11-08-2026, 11:23 AM
2
ఆ రోజు ఆదివారం తరువాత నేను ఉత్తరాలు రాయడం మొదలుపెట్టాను. కొత్త హీరోయిన్స్ అవకాశం కోసం రోజు పేపర్ చదివేదాన్ని. సూన్యం. నేను పంపించే ఉత్తరాలకి జవాబులు. సూన్యం. నా బతుకే సూన్యంగా తోచింది.
ఆరు నెలల తరువాత సీరియల్ నటి భువన దగ్గర నుంచి నాకో ఉత్తరం వచ్చింది. నిజంగా హీరోయిన్ అవ్వాలని ఉందా ఈ అడ్రెసుకి రండి అని ఉంది అందులో
ఎస్. నాకు ఛాన్స్ వచ్చింది. నన్ను చూడకుండా నాతో మాట్లాడకుండా ఎలా నాకు ఛాన్స్ ఇస్తారు అని ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. ఇంట్లో చెప్పేశాను. సంతోషంగా.
నా సంతోషం నిమిషం కూడా నిలవలేదు. అమ్మ లాగి పెట్టి కొట్టింది. నాన్న మందలించాడు. నాకు ఒక్కటి స్పష్టంగా అర్ధమైంది. నా బతుకు వంటిల్లే. నాలుగు రోజులు బాగా ఆలోచించాను. ఈ రెండేళ్లలో నేను అందరితో మాట్లాడగా నాకు తెలిసింది ఒకటి హైదరాబాద్ వెళ్ళాలి, రెండు నేను అందరి దృష్టిని ఆకర్షించాలి. ఇవన్నీ జరగాలంటే నాకు ఒకటే దారి తోచింది. బీరువాలో డబ్బు దొంగతనం చేశాను. ఇదే నా మొదటి దొంగతనం. నేను దిగజరుతున్నానా?
లేదు. ఇది నాన్న డబ్బు. ఆయనేం చేసినా నాకోసమేగా. నేను హీరోయిన్ అయ్యాక దీనికి వంద రెట్లు తిరిగిస్తాను. ఇదంతా నా సంతోషం కోసం. నేను సంతోషంగా ఉంటే వాళ్ళని సంతోషంగా చూసుకుంటాను. అనుమానం రాకుండా డబ్బు తీశాను. బట్టలు సర్దేశాను. ఇప్పుడు రైల్లో కూర్చున్నాను.
రైలు సికింద్రాబాదులో ఆగింది. ఆకలేస్తుంది. అలానే భయంగానూ ఉంది. సీరియల్ నటి భువన అడ్రెస్ ఇచ్చిన ఉత్తరంతో ఆటో మాట్లాడుకుని వెళ్లాను. ఆటో వాడు ఐదు వందలు తీసుకున్నాడు. మా అమ్మ ఈ ఐదు వందలతో కొట్టు నుంచి పది రోజుల సామాను తెస్తుంది. మోసపోయానని తెలుస్తుంది. అడగలేను. గేటు ముందు సెక్యూరిటీ ఉంటుంది అనుకున్నాను. ఎవ్వరు లేరు. మా ఇంట్లో రెండు గదులంత కూడా ఉండదు ఈమె ఇల్లు. అయినా సీరియల్ నటి ఇంతకంటే ఎంత సంపాదిస్తుందిలే అనుకున్నాను. గేటు తీసి తలుపు కొడితే ఆమె నైటీలో బైటికి వచ్చింది. ఈమె నిజంగానే నటించిందా? అసలు ఈమెనా అన్న అనుమానం పుట్టింది.
అన్ని తెగించి వచ్చాక తప్పుతుందా అని నన్ను నేను పరిచయం చేసుకున్నాను. నన్ను వాటేసుకుని వదిలేసి లోపలికి రమ్మంది. కాఫీ తాగుతావా అని అడిగితే అలాగే అన్నాను. ఇప్పుడు ఈమె మీద నమ్మకం వచ్చింది. కాఫీ తాగేసి నా పుట్టు భారతం మొత్తం ఆమెకి చెప్పేశాను.
