28-08-2026, 11:46 PM
4
ఓ రోజు కొట్టు ఖాళీగా ఉంటే కుమారి లోపల ఇంట్లోకి వెళ్ళింది. గిరి వాళ్ళ అమ్మ జాకెట్ ఉక్సులు కుడుతుంటే తన పక్కన కూర్చుంది. ఆంటీ అంటే మ్మ్ అంది రాగం తీస్తూ.. మీ పేరేంటి అని అడిగితే చిన్నగా చూసి సుమలతా దేవి అంది.
ఎందుకు మూడు పేర్లు పెట్టారు? సుమ, లత, దేవి అయినా బాగుందిలే అంటే అవునా అంది సుమ. బైట కొట్లో నుంచి గిరి కేక వినిపించగానే కుమారి లేచి పరిగెత్తడం చూసి నవ్వుకుంది. గిరి కుమారీల మధ్య రోజు రోజుకి చనువు పెరగడం సుమ గమనిస్తూనే ఉంది. ఇది ఎక్కడికి దారి తీస్తుందో తెలీదు గానీ కుమారి మాత్రం తనకి నచ్చింది.
ఈ రోజుకి ఇంట్లో తెలీకుండా బాబాయ్ దగ్గర భోజనం చేసి మళ్ళీ ఇంట్లో తిన్నట్టు నటించి కొంచెం అన్నం లోపల కుక్కి కొంచెం అన్నం బైట కుక్కలకి కుక్కి, ఫుల్ టైట్ పొట్టతో ప్రెగ్నెంట్ లాగ అటు ఇటు తిరిగి నిద్రపోయింది. తరువాత నాలుగు రోజులకి వచ్చిన డబ్బులతో తనే ఓ జీన్స్ కొనుక్కుంది కుమారి. అది స్లిమ్ ఫిట్ బ్లు జీన్స్. చాలా ఇష్టంగా కొనుక్కుంది కుమారి. అనుకున్నది కొనింది కానీ తరువాత వచ్చే సమస్యలు మాత్రం జీన్స్ కొన్నాకే తట్టాయి. దీన్ని ఎక్కడ దాచాలో కుమారికి అర్ధంకాలేదు. అన్నీ ఆలోచించి చివరికి కొట్లోనే దాచింది. తరువాత రెండు రోజుల్లో ఒక టాప్, ఆ తరువాత రెండు రోజులకి రెండు ఫ్లాట్స్ కొనుక్కుంది. అన్నీ కొట్లోనే..
కొట్లో సామాను కంటే నీ సామాను పెరుగుతుంది అంది సుమ. నాకోసం ఇంత చోటివ్వలేరా అని ఏడుపు మొహం పెడితే సుమకి ముద్దొచ్చి ముక్కు పట్టుకుని లాగింది. అలా పెట్టకు మొహం అంటే సరే సరే అంది కుమారి. ఇద్దరు నవ్వుకున్నారు. రాత్రి కుమారి వెళ్ళిపోయాక కొడుకు పక్కన కూర్చుంది సుమ. రేపు పెళ్ళికి వెళుతున్నాను అని గిరి వంక చూసింది.
గిరి వెళ్ళవే అంటే, కొట్లో ఉండేది నువ్వు కుమారి మాత్రమే అని గుర్తుచేసింది. నా మీద నమ్మకం లేదా అని ఆశ్చర్యపోయాడు గిరి.
అస్సలు లేదు. కుమారిని ఏడిపించినట్టు తెలిసినా, తనతో పిచ్చి పిచ్చి వేషాలేసినట్టు తెలిసినా బెల్టు తెగిపోద్ది అని వార్నింగ్ ఇచ్చింది సుమ.
అలాగే అమ్మ గారు అన్నాడు లేచి వంగుని. సుమ నవ్వితే గిరి కూడా నవ్వి, ఆ పిల్ల సుబ్బరాజు కూతురని మర్చిపోయినట్టున్నావ్ అంటే కుమారిని మెచ్చుకుంటూ మంచి పిల్లరా అంది.
తెల్లారి యాధావిధిగా కాలేజీ అయిపోగానే కొట్టుకి వచ్చిన కుమారికి సుమ ఆంటీ కనిపించకపోయేసరికి అడిగింది,.
