి నుంచి అమ్మ పదేపదే పిలవడంతో వెన్నెలే ఇష్టం లేకుండా పెట్టేసింది.
సోమవారం వెన్నెల మామూలు కంటే అరగంట ముందే కాలేజీకి వచ్చింది.
గేటు పక్కన నిలబడి ఫోన్ చూస్తోంది. వర్ష వచ్చేసరికి ఆమె అప్పటికే రెండుసార్లు అర్జున్‌కు కాల్ చేసి ఉంది.
“చేరాడా?” వర్ష అడిగింది.
“దగ్గర్లో ఉన్నాడంట.”
“నువ్వు గేటు దగ్గర నిలబడకపోతే కాలేజీ కనిపెట్టలేడా?”
“నువ్వు కాసేపు ఊరుకుంటావా?”
వర్ష నవ్వుతూ ఆమె పక్కనే నిలబడింది.
కొద్దిసేపటికి గేటు బయట ఆటో ఆగింది.
ముందుగా ఒక బ్యాగ్ కనిపించింది. తర్వాత అర్జున్ దిగాడు. నీలం చొక్కా, భుజాన బ్యాక్‌ప్యాక్, చేతిలో పత్రాల ఫైల్.
అతను ఆటోకి డబ్బులు ఇచ్చి తిరిగేసరికి వెన్నెల చేయి ఊపింది.
ఆమెను చూసి నేరుగా వాళ్ల దగ్గరకు వచ్చాడు.
“ఎప్పటి నుంచి ఇక్కడ?”
“ఇప్పుడే వచ్చాం,” వెన్నెల అంది.
వర్ష ఆమెవైపు చూసింది. వెన్నెల చూడనట్టు నటించింది.
“ఇది వర్ష. చెప్పాను కదా.”
“హాయ్,” అంది వర్ష.
“హాయ్. గుర్తుంది,” అన్నాడు అర్జున్.
తర్వాత ఫైల్ కొంచెం పైకెత్తి వెన్నెలను అడిగాడు.
“ముందు ఆఫీసుకే కదా?”
“అవును బావా. పద.”
ముగ్గురూ లోపలికి నడిచారు.
మెట్ల దగ్గర వెన్నెల కొంచెం వెనుకపడింది. అర్జున్ ఆగి తిరిగి చూశాడు.
“రావా?”
“వస్తున్నా.”
ఆ చిన్న మాట చాలు. ఇన్ని రోజుల ఎదురుచూపులోని అలసటంతా ఆమెకు మాయమైంది.
ఆఫీసులో పత్రాలు ఇచ్చి, రిజిస్టర్‌లో సంతకం చేసిన తర్వాత అర్జున్ బయటకు వచ్చాడు.
“అయిపోయింది,” అన్నాడు.
వెన్నెల ముఖం వెలిగిపోయింది.
బెంగళూరు నుంచి వచ్చే మెసేజ్ కోసం ఎదురుచూడాల్సిన అవసరం ఇక లేదు.
అర్జున్ ఇప్పుడు నంద్యాలలో ఉన్నాడు.
తన కాలేజీలోనే!!!
అర్జున్‌కు కాలేజీ అలవాటు పడటానికి వారం కూడా పట్టలేదు.
మొదటి రోజు అతన్ని క్లాస్‌లోకి తీసుకొచ్చి అందరికీ పరిచయం చేసింది వెన్నెలే. కానీ శుక్రవారం వచ్చేసరికి, తనకు పేర్లు కూడా తెలియని వాళ్లు అతన్ని పలకరిస్తున్నారు.
పందొమ్మిదేళ్ల అర్జున్ పెద్దగా మాట్లాడేవాడు కాదు. మాట్లాడినప్పుడు మాత్రం ఎదుటివాళ్లవైపు పూర్తిగా తిరిగి, వాళ్లు చెప్పేది వింటున్నట్టు చూసేవాడు. గట్టిగా నవ్వి అందరి దృష్టినీ ఆకర్షించే ప్రయత్నం చేసేవాడు కాదు. ఎవరో చేసిన జోక్‌కి చిన్నగా నవ్వి, చివర్లో ఒక మాట అనేవాడు. ఆ మాటకే టేబుల్ చుట్టూ ఉన్నవాళ్లంతా నవ్వేవారు.