వాట్ చెప్పకుండా వచ్చేశావా? అని ఆశ్చర్యపోయింది భువన. మీ వాళ్లకి తెలిస్తే ? ఎవరినైనా పట్టుకుని ఇక్కడికి వస్తే నా గతేం కాను? అంది.
ఎవరు రారు. డబ్బు కూడా కొంత తెచ్చుకున్నాను. సాయం చెయ్యమని తెచ్చిన డబ్బు మొత్తం ఆమె చేతిలో పెట్టేశాను. నాకు వేరే దారి తెలీలేదు. వెనక్కి వెళ్ళలేను. ఈమె కాదంటే ముందుకు ఎలా వెళ్లాలో కూడా తెలీదు. డబ్బు ఆమె చేతిలో పెట్టాక ఆమె మౌనంగా ఉండటం నాకు ఆటో వాడిని గుర్తు తెచ్చింది. రైలు ఎక్కినంత వరకు లేని భయం నాకు రైలు ఎక్కాక ఎక్కడ ఉండాలి, ఎలా ఉండాలి, అవకాశాలు ఎలా వస్తాయి, ఎక్కడెక్కడ తిరగాలి అని తెగ గింజుకున్నాను. ఆమె చేతిలో డబ్బు మొత్తం పెట్టడానికి ఇది కూడా ఓ కారణం అయ్యుండచ్చు.
సరే. ఆలోచిద్దాం. ముందు నువ్వు ఫ్రెష్ అయ్యి కాస్త రెస్ట్ తీసుకో. భయపడకు, నేను ఒంటరిగా ఉంటున్నాను అంది. అది నాకు కాస్త ఊరటనిచ్చింది. గది చూపిస్తే ఫ్రెష్ అయ్యి కూర్చున్నాను. అమ్మా నాన్నా తమ్ముడుని బాగా తలుచుకున్నాను. కాసేపటికి భువన వచ్చి నాకు ఎదురు కూర్చుంది.
ఇంటి నుంచి అయితే వచ్చేశాను. ఇప్పుడేం చెయ్యాలి. ఈమెని ఎలా అడగాలి నాకు తెలీదు. మౌనంగా ఆమె వైపు చూశాను.
రేపు ఒకసారి ఆఫీసుకి తీసుకెళతాను. మాట్లాడి చూద్దాం అంది భువన.
భయం కాస్త తగ్గినట్టు అనిపించింది. రాత్రికి నాకు నటన గురించి ఏమి తెలుసు, డాన్స్ వచ్చా లాంటి ప్రశ్నలు వేసి నాతో అవన్నీ చేయించింది. నాకేం రాకపోయినా ధైర్యం తెచ్చుకుని ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉన్నప్పుడు చేసింది చేసి చూపించాను.
బాగుంది కానీ ఇది సరిపోదు అంది భువన. అలాగే, నీ పేరు మీనా కదా ఈ పేరు వద్దు ఇంకేదైనా ఆలోచిద్దాం అంది.
పడుకుంటే నిద్ర రాలేదు. నా స్క్రీన్ నేం గురించి నేను ఎప్పుడో ఆలోచించాను. సౌందర్య అసలు పేరు సౌమ్య సత్యనారాయణ ఆమె అందంగా ఉంటుందని సౌందర్య అని పెట్టారు కానీ నేను ఆమె కంటే అందంగా ఉంటాను అసలు ఆ పేరు నేను పెట్టుకోవాల్సింది. ఇప్పుడు చేసేదేం లేదు గనక ఇంకో అందం తలపించే పేరు రూపవతి. ఇది కొంచెం మోటుగా ఉందని రూప అనుకున్నాను. తెల్లారి అదే చెపితే భువన గారు బాగుందన్నారు. నా బట్టలు చూసి ఆమె మొహం అదోలా పెట్టింది.
