15-09-2026, 11:51 AM
బ్యాగ్ లోంచి బెట్టీ మెహమూదీ ఆటోబయాగ్రఫీ ‘నాట్ విదౌట్ మై డాటర్’ ని తీసి చదవనారంభించాను...అమెరికాలో పనిచేస్తూన్న ఓ ఇరానియన్ డాక్టర్ ని ప్రేమించి పెళ్ళాడి అష్టకష్టాలకు గురయింది అమెరికన్ యువతి బెట్టీ. రెండు వారాల వెకేషన్ కని చెబితే నమ్మి నాలుగేళ్ళ కూతుర్ని వెంటబెట్టుకుని అయిష్టంగానే భర్తతో ఇరాన్ కి వెళుతుంది. ఆ దేశపు సంస్కృతి, ఆచారవ్యవహారాలు, స్త్రీలను బానిసలుగా ట్రీట్ చేసే విధానము, అపరిశుభ్రతా వాతావరణం, అనాగరికపు అలవాట్లు, అమెరికన్ల పట్ల ఆ దేశపు ప్రజలకు గల ద్వేషం, వగైరాలు జుగుప్సను, భయాన్నీ కలిగిస్తాయి ఆమెకు. అమెరికాకి తిరిగివెళ్ళకుండా అక్కడే స్థిరపడిపోవాలన్న భర్త హఠాన్నిర్ణయంతో బెట్టీ ప్రపంచం తలక్రిందులు అవుతుంది. కూతురికి కూడా ఇరాన్ నచ్చదు. తల్లీకూతుళ్ళు ఎప్పుడు అమెరికాకి తిరిగి వెళ్ళిపోదామా అని అర్రులుచాచుతూ ఉంటారు. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న బెట్టీ తండ్రి చావుబ్రతుకులలో ఉంటాడు. ఎట్టి పరిస్థితులలోనూ తాము అమెరికాకి తిరిగి వెళ్ళే ప్రసక్తే లేదంటాడు భర్త. ఎదురు తిరిగిన భార్యను ఒంటరిగా బంధించి చిత్రవధ చేస్తాడు. ‘ఫార్సీ’ మీడియంలో చదువు నేర్పే లోకల్ కాలేజీ వాతావరణం నచ్చక వెళ్ళనని మారాము చేసే చిన్నారిని కూడా హింసిస్తాడు. కూతుర్ని తల్లి నుండి వేరుచేయడానికి ప్రయత్నిస్తాడు. ఎలాగైనా కూతురితో ఆ దేశం నుండి తప్పించుకుని అమెరికాకి పారిపోవాలని విశ్వప్రయత్నాలు చేస్తుంది బెట్టీ. కూతుర్ని విడచి తాను తప్పించుకోగల అవకాశం ఉన్నా, కూతురు లేకుండా తాను తిరిగివెళ్ళనని భీష్మించుకుంటుంది....అయాతుల్లా ఖోమిని హయాములోని ఇరాన్ యొక్క రాజకీయ, సామాజిక స్థితిగతులు కళ్ళకు కట్టినట్టు వివరించబడ్డాయి పుస్తకంలో...బెట్టీ చేదు అనుభవాలను, నాలుగేళ్ళ చిన్నారి గురయ్యే శారీరక, మానసిక హింసను గూర్చి చదువుతూంటే ఎంతటివారికైనా కన్నీళ్ళు రాకమానవు...
“హలో!” అన్న పలుకరింపుతో తలెత్తి చూసాను నేను. ఎదురుగా – చిరునవ్వుతో ఓ యువకుడు.
పాతికేళ్ళుం టాయి అతనికి. ఆరడుగుల హ్యాండ్సమ్ విగ్రహం. డార్క్ జీన్స్ ప్యాంట్ పైన లైట్ కలర్ షర్ట్ ధరించాడు. కళ్ళకు కూలింగ్ గ్లాసెస్, కాళ్ళకు బాటా షూస్. వీపుకు బ్యాక్ ప్యాక్, చంకను వీడియో కెమేరా వ్రేలాడుతున్నాయి.
“మీరు దుర్గారం జాతరకు వెళుతున్నారా?” అనడిగాడు. ఔనని చిన్నగా తల ఊపాను. తానూ అక్కడికే వెళుతున్నట్టు చెప్పాడు. బ్యాక్ ప్యాక్ నీ, కెమేరానీ బల్ల మీద పెట్టి కూర్చున్నాడు.
నేను మళ్ళీ పుస్తకంలో తల దూర్చబోతే, “ఒంటరితనపు నేస్తాన్ని కాసేపు పక్కను పెట్టి, పక్కనున్న నాతో నేస్తం కలపవచ్చుగా?” అన్నాడు అతను చనువుగా. నిర్మానుష్యమైన ఆ స్టేషన్లో మరో వ్యక్తి తారసపడడం ఓ విధంగా సంతోషం కలిగించింది నాకు. పుస్తకం మూసేసాను.
“నా పేరు కిశోర్. ఫ్రీలాన్స్ జర్నలిస్టుని. బేస్ కోల్ కత్తా ఐనా, దేశమంతా నాదే. దుర్గారం జాతరను కవర్ చేయడానికి వచ్చాను,” చెప్పాడు అతను. నాకంటె ఓ గంట ముందుగా కోల్ కత్తా నుండి వచ్చాడట. కలుపుగోరు మనిషి కావడంతో ఉత్సాహంగా కబుర్లు చెప్పుకున్నాము మేము.