వర్ష మొదట గమనించింది అదే.
అతని బట్టలు, నడక, మాట్లాడేటప్పుడు ఉండే నెమ్మది—అన్నీ ఆమెకు నచ్చాయి. అయినా అతనితో మాట్లాడేటప్పుడు వెన్నెలను కూడా సంభాషణలోకి లాగేది.
“మీ బావకి నంద్యాల బాగా నచ్చినట్టుంది,” అంది ఒకరోజు.
“ఏం?”
“నువ్వు చెప్పినంత బిజీగా ఏం లేడు. అందరితో మాట్లాడుతున్నాడు.”
వెన్నెల నవ్వింది.
“ఇక్కడ ఫ్రెండ్స్ అయ్యారుగా.”
ఆ మాట అంటున్నప్పుడు ఆమెకు ఆనందమే కలిగింది. తన వల్ల అతనికి కాలేజీ సులువైందనుకుంది.
లంచ్ బ్రేక్‌లో ముగ్గురూ క్యాంటీన్‌లో కూర్చున్నారు.
వెన్నెల ఇంటి నుంచి తెచ్చిన బాక్స్ తెరిచి అర్జున్ ముందుకు జరిపింది.
“అమ్మ నీకూ పెట్టింది.”
“నువ్వు అడిగావా, అత్తే పెట్టిందా?”
“ఎవరు పెడితే ఏంటి? తిను.”
అతను నవ్వుతూ తీసుకున్నాడు. వెన్నెల తన బాక్స్ మర్చిపోయి అతను తింటున్నదే చూస్తోంది.
వర్ష దాన్ని గమనించి తల దించుకుంది.
అప్పుడే పక్క టేబుల్ నుంచి ఓ అమ్మాయి పిలిచింది.
“అర్జున్… నోట్స్ తెచ్చావా?”
“తెచ్చా, సిరి. క్లాస్‌లో ఇస్తా.”
“నిన్నే ఇస్తానన్నావ్.”
“నిన్న ఇచ్చుంటే ఇవాళ నాతో మాట్లాడేదానివా?”
సిరి నవ్వుతూ, “నీకు మాటలు ఎక్కువ,” అంది.
“ఇప్పుడే గుర్తించావా?”
వెన్నెల స్పూన్‌తో అన్నం కలుపుతూ ఉండిపోయింది.
“అందరినీ అలాగే ఏడిపిస్తాడు,” అని వర్షతో అంది.
అర్జున్ విన్నాడు. ఆమె తన ప్రవర్తనకు ఎంత సులువుగా వివరణ ఇచ్చిందో కూడా గమనించాడు.
అతను దాన్ని సరిచేయలేదు.
ఆ మధ్యాహ్నం వర్ష ల్యాబ్‌లో చేసిన పని సేవ్ కాకుండా పోయింది.
“అయిపోయింది. గంట నుంచి చేసినదంతా పోయింది,” అంటూ కుర్చీలో వెనక్కి వాలింది.
పక్క సిస్టమ్ దగ్గరున్న అర్జున్ లేచి వచ్చాడు.
“ఒకసారి చూడనా?”
వర్ష పక్కకు జరిగింది.
అతను తొందరపడకుండా ఫోల్డర్లు వెతికాడు. ఆటోసేవ్‌లో కొంత పని కనిపించింది. మిగిలినది మళ్లీ చేయడానికి తన నోట్స్ ఇచ్చాడు.
“ఇంత ప్రశాంతంగా ఎలా ఉంటావ్?” అడిగింది వర్ష.
“కంప్యూటర్ మీద అరిస్తే ఫైల్ తిరిగొస్తుందా?”
ఆమె నవ్వింది.
“నాకు ముందు అరవాలని ఉంటుంది. తర్వాత ఆలోచిస్తా.”
“అయితే నువ్వు అరిచే పని చూసుకో. నేను ఇది చూస్తా.”
