Thread Rating:
  • 4 Vote(s) - 3.25 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller థ్రిల్లర్ & సస్పెన్స్ కథలు - తోడేలు
#93
నైట్ అవుట్ (కథ )

[Image: Picture1.png]
Gayatri Tokachichu
 
 
ఇంజనీరింగ్ ఫస్టియర్ పరీక్షలు అయిపోయాయి. ఈ రోజే ఆఖరి పరీక్ష. రేపటినుండి దాదాపు నెలన్నర సెలవలు. ఆడపిల్లలు, మగపిల్లలు అందరూ గోలగోలగా అరుస్తూ బయట చెట్ల క్రింద సందడి చేస్తున్నారు. అనుష్క, రాగ, సుజిత, సింధు, నదియా ఒకచోట చేరి కబుర్లు చెప్పుకుంటున్నారు.
 
"ఈ సెలవల్లో ఎక్కడికైనా ప్లాన్ చెయ్యాలి. సరదాగా వెళ్ళొద్దాం!"అంది అనుష్క.
 
"అవును. ఏదైనా హిల్ స్టేషనుకు అయితే బాగుంటుంది. "అంది రాగ.
 
హేయ్!గర్ల్స్!మేము మదనపల్లి ప్లాన్ చేస్తున్నాము. వస్తారా?"అంటూ సుదీప్, చైతు వీళ్ళ వైపుకు వచ్చారు.
 
"మేము అరకులోయ అనుకుంటున్నాము. మీరు వస్తారా?" అంది సుజిత.
 
ఎవరెవరు ఎక్కడెక్కడికి వెళ్దామనుకుంటున్నారో తర్జన భర్జనల్లో పడ్డారు స్టూడెంట్స్ అందరూ.
ఫ్రెండ్స్ అందరూ మాట్లాడుకుంటూ ఉంటే సింధు నవ్వుతూ ఉంది కానీ మనసులో ఆలోచిస్తూ ఉంది. స్నేహితులతో టూర్ అంటే ఇంట్లో అమ్మా, నాన్న ఒప్పుకోరు. సేఫ్టీ కాదు అంటూ అమ్మ ఎక్కడికీ పంపించదు.
 
"హేయ్!సింధూ!అందరం అరకులోయ అనుకుంటున్నాము. నువ్వూ వస్తావా?"
సుజిత కేకతో సందిగ్ధంగా మొహం పెట్టింది సింధు.
 
"నాన్నగారిని అడిగి చెప్తాను."మెల్లగా అంది సింధు.
 
"చూడు!తప్పకుండా రావాలి!అందరం వెళ్తున్నాము. సరదాగా ఉంటుంది. నువ్వు మిస్ అవకుండా రావాలి!మీ నాన్నగారితో గట్టిగా చెప్పి వచ్చెయ్యి !"రాగ ఆజ్ఞ జారీచేసింది.
 
"సరే!సరే!"అంటూ స్నేహితుల దగ్గర సెలవు తీసికొని ఇంటికి వచ్చింది సింధు.
 
తల్లితండ్రులతో టూర్ గురించి చెప్పింది సింధు.
 
"కళ్యాణి పెళ్లి కుదిరింది.మనం ఒక పదిరోజుల ముందైనా వెళ్ళకపొతే ఎలా? పెళ్లి నుండి వచ్చాక ఒక వారం మనం తిరుమల వెళ్ళి రావాలి. అటు వెళ్ళినప్పుడు మదనపల్లి చూసొద్దాం!"అంది తల్లి పద్మజ.
 
అత్త కూతురు కళ్యాణి పెళ్లి అనగానే చెల్లెలు రావి గంతులు వేస్తూ ఉంది. దానికి ఎవరింట్లో  అన్నా పెళ్లి అంటే చాలు బోలెడు సరదా.
 
"ముందు మీరు వెళ్ళండి!నేను పెళ్ళికి ముందు రోజు వస్తాను."అన్నాడు తండ్రి సుధాకర్.
 
స్నేహితులతో టూరుకు వెళ్ళలేకపోయినందుకు కొంత నిరుత్సాహం కలిగినా అత్త కూతురు పెళ్లి కాబట్టి" సరే!"అంది సింధు.
 
**     **      **     **     **     **     **     **     **     **     **
 
నెలరోజులు గడిచిపోయాయి. ఒకరోజు రాగ సింధుకు ఫోన్ చేసింది.
 