ఆంటీ ఎక్కడా అంటే పెళ్ళికి ఊరు వెళ్ళింది అన్నాడు. మళ్ళీ ఎప్పుడు వస్తుంది అని అడిగితే రెండు రోజుల్లో వస్తుందన్నాడు గిరి. ఎనిమిదిన్నర వరకు నడిచిన హడావిడి ఒక్క క్షణంలో మాయమైపోయింది. ఇద్దరు సామాను మధ్యలోనే కింద ఎదురు కూర్చున్నారు.
అలిసిపోయావా అంటే నవ్వి లేదంది, ఇద్దరు కలిసి కొట్టు సర్దుతుంటే ఒకేసారి గదిలోకి వెళ్ళబోతూ ఒకరినొకరు తగులుకున్నారు. కుమారి మామూలుగానే నవ్వినా గిరికి మాత్రం ఒంట్లో ఏదో రాజుకుంది, ఇంకేదో కాదు భయం. అమ్మ చెప్పిన బెల్టు గుర్తుకు వచ్చి సారీ చెప్పాడు. కుమారి వెళ్లిపోయిన తరువాత ఒక్కడే కూర్చుని కుమారిని తలుచుకున్నాడు. తన చిలిపి మాటలు, నచ్చనప్పుడు పెట్టే బుంగమూతి, ఏదైనా తప్పు చేసినప్పుడు నాలిక బైట పెట్టడం అన్నీ గిరికి నవ్వు తెప్పిస్తున్నాయి. ఇవన్నీ పక్కన పెడితే కుమారి అందమైన మొహం. చూడముచ్చటగా ఉండే తెల్లని మొహానికి పొడుగాటి నల్లని జుట్టు, పెద్ద కనుగుడ్ల కింద ఎర్రని దొండపండు పెదవులు, గుండ్రని చందమామ మొహానికి జీడీ గింజ లాంటి గడ్డం. పంజాబీ డ్రెస్సులో చున్నీ వేసుకున్నా లాఘవంగా కనిపించే శరీర సౌష్టవం కుమారిది. ఎద ఎత్తులు. వంగినప్పుడు పూరీలా పొంగే పిర్రలు, సన్నాని నడుముకి ఇంకాస్త అందం పెంచుతూ కనపడీ కనపడని పొత్తి కడుపు. ఎవరైనా తనకి ఫన్నీగా అనిపిస్తే వాళ్ళని మిమిక్రి చేసి వెక్కిరిస్తుంది. చాలా అల్లరిది. చాలా మంచిది. లేచి కొట్టు కట్టేస్తున్నాడు.
తెల్లారితే ఆదివారం రేపంతా కొట్లోనే ఉంటది కుమారి. ఇంకెవ్వరు ఉండరు. ఏమైనా ట్రై చేద్దామా అన్న ఆలోచనలు ఒకవైపు, కాలేజీ చదివే పిల్ల చదువు రాని మొద్దుని ఎందుకు ఇష్టపడతది అని ఇంకోవైపు తొలిచేస్తుంటే షటర్ కిందకి లాగేసి త్వరగా తినేసి ఆలోచనలు raakundaa బలవంతంగా కళ్ళుమూసుకుని నిద్రపోయాడు.
ప్రతీ వారం లానే ఫస్టు బస్సుకు పోయి కూరగాయలు తెచ్చుకుని ఒక్కడే పని మొత్తం కానించి బైట కూర్చుంటే కాసిన్ని పాల ప్యాకెట్లు, కొన్ని కూరగాయలు అమ్ముడు పోయాయి. ఎదురు బడ్డీ కొట్టు వాడికి సైగ చేస్తే టీ తెచ్చిచ్చాడు. టీ తాగుతుంటే రానే వచ్చింది కుమారి. టీ తాగుతావా అని అడిగితే వద్దంది. చున్నీ కట్టుకుని చీపిరి తీసుకుని ఊడుస్తుంటే గిరి చూసి చూడనట్టు చూస్తున్నాడు. అమ్మ చెప్పింది నిజమే ఇంత అందమైన మొహానికి దుమ్ము తగలడం అస్సలు బాలేదు. భార్యగా చీరలో తల స్నానం చేసి కొప్పు కట్టుకుని ఊడిస్తే ఎలా ఉంటుందో అని ఊహిస్తూ కుమారినే చూస్తుంటే సడన్‌గా గిరి వైపు చూసింది కుమారి. గిరి తడబడ్డాడు, ఏంటీ అని కళ్ళు ఎగరేసింది. గిరి లేచి కొట్టులోకి వెళ్లొచ్చేసరికి కుమారి ఊడ్చేసింది.
