22-08-2026, 11:13 AM
"కేశవ్ బాబాయి నీకు దగ్గర్లోనే ఉన్నాడు..డోంట్
వర్రీ చిన్నా!"
"హమ్మయ్య!అనుకొంది
సింధు.
ఇక పైన నలుగురు
కుర్రవాళ్ళు సింధు రూము తలుపు వేసుకోగానే
తలుపులు బాదటం మొదలుపెట్టారు. వాళ్ళల్లో ఒకడు స్థానిక ఎమ్. ఎల్. ఎ. కొడుకు.
అతని పేరు వినీత్.
అతడి చెంప మీదే గట్టిగా కొట్టింది సింధు.
"వదిలెయ్యరా!తలుపు గట్టిగా
వేసుకుంది."అన్నారు మిగిలిన వాళ్ళు.
"ఊహు!ఎంత గట్టిగా కొట్టింది. ఈ రోజు దాన్ని వదిలిపెట్టకూడదు!"అం
టూ మేనేజర్ దగ్గరికి వచ్చాడు.
"ఒక అమ్మాయి మా ఫ్రెండ్ లోపల తలుపు వేసుకొంది. బాగా తాగి వుంది. స్పృహలో వుందో లేదో!తలుపు తీస్తే
రావటం లేదు. అర్జంట్!.."
మేనేజర్ గబుక్కున ఇద్దరు సర్వెంట్స్ ని తీసికొచ్చాడు
'బాగా తాగి ఉన్న పిల్లలకు ఒళ్ళు పై
తెలీదు.ఏదో ఒక గడబిడ చేస్తారు' అని
గొణుక్కుంటూ తలుపులు తీయటానికి ప్రయత్నం చేస్తున్నారు సర్వెంట్స్.
అందరూ కలిసి తలుపును గట్టిగా కొడితే పైన గడియ ఊడి వచ్చింది. కానీ తలుపు తెరుచుకోలేదు. తలుపుకేదో అడ్డం ఉంది అనుకుంటూ అందరూ కలిసి బలంగా నెట్టారు. అడ్డుగా పెట్టిన బల్ల కొద్దిగా కదిలింది. ఇంకా బలంగా నెట్టారు. బల్లకు, తలుపుకు మధ్య గ్యాప్ వచ్చింది. మొత్తానికి తలుపు తెరుచుకుంది. లోపలికి వెళ్లిన సర్వెంట్స్ బల్లను తొలిగించారు. లోపల అమ్మాయి లేదు.మేనేజరకు అర్థం కాలేదు. అయోమయంగా చూస్తున్నాడు.
'ఎటు పోయిందో!'అనుకుంటూ బాత్ రూంలో చూసాడు వినీత్. బాత్రూంలో కుర్చీ చూడగానే సింధు కిటికీలోంచి పారిపోయిందని అర్థం అయ్యింది.
"షిట్!"అంటూ పిడికిలి బిగించి బయటకు పరిగెత్తాడు.అతడిని అనుసరించారు మిత్రగణం.
పార్కింగ్ ప్లేసులో చూసారు. ఎవ్వరూ కనిపించలేదు. గేట్ దగ్గరికి వచ్చారు.
"ఇప్పుడే ఎల్లో కలర్ పంజాబీ డ్రెస్సు వేసుకున్న అమ్మాయి బయటికి వెళ్లిందా?"అంటూ వాచ్ మాన్ ని అడిగాడు వినీత్.
"లేదు!లేదు!ఏమైంది?"అడిగాడు వాచ్ మాన్.
"మా ఫ్రెండ్ వెళ్లిందేమోనని "
"ఎవ్వరూ వెళ్ళలేదు "అన్నాడు వాచ్ మాన్. ఆ టైంకి అందరూ వచ్చేవాళ్ళే కానీ వెళ్ళే
వాళ్ళు ఉండరు. ఏ అర్థరాత్రికో, అపరాత్రికో ఇళ్లకు వెళ్తూ ఉంటారు.
"ఇక్కడే ఎక్కడో ఉంటుంది వెదుకుదాం!పదండి!"
అంటూ బిల్డింగ్ వెనక్కు వెళ్ళాడు వినీత్.
బిల్డింగ్ చుట్టూ వెదికినా వాళ్లకు సింధు జాడ తెలియలేదు.
సింధు ఉన్న చెట్ల గుబుర్లకు కొద్ది దూరంలో నిలబడ్డ ఆ నలుగురిని చూస్తే భయం వేసింది సింధుకు. ఊపిరి బిగబట్టి కూర్చుంది సింధు.
"ఎప్పుడో వెళ్ళిపోయింటుందిరా!టైం వెస్ట్. లోపలికి వెళదాం పద!అన్నాడు వినీత్ ఫ్రెండ్.
