15-09-2026, 11:52 AM
మేము స్టేషన్లో అడుగు పెట్టేసరికే ప్లాట్ ఫామ్ ఖాళీ అయిపోయింది. ప్రయాణీకులతో క్రిక్కిరిసియున్న రైలు ప్లాట్ ఫామ్ దాటి వేగం పుంజుకుంది. దాన్ని అందుకోవాలని విఫల ప్రయత్నం చేసాము మేము. నిస్పృహతో వెళుతూన్న రైలునే చూస్తూ ఉండిపోయాము. నెక్స్ ట్ ట్రెయిన్ మళ్ళీ మర్నాటి ఉదయం పది గంటల వరకు లేదు. ఉసూరుమంటూ బుకింగ్ ఆఫీస్ వైపు నడచాము.
నాలుగు అడుగులు వేసామో లేదో, దూరంలో భారీ ప్రేలుడు శబ్దం వినిపించింది మాకు. అదరిపడి అటువైపు చూసాము. ట్రెయిన్ కి ఏదో ప్రమాదం సంభవించినట్లనిపించింది. మారుయోచన లేకుండా పట్టాల పైన అటువైపు పరుగెత్తాము.
స్టేషన్ కి సుమారు ఓ కిలో మీటరు దూరంలో ఏటిపైన రైలు వంతెన ఒకటి ఉంది. అక్కడకు చేరుకున్న మా గుండెలు గుభేలుమన్నాయి. ఆ వంతెన కూలిపోయింది. దాని పైన వెళుతూన్న జాతర స్పెషల్ పడిపోయింది. చివరి కంపార్ట్ మెంటులు రెండూ క్రిందనున్న ఏటిలో పడిపోతే...ఇంజను, దాని వెనుకనున్న కంపార్ట్ మెంటూ విరిగిన వంతెన పైన ప్రికేరియస్ గా వ్రేలాడుతున్నాయి. ప్రయాణీకుల హృదయవిదారకమైన ఆర్తనాదాలు ఆ ప్రాంతమంతా మార్మ్రోగుతున్నాయి.
ఓ క్షణం ఏం చేయాలో తోచలేదు మాకు. తేరుకుని, కంపార్ట్ మెంటులలో చిక్కుకున్న ప్రయాణీకులను కాపాడదామని ప్రయత్నిస్తే, దరిదాపులకు కూడా వెళ్ళలేకపోయాము.
“మనం వెంటనే స్టేషన్ మాస్టర్ని ఎలర్ట్ చేయాలి, పద” అని కిశోర్ అనడంతో, మళ్ళీ వెనక్కి తిరిగి పరుగెత్తాము మేము. కొంతదూరం వెళ్ళాక హఠాత్తుగా ఆగి నావంక చూసాడు కిశోర్. “విధివిలాసం చిత్రమైంది సుమా! మనకింకా ఆయుస్సు ఉండడం వల్లనే రైలును మిస్ చేసాం మనం” అన్నాడు. నిజమేననిపించడంతో, భయంగా గుండె పైన చేయి వేసుకున్నాను నేను.
మేము రొప్పుతూ అందించిన సమాచారాన్ని ఆలకించిన స్టేషన్ మాస్టర్ (ఎస్సెమ్), “నాకు ప్రేలుడు శబ్దం ఏదీ వినిపించలేదే!” అన్నాడు తాపీగా.
“మాకు వినిపించింది. సంఘటనాస్థలానికి వెళ్ళి చూసి వచ్చాం మేము. వంతెనతోపాటు రైలు కూడా కూలిపోయింది. ప్రయాణీకులు ఆర్తనాదాలు మిన్నంటుతున్నాయి” అన్నాడు కిశోర్ విసుగ్గా. “వెంటనే రిలీఫ్ టీమ్స్ కోసం ఫోన్ చేయండి. నేను గ్రామస్తులను ఎలర్ట్ చేస్తా ను”.
“ఆగవయ్యా మగడా! జాతర స్పెషల్ ఇంకా రానేలేదు. దాన్ని మీరి మిస్ చేయడం, అది ప్రమాదానికి గురికావడం...చిత్రంగా ఉంది!” అన్నాడు ఎస్సెమ్. ఆ రోజు జాతర స్పెషల్ ఓ గంట లేటనీ, సాయంత్రం ఐదు గంటలకుగాని రాదనీ అతను చెబుతూంటే అవాక్కయాము మేము.
“నో! మేము అబద్ధం చెప్పడంలేదు. ఆ ప్రమాదాన్ని మేము కళ్ళారా చూసాము” దాదాపుగా అరచాడు కిశోర్.
