11-08-2026, 12:26 AM
1
రాత్రి రెండు దాటింది. ఊరంతా నిశబ్దంగా ప్రశాంతంగా ఉంది. వీధి లైట్లు వచ్చే నెలలో బిగిస్తారని చెప్పాడు సర్పంచ్, అందువల్ల ఇంకా ఊరి చీకటితనం పోలేదు. ఇక రోడ్ల సంగతి దేవుడే ఎరుగు. సుబ్బారావు ఇంటి తలుపులు మెల్లగా తెరుచుకున్నాయి. అమ్మాయి చేతిలో బట్టల బ్యాగుతో బైటికి వచ్చి మెల్లగా తలుపులు దగ్గరికి వేసింది. చందమామ వెలుగులో కాసింత కానొస్తుంది. ఎంత వద్దన్నా రెండు జళ్ళు వేసింది వాళ్ళ అమ్మ. నేనేమైనా చిన్న పిల్లనా అంటే నాకు నువ్వెప్పటికి చిన్న పిల్లవే అంటుంది సుబ్బారావు పెళ్ళాం. ఆకాశంలోకి చూసింది. ఓసారి చుట్టూ చూసి వెళ్లిపోతుంటే పంచలో కట్టేసిన గోరింక అంబా అని అరిచింది. దాని దగ్గరికి వెళ్లి చెవులు నిమురుతూ ముద్దు పెట్టుకుని మళ్ళీ కలుద్దామే అంది ఏడుపు గొంతుతో
కళ్ళు తుడుచుకుని ఇంకోసారి ఇంటి తలుపుల వైపు చూసి చీకట్లో నడవడం మొదలుపెట్టింది. గోరింక మాత్రం అంబా అంబా అని పిలుస్తూనే ఉంది. అమ్మాయి అడుగులు వీధి దాటి ఊరి మధ్యన నుంచి నడుస్తుంది. ఉన్న వాళ్ళ డాబా ఇళ్ళు లేని వాళ్ళ రేకుల ఇళ్ళు అన్నీ ఒకే దగ్గర. ప్రతీ ఇంటి ముందు కళ్ళాపజల్లి ఉండడం వల్ల అడుగులు కూడా మెత్తగా అనిపించే ఊరు. ఇళ్ళు దాటుతుండగా నడిచే మార్గం మారింది. ఈ నేలంతా బంక నేల. పైగా వర్షాలు. అడుగు పడితే కాలు బైటికి వచ్చినా చెప్పులు మాత్రం ఇరుక్కుపోతున్నాయి. అలవాటు కాబట్టి వేగంగా నడుస్తుంది గానే ఇంకొకరైతే జారే అవకాశాలు ఎక్కువ.
చీకట్లో కష్టపడుతూనే నడుస్తున్నాను. సుభాష్ చంద్రబోస్ విగ్రహం దాటుతుంటే ఇక్కడ చిన్నప్పటి నుంచి ఆడుకున్న ఆటలన్నీ గుర్తుకువస్తున్నాయి. ఊరి మధ్యలో ఉన్న రామాలయం చూడగానే ఇక్కడ కట్టే నాటకాలు, గుళ్లో పాడిన దేవుడి పాటలు, వినాయకుడి ముందు వేసిన చిందులు. అన్నీ సంతోషాలే..
సరిగ్గా సంవత్సరం క్రితం పట్టుకుంది నాకీ పిచ్చి. నాన్న టీవీ కొన్నారు. మా ఊరిలో ఉన్న ఎనిమిదవ కలర్ టీవీ అది. అప్పటికే డిగ్రీలో జాయిన్ అయ్యి ఆరు నెలలు అవుతుంది. టీవీలో కనిపిస్తున్న రంగులలో లీనమైపోయాను. దానికితోడు గుంటూరులో నేను చూసిన ఆడియో ఫంక్షన్. అక్కడ నేను చూసిన హీరోయిన్ సౌందర్య. ఆమె మీద జనాలు పెంచుకున్న అభిమానం. ఆమెని కాపాడటానికి చుట్టూ మనుషులు. మా నాన్న కూడా చిన్న పిల్లాడిలా అరుస్తుంటే నవ్వొచ్చింది. ఆమె కళ్ళ జోడు. ముఖానికి ఆమె వేసుకున్న మేకప్. వెనక ఆమె ఫోను, హ్యాండ్ బ్యాగ్ పట్టుకున్న మనిషి. ఆమె నడక లోని ఠీవి. గర్వం. రాజసం. అవన్నీ నాకూ కావాలని అనిపించింది. ఆ రోజుని నేను ఎన్నటికీ మర్చిపోలేను. నెమ్మదిగా సౌందర్య అవ్వాలన్న కోరిక పుట్టింది. ఆమె సినిమాలతో పాటు మిగతా హీరోయిన్లని కూడా చూస్తూ వాళ్ళలా నటించడం మొదలుపెట్టాను. ఒకానొక సమయంలో నేనే హీరోయిన్ అయ్యి ఉంటే సౌందర్య, మీనా, రోజా, రమ్య కృష్ణా, లైలా వీళ్లందరినీ తొక్కేసేదాన్నేమో అన్నంతగా ఎక్కింది పిచ్చి.