కుమారి.. ఇవ్వాళ వద్దులే, ఇంటికెళ్లిపో
యే.. అంది ఎవరీ తింగ్ ఈజ్ ఫైన్ నొ అన్నట్టు
నాకు ఉండాలని లేదు, కాసేపు కూరగాయలు అమ్మేసి కొట్టు కూడా మూసేస్తాను అన్నాడు గిరి.
ఇవ్వాళ బేరం ఎక్కువ ఉంటదిగా, ఆంటీ ఉన్నంతసేపేనా నీ నిజాయితీ అని నవ్వితే గిరి కూడా నవ్వి, ఇవ్వాళ పనులున్నాయి అందుకే అన్నాడు.
కుమారి కూడా ఆలోచించింది. రోజూ స్పెషల్ క్లాస్ అని ఇంటికి లేటుగా వెళ్తుంది. ఇప్పటికి రెండు ఆది వారాలు చదువుకుంటాననే చెప్పింది. మరీ ఇంట్లో ఉండకపోయినా అనుమానం వచ్చేస్తుందని గిరితో సరే అంది. వెళ్ళిపోతూ గిరి వైపు చూసి.. ఇవ్వాళ ఇంట్లో ఎవ్వరు ఉండరు, కొట్టు మూసేసి లవర్‌ని ఏమైనా పిలుచుంటావా అని వెక్కిరింపుగా నవ్వితే గిరి కోపంగా కొట్టడానికి వచ్చేసరికి అక్కడి నుంచి తుర్రుమంది.
ఇంట్లోకి వెళ్తూ బైట పిన్ని కనబడితే చెయ్యి ఊపి లోపలికి వెళ్ళింది. అమ్మ కిచెన్లోనుంచే ఎవరు అంటే నేనే అని సోఫాలో కూర్చుంది.
భవ్య వాళ్ళ ఇంటికి వెళ్తా అన్నావ్ అంటే వాళ్ళు బైటికి వెళ్తున్నారు అని చెప్పింది.
గిరి వాళ్ళ కొట్టు దగ్గర నీకేం పనీ..
వోవ్వ.. తెలిసిపోయిందా అనుకుంది కుమారి. వంటింట్లోకి వెళ్లి అమ్మ పక్కనే నిలబడింది. ఇందాక తమ్ముడు చూశాడంట నువ్వు గిరి వాళ్ళ కొట్టు ముందు ఉండడం.
భవ్యతో పాటు వెళ్లాను అని ఒక రాయి వేసింది.
వాళ్ళ కొట్టుకెళ్లకు, మనకి వాళ్లకి గొడవలు అంది కుమారి అమ్మ.
(అంటే ఇంకా మన సీక్రెట్ సీక్రెట్ గానే ఉంది. గుడ్ అనుకుంది)
ఎందుకు.. ఏమైంది అని అడిగితే పాత గొడవలే అంది కుమారి అమ్మ
చెప్పవే అంది కుమారి
మన కులపోళ్ళ అమ్మాయిని లేవతీసుకుబోయాడని గిరిని పట్టుకుని కొట్టారు, ఆ గొడవలో మీ నాన్న గిరి వాళ్ళ నాన్నని కొట్టాడు. మన ఊళ్ళో అప్పుడే రోడ్లు వేస్తున్నారు, మీ నాన్న నెట్టాడో కొట్టాడో గానీ ఆయన డాంబర్ తొట్టి మీద పడ్డాడు. ఆయన ఒళ్ళంతా కాలిపోయింది. దంబార్ తొట్టి ఆయన మీద పడి కాలుకి ఏదో అయ్యింది. ఆ గొడవ తరువాత కొన్నేళ్లు వాళ్ళు ఈ ఊళ్ళో కనిపించలేదు. పోయిన ఏడాది నుంచే కనిపిస్తున్నారు అని ముగించింది కుమారి అమ్మ.
గిరి వాళ్ళ అమ్మ కోపం కుమారికి ఇప్పుడు అర్ధమైంది. ఎంతసేపు గిరి, సుమ ఆంటీనే కానీ ఎప్పుడు గిరి వాళ్ళ నాన్న గురించి గానీ ఆయన ప్రస్తావన గానీ కొట్లో రాలేదు.
