14-08-2026, 10:24 AM
"అదిగో మళ్లీ...నాగూ...అనే పిలుస్తున్నారు...హు హు హు.. నిన్న మధ్యాహ్నం భోజనానికి వచ్చి నపుడు మందుబిళ్ళలు తెచ్చి ఇచ్చి మందులు వేసుకో..లేకపోతే మీ అమ్మా నాన్నలు 'రొంపకి మందుబిళ్ళ కూడా ఇప్పించలేని వాడికిచ్చి పెళ్లిచేసాం' అని బాధ పడతారేమో'అనితెచ్చి ఇచ్చారుగా...ముక్కు కారిపోతోందని రెండేసి చప్పున వేసేసుకున్నా.దెబ్బతో హుస్సేన్ సాగర్ లాంటి ముక్కు ఎడారిలో దిగుడుబావి అయిపోయింది...ఇక మీతో నా పెళ్లి అయితే మొదటిసారి తిరుపతి వస్తే తలనీలాలు ఇచ్చేస్తానని మొక్కుకోమంది బామ్మ." అంది గుండు నిమురుకుంటూ... నాగమణి.
చెక్కుతీసేసిన నిండు తర్బూజా పండులా ఏ పక్కనుంచి చూసినా గుండ్రంగా పచ్చని పసిమితో మెరిసిపోతున్న భార్యను చూసి అతికష్టం మీద తమకం ఆపుకున్నాడు గోవిందరావు.
అయినా అతని చూపు ఆమె గుండు మీదపడి జారిపోతున్నప్పుడల్లా "అయ్యో...బంగారంలాంటి జడ.. మళ్లీ ఎన్నాళ్లకు ఎదుగుతుందో...మళ్లీ అంతపొడుగు ముంగురులలో తన ముఖం దాచుకునేదెప్పుడో.."అని వాపోయాడు గోవిందరావు.
******
మందు పవర్ అయిపోవడం తో రైల్లో మళ్లీ నాగమణి బ్రాండ్ ముక్కు కారడం మొదలైంది. లోయర్ బెర్త్ దొరకడం తో గోవిందరావు అదృష్టం పుచ్చింది. నిద్రలోకి జారకముందు వరకు ముక్కు చీది బయటకు విసరబోతే అది గాలికెగిరి ఎవడిమీదో పడితే...వాడు డోర్ లో నిలబడి ఎవరు విసిరారో తెలియక పచ్చి బూతులు తిడుతుంటే కుక్కిన పేనులా నోరు మూసుకుని కూర్చున్నాడు గోవిందరావు.
రాత్రి పది గంటల దాటడంతో అవయవాలన్నీ గాలికి, సమాజానికి సగం వదిలేసి ఫ్రీగా వెల్లకిలా పడుకుని గుర్రు పెట్టసాగింది నాగమణి.
ఆ వేగానికి ఆమె ముక్కుకు వరదలు రావడంతో
చేసేది లేక రెండు తువ్వాళ్ళు తీసుకుని భార్య పక్కన ఇరుక్కుని కూర్చుండి పోయాడు గోవిందరావు.
వరదొచ్చినప్పుడల్లా తుండుతో తుడవడం... కునికిపాట్లు పడటం తో రాత్రంతా కోడి బతుకైపోయింది గోవిందరావు కి.
******
ఇంటికి ఉదయం చేరాక అద్దంలో ముఖం చూసుకుని కెవ్వుమంది నాగమణి.
ఆ దెబ్బతో...పూర్తిగా మెలకువ వచ్చి "ఏమైంది..నా..(గూ...అనబోయి) మణీ..." అని ఒక్క అంగలో ఆమెదగ్గరకు వచ్చాడు గోవిందరావు.
రాత్రంతా తువ్వాలతో గోవిందరావు తుడిచిన తుడుపుకి అప్పుడే కాచి చల్లారిన ఇటుకబట్టీలొంచి
తీసిన పండు ఇటుక ముక్కలా ఎర్రగా వాచిపోయింది ముక్కు.
"ఇదంతా మీ వల్లనే... రోజూ గంపెడు పూలు తెస్తారు.తల్లో పెట్టుకోమంటారు..మీ ముచ్చట్ల న్నీ తీర్చుకున్నాకా...నేను పడుకున్నా పువ్వులు తెల్లవారెంతవరకు వాడకూడదని నీళ్లు చల్లుతూ ఉంటారు.దాంతో నా తల నానిపోయి శోభనం నాటి మూడవరాత్రినుంచి రొంప ప్రారంభమై ముక్కు జీవనదిలా తయారైంది.
మా బామ్మకు చెబితే నిత్యం అలా నీళ్ళల్లో నానితే ఏడాది నిండకుండానే నూరేళ్లూ నిండుతాయే తల్లి.ముందు ఆ తల పట్టుకెళ్లి ఆ ఏడుకొండలవాడికి తలనీలాలు ఇచ్చేసి రండి.నేను నీ తరపున మొక్కేసుకుంటున్నాను. "అని కళ్ల నీళ్లు కుక్కుకుంది.
మీ పూల వ్యాపారం చల్లగుండా...రాత్రి అమ్మగా మిగిలిన పూలన్నీ నాకు తెచ్చిపెట్టి చివరకి నన్ను ఇలా తయారు చేశారు." అంది ముక్కుకు విక్స్ రాసుకుంటూ.
" అయాం వెరీ సారీ మణీ... ఇంకెప్పుడూ అలా చెయ్యను...కానీ నా కిష్టమైన జడ మాత్రం నువ్వెంత తొందరగా పెంచి ఇస్తే నీకు అంత మంచి గిఫ్ట్ ఇస్తాను.ప్లీజ్ మణీ.నా బంగారు మణీ కదూ...నిన్ను ఇంకెప్పుడూ ఇబ్బంది పెట్టను. ఒట్టు." ఆమె చేతిలో చెయ్యి వేసి ఒట్టు వేసాడు గోవిందరావు.
"నేను ఏదడిగినా ఇస్తారా...?" అనుమానంగా అడిగింది నాగమణి.
" నీ గుండు మీద...ఉహు..కాదు..నువ్వు నాకివ్వబోయే నల్లత్రాచు జడమీద ఒట్టు.ఏదడిగినా సంతోషంగా ఇస్తాను.వెంటనే ఇవ్వలేకపోతే జీవితాంతం కష్టపడి నీ కోరిక తీరుస్తాను.సరేనా?" అన్నాడు గోవిందరావు ఆమె ఎం ఎదుగుతుందో అనే ఆత్రుతతో...
"ఏ ఆడదైనా కోరుకునేది మాతృత్వం. ముందు పండంటి బిడ్డనివ్వండి.తర్వాత మీకిష్టమైన నా పొడుగాటి జడ మీకు బహుమతి ఇచ్చేలోగా నాకు మంచి వడ్డాణం చేయించండి చాలు. సరేనా?" మత్తు కళ్ళతో అడిగింది నాగమణి.
తమకం ఆపుకోలేని గోవిందరావు "ఊ.." అంటూ ఆమెను కౌగిట్లోకి తీసుకున్నాడు.
ఇపుడు నాగమణి తొందరగా జడ పెంచడం లోను...గోవిందరావు పగలు వడ్డాణానికి అవసరమైన డబ్బు సంపాదించడంలోను, రాత్రి వేళ పండంటి బిడ్డని కనడానికి శ్రమపడుతున్నారు...!!!
సమాప్తం

ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
మా తెలుగు తల్లికి మల్లె పూదండ

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)