2002.. ఈ ఒక్క సంవత్సరంలోనే ఐదు సినిమాలు చేసింది సౌందర్య. మూడు తెలుగు, ఒక మలయాళం, ఒక తమిళ్ సినిమా. పీక్ కెరీర్. అదే స్థానంలో నేనుంటే ?
పేరు ప్రతిష్టలు. సౌందర్య కంటే నేనే అందంగా ఉంటాను. అది ఆమెకి చెప్పాలి. నేను హీరోయిన్ అవుతాను. అందరిలా మేడం మేడం అని కాదు. సాటి హీరోయిన్‌గా ఆమెని కలవాలి. కలిసి నేను తన అభిమాని అని చెప్పాలి. దానితో పాటు నీకు ఉన్న కాంపిటీషన్ నేనే అని ఆమెకి చెప్పాలి. ఇదొక్కటే ఉంది బుర్రలో. బలమైన నిర్ణయం తీసుకున్నాను. ఇంట్లో చెపితే అమ్మ నవ్వింది. నాన్న వీపు మీద ఓ దెబ్బ వేశాడు. అది చూసి తమ్ముడు నవ్వాడు. ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటే నవ్వుతారేంటి. అయినా ఎవరు నవ్వితే నాకేంటి.. మాట్లాడటం మొదలు పెట్టాను. కనిపించిన ప్రతీ మనిషిని అడిగాను.
హీరోయిన్ ఎలా అవ్వాలి?
ముందు అందరూ నవ్వేవాళ్ళు. తరువాత ఆ ఆలోచనలు మానుకొమ్మని సలహా ఇచ్చారు. ఇప్పుడు అందరూ కోప్పడుతున్నారు. తన్నులు కూడా తిన్నాను. పిచ్చి పెరిగిందే కానీ తగ్గలేదు.
డిగ్రీలో చేరాక నాకో దారి దొరికింది. ఓ రోజు ఆదివారం పుస్తకంలో ప్రముఖ సీరియల్ హీరోయిన్ భువన ఇంటర్వ్యూలో తనని మీరేమైనా ప్రశ్నలు అడగాలని అనుకుంటే మీ ప్రశ్నలు రాసి కింద ఉన్న అడ్రెసుకు పోస్టు పంపగలరు అని ఉండటం చూసి సరే అని నా పిచ్చి ప్రశ్నని పంపించాను. వచ్చే ఆదివారం కోసం నేను చూసిన ఎదురు చూపులు అంతా ఇంతా కాదు. నా ఆత్రానికి తగ్గ ఫలితం దక్కింది. నేను అడిగిన ప్రశ్న కింద నా ఊరి పేరు రాయిబండ, మీనా అని నా పేరు కూడా వేశారు. ఆమె సమాధానం నాకు నచ్చకపోయినా నా ప్రశ్న నా పేరు చూడగానే నేను పడ్డ ఆనందం అంతా ఇంత కాదు. అలాంటిది నా ఫోటో పడితే? ఆ ఇంటర్వ్యూ నాదే అయితే
రెండు గంటలు ఎదురు చూడగా సిటీకి వెళ్లే ఫస్టు బస్ వచ్చింది. లోకల్ దాన్ని కదా నన్ను గుర్తుపట్టారు. టూర్‌కి వెళ్తున్నా నాన్న అక్కడే ఉన్నారని అబద్దం చెప్పేశాను. నలభై నిమిషాల్లో బస్ దిగడం. తెల్లవారుజాము కాకముందే రైల్వే స్టేషన్‌కి వెళ్లి టికెట్ తీసుకుని గంటకి వచ్చిన రైలు కూడా ఎక్కేశాను.
భయంగా ఉంది. భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలీదు. కూర్చున్నాననే కానీ కాళ్ళు వణుకుతున్నాయి. నేను చేసేది గనక తప్పే అయితే సరిదిద్దుకునేది నాకు రాదు. రైలు ముందుకు కాదులుతుంటే ఇక ఆలోచించడం అనవసరం అనిపించింది. మనసు మార్చుకున్నా రైలు దిగలేను కదా. తాడో పేడో తెల్చుకుందాం. ఇది నా వల్ల అవుతుంది. నేను సాధిస్తాను.
సౌందర్యా.. ఐయామ్ కమింగ్ ఫర్ యు

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)