05-09-2026, 02:19 PM
సిద్దును ప్రసాద్ చంపదెబ్బ కొట్టిన మరుసటి రోజు ఉదయం...
ఇంట్లో వాతావరణం మామూలుగానే ఉన్నప్పటికీ, సిద్దు మాత్రం నిన్న జరిగిన ఘటనను తలుచుకుంటూ మౌనంగా కూర్చున్నాడు. నందిని కూడా తమ్ముడి వైపు చూస్తూ ఏదో చెప్పాలనుకుని ఆగిపోతుంది.
ఇంతలో ప్రసాద్ తన భార్య భానుమతితో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడేందుకు కూర్చుంటాడు.
“భానుమతి... ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఈసారి ఖర్చు కూడా ఎక్కువగానే ఉంటుంది. అందుకే బెతంచర్లకు దగ్గర్లో ఉన్న మన పది ఎకరాల బీడు పొలం అమ్మేద్దామని అనుకుంటున్నాను” అని ప్రసాద్ అంటాడు.
భానుమతి ఒక్కసారిగా భర్త వైపు చూస్తుంది.
“ఆ పొలమా... అది మనకు పెద్దల నుంచి వచ్చిన ఆస్తి కదండీ. అలా ఎలా అమ్మేస్తారు?” అని అడుగుతుంది.
“తెలుసు భానుమతి. కానీ పరిస్థితులు అలా ఉన్నాయి. రేపో మాపో దానికి రేటు కుదిరిపోతుంది. ఇప్పుడు అమ్మితే మన అవసరాలు తీరుతాయి” అంటాడు ప్రసాద్ .
కొద్దిసేపు మౌనంగా ఉన్న భానుమతి...
“పెద్దల ఆస్తి కదా... ఒక్కసారి అమ్మేస్తే మళ్లీ తిరిగి రాదు” అంటుంది.
“నాకూ తెలుసు. కానీ ఇప్పుడు ఎన్నికల్లో నిలబడుతున్నాను. డబ్బు అవసరం ఉంది. తప్పనిసరి పరిస్థితి” అని ప్రసాద్ స్పష్టంగా చెబుతాడు.
అనంతరం మరో విషయం గుర్తు చేస్తూ...
“అమ్మాయి నందిని, నీ ముద్దుల కొడుకు సిద్దు... ఇద్దరూ సంతకం పెట్టాలి. అందుకే వాళ్లిద్దరినీ ఇంకో వారం రోజులు ఇక్కడే ఉండమని చెప్పు” అని భార్యకు చెబుతాడు.
భానుమతి భర్త మాటలకు తల ఊపుతుంది.
“సరే... పిల్లలతో మాట్లాడతాను” అంటుంది.
ఆ రోజు సాయంత్రం...
ఇంట్లో నందిని, సిద్దు ఇద్దరినీ భానుమతి తన దగ్గర కూర్చోబెట్టుకుంటుంది.
తల్లి ముఖంలో కనిపిస్తున్న ఆలోచనను గమనించిన నందిని...
“ఏమైంది అమ్మా? ఎందుకు అలా ఉన్నావు?” అని అడుగుతుంది.
భానుమతి కాసేపు పిల్లలిద్దరి ముఖాల్లోకి చూస్తుంది.
“మీ నాన్న ఒక విషయం చెప్పారు...” అంటూ ఆగుతుంది.
“ఏంటమ్మా?” అని సిద్దు అడుగుతాడు.
“బెతంచర్ల దగ్గర మనకున్న పది ఎకరాల బీడు పొలం అమ్మాలని అనుకుంటున్నారట” అని భానుమతి చెబుతుంది.
నందిని, సిద్దు ఒకరినొకరు చూసుకుంటారు.
“పొలం అమ్మడానికా?” అని నందిని అడుగుతుంది.
“అవును. ఎన్నికల ఖర్చులకు డబ్బు అవసరమంటున్నారు. రేటు కూడా కుదిరేలా ఉందట” అని భానుమతి చెబుతుంది.
సిద్దు కాసేపు ఆలోచించి...
“అమ్మా... మనకు అంత అవసరం ఉంటే అమ్మండి. బీడు పొలం కదా... మనకేం ఉపయోగం లేదు” అంటాడు.
నందిని కూడా తమ్ముడి మాటకు సమ్మతిస్తుంది.
“నాన్న ఏదో ఆలోచించే చెబుతారు కదా అమ్మా. మనం వద్దంటే ఆయన ఇబ్బంది పడతారు. అమ్మేయనివ్వండి” అంటుంది.
పిల్లలిద్దరూ అంత సులభంగా ఒప్పుకోవడంతో భానుమతి కాసేపు వాళ్లవైపు చూస్తూ ఉంటుంది.
“నాకు తెలుసు... మీరు నా మాట కాదనరు. కానీ అది మీ తాతయ్యల కాలం నుంచి వచ్చిన ఆస్తి. అందుకే మీ ఇద్దరి అభిప్రాయం కూడా అడగాలని అనిపించింది” అంటుంది.
సిద్దు తల్లి చేతిని పట్టుకుని...
“నువ్వు ఏం అనుకుంటే అదే అమ్మా. నువ్వు చెప్పాక మేమేం కాదంటాం?” అంటాడు.
నందిని కూడా తల్లి భుజంపై చేయి వేసి...
“అమ్మా... నీకు ఏది మంచిదనిపిస్తే అదే చేయి. నాన్నకు అవసరం ఉందంటే పొలం అమ్మేయడంలో మాకు ఎలాంటి అభ్యంతరం లేదు” అంటుంది.
భానుమతి పిల్లలిద్దరినీ దగ్గరకు తీసుకుని...
“మీ ఇద్దరూ ఇలా అర్థం చేసుకుంటే చాలు. పెద్దల ఆస్తి పోతుందన్న బాధ కంటే... మీ మధ్య ఎలాంటి గొడవలు రాకుండా ఉండటమే నాకు ముఖ్యం” అంటుంది.
సిద్దు, నందిని తల్లి మాటలకు మౌనంగా తల ఊపుతారు.
తల్లి మాట కాదనలేక...
పొలం అమ్మడానికి ఇద్దరూ అంగీకరిస్తారు.

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)