14-08-2026, 10:21 AM
గోవిందరావు - వాలుజడ (హాస్య కధ)
![[Image: Picture3.png]](https://i.ibb.co/xKCxqcNB/Picture3.png)
ఉదయబాబు కొత్తపల్లి
"ఏమండీ...పెద్ద తిరుపతి ఎపుడూ వెళదాం?" అడిగింది నాగమణి భర్త గోవిందరావుని.
"పెళ్లయి మూడు నెలలు అయింది.వచ్చినప్పటినుంచి వ్రతాలే చేస్తున్నావో... నోములే నోస్తున్నావో... ఎపుడూ జీవనదిలా ఆ ముక్కు కారుతూనే ఉంది. తగ్గాకా వెళదాం లే..." అన్నాడు గోవిందరావు వ్యాపారానికి బయల్దేరుతూ...
"పెళ్లి అయిన నెలలోపలే జంటగా వస్తామని మొక్కుకున్నాను.అపుడే మొక్కు గడువు తీరి రెండో నెల గడుస్తోంది...ఈవేసవికాలం ఎలాగూ మీవ్యాపారం మండకోడిగానే సాగుతుంది కదా.ఒక్క రెండు రోజులేనండి. తిరుపతిదేవుడితో వ్యవహారం.మళ్లీ వ్యాపారం సరిగా జరగలేదు.నువ్వొచ్చిన వేళా విశేషం..గాడిద... గుడ్డు...ఆమ్లెట్...అంటూ విసిగిస్తే మాత్రం నేను మా పుట్టింటికి పోతా..." ముక్కు చీదింది నాగమణి.
ఒక్కసారి ఇంటి గోడలన్నీ కలియచూశాడు గోవిందరావు.గోడలన్నీ చీమిడి మరకలే...
మొన్న ఒక స్నేహితుడు వచ్చి "కొత్త డిజైన్ బాగుందిరా... ఎక్కడ సెలెక్ట్ చేశావ్...లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు లేదే.."అని అడిగాడు
వాడినలాగే బయటకు తీసుకువెళ్లి మాటతో పాటు మనిషిని గేటు దాటించేశాడు.
"అబ్బా...అస్తమాను పుట్టిల్లు అనకు. నాకు చిర్రెత్తుకొస్తుంది.మహాలక్ష్మి లా తలనిండా రెండు రకాల పూలెత్తుకుని సాయంత్రం ఇంటికొచ్చేసరికి... నవ్వుతూ ఎదురొస్తావ్...నా అలసట పోగొడతావ్...ఆకలి తీరుస్తావ్.నిన్నొదిలి నేను ఉండలేను నాగూ." గారంగా అన్నాడు గోవిందరావు.
" అదిగో ఆ వెధవ పిలుపే నాకు నచ్చనిది.నాగూ ఏమిటి పాముని పిలిచినట్టు... ముద్దుగా మణీ అనలేరూ.ఇంకోసారి అలా పిలిస్తే మా పుట్టింటికి పోతా..." మళ్లీ ముక్కుచీదింది నాగమణి.
ఈసారి అదెక్కడ పడిందో చూసి ...గాప్ కొంచం కవరైంది...అనుకుని " సరే..వెళ్లి ఆ మొక్కేదో తీర్చుకొచ్చేద్దాం...రెండు రోజులే సుమా..మళ్లీ యాపారం దెబ్బ తింటాది. టిక్కెట్లు రిజర్వేషన్ చేయించి తెస్తాను. ఇంకోసారి పుట్టింటికి పోతా అంటే నాకు కోపం వస్తుంది."గోముగా అన్నాడు గోవిందరావు.
"మీ కోపం ఎలా పోగొట్టాలో నాకు తెలుసుగా..."అని కన్ను కొట్టి నవ్వి, ముక్కు ఒకసారి పక్కకి తుడుచుకుని,
అతని బుగ్గమీద గాఢంగా ముద్దు పెట్టి బుగ్గ చిన్నగా కొరికి లోపలికి పారిపోయింది నాగమణి.
"ఊ... యూ నాటీ..."బుగ్గ తుడుచుకున్న చెయ్యి పాంటు వెనుక పాముకుని నవ్వుతూ స్కూటరెక్కాడు గోవిందరావు.
