Thread Rating:
  • 4 Vote(s) - 3.25 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller థ్రిల్లర్ & సస్పెన్స్ కథలు - తోడేలు
#94
నదియా, సుజిత ఎవరో కుర్రవాళ్ళతో డాన్స్ చేస్తున్నారు.

రాగ హుక్కా లాంటిది పీలుస్తూ వుంది.
అనుష్క మళ్ళీ డ్రింక్ తెచ్చుకోవటానికి వెళ్ళింది.
అలాగే ఒక మూల నిల్చుంది సింధు.టైమ్ ఎంత అయిందో తెలియలేదు.
 
"అర్యూ న్యూ కమ్మర్?"అంటూ వినిపించింది.
 
వెనకాలే ఒక కుర్రవాడు.
 
సింధు జవాబు చెప్పలేదు.
 
"కమాన్!లెటస్ డాన్స్!"అంటూ సింధు చెయ్యి పట్టుకున్నాడు.
 
"నో!నో!"
అంటూ చెయ్యి విదిలించుకొంది సింధు.
 
అతడు బిగ్గరగా నవ్వేసి ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ ని చేత్తో రమ్మని పిలిచాడు.
 
"సీ!న్యూ కమ్మర్!"అంటూ సింధూని చూపించాడు.
 
"హాయ్!బేబీ!మొదటిసారా!నీకు నేను డాన్స్ నేర్పించనా?"అంటూ చనువుగా సింధు నడుము పట్టుకొని గిర్రున తిప్పాడొక కుర్రవాడు . ఘాటైన వాసన. కంపరంతో వదిలించుకోబోయింది. అతడి పట్టు గట్టిగా ఉండటంతో సాధ్యం కాలేదు. వెంటనే చాచి అతడి చెంప మీద గట్టిగా కొట్టింది. ఒక్కసారి చెంప పట్టుకొని సింధూని వదిలేసాడతడు.
అక్కడి నుండి పరుగెత్తింది.
 
"ఎక్కడికి పోతావ్?"
అంటూ వెంటపడ్డాడు ఆ కుర్రవాడు.
 
డాన్స్ చేస్తున్న వాళ్ళ మధ్య తప్పించుకుంటూ ఎటు వెళ్ళాలో అర్థంకాక ఆ హాలు దాటింది సింధు.
నలుగురు కుర్రవాళ్ళు ఆమె వెనకాల వస్తున్నారు. అసలే తాగి ఉన్న వాళ్ళల్లో విచక్షణాజ్ఞానం లోపించింది. ప్రతీకార వాంఛతో, కోపంగా సింధు వెనకాలే పరుగెత్తుకొని వస్తున్నారు.
 
గబుక్కున మరో హాలులోకి పరిగెత్తింది.
అక్కడ ఐదారు రూముల్లాగా కనిపించాయి. వెనకాల నలుగురు కుర్రవాళ్ళు.
తలుపు తెరిచి ఉన్న రూములోకి పరిగెత్తింది.
ఆ నలుగురూ తలుపు దగ్గరికి వచ్చే లోపల తలుపు మూసింది.
లోపల చీకటి......
 
ఆ నలుగురు కుర్రవాళ్ళు బైట తలుపు మీద దబదబ బాదుతున్నారు.
సింధు లోపల తలుపు పైన తడిమింది. చిన్న గడియ తగిలింది. పైన గడియ పెట్టి గోడ దగ్గర స్విచ్ బోర్డు కోసం ఫోన్ లైట్ తో వెతికింది. గోడ పక్కన స్విచ్ బోర్డు వుంది. అన్ని స్విచ్చులూ వేసింది. లైట్ వెలిగింది.ఫ్యాన్ కూడా తిరుగుతోంది.అదొక బెడ్ రూమ్. బెడ్స్, అటాచ్డ్ బాత్ రూమ్ ఉన్నాయి. రూములో చిన్న టేబుల్, రెండు కుర్చీలు ఉన్నాయి.
బైట తలుపులు బాదటం ఆపేశారు.
టైం చూసింది. తొమ్మిది పది.
 
