03-08-2026, 09:46 AM
రూమ్‌కి వచ్చిన తర్వాత ఇద్దరూ కాసేపు మాట్లాడుకుంటూ అలా బెడ్‌పై పడుకున్నారు.
ప్రయాణం, కొత్త కాలేజ్, కొత్త హాస్టల్ అంటూ ఉదయం నుంచి బిజీగా ఉండటంతో ఇద్దరికీ బాగా అలసటగా అనిపించింది.
అలా కాసేపటికి ఇద్దరూ నిద్రలోకి జారుకున్నారు.
సాయంత్రం దాదాపు ఐదు గంటల సమయం.
ముందుగా నిద్ర లేచిన కృష్ణ పక్కనే పడుకున్న సిద్దును చూశాడు.
సిద్దు మాత్రం ఇంకా గాఢమైన నిద్రలో ఉన్నాడు.
కృష్ణ అతని దగ్గరకు వెళ్లి,
“నిద్ర లెయ్యరా బాబు...”
అంటూ సిద్దును కదిలించాడు.
సిద్దు మాత్రం కదలకుండా అలాగే పడుకున్నాడు.
“ఏంట్రా... ఎంతసేపు నిద్రపోతావ్? కలలో ఏ హీరోయిన్ వచ్చింది? అంతలా నిద్రపోతున్నావ్!”
అంటూ కృష్ణ వరుసగా మాట్లాడుతూనే ఉన్నాడు.
చివరికి సిద్దు నెమ్మదిగా కళ్లుతెరిచి లేచి కూర్చున్నాడు.
కానీ కృష్ణ మాటలు వింటూ ఉండగానే అతని మొహంలో ఏదో మార్పు కనిపించింది.
కృష్ణ అప్పటివరకు సిద్దును “రా”, “ఒరేయ్” అంటూ తన సొంత ఫ్రెండ్‌లా పిలుస్తూనే ఉన్నాడు.
అది సిద్దుకు కొత్తగా అనిపించింది.
చిన్నప్పటి నుంచి హాస్టల్ జీవితంలో పెరిగిన సిద్దుకు ఇలాంటి పిలుపులు అంతగా అలవాటు లేవు.
అందుకే కృష్ణ వైపు అలా చూస్తూ ఉండిపోయాడు.
కృష్ణ తన మాటలను మధ్యలోనే ఆపి,
“ఏంటి... అలా చూస్తున్నావ్?” అని అడిగాడు.
అప్పుడే కృష్ణకు విషయం అర్థమైంది.
‘అరే... నేను తనను రా, ఒరేయ్ అని పిలుస్తుంటే కొత్తగా అనిపిస్తుందేమో!’
అనుకున్నాడు.
తర్వాత సిద్దు వైపు చూస్తూ,
“చూడు సిద్దు... నాకు ఎందుకో నువ్వు మా ఊరిలోని ఫ్రెండ్స్‌లా చాలా త్వరగా కలిసిపోయావు. నువ్వు చిన్నప్పటి నుంచి చదువు కోసం సిటీల్లో, హాస్టళ్లలో పెరిగావు. అందులోనూ నువ్వు కొంచెం రిజర్వ్డ్. అందుకే మా ఊళ్లలో ఫ్రెండ్స్ ఎలా మాట్లాడుకుంటారో నీకు పెద్దగా తెలియకపోవచ్చు.”
కృష్ణ నవ్వుతూ చెప్పడం కొనసాగించాడు.
“నేను నా ఫ్రెండ్స్‌తో బ్రో, హాయ్ అంటూ మాట్లాడను. అలా మాట్లాడితే ఏదో దూరంగా ఉన్నట్టు అనిపిస్తుంది. అందుకే నిన్ను కూడా నా ఫ్రెండ్‌లాగే భావించి అలా పిలుస్తున్నాను. ఒకవేళ నేను నిన్ను అలా పిలవడం నీకు ఇబ్బందిగా ఉంటే మాత్రం చెప్పు. అప్పుడు నిన్ను బ్రో అని పిలుస్తాను.”
అని కృష్ణ చెప్పాడు.
సిద్దు మాత్రం ఏమీ మాట్లాడకుండా కృష్ణ వైపు ఒక సీరియస్ లుక్ ఇచ్చాడు.
ఆ తర్వాత నెమ్మదిగా బెడ్ మీద నుంచి లేచి బాత్రూమ్ వైపు నడుచుకుంటూ వెళ్లిపోయాడు.
సిద్దు అలా వెళ్లిపోవడం చూస్తూ కృష్ణ,
“ఏంట్రా స్వామీ... వీడు ఇలా ఉన్నాడు!” అని మనసులో అనుకున్నాడు.