సంశయిస్తూనే మావెంట పరుగెత్తాడు ఎస్సెమ్. ఐతే, సంఘటనాస్థలానికి చేరుకున్న మేము గొప్ప షాక్ కి గురయ్యాము…ఆ వంతెన కూలిపోలేదు! చెక్కు చెదరకుండా ఉంది. రైలు కూడా లేదక్కడ! కిశోర్, నేను అయోమయంగా ముఖాలు చూసుకున్నాము.
“మీరు హారర్ సినిమాలు ఎక్కువగా చూస్తారా?” మావంక అదోలా చూస్తూ అడిగాడు ఎస్సెమ్.
“బట్...సర్!...ఇక్కడే...ఈ వంతెన మీదే...ఆ ఘోరదృశ్యాన్ని కళ్ళారా చూసాం మేము” అన్నాడు కిశోర్. ఔనన్నట్టు తలూపాను నేను.
“ఇట్జ్ నతింగ్ బట్ ఇల్ల్యూజన్,” స్వగతంలా అనుకుంటూ వెనుదిరిగాడు ఎస్సెమ్. అయోమయంగా అతన్ని అనుసరించాం మేము.
గదికి తిరిగిరాగానే మమ్మల్ని కూర్చోమని సైగ చేసాడు ఎస్సెమ్. ఓ క్షణం మావంక నిశితంగా చూసి అన్నాడు _ “మీకు ఓ విషయం తెలుసా? ఇవాళ మధ్యాహ్నం పన్నెండు గంటల తరువాత ఏ ట్రెయినూ రాలేదు ఇక్కడికి. సో, అందులోంచి ప్రయాణీకులు దిగడమనేది కేవలం మీ భ్రమ!” నోళ్ళు వెళ్ళబెట్టాం మేము. భ్రమ ఇద్దర్నీ ఒకేసారి ఆవరిస్తుందా...!?
ఓ క్షణం ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాడు అతను. తరువాత “అఫ్ కోర్స్, కొన్ని ఏళ్ళ క్రితం అదే వంతెన పైన ఘోర రైలు ప్రమాదం జరిగిన మాట వాస్తవమే. కాని, ఆ దృశ్యం ఇప్పుడు మీకు తాజాగా కనిపించడమనేది...ఐ సింప్లీ కాంట్ బిలీవ్”. ఆశ్చర్యంతో చూసాము మేము.
“అన్నట్టు, ఈ రోజు ఆ యాక్సిడెంట్ యొక్క యానివర్శరీ. అందువల్ల లోకల్ న్యూస్ పేపర్స్ దాని గురించి విపులంగా రాసాయి” అంటూ, ఆనాటి తెలుగు దినపత్రిక ఒకటి తెచ్చి ఇచ్చాడు ఎస్సెమ్.
ఆ రిపోర్ట్ ని ఆతృతగా చదివాము మేము... సరిగా ఇరవయ్యేళ్ళ క్రితం అదే వంతెన కూలి జాతర స్పెషల్ కి ఘోర ప్రమాదం జరిగింది. అందులో ఇద్దరు చిన్నారులు తప్ప ప్రయాణీకులంతా మరణించడంతో అది గొప్ప సెన్సేషన్ అయింది. ఆరోజు ఇరవయ్యో వార్షికం కావడంతో స్థానిక పత్రికలు దాని గురించి బ్లాక్ బోర్డర్స్ తో ప్రత్యేక కథనాలు ప్రచురించాయి. ఆ దుస్సంఘటనలో ప్రాణాలు కోల్పోయినవారిలో కొందరి ఫొటోలు కూడా ప్రచురింపబడ్డాయి. వాటి వంక చూసిన మేము ఉలికిపడ్డాము.
వాటిలో – ‘ఎక్స్ ప్రెస్ నుండి దిగి ప్లాట్ ఫాం మీద కూర్చున్నవారిలో కొందరి ఫొటోలు కూడా ఉన్నాయి’. ముఖ్యంగా – మేము కూర్చున్న బెంచ్ పైన ఆశీనులైన యువజంట, వృద్ధజంటలను ఇట్టే గుర్తుపట్టాము మేము. “మాస్టారూ! ఎక్స్ ప్రెస్ నుండి దిగిన జనంలో వీళ్ళూ ఉన్నారు. ఈ జంటలు రెండూ మేము కూర్చున్న బల్లపైనే కూర్చున్నాయి” ఎక్సైటింగ్ గా అన్నాడు కిశోర్. ఔనన్నట్టు తలూపాను నేను.

ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
మా తెలుగు తల్లికి మల్లె పూదండ

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)