'ఆ నలుగురు కుర్రవాళ్ళు తలుపులు బద్దలు కొడతారేమో!ఏమవుతుందో?'అనుకుంటూ తండ్రికి ఫోన్ చేసింది.
 
"భోజనం చేసావా?" తండ్రి గొంతు వినిపించగానే "నాన్నా!..."అంది ఒక్కసారి.
 
కూతురి కంఠంలో వణుకు విని "ఏమిటి తల్లీ!"అన్నాడు సుధాకర్.
 
"నాన్నా!ఐ యామ్ ఇన్ డేంజర్!"అంటూ మొత్తం గబగబా చెప్పింది.
 
"నాన్నా!వాళ్ళు తలుపు బయట ఉన్నారు... ఎలాగా? భయంగా వుంది.."
 
"
నువ్వేమీ కంగారు పడకు!కూల్ గా ఉండు!ఏ లొకేషనులో ఉన్నావో ఫోనులో చెక్ చేస్తాను. నేను, అమ్మా బయలుదేరుతున్నాము. అక్కడకు దగ్గర్లో ఉన్న సెక్యూరిటీ ఆఫీసర్ స్టేషన్ కు ఫోన్ చేస్తాను. నా కంటే ముందు వాళ్ళే వస్తారు. భయపడకు!తలుపుకు మంచం కానీ, టేబుల్ కానీ అడ్డం పెట్టు!"
 
తండ్రితో మాట్లాడాక సింధుకు ధైర్యం వచ్చింది.
 
బెడ్ ని కదపటానికి ప్రయత్నించింది. శక్తినంతా ఉపయోగించింది. ఊహు!మంచం కదలటం లేదు. టేబుల్ జరిపింది. అది కొంచెం కదులుతోంది. టేబుల్ని జరుపుకుంటూ తెచ్చి తలుపుకు అడ్డం పెట్టింది.
 
బయట మళ్ళీ తలుపు చప్పుడయ్యింది.భయం వేసింది సింధుకు. కిటికీలోంచి బయటకు చూసింది. కార్ పార్కింగ్ ఏరియా కనిపించింది. కిటికీలోంచి దూకటానికి లేదు. కిటికీకి కమ్మీలు ఉన్నాయి. కార్ పార్కింగ్ లోకి వెళ్తే బిల్డింగ్ బయటికి వెళ్ళవచ్చు. ఎలాగా?...
 
బాత్ రూములోకి వెళ్ళింది. చిన్న బాత్ రూము అది. ఒక వాష్ బేసిన్, కమౌట్ ఉన్నాయి. కమౌట్ పైన గ్లాస్ పలకలతో చిన్న కిటికీ ఉంది. గ్లాస్ పలకల వెనకాల కమ్మీలు లేవు. గ్లాస్ పలకలు మెల్లగా తీసి కింద పెట్టింది. తను పట్టేంత కిటికీ అది కానీ కొంచెం ఎత్తులో ఉంది...
ఎక్కటం ఎలాగా?...
రూములోనించి కుర్చీ తీసికొని వచ్చింది. కమౌట్ మీద పెట్టింది. ఫర్వాలేదు. ఎక్కితే బయటికి దూకొచ్చు..
ఈ లోపల ఫోన్ మోగింది.
తండ్రి కాల్ చేస్తున్నాడు.
 
"నాన్నా!.."
 
"సెక్యూరిటీ ఆఫీసర్ ఇన్స్పెక్టర్ పేరు రఘురామ్.నీ లొకేషన్ ట్రేస్ చేసారు. ఇరవై నిమిషాల్లో నీ దగ్గరికి వస్తారు. కేశవ్ బాబాయి కూడా వస్తున్నాడు. నీకు దగ్గరలోనే ఉన్నాడు. టెన్షన్ పడొద్దు!వస్తున్నాము!...."
 
"నాన్నా!నేను తప్పించుకోవటానికి ట్రై చేస్తున్నాను. కార్ పార్కింగ్ లోకి వస్తే భయం ఉండదనిపిస్తోంది..."
 
"రూము బయట ఇంకా తలుపులు బాదుతున్నారా?.."
 