నన్ను షాపింగుకి తీసుకెళ్ళింది. టీషర్టులు, జీన్స్, మిడ్డీలు కొనింది. ఇలాంటి బట్టలు నేనెప్పుడు వేసింది లేదు. రెండు చీరలు కొన్నది. తక్కువ ఖరీదు చేసేవి, చాలా పలచగా ఉన్నాయి. లోదుస్తులు కూడా కొన్నది. వాటిల్లో చాలా చిన్నవి కూడా ఉన్నాయి. నాకు భయం పుట్టింది.
భువన గారి ఇంటికి వచ్చాక నాకు మిడ్డీ వేయించింది. పైన టీ షర్ట్ వేయించింది. అది చాలా టైటుగా ఉంది. నాకే ఏదోలా అనిపించింది. నా మొహంలో ఇబ్బంది ఆమెకి తెలిసిందేమో
నీకు టాలెంట్ ఉందా లేదా అని పక్కన పెడితే నీకు అనుభవం లేదు. బ్యాక్గ్రౌండ్ లేదు. ఎందుకు ఇవ్వాలి నీకు అవకాశం? నీ అందమే నీకు అవకాశాలు పుట్టిస్తుంది. నీ మాట తీరుతో నువ్వే అవకాశాలు సంపాదించుకోవాలి అంది భువన.
ఆలోచిస్తే నిజమే
భువన గారితో పాటు షూట్ కి వెళ్లాను. కొంత మంది నన్ను చూస్తునే ఉన్నారు. కెమెరా రోలింగ్ అనడం, డైరెక్టర్ యాక్షన్ అనడం, ఏదో లోకంలో ఉన్నట్టు అనిపించింది. భువన గారు కూడా యాక్టింగ్ చేశారు. నేను చెప్పట్లు కొడితే నన్ను చూసి నవ్వింది.
నాలుగు రోజులు గడిచాయి. ఈ నాలుగు రోజుల్లో భువన గారు చాలా డబ్బు ఖర్చు చేశారు. ఆమెకి సిగరెట్ అలవాటు ఉంది. నన్ను ట్రై చెయ్యమంది. నేను దూరం జరిగాను. ఆమెకి చాలా మంది స్నేహితులు ఉన్నారు. వాళ్ళని నాకు పరిచయం చేసింది. నాకు ఫోన్ కొనింది.
శనివారం
రూపా ఇవ్వాళ చిన్న పార్టీ ఉంది. నువ్వు కూడా జాయిన్ అవ్వు ఇక్కడే చేసుకుందాం అంటే సరే అన్నాను.
సాయంత్రం ఆరు అవుతుండగా ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు వచ్చారు. నన్ను కూడా పలకరించారు. ఊహించింది మందు, ముక్కా
కానీ ఊహించనిది వచ్చిన అమ్మాయిలతో పాటు భువన గారు కూడా తాగడం. పేకాట ఆడుతుంటే నేను వాళ్లకి అందిస్తూ కూర్చున్నాను. అందులో ఒకడు నన్ను పదే పదే చూస్తూనే ఉన్నాడు. కాసేపటి తరువాత మేము ఒక షాట్ ఫిల్మ్ చేస్తున్నాం, అందులో నటిస్తావా అని అడిగాడు. నేను భువన వైపు చూశాను. ఆమె ఓకే చెప్పమని సైగ చేసింది. వాళ్ళు వెళ్ళిపోయాక చెప్పింది భువన. వాళ్లు డెమో షూట్ చేస్తున్నారు. నాకోసమె వాళ్లకి ఈ పార్టీ ఇచ్చానని, ముందు అందులో చెయ్యి తరువాత చూద్దాం అంది. సరే అన్నాను. డబ్బు విషయం పక్కన పెడితే నాకు సాయం చేస్తుంది, అదే చాలు.

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)