"చూద్దాం!"అంటూ గుబుర్ల వంక చూసాడు వినీత్. అతడి దృష్టికి చెట్ల గుబుర్ల మధ్య ఏదో ఉన్నట్లు అనిపించింది. సెల్ ఫోన్ లైట్ వేసాడు. అతడితోపాటు ఫ్రెండ్స్ కూడా ఫ్లాష్ లైట్స్ వేశారు.
ఎల్లో కలర్ డ్రెస్ కనిపించింది.
గుబుర్ల వెనకాల సింధు.
"ఇప్పుడు ఎక్కడికి పోతావ్?"అంటూ చెయ్యి పట్టి ఇవతలికి లాగాడు వినీత్. వణికిపోతూ గింజుకోసాగింది సింధు. నలుగురు కుర్రవాళ్ళు సింధుని ఒడిసి పట్టుకున్నారు.
అంతలో
"ఆ అమ్మాయిని వదిలెయ్యండి!"లేకపొతే కాల్చి పారేస్తాను!"
గంభీరమైన కంఠం వినబడింది.
వెనక్కు తిరిగారు ఆ నలుగురు.
ఇన్ స్పెక్టర్ రఘురామ్ రౌద్రంగా ఫిస్టల్ తో నిలబడి ఉన్నాడు.
అప్రయత్నంగా సింధుని వదిలివేశారు వినీత్ వాళ్ళు.వెంటనే నలుగురు కానిస్టేబుల్స్ వచ్చి వాళ్ళను పట్టుకొన్నారు. తేరుకున్న సింధు ఇన్ స్పెక్టర్ దగ్గరికి వచ్చింది.
ఇంతలో
"సింధూ!"అంటూ కేశవ్ గొంతు వినిపించింది.
"బాబాయ్!"అంటూ కేశవ్ చెయ్యి పట్టుకొంది. సింధూ భుజం చుట్టూ చెయ్యి వేసాడు కేశవ్.
"కార్లో కూర్చుందాం!రా!నాన్న వాళ్ళు దగ్గరే ఉన్నారు."అంటూ కార్ దగ్గరికి సింధుని నడిపించాడు కేశవ్.
"మీరు అమ్మాయిని తీసికొని వెళ్ళండి!మేము వీళ్ళ విషయం చూసుకొంటాము."అన్నాడు ఇన్ స్పెక్టర్ రఘురామ్.
కారులో కూర్చుని వాటర్ బాటిల్ లో నీళ్లు తాగింది సింధు.కొద్దిగా ప్రాణం కుదుటపడింది.
కాసేపటికి సుధాకర్, పద్మజ, రావి వచ్చారు. అమ్మా, నాన్నలను చూడగానే భోరుమంది సింధు.
సింధుని గుండెలకు
హత్తుకున్నాడు సుధాకర్.
"అన్నయ్యా!మీరు ఇంటికెళ్లండి!నేను ఇక్కడే ఉండి ఇన్ స్పెక్టర్ తో మాట్లాడి వస్తాను."అన్నాడు కేశవ్.
కారు స్టార్ట్ చేసాడు సుధాకర్.
కారు కిటికీలోంచి చల్లని పిల్ల తెమ్మర భయం లేదన్నట్లు సింధు మేనును తాకింది.
కారు సిటీ వైపు పరుగెత్తింది.
** ** ** ** ** ** ** ** **
రెండో రోజు పొద్దున ఆలస్యంగా నిద్రలేచింది సింధు.
"నిన్న పబ్ గురించి పేపర్లో వచ్చింది చూడు!"
తండ్రి చేతిలో పేపర్ తీసి చూసింది.
"నగర శివార్లలో పబ్ పైన సెక్యూరిటీ ఆఫీసర్ల దాడి. భారీగా మాదకద్రవ్యాల పట్టివేత. అందరూ ఉన్నత వర్గాలకు చెందిన విద్యార్థినీ, విద్యార్థులు.వారిలో స్థానికి ఎమ్. ఎల్. ఎ. కుమారుడు కూడా ఉండటం విశేషం. ఈ పబ్ లో అమ్మాయిల సంఖ్య కూడా ఎక్కువే ఉంది. అందరినీ అదుపులోకి తీసికొని విచారిస్తున్న సెక్యూరిటీ ఆఫీసర్లు."
నిన్నటి సంఘటన తాలూకు భయం మనసును కుదిపేస్తుంటే తండ్రి ఒడిలో తలపెట్టుకొని కూర్చుంది సింధు. '
సింధు కోలుకోవటానికి కొంత సమయం పడుతుంది' అనుకుంటూ మెల్లగా కూతురు తల నిమురుతూ ఉన్నాడు సుధాకర్.
** ** ** ** ** ** ** ** ** ** ** **

ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
మా తెలుగు తల్లికి మల్లె పూదండ

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)