స్టేషన్ మాస్టర్ గంట కొట్టడంతో వాచ్ చూసుకున్నాను నేను. మా ట్రెయిన్ కి ఇంకా సుమారు గంట వ్యవధి ఉంది. మరేదో ట్రెయిన్ వస్తున్నట్టుంది…కాసేపటికి దక్షిణాదినుండి ఎక్స్ ప్రెస్ ట్రెయిన్ ఒకటి వచ్చి ఆగింది. అందులోంచి బిలబిలమంటూ దిగారు ప్యాసెంజర్స్.
అక్కడ దిగినవారు దాదాపు ఇరవై మంది ఉంటారు. వారిలో వృద్ధులు, స్త్రీలు, పిల్లలూ కూడా ఉన్నారు. అదంతా జాతర జనమేనని తెలుస్తూనేయుంది. కావిళ్ళు, అరటిగెలలు, బెల్లపు అచ్చులు, కోళ్ళు, పసుపు గుడ్డ
లు కట్టిన బిందెలు వగైరాలు ఉన్నాయి. బల్లల పైన కొందరు సర్దుకుంటే, చెట్లనీడల్లో దుప్పట్లు పరచుకుని కూర్చున్నారు మరికొందరు.
ఓ యువజంట రెండేళ్ళ పాపతో వచ్చి మేము కూర్చున్న బల్లపైన సర్దుకుంది. ఓ వృద్ధజంట ఐదేళ్ళ పిల్లవాడితో మాకు చేరువలో చెట్టు క్రింద కూర్చుంది. నేను, కిశోరూ లేచి వారికి చోటు ఇచ్చాము. పాప ముద్దుగా ఉంది. బుద్ధిగా కూర్చుంది. పిల్లవాడు ఆకతాయిలా ఉన్నాడు. అల్లరి చేస్తున్నాడు. ప్లాట్ ఫాంకి మరో వైపు యువతీయువకులు కొందరు నవ్వులతో కేరింతాలతో సందడి చేస్తున్నారు, జాతరకు వెళుతూన్న సంబరం కాబోలు.
కిశోర్ బల్లమీద కూర్చున్నవారితో మాటలు కలపబోయాడు. కాని, వారి నుండి స్పందన లేకపోవడం చిత్రంగా తోచింది మాకు. “పద, అక్కడ సందడిచేస్తూన్న యూత్ ని పలుకరిద్దాం” అని కిశోర్ అనడంతో, అటువైపు నడచాము మేము...మమ్మల్ని చూడనట్టు వాళ్ళ ధోరణిలో వాళ్ళు ఉన్నారు. ఆ గుంపును వీడియో తీసి, వారితో మాట్లాడబోయాడు కిశోర్. వారి నుంచి స్పందన కరవయింది.
“వీళ్ళది సిగ్గో, లేక ఆత్మన్యూనతాభావమో అర్థం కావడంలేదు,” అన్నాడు కిశోర్, భుజాలు ఎగురవేస్తూ. “ఈ వియర్డ్ ఎట్మాస్ఫియర్ లో గడిపే కంటే, అలా బైట తిరిగివస్తే బావుంటుంది”.
స్తేషన్ నుండి బైటపడి గ్రామం వైపు నడచాము ఇద్దరమూ. ఊరు చిన్నదైనా, పచ్చని ప్రకృతి మధ్య అందమైన పొదరిల్లులా ఉంది. సుమారు వంద గడప ఉంటుంది. అందులో గిరిజనుల సంఖ్యే అధికం. గ్రామం నడిబొడ్డున రావిచెట్టు క్రింద ఉన్న రచ్చబండ మీద కూర్చున్నాం మేము.
మమ్మల్ని చూసి పరుగెత్తుకు వచ్చారంతా. ఆడ, మగ, పిల్లలూ మా చుట్టూ చేరి నన్నే వింతగా చూడడం కొంచెం ఇబ్బందిగా అనిపించింది నాకు. బహుశా నా మోడర్న్ డ్రెస్సే అందుకు కారణమయ్యుంటుంది. నా గురించి వాళ్ళు వేసిన ప్రశ్నలన్నిటికీ ఓపికగా జవాబులు ఇచ్చాము మేము. దుర్గారం జాతరను చూడ్డానికి నేను హైదరాబాద్ నుండి ఒంటరిగా వచ్చానని ఆలకించి ఆశ్చర్యపోయారంతా. నాతో కలసి ఫొటోలు, వీడియో దిగారు అంతా. గ్రామస్తుల బ్రతుకుతెరువులను గూర్చి, జీవన విధానాలను గూర్చీ తెలుసుకుంటూ ఆ గ్రామపెద్దను ఇంటర్వ్యూ చేసాడు కిశోర్. ఆ గ్రామాన్ని, ప్రజలనూ వీడియో తీసాడు. వాళ్ళు తెచ్చి ఇచ్చిన కమ్మటి మజ్జిగ త్రాగితే కడుపులో చల్లగా అనిపించింది.
దూరంలో రైలు కూత వినిపించడంతో టైమ్ చూసి చిన్నగా ఉలికిపడ్డాను నేను. జాతర స్పెషల్ వచ్చే టైమ్ అయిపోయింది. ఆ గ్రామస్తులతో గడుపుతూంటే సమయమే తెలియలేదు. హడావుడిగా వారికి వీడ్కోలు చెప్పి గబగబా స్టేషన్ వైపు నడచాము ఇద్దరమూను.

ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
మా తెలుగు తల్లికి మల్లె పూదండ

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)