***
" హాయ్.." ఫేస్బుక్ పోస్ట్స్ పరిశీలిస్తున్న గోవిందరావు తలెత్తి చూసాడు.ఎవరో కొత్తశాల్తీ...
"ఏం కావాలండి..." అడిగాడు
" మీరే..." అంది ఆ శాల్తీ చిలిపిగా...
" పరాయి మగాడితో ఏమిటి మేడం మీ పరాచకాలు?
ఇంతకీ ఎం కావాలి మీకు?" కోపంగా అన్నాడు గోవిందరావు.
"మీరే..మీరే..మీరే..." అంది ఆ శాల్తీ నవ్వుతూ ఇంకా గట్టిగా.
అక్కడున్న అందరూ చూసారు.
చుట్టూ అందరూ తమనే చూస్తున్నారని గమనించి లేని ఓపిక తెచ్చుకుని సహనంతో అన్నాడు గోవిందరావు.
"చూడండమ్మా. మా ఆవిడ లోపలికి వెళ్ళి అరగంట అయింది.వచ్చేవేళ అయింది.ఆవిడ వస్తే అనవసరంగా నా సంసారంలో గోడవలొస్తాయ్..మీకు ఏమైనా వివరం కావాలంటే అడగండి.తెలిస్తే చెబుతాను.లేదా మీదారిన మీరు వెళ్ళండి."
" నాకు మా ఆయన కావాలి. ఇందాక ఇక్కడే కూర్చోబెట్టి వెళ్ళాను.మీరేమైనా చూసారేమోనని." అంతే కూల్ గా అడిగింది ఆ శాల్తీ.
"అమ్మయ్య.బతికించారు.నేను గంటనుంచీ ఇక్కడే ఉన్నాను.వేరే మగపురుగు ఇక్కడెవరూ లేరు..రాలేదు.ఇంతకీ ఆయన ఎలా ఉంటారు?ఏ ఊరునుంచి వచ్చారు?." అడిగాడు గోవిందరావు.
ఆ శాల్తీ గుర్తులు చెప్పింది నడుము మీద ఒక చెయ్యి వేసి నిలబడి.
అన్నీ తనపొలికలే... ఊరు కూడా తమఊరే...తమ ఊళ్ళో తనకు తెలియని వాడెవడబ్బా... తన వ్యాపారానికి ఒక్కసారైనా వచ్చి ఉండాలే...తనను మిస్సయ్యే అవకాశం లేదే.. అని ఆలోచనలో పడ్డాడు గోవిందరావు.
ఒక్కనిముషం కూడా కాలేదు.
ఆ శాల్తీ గోవిందరావు కాలర్ పుచ్చుకుంది.
"ఏంటి...పది నిముషాల్నించి చూస్తున్నాను...అయ్యో..పెళ్ళాం ఇంత రద్దీలో ఏ తోడు లేకుండా కళ్యాణకట్టలోకి వెళ్లి తలనీలాలు ఇచ్చి వచ్చిందే...అన్న జాలైనా ఉందా మీకు...పైగా ప్రభుత్వ ఉద్యోగం ఇంటర్వ్యూ లో పనికిమాలిన ప్రశ్నలు వేసినట్టు నన్ను ఏడిపిస్తారా... ఫేస్బుక్ లో ఎవరితోనో కనెక్షన్ పెట్టుకునే ఉంటారు. పెళ్లయి మూడు నెలలు కాలేదు.అపుడే ఈ నాగూ అంటే మొహం మొత్తేసింది మీకు."అంటూ ఒక్కసారి ఘాట్టిగా ముక్కు చీది విసిరేసరికి అపుడు ఈలోకంలోకి వచ్చాడు గోవిందరావు.
" నాగూ... నువ్వేనా...నువ్వేనా నా నాగూ...నేను అమ్మతోడుగా గుర్తుపట్టలేకపోయాను. నీ ముక్కు కేసి కూడా చూసానే...ఎప్పుడూ జీవనదిలా కారుతూనే ఉండేది...హైద్రాబాద్ మూసీ నదిలా అలా ఎప్పుడు ఎండిపోయిందే... నిన్నపొద్దున్నకూడా ప్రవహిస్తూనే ఉందిగా..అరే నల్ల తారురోడ్డులా వంపులు తిరిగిన నీ వాలు జడ ఏమైంది?." అన్నాడు సంతోషం పట్టలేక.

ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
మా తెలుగు తల్లికి మల్లె పూదండ

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)