21-08-2026, 09:07 PM
(This post was last modified: 21-08-2026, 09:08 PM by anaamika. Edited 1 time in total. Edited 1 time in total.)
(21-08-2026, 09:11 AM)Suvamani Wrote: Miru translation ki a tool vadatharu andi
నేను ఒక translation తో మొత్తం కథని AI ని వాడి పోస్ట్ చేస్తున్నట్లు మీరు అనుకుంటున్నారు. మీరు అడిగారు కాబట్టి మీకు వివరంగా చెబుతాను.
నేను వాడేది Gemini AI అయితే అది నేను కేవలం కథ యొక్క రఫ్ కాపీ కోసం మాత్రమే వాడతాను అంటే మొత్తంగా ఆ ఎపిసోడ్ ని అది దానికి నచ్చినట్లు తెలుగులో ఇస్తుంది. ఇది నేను ఎందుకు వాడతానంటే, ప్రతిసారి హిందీ కథని చదువుకోకుండా ఉండడానికి. అయితే నేను హిందీలో కథని ముందుగా చదువుతాను (కాబట్టి మీరు ఏ భాషని translate చెయ్యాలని అనుకుంటున్నారో అది మీకు పూర్తిగా తెలిసి, వచ్చి ఉండాలి. అప్పుడే మీరు తెలుగులోకి మార్చడానికి కుదురుతుంది)
ఇలా రఫ్ కాపీ వచ్చాక నేను మళ్ళీ ఆ కథని తప్పులు లేకుండా మొత్తం తిరిగి తెలుగులో టైపు చేస్తాను. అంటే నేరుగా రాసే కథ కంటే దీనికి మరింత టైం పడుతుంది. మీకు ఆ ఓపిక ఉండాల్సిందే, తప్పదు.
ఇక సెక్స్ సీన్స్ విషయానికి వస్తే, అవి మీరు translate చెయ్యాలని అనుకున్నా చాలా కష్టం. AI కి పరిమితులు వున్నాయి అవి మీకు తెలిసే ఉంటాయి. ఇక్కడే మనం హిందీలో చదివి తెలుసుకున్న విషయాన్ని రాయాల్సివస్తుంది. కాకపొతే మీరు Grok AI ని వాడి కొంతవరకు translate చెయ్యొచ్చు, అయితే అది ఎలా translate చేస్తుందో మీకు ఒక ఉదాహరణని చెబుతాను.
ఆంధ్రా xxxx సోదరులు వాళ్ళ హిందీ ని ఎలా మాట్లాడతారో Grok AI అలా మారుస్తుంది.
"అరేయ్, పందిరి మీది చొప్పకట్టని నికాల్ కె ఎద్దుకి డాలో" లా ఉంటుంది. పూర్తి అర్ధం తెలియాలంటే మీకు హిందీ తెలియాల్సిందే.
మీకు వచ్చిన translation లో మచ్చుకి కొన్ని పదాలు ఇలా ఉంటాయి :
తలుపుకు - మనం వాడేది - తలుపుకి
కళ్ళకు - మనం వాడేది - కళ్ళకి
నిలబడి వున్నాడు/వుంది - మనం వాడేది - నిలబడ్డాడు or నిలబడింది
ఇలాంటివన్నీ మనం టైపు చేసుకోవాల్సిందే, తప్పదు. కొన్నిసార్లు AI ని ఫూల్ ని చేస్తుంటాను కాకపొతే ప్రతిసారి అది కుదరదు.
మీ అనుమానానికి సమాధానం ఇచ్చానని అనుకుంటున్నాను.


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)