"కొంచెం ఆగి ఆగి కొడుతున్నారు. తలుపు పైన గడియ చాలా చిన్నది. గట్టిగా కొడితే ఊడిపోతుంది. తలుపు గడియ ఊడితే టేబుల్ నెట్టటం పెద్ద కష్టం కాదు.."
 
 
ఏం చెప్పాలో తెలియలేదు సుధాకర్ కు. గొంతు పూడుకు పోతోంది.
 
"ధైర్యంగా ఉండు చిన్నా!.."కంఠంలో జీర..
 
" నాన్నా!నేను మళ్ళీ చేస్తాను!"
 
అంటూ ఫోన్ పెట్టేసి కుర్చీ ఎక్కి కిటికీలోకి దూరింది . కానీ ముందు వైపు నుంచి ఎలా దూకుతుంది? ఇలా కాదు.. సెల్ ఫోన్ లైట్ వేసి బయట గోడకు అటువైపు, ఇటువైపు చూస్తే ఎడమ వైపు పివిసి పైప్ కనిపించింది. ఫోన్ బ్యాగ్ లో పెట్టి సగం శరీరం కిటికీలోంచి బయటకు తెచ్చి తన చున్నీని పైపుకు కట్టింది. రెండు చేతులతో చున్నీని బలంగా పట్టుకొంది. అది ఫస్ట్ ఫ్లోర్ అయినా కిటికీ ఎత్తు పది అడుగులు ఉంది. చున్నీని పట్టుకొని కిందకు జంప్ చేసింది.సింధు బరువుకు చున్నీ జర్రున పైపులైను కిందకు జారింది. కింద భూమి కాళ్లకు తగిలింది. ఊపుగా దూకటంతో కింద దబ్బున పడింది. కొద్దిగా చేతుల దగ్గర గీచుకు పోయింది. ఎగుడు దిగుడు రాళ్లు ఉన్నాయి అక్కడ. మోకాళ్ళ దగ్గర రాళ్లు గీచుకున్నాయి. మంట పుడుతోంది.
'ఫర్వాలేదు 'అనుకుంటూ ఫోన్ తీసి ముందు మ్యూట్ లో పెట్టింది.
 
"నేను సేఫ్ గా కిందకు దిగాను "అంటూ తండ్రికి మెసేజ్ పెట్టింది.
 
పార్కింగ్ ప్లేస్ కొంచెం దూరంలో ఉంది. అక్కడ లైట్లు వెలుగుతున్నాయి. బిల్డింగ్ చుట్టూ గుబురుగా మొక్కల పొదలు ఉన్నాయి.
 
పొదల వెనకాల ఒంగి ఒంగి నడుస్తూ వచ్చింది సింధు. బిల్డింగ్ ప్రక్క భాగంలో గుబురుగా ఉన్న పొదల మధ్య ముడుచుకొని కూర్చుంది. అక్కడ లైట్ పడటం లేదు. సెక్యూరిటీ ఆఫీసర్లు వచ్చేదాకా అక్కడే కూర్చుంటే సేఫ్ గా ఉంటుందని సింధు భావన.
 
తండ్రి దగ్గర్నుంచి మెసేజ్ వచ్చింది. "ఇన్ స్పెక్టర్ రఘురామ్ నీ లొకేషనుకు దగ్గర్లో ఉన్నాడు. అతని ఫోన్ నెంబరుకు బిల్డింగ్ కలర్ ఏమిటో పెట్టు!"
 
తండ్రి పంపించిన నెంబరుకు "బిల్డింగ్ కలర్ రిచ్ పింక్. బ్లూ గేట్. నేను కింద పొదల మధ్య దాక్కొని వున్నాను "అని మెసేజ్ పెట్టింది.
 
"ఒకే ఓకే! డోంట్ వర్రీ!"అని రిప్లై వచ్చింది.
 
మళ్ళీ తండ్రి దగ్గర్నుంచి మెసేజ్ వచ్చింది.
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply


Messages In This Thread
RE: థ్రిల్లర్ & సస్పెన్స్ కథలు - 16 నిమిషాలు - by k3vv3 - 22-08-2026, 11:11 AM



Users browsing this thread: 1 Guest(s)