Thread Rating:
  • 154 Vote(s) - 2.95 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
తన పేరు వసుంధర...
(16-08-2026, 06:27 AM)sakhee21 Wrote: అందరూ నన్ను క్షమించండి..
లైఫ్ లో అనుకోని సంఘటనల వల్ల నాకు తెలీకుండానే చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను...
ఎంత మర్చిపోదాం అనుకున్నా కూడా రాత్రి కన్ను మూతకీ నిద్ర పోడానికి మధ్యలో క్షోభ...
ఏడుపూ రావట్లేదు నిద్రా పట్టట్లేదు..
మెదడు లోపల నరాల్ని ఎవడో మెలిపెట్టినట్టు అనిపిస్తుంది..
అసలు మెదడుంటే ఇలాంటి పరిస్థితిలో చేరేవాణ్ణా అనిపిస్తుంది..
కంటి చివర్లో చిన్న నీటి తేమ తప్ప లోపల ఏడుపెంతుందో బయటికి రావట్లేదు..
అందరికీ చెప్పుకునేంత పెద్ద కష్టం కాదు అనిపిస్తుంది..
అలా అని చెప్పకపోతే గుండె బరువెక్కి ఊపిరి కూడా ఆడనట్టుగా ఉంది..
రోజంతా బానే ఉంటుంది కానీ గుర్తుకొచ్చిన ఒక్క క్షణం రోజు మొత్తాన్ని చంపేస్తోంది..
ముక్కుతో గుండెల నిండా ఊపిరి తీసుకుని తెలీకుండానే కళ్ళు మూసి నోటితో ఎన్ని సార్లు వదిలానో,,
అలా మూసిన మరుక్షణం ఆ కళ్లలో ఏం మెదులుతోందో,,
కళ్ళు తెరిచాక వాటిలో తేమ ఎందుకు నిండుతోందో,,
ఇది ఏ రకమైన మనస్థాపమో..
చెప్పుకుంటే ఎవరికి చెప్పుకోవాలి,ఎవరికి చెప్పుకుంటే ఎలా తీరుద్ధి..
ఇవేమీ తెలీకుండానే రోజులు గడిచిపోతున్నాయ్..
అందుకే అప్డేట్ రాయలేక పోతున్నా..
త్వరలోనే తేరుకుంటా..,రాస్తా
ఇప్పటిదాకా ఎదురు చూసిన వారందరికీ పేరు పేరునా థాంక్స్..
నన్ను క్షమించండి లేట్ చేస్తున్నందుకు..



సఖీ గారు,
మీరు ఎవరికీ క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదు. మీ మనసు బాధలో ఉన్నప్పుడు, అప్‌డేట్స్ గురించి ఆందోళన పడాల్సిన పనిలేదు. మీ మానసిక ప్రశాంతతే అన్నింటికంటే ముఖ్యం.

మీకు ఎప్పుడైనా మాట్లాడాలనిపిస్తే లేదా ఏదైనా సహాయం కావాలని అనిపిస్తే, నేను సిద్ధంగా ఉన్నాను. మీరు ఒంటరిగా లేరు.

మీ సమయం మీరు తీసుకోండి. జాగ్రత్తగా చూసుకోగలరు. ?

venkujkc1984
thanks
Venkatesh
మీ స్పందన నాకు ప్రేరణ! కథపై మీ అభిప్రాయాన్ని పంచుకోండి...

[+] 2 users Like venkujkc1984's post
Like Reply


Messages In This Thread
RE: తన పేరు వసుంధర... - by venkujkc1984 - 25-08-2026, 11:05 PM
RE: జాను (Jannu - by utkrusta - 07-01-2026, 03:21 PM



Users browsing this thread: 2 Guest(s)