"మా ఇంట్లో రేపు నైట్ అవుట్ పెట్టుకున్నాము. సుజిత, అనుష్క,నదియా కూడా వస్తున్నారు. అందరం కలుద్దాము. సాయంత్రం వచ్చెయ్యి!నువ్వు మాతోపాటు టూరుకు కూడా రాలేదు. దీనికి మాత్రం రానని చెప్పకు!రేపు సాయంత్రం ఫైవ్ ఓ క్లాక్ నుండి రెండోరోజు మధ్యాహ్నం దాకా మా ఇంట్లోనే. సరదాగా గడుపుదాం!"
 
రాగ చెప్పింది వినగానే ఉత్సాహంగా అనిపించింది సింధుకు.
ఎగురుకుంటూ వెళ్లి తల్లిని పర్మిషన్ అడిగింది.
 
 "నైట్ అవుటే కదా!వెళ్ళిరా! కానీ జాగ్రత్తగా బిహేవ్ చెయ్యి!పంజాబీ డ్రెస్స్ వేసుకో!వేరే వాళ్ళింట్లో నైటీ వేసుకొని తిరిగితే బాగుండదు!"అంది పద్మజ.
 
"అలాగే అమ్మా!"
అంటూ చటుక్కున తల్లిని ముద్దు పెట్టుకొని తండ్రి దగ్గరికి వెళ్ళింది. సుధాకర్ కూడా ఒప్పకున్నాడు.
 
రెండోరోజు సాయంత్రం కారులో సింధుని రాగ వాళ్ళ ఇంటిదగ్గర దించాడు సుధాకర్.
 
"చూడు!బంగారూ!నిద్రపోయేముందు నాకు ఫోన్ చెయ్యి!నీకు గుడ్ నైట్ చెప్పంది నాకు నిద్రరాదు. నీకు తెలుసుగా!" అన్నాడు సుధాకర్.
 
"ఒకే నాన్నా!మర్చిపోకుండా ఫోన్ చేస్తాను!"అంటూ ఛంగున దూకి ఫ్రెండ్ ఇంట్లోకి వెళ్ళింది సింధు.
 
అప్పటికే అనుష్క, సుజిత, నదియా వచ్చి ఉన్నారు. రాగ వాళ్ళ అమ్మగారు అందరికీ బర్గర్లు, పిజ్జాలు పెట్టింది. కబుర్లలో పడ్డారు ఫ్రెండ్స్ అందరూ. మిగిలిన వాళ్ళు వెళ్లిన టూర్ విశేషాలు చెప్తుంటే సింధు అత్త కూతురి పెళ్లి సందడి చెప్పుకొచ్చింది.
 
సాయంత్రం ఏడున్నరకు " కారులో అలా కాసేపు తిరిగొద్దాము!"అంటూ ఫ్రెండ్స్ ని లేవదీసింది రాగ.
 
రాగకు పుట్టినరోజు కానుకగా వాళ్ళ నాన్నగారు కారు కొనిపెట్టారు.
రాగ అప్పుడప్పుడూ తన కారులో సొంతంగా డ్రైవ్ చేసుకుంటూ కాలేజీకి వస్తూ ఉంటుంది.
 