లేపుకుపోతే కొడతారా.. తెలీకుండానే అనేసింది కుమారి
కొట్టరా మరీ.. పైగా మన కులం కూడా కాదు. తక్కువ కులం నా కొడుకులు మన ఇంటి అమ్మాయి మీద చెయ్యేస్తే నరికేస్తారు.
నీకెందుకు అంత కోపం.. అంది కుమారి
నాకేం కోపం లేదు. అయినా ఇవన్నీ ఎందుకు నీకు. బుద్ధిగా చదువుకో, ప్రేమా దోమ అన్నావంటే మీ నాన్న గురించి తెలిసిందిగా.. ఎవరో అమ్మాయికే అంత గోల చేశాడు, ఇక నీ విషయం అయితే చంపేస్తాడు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాసలుకో బైట అని హెచ్చరించింది.
హా.. సరే అని వచ్చేసింది. గదిలో చాలా సేపు ఒంటరిగా కాళ్ళు మడుచుకుని కూర్చుంది కుమారి. ఇందాక అమ్మ చెప్పినవే మళ్ళీ మళ్ళీ అప్పజెప్పినట్టు వినిపిస్తుంటే రేపటి నుంచి పనికి వెళ్లాలా వద్దా అన్న డౌట్ మొదలయింది. కొంచెం భయం కూడా వేసింది.
సుమ ఆంటీ పైకి కోపంగా ఉన్నా చాలా మంచిది. తనకి ముద్దు వచ్చినప్పుడల్లా ముక్కు పట్టుకుని లాగడం, లేకపోతే బుగ్గ గిల్లడం గుర్తొచ్చి నవ్వుకుంది. కొంచెం జాగ్రత్తగా ఉందాంలే అనుకుంది చివరికి.
సాయంత్రం తమ్ముడు నాన్నతో బండి మీద తినడానికి పక్కూరికి వెళుతుంటే కొట్టు తీసే ఉండటం గమనించింది. కొట్టు ముందు హడావిడి ఉంది. బండి మీదే నిలుచుని చూస్తే లోపల గిరి ఒక్కడే పని చేస్తున్నాడు. మరి నాకెందుకు కట్టేస్తా అని చెప్పాడు, లవర్ హ్యాండ్ ఇచ్చిందేమో అని నవ్వుకుని సరిగ్గా కూర్చుంటుంటే బండి ఊగింది. సుబ్బరాజు సరిగ్గా కుర్చో అని విసుక్కుంటే బుంగమూతి పెట్టుకుంది. బుంగమూతి పెట్టినప్పుడల్లా గిరి, సుమ ఆంటీ ఒకరిని చూసి ఒకరు నవ్వుకుంటారు. వాళ్ళు ఇద్దరు నవ్వుకోవాలని మూతిని ఎన్నో వంకర్లు తిప్పడం తలుచుకుని నవ్వుకుంది.
తరువాత రోజు సాయంత్రం సుమ ఆంటీ కొట్లో కనిపించగానే పోయి వాటేసుకుంది. సుమకి కొత్తగా అనిపించినా కుమారి అమాయకత్వం తనకి తెలుసు కాబట్టి నవ్వేసి ఊరుకుంది. పని అయిపోయాక వెళుతూ ఆంటీ రేపు నాకో సాయం కావాలి అంటే ఏంటి అంది సుమ. రేపు కాలేజీకి జీన్స్ వేసుకెళ్తా, ఇక్కడికి వచ్చాక బట్టలు మార్చుకుంటా మళ్ళీ కాలేజీ అయిపోయాక నా బట్టల్లోకి మారిపోతా
సుమ కుమారిని కింద నుంచి పై వరకు చూసి వద్దని తల ఊపితే అబ్బా ప్లీజ్ అంది మెలికలు తిరుగుతూ..
ఆ ఇవన్నీ నా దెగ్గరొద్దు అంది సుమ. మీ నాన్నకి తెలిస్తే ఎంత పెద్ద గొడవ అవుతుందొ తెలుసా అంటే ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ అని మోకాళ్ళ మీద కూర్చునేసరికి కుమారి గడ్డం పట్టుకుని అటు ఇటు తిప్పి ఇబ్బంది పెట్టేస్తున్నావే నన్ను, ఏదో ఒకటి చేసుకోపో అని వెళ్ళిపోయింది.
కుమారి సంతోషంలో ఎస్ ఎస్ ఎస్ అనుకోవడం విని నవ్వుకుంది సుమ.

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)