అయినా పెద్దగా పట్టించుకోకుండా తన మొబైల్ తీసుకుని బెడ్ మీద కూర్చున్నాడు.
ఇక బాత్రూమ్లోకి వెళ్లిన సిద్దు మాత్రం కృష్ణ గురించే ఆలోచించడం మొదలుపెట్టాడు.
చిన్నప్పటి నుంచి తాను పెరిగిన వాతావరణం వేరు.
కాలేజ్, కాలేజ్... అన్నీ హాస్టల్ జీవితమే.
ఎంతమంది పరిచయమైనా, ఎవరితోనూ ఇంత త్వరగా క్లోజ్‌గా కలిసిపోయిన సందర్భం తన జీవితంలో ఎప్పుడూ లేదు.
కానీ కృష్ణ మాత్రం...
తన జీవితంలోకి వచ్చిన మొదటి రోజే తనతో ఏళ్ల తరబడి పరిచయం ఉన్న వ్యక్తిలా కలిసిపోయాడు.
తనకు తెలియకుండానే కృష్ణను ఒక ప్రత్యేకమైన స్నేహితుడిగా భావించడం మొదలుపెట్టాడు.
‘నా జీవితంలో నిజంగా క్లోజ్ ఫ్రెండ్ అంటూ ఒక పేజీ ఉంటే... అందులో మొదటి పేరు కృష్ణదే ఉంటుంది.’
అని అనుకున్నాడు.
కృష్ణ చెప్పిన మాటలు గుర్తు చేసుకుని సిద్దు చిన్నగా నవ్వుకున్నాడు.
‘సరే... ఇక నుంచి నేనూ తనలాగే ఉంటాను.’
అనుకుంటూ ఫ్రెష్ అయి బాత్రూమ్ నుంచి బయటకు వచ్చాడు.
కృష్ణ మాత్రం అప్పటికే మొబైల్లో ఏదో చూస్తూ ఉన్నాడు.
సిద్దు బాత్రూమ్కి వెళ్లేటప్పుడు ఇచ్చిన సీరియస్ లుక్ కృష్ణకు ఇంకా గుర్తుంది.
అందుకే సిద్దు బయటకు రాగానే,
“ఏంటి బ్రో...” అంటూ కృష్ణ మాట్లాడటం మొదలుపెట్టాడు.
కానీ కృష్ణ మాట పూర్తయ్యేలోపే...
“రేయ్ బావ...”
అంటూ సిద్దు పిలిచాడు.
ఆ మాట విన్న కృష్ణ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు.
చుట్టూ చూసుకున్నాడు.
రూమ్ మొత్తం ఒకసారి పరిశీలించాడు.
ఎవరైనా మూడో వ్యక్తి వచ్చారా అన్నట్టు అటూ ఇటూ చూశాడు.
కృష్ణ అలా రూమ్ మొత్తం చూడటం చూసిన సిద్దు నవ్వుకున్నాడు.
“నిన్నేరా...”
అని అన్నాడు.
అప్పటికి కృష్ణకు అసలు విషయం అర్థమైంది.
“ఓహ్...”
అంటూ మళ్లీ సిద్దు వైపు చూశాడు.
“ఏంట్రా... అలా వింతగా చూస్తున్నావ్?” అని సిద్దు అడిగాడు.
కృష్ణ ఇంకా ఆశ్చర్యంగానే చూస్తుండటంతో సిద్దు నవ్వుతూ,
“మీ ఊరిలో బెస్ట్ ఫ్రెండ్స్ ఇలాగే పిలుచుకుంటారంట కదా... బావ, అరేయ్, ఒరేయ్ అంటూ. అందుకే ఇక నుంచి నేనూ అలాగే పిలుస్తాను.”
అని చెప్పాడు.
కృష్ణ మాత్రం సిద్దు వైపు చూస్తూ ఉండిపోయాడు.
తన ముందు నిలబడి ఉన్న సిద్దు...
కొన్ని గంటల క్రితం వరకు “బ్రో” అని పిలవమన్న వ్యక్తి.
ఇప్పుడు మాత్రం తనను “బావ” అంటూ పిలుస్తున్నాడు.
కృష్ణకు ఒక్కసారిగా నవ్వొచ్చింది.
ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు.
ఆ చిన్న క్షణంలోనే...
ఇద్దరి మధ్య ఉన్న పరిచయం స్నేహంగా మారింది.
ఆ స్నేహం కూడా మామూలు స్నేహం కాదు...
ఒకరికొకరు తమ సొంత మనుషుల్లా అనిపించేంత దగ్గరైన స్నేహం.

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)