వెన్నెల ప్రింట్లు తీసుకుని వచ్చేసరికి ఇద్దరూ ఒకే స్క్రీన్ వైపు చూస్తున్నారు. వర్ష నవ్వుతూ ఏదో చెబుతోంది. అర్జున్ ఆమె మాట మధ్యలో ఆపకుండా వింటున్నాడు.
వెన్నెల చేతిలోని పేపర్లను సర్దుకుంది.
“వర్షా… నీ ప్రింట్లు.”
“థాంక్స్. ఇది చూడు, నా ఫైల్ పోయింది. మీ బావ కొంత వెతికి ఇచ్చాడు.”
“అవునా?”
వెన్నెల కూడా నవ్వింది. అర్జున్ తనవైపు చూస్తాడనుకుంది.
అతను ఇంకా స్క్రీన్‌నే చూస్తున్నాడు.
అర్జున్‌కు వెన్నెల ప్రేమ తెలియనిది కాదు.
తన కోసం తెచ్చే భోజనంలో, క్లాస్ అయిపోయినా గేటు దగ్గర ఆగడంలో, తను చిన్నగా మొహం చిట్లిస్తే వెంటనే “ఏమైంది బావా?” అని అడగడంలో అది స్పష్టంగా కనిపించేది.
ఆ శ్రద్ధ అతనికి ఇష్టం.
కానీ వెన్నెల ఊహిస్తున్న భవిష్యత్తు గురించి అతను ఆలోచించేవాడు కాదు.
వర్ష విషయంలో అతని ఆసక్తి వేరు. ఆమె దగ్గరగా కూర్చున్నప్పుడు సంభాషణను పొడిగించేవాడు. ఆమె నవ్వితే ఇంకో మాట అనేవాడు. ఆమెతో ఒంటరిగా మాట్లాడే అవకాశం కోసం చూసేవాడు.
వర్ష అతని ప్రశాంతతలో భద్రతను చూస్తోంది.
అర్జున్ మాత్రం ఆమె ఆకర్షణను పరీక్షిస్తున్నాడు—తన మెసేజ్‌కి ఎంత త్వరగా సమాధానం ఇస్తుంది, తను మెచ్చుకుంటే ఎలా స్పందిస్తుంది, వెన్నెల లేకపోయినా తనతో ఉండటానికి ఇష్టపడుతుందా అని.
ఒకరోజు ఇంగ్లీష్ లెక్చరర్ క్లాస్‌లోకి రాగానే అర్జున్ ముందరి బెంచ్ నుంచి అన్నాడు.
“మ్యామ్, ఇవాళ మీ క్లాస్ బంక్ కొట్టాలనుకున్నా. కానీ మీరు చెప్పే విధానం మిస్ అవుతాననిపించింది.”
ఆవిడ పుస్తకం టేబుల్ మీద పెట్టింది.
“అంత నచ్చితే నిన్న ఇచ్చిన అసైన్‌మెంట్ తీసి చూపించు, అర్జున్.”
వెనక బెంచీల్లో నవ్వులు వినిపించాయి.
అతను కూడా నవ్వాడు.
“రేపు ఇస్తా, మ్యామ్.”
“మాటలతో మార్కులు రావు. రాసుకొచ్చి ఇవ్వు.”
ల్యాబ్ ఫ్యాకల్టీతో కూడా ఇలాగే ఏదో పొగడ్త కలిపి మాట్లాడేవాడు. వాళ్లు పనికి సంబంధించిన ప్రశ్న అడిగితే, చిరునవ్వుతో తప్పించుకోవడానికి ప్రయత్నించేవాడు.
వర్షకు మొదట అది అతని సరదా స్వభావంగా అనిపించింది.
వెన్నెలకు మాత్రం కొన్నిసార్లు ఇబ్బందిగా ఉండేది.
“అందరితో అలా మాట్లాడాలా?” అని ఒకసారి అడిగింది.
“ఎలా?”
“నీకు తెలుసు బావా.”
అతను ఆమె ముఖంలోకి చూశాడు.
“నీతో మాట్లాడటం తగ్గించానా?”
వెన్నెల వెంటనే తల అడ్డంగా ఊపింది.
