Thread Rating:
  • 21 Vote(s) - 3.05 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance బెంగళూరులో మొదలైన ప్రేమ
#19
ఇక సిద్దు తన గురించి చెప్పడం మొదలు పెట్టాడు.

“నా పేరు సిద్దార్థ్. మా సొంత ఊరు కర్నూలు జిల్లాలోని ఒక చిన్న ఊరు. మా నాన్న పేరు ప్రసాద్ . ఆయన ఫస్ట్ క్లాస్ కాంట్రాక్టర్. కాంట్రాక్ట్ పనులతో పాటు రాజకీయాల్లో కూడా యాక్టివ్‌గా ఉంటారు. ఎప్పుడూ ఏదో ఒక పని, మీటింగ్స్ అంటూ బిజీగా ఉంటారు.”

సిద్దు కాసేపు ఆగి మళ్లీ చెప్పడం మొదలుపెట్టాడు.

“మా అమ్మ పేరు భానుమతి. ఆమె వయసు నలభై సంవత్సరాలు. డిగ్రీ వరకు చదువుకుంది. నాకు ఒక అక్క, ఒక చెల్లి ఉన్నారు.”

“మా అక్క పేరు నందిని. తన వయసు ఇరవై మూడు సంవత్సరాలు. జీవితంలో ఏదో ఒకటి సాధించాలనే తపన తనకు చాలా ఎక్కువ. ప్రస్తుతం MBBS థర్డ్ ఇయర్ చదువుతోంది. డాక్టర్ అవ్వాలన్నదే తన కల.”

“అక్క పుట్టిన సంవత్సరానికి నేను పుట్టాను. నా తర్వాత మా చెల్లి పుట్టింది. ప్రస్తుతం ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. మా ముగ్గురి మధ్య చిన్న చిన్న గొడవలు ఉన్నా, ఒకరి మీద ఒకరికి చాలా ప్రేమ ఉంటుంది.”

కృష్ణ ఆసక్తిగా సిద్దు చెప్పే విషయాలను వింటూ ఉన్నాడు.

“నేను ఇంటర్ వరకు మా సొంత ఊరిలోనే చదివాను. ఆ తర్వాత బీటెక్ మణిపాల్‌లో చేశాను. చిన్నప్పటి నుంచే ఎక్కువగా హాస్టల్‌లోనే ఉండి చదువుకున్నాను. కాలేజ్‌లో కూడా హాస్టల్, తర్వాత కాలేజ్‌లో కూడా హాస్టల్. అందుకే సొంత ఊరిలో నాకు పెద్దగా స్నేహితులు లేరు. ఎవరితోనైనా త్వరగా కలిసిపోవడం నాకు అంతగా అలవాటు లేదు.”

“అంటే నువ్వు కొంచెం రిజర్వ్డ్ అన్నమాట?” అని కృష్ణ అడిగాడు.

“అవును. నేను కొంచెం రిజర్వ్డ్ టైప్. అవసరం ఉంటే తప్ప ఎక్కువగా ఎవరితోనూ మాట్లాడను. కానీ ఒక్కసారి ఎవరినైనా మనసులోకి తీసుకున్నానంటే మాత్రం వాళ్ల కోసం ఏదైనా చేస్తాను.”

“మరి నీ ఫ్యామిలీ?”

“ఫ్యామిలీ అంటే నాకు చాలా ఇష్టం. మా నాన్న ఎప్పుడూ కాంట్రాక్ట్ పనులు, రాజకీయాల్లో బిజీగా ఉండేవారు. వాటి వల్ల ఇంట్లో కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు జరుగుతుండేవి. అందుకే నాన్నతో నాకు అంతగా క్లోజ్ బాండింగ్ లేదు. కానీ అమ్మ, అక్క, చెల్లి అంటే మాత్రం నాకు చాలా ఇష్టం. వాళ్లతో నేను చాలా క్లోజ్‌గా ఉంటాను.”

“ఇక నాకు సిగరెట్ అలవాటు లేదు. ఎప్పుడూ తాగలేదు కూడా. కానీ బీర్ మాత్రం అప్పుడప్పుడు తాగుతాను. అదీ ఫ్రెండ్స్‌తో బయటకు వెళ్లినప్పుడు మాత్రమే.”

“అంటే మందు కూడా అలవాటే అన్నమాట,” అంటూ కృష్ణ నవ్వాడు.

“అప్పుడప్పుడు మాత్రమే. అదేం రెగ్యులర్ అలవాటు కాదు.”

“సరే సరే.”

సిద్దు కూడా నవ్వాడు.

“ఇక ప్రేమ దోమ లాంటివి కూడా నా జీవితంలో లేవు. నేను చాలా రిజర్వ్డ్‌గా ఉంటాను. అమ్మాయిలతో కూడా పెద్దగా మాట్లాడను. ఇప్పటివరకు ఎలాంటి లవ్ స్టోరీ లేదు.”

అని చెప్పి సిద్దు కాసేపు ఆగాడు.

“కానీ...”

“కానీ ఏంటి?” అంటూ కృష్ణ ఆసక్తిగా అడిగాడు.

సిద్దు కృష్ణ వైపు చూస్తూ చిన్నగా నవ్వాడు.

“నిన్ను మాత్రం కాలేజ్ రిసెప్షన్‌లో మొదటిసారి చూసినప్పుడే ఏదో చాలా ఆప్తుడిలా అనిపించింది. మనం ఇంతకు ముందే ఎక్కడో కలిసినట్టు... లేకపోతే చాలా సంవత్సరాల నుంచి పరిచయం ఉన్నట్టుగా అనిపించింది. అందుకే నిన్ను చూసిన వెంటనే మాట్లాడాలనిపించింది.”

“మరి చిలక కొట్టుడు...” అంటూ కృష్ణ దీర్ఘంగా అన్నాడు.

వెంటనే సిద్దు కృష్ణ వైపు అదోలా చూస్తూ,

“అలాంటి ఇప్పటివరకు ఏం లేవు. నేను చెప్పింది ఫ్రెండ్‌షిప్ గురించి. నువ్వు ఏదో అర్థం చేసుకోకు,” అన్నాడు.

కృష్ణ నవ్వుతూ,

“సరదాగా అన్నాను.”

అంటూ మాట మార్చేశాడు.

తర్వాత సిద్దు తమకు ఉన్న పొలాల గురించి, చిన్నప్పటి నుంచి తాను చూసిన ప్రదేశాల గురించి, ఇప్పటివరకు తిరిగిన పుణ్యక్షేత్రాల గురించి కృష్ణకు చెప్పాడు.

ఇద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉండగా సమయం ఎలా గడిచిపోయిందో వారికి తెలియలేదు.

అంతలో లంచ్ టైమ్ అవ్వడంతో ఇద్దరూ హాస్టల్ మెస్‌కు వెళ్లడానికి రూమ్ నుంచి బయటకు వచ్చారు.

మాట్లాడుకుంటూ మెస్ దగ్గరకు వెళ్లిన ఇద్దరూ లోపలికి అడుగు పెట్టారు.

కానీ...

మెస్‌లోకి అడుగు పెట్టగానే కృష్ణ ఒక్కసారిగా అక్కడే ఆగిపోయాడు.

అతని కళ్ల ముందు కనిపించిన దృశ్యాన్ని చూసి కృష్ణ షాక్ కొట్టి నిలబడిపోయాడు.
Like Reply


Messages In This Thread
RE: బెంగళూరులో మొదలైన ప్రేమ - by Train222 - 02-08-2026, 07:36 AM



Users browsing this thread: 2 Guest(s)