Thread Rating:
  • 31 Vote(s) - 3.13 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Misc. Erotica తప్పు ఎవరిదీ?
రోహన్ అడిగిన దానికి ఇంకా ప్రేమ్ సమాధానం చెప్పలేదు. అంతలోనే రోహన్ చూపులు ప్రేమ్ చొక్కా మీద పడ్డాయి. 

"ఏంటి ప్రేమ్ ఆ షర్ట్ నిండా ఆ మరకలు" అన్నాడు రోహన్.

అప్పుడు కానీ ప్రేమ్ తన షర్ట్ చూసుకోలేదు. కార్ ఇచ్చిన ట్రబుల్ కి సరిగ్గా గమనించలేదు కానీ చొక్కా మొత్తం నలిగిపోయి, అక్కడక్కడా నల్లని ఆయిల్ మరకలు అయ్యాయి. 

"ఉఫ్ఫ్... చూసుకోలేదు రోహన్, నా కార్ బాగా ట్రబుల్ ఇచ్చింది. దాంతో ఇలా అయింది" అన్నాడు ప్రేమ్ మెల్లగా.

"ఓహ్... ఇప్పుడు ఒకే నా అంతా?" అన్నాడు రోహన్ కళ్ళు ముడివేస్తూ.

"హా ఒకే, మధ్యలో ఒక ఫ్రెండ్ కలిసాడు. అతనే కార్ ని రిపేర్ చేసాడు" అన్నాడు ప్రేమ్.

"హాహా సరే, నేను ఊరి నుండి డైరెక్ట్ గా ఇటే వచ్చేసాను. కాస్త ఇంటికి వెళ్లి రెస్ట్ తీసుకుంటాను" అంటూ రోహన్, ఇద్దరికీ బాయ్ చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయాడు.

రోహన్ వెళ్ళగానే నివి ప్రేమ్ వైపు చూసింది. అతను తీక్షణంగా, అదోలా తనని చూడటం ఆమె గమనించింది. ఆ క్షణం ప్రేమ్ ఎందుకు అలా చూశాడో అర్ధం అయింది. రోహన్ రావటంతో తెలియకుండానే తన మొహం వెలిగిపోయింది. కళ్ళు ఆనందంతో మెరుస్తూ ఉన్నాయి. బుగ్గలు ఎర్రగా మారాయి. అరేయ్ ఇలా ఎందుకు అయింది అని మనసులోనే అనుకుంటూ 

"ఏమైంది అలానే చూస్తున్నావ్?" అంది మెల్లగా 

"ఏం లేదు" అన్నాడు ప్రేమ్ 

"సరే ఒక్క గంటసేపు ఉండు ప్రేమ్. నా వర్క్ అయిపోతుంది. ఇలా నలిగిన షర్ట్ తో ఏం వెళ్తావ్ ఇక, నాతో పాటు ఇంటికి వచ్చేసేయ్" అంది నివి 

అది విని అప్పటి వరకు ఉన్న అనుమానం మాయమైంది. నివి తనతోనే ఇంటికి వస్తాను అనటంతో అతని మొహం ఆనందంతో వెలిగిపోయింది. దాంతో అక్కడే ఒక చైర్ లో కూర్చుని తన అందాల నివి ని చూస్తూ, మురిసిపోతూ ఉన్నాడు.

అటు నివి మాత్రం ప్రేమ్ ముందు సీరియస్ గా వర్క్ చేస్తున్నట్టు మొహం పెట్టి లాప్టాప్ చూస్తూ ఉంది, కానీ మనసులో మాత్రం రోహన్ ని చూసి అసలు ఇలా ఎందుకు చేసాను అనుకుంటూ తనని తాను తిట్టుకుంది.

కొంతసేపటికి వర్క