అనుష్క, సుజిత, రాగ బాగా ధనవంతుల బిడ్డలు. సింధు, నదియా మాత్రం మధ్యతరగతికి చెందిన అమ్మాయిలు.
 స్నేహితురాళ్ళ దగ్గర కొంచెం రిజర్వుడుగా ఉంటుంది సింధు. అయితే స్నేహితురాళ్లు ఏమి చెప్పినా వింటుంది కానీ గబుక్కున తొందరగా మాట్లాడటం, ఎక్కువ చనువు తీసికోవటం జరగదు. వాళ్ల స్థాయి ఎక్కువ, తను కొంచెం క్రింద తరగతి అనే స్పృహ ఎప్పుడూ ఆమెలో ఉంటుంది.
నదియా మాత్రం గలగలా మాట్లాడుతూ ఉంటుంది.ఆమెకు ధనవంతులయిన స్నేహితులతో గడపటం ఇష్టంగా ఉంటుంది. వాళ్ళ లాగా వుండాలని ఎప్పుడూ తాపత్రయ పడుతూ ఉంటుంది.
రాగ ఇల్లు పెద్ద బంగళా. దానికి తగ్గట్లు నౌకర్లు,చాకర్లు ఉండనే వుంటారు. ఇంటి నిండా ఖరీదైన ఫర్నిచర్. వాళ్ళ కుక్కపిల్లకు పెట్టే ఖర్చుతో తన ఇంటికి నెలకు సరిపడా సరుకులు కొనుక్కోవచ్చు అనుకుంటుంది సింధు. ఎప్పుడూ సింధు జీన్స్ లాటివి వేసుకోదు. పంజాబీ డ్రెస్సులే ధరిస్తుంది. మధ్యతరగతి తల్లి తండ్రుల పెంపకంలోని క్రమశిక్షణ ఆ అమ్మాయిలో కనిపిస్తూ ఉంటుంది.
రాగ తల్లి తండ్రులు పిల్లల్ని పెద్దగా పట్టించుకోరు. పిల్లలకు స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు ముఖ్యం అనుకుంటారు. అందుకని ఆ టైంలో బయటికి వెళ్తామంటే పెద్దగా అభ్యంతరం పెట్టలేదు.
 
స్నేహితురాళ్ళందరు కలిసి కారులో బయలుదేరారు.
 
అందరూ కారులో అంత్యాక్షరి పాటలు పాడుకుంటూ కేరింతలు కొడుతున్నారు.
అరగంట తర్వాత తలతిప్పి బయటికి చూసింది సింధు. కారు ఎయిర్పోర్ట్ రోడ్డులోకి వెళ్తూ ఉంది.
 
"ఎక్కడికి వెళ్తున్నాం?"
 
సింధూ ప్రశ్నకు రాగ నవ్వింది.
 
"నీకు సర్ప్రైజ్!చూద్దువుగాని!"
 
 పదినిమిషాల్లో ఒక పెద్ద బిల్డింగ్ ముందు కారాపింది రాగ. కారును చూడంగానే గేట్ తీశాడు వాచ్ మాన్. లోపల పార్కింగులో కారు పెట్టింది రాగ. అందరినీ తీసికొని బిల్డింగ్ లోపలికి దారితీసింది. మొదట ఒక హాలులాగా ఉంది.అక్కడ డెస్క్ దగ్గర ఉన్న యువకుడు వీళ్ళ పేర్లు రిజిస్టరులో వ్రాసుకొని అందరి చేతుల మీద స్టాంప్ వేసాడు.
 
'ఇది పబ్ కాదు కదా!'అనుకుంటూ "రాగా!ఇది పబ్ కదా!"అనుమానంగా అడిగింది సింధు.
 
"ప్చ్!నువ్వేమీ కంగారు పడకు!చాలా సరదాగా ఉంటుంది. మేము ఎప్పుడూ వస్తూ ఉంటాము... నదియా కూడా చాలా సార్లు వచ్చింది."
 
"వద్దు!వద్దు!మా నాన్నగారు కోప్పడతారు. వెనక్కు వెళదాం!"
కంగారుగా ఉంది సింధుకు.
 
"ఏం భయం లేదు సింధూ!నేను చాలా సార్లు వచ్చాను. అందరూ సరదాగా వుంటారు.. కాసేపు ఉండి వెళదాం!"అంటూ సింధు చెయ్యి పట్టుకొని లోపలికి లాక్కెళ్ళింది నదియా.
 
లోపల ఎప్పుడూ చూడని వాతావరణం. కోలాహలంగా బాయిస్, గర్ల్స్ గోలగోలగా డాన్స్ చేస్తున్నారు. చాలామంది చేతుల్లో డ్రింక్స్ గ్లాసులు ఉన్నాయి. కొంతమంది పూనకం వచ్చినట్లు వూగుతున్నారు.
 
సింధూకు నీరసం వచ్చింది.
 
"కొద్దిగా టేస్ట్ చెయ్యి!"అంటూ అనుష్క డ్రింక్ గ్లాసు పట్టుకొచ్చింది.
 
"వద్దు!వద్దు!"అంటూ దూరంగా జరిగింది సింధు.
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply


Messages In This Thread
RE: థ్రిల్లర్ & సస్పెన్స్ కథలు - 16 నిమిషాలు - by k3vv3 - 22-08-2026, 11:10 AM



Users browsing this thread: 1 Guest(s)