Thread Rating:
  • 21 Vote(s) - 3.05 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance బెంగళూరులో మొదలైన ప్రేమ
కృష్ణను చూడగానే పుష్ప కూడా ఒక్కసారిగా షాక్‌కు గురైంది. ఏం మాట్లాడాలో అర్థం కాక కృష్ణ వైపు అలానే చూస్తూ ఉండిపోయింది.

పుష్ప అలా నిలబడిపోవడం గమనించిన కృష్ణ ముందుగా తేరుకుని మాట్లాడాడు.

“ఏంటి పుష్పా… నువ్వేంటి ఇక్కడ? ఇంత పొద్దున్నే?”

అంటూ ఆమె ముఖం వైపు చూసి,

“అయినా… ఏదైనా ప్రాబ్లమా? పొద్దున్నే ఏడుస్తూ ఎవరితోనో మాట్లాడుతున్నావ్. అసలు ఏం జరిగింది?” అని అడిగాడు.

కానీ పుష్ప మాత్రం సమాధానం చెప్పలేదు.

ఏం జరిగిందో కృష్ణకు చెప్పాలా? వద్దా? చెప్పినా కృష్ణ తన సమస్యకు హెల్ప్ చేస్తాడా? లేక తన పరిస్థితిని అడ్వాంటేజ్‌గా తీసుకుంటాడా? అసలు ఇలాంటి విషయం కృష్ణకు ఎలా చెప్పాలి?

ఇలా ఎన్నో ఆలోచనలు ఆమె మనసులో తిరుగుతున్నాయి.

“పుష్పా…”

కృష్ణ మరోసారి పిలిచాడు.

ఆ పిలుపుతో ఆలోచనల్లో నుంచి బయటకు వచ్చిన పుష్ప అతని వైపు చూసింది.

“ఆది… కృష్ణా… అది…” అంటూ మాటలు తడబడసాగింది.

ఆమె పరిస్థితిని చూసిన కృష్ణ ఇక ఎక్కువగా అడగకూడదని అనుకున్నాడు.

“సరే లే… ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం.”

అని నవ్వుతూ,

“మనం ఇప్పుడు మంచి ఫ్రెండ్స్ కదా! అందుకే నీకు మంచి రాయలసీమ రుచి చూపిస్తా. బయటకు వెళ్దాం… ఎగ్ దోస తిందాం. మా హాస్టల్‌లో ఈరోజు ఉప్మా అంట. ఆ ఉప్మా తినే కంటే ఎగ్ దోస బెస్ట్!” అన్నాడు.

కృష్ణ మాటలను కాదనలేక పుష్ప కూడా చిన్నగా నవ్వింది.

“సరే… పది నిమిషాలు. రెడీ అయ్యి వస్తా.”

అని చెప్పి వెంటనే హాస్టల్ వైపు వెళ్లిపోయింది.

పుష్ప వెళ్లిపోతున్న వైపు చూస్తూ కృష్ణ అక్కడే నిలబడిపోయాడు.

“అసలు పుష్పకు ఏం జరిగింది? ఎందుకు ఇలా ఏడుస్తూ ఎవరినో బ్రతిమాలుతోంది? నన్ను చూసిన తర్వాత కూడా ఏదో చెప్పాలని అనుకుని ఆగిపోయింది. ఏదో పెద్ద సమస్యలో ఉన్నట్టుంది…”

ఎలాగైనా అసలు విషయం తెలుసుకోవాలని కృష్ణ మనసులో నిర్ణయించుకున్నాడు.

“ఏం జరిగిందో పుష్ప నోటి నుంచే తెలుసుకోవాలి…”

అని అనుకుంటూ, పుష్ప తిరిగి వచ్చే వరకు అక్కడే ఆమె కోసం ఎదురుచూస్తూ నిలబడ్డాడు.
Like Reply


Messages In This Thread
RE: బెంగళూరులో మొదలైన ప్రేమ - by Train222 - 27-08-2026, 02:04 PM



Users browsing this thread: 1 Guest(s)