అతను ఆమె అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు. అయినా ఆమె మళ్లీ అడగలేకపోయింది.
ఆ శుక్రవారం వెన్నెల ఇంటికి ముందే వెళ్లాల్సి వచ్చింది.
“వర్షతో కలిసి వెళ్లు బావా. కొత్త రూట్‌లో బస్సులు గందరగోళంగా ఉంటాయి,” అని చెప్పింది.
గేటు బయట ఇద్దరూ పక్కపక్కన నడుస్తున్నారు.
“వెన్నెల నిన్ను బాగా చూసుకుంటుంది,” అంది వర్ష.
“చిన్నప్పటి నుంచీ అంతే.”
“నీ గురించి చాలా మాట్లాడుతుంది.”
“నా ముందు మాత్రం ఎక్కువ మాట్లాడదు.”
వర్ష అతనివైపు చూసింది.
“నువ్వు వినాలి కదా.”
అర్జున్ అడుగులు కొంచెం నెమ్మదించాయి.
“అంటే నేను విననంటావా?”
“కొన్నిసార్లు.”
అతను కోపపడతాడేమో అనుకుంది. కానీ నవ్వాడు.
“సరే. నువ్వు చెప్తున్నావుగా, వింటా.”
ఆ చిన్న సమాధానం వర్షకు నచ్చింది. తన మాటను తేలిగ్గా తీసిపారేయలేదనిపించింది.
బస్‌స్టాప్ దగ్గర నిలబడినప్పుడు అతను అడిగాడు.
“నువ్వెప్పుడూ అందరి గురించి ఇంత ఆలోచిస్తావా?”
“అందరి గురించి కాదు.”
“మరి నా గురించి?”
వర్ష రోడ్డు వైపు చూసింది.
“నీ బస్సు వచ్చిందేమో చూడు.”
అతను నవ్వాడు. ఆమె కూడా నవ్వకుండా ఉండలేకపోయింది.
ఆ రాత్రి వర్ష ఫోన్‌కి మెసేజ్ వచ్చింది.
ఇంటికి చేరావా?
ఎప్పుడో. నువ్వు?
చేరా. ఇవాళ నీతో మాట్లాడటం బాగుంది.
వర్ష ఆ వాక్యాన్ని కాసేపు చూస్తూ ఉండిపోయింది.
వెంటనే వెన్నెల చాట్ తెరిచింది.
మీ బావ మెసేజ్ చేశాడు.
అని టైప్ చేసింది.
కొన్ని క్షణాల తర్వాత చెరిపేసింది.
చెప్పాల్సినంత పెద్ద విషయం కాదని తనకు తానే అనుకుంది.
అర్జున్‌కి సమాధానం పంపింది.
నాకూ.
అదే సమయంలో వెన్నెల అతనికి అడిగింది.
రేపు లంచ్‌కి ఏం తీసుకురాను బావా?
అతను పంపాడు.
నీ ఇష్టం. నువ్వు తెచ్చేది ఏదైనా బాగుంటుంది.
వెన్నెల ఆ మెసేజ్ చదివి నవ్వుకుంది.
వర్షతో చాట్ చేస్తుండగా సిరి నుంచి మరో మెసేజ్ వచ్చింది.
నా నోట్స్ ఇంకా నీ దగ్గరే ఉన్నాయి.
సోమవారం ఇస్తా. క్యాంటీన్‌లో కాఫీ నీది.
అని అర్జున్ సమాధానం ఇచ్చాడు.
తర్వాత మళ్లీ వర్ష చాట్ తెరిచాడు.
నిద్ర వస్తోందా? కాసేపు మాట్లాడదామా?
వర్ష గదిలో లైట్ ఆర్పి, ఫోన్ చేతిలో పట్టుకుని పడుకుంది.
పక్కనే ఉన్న వెన్నెల చాట్‌లో చివరి మెసేజ్ కనిపిస్తోంది.
రేపు త్వరగా రా. నీతో చాలా చెప్పాలి.
వర్ష దానికి గుండె గుర్తు పెట్టింది.
ఆ తర్వాత అర్జున్‌కు—
మాట్లాడు.
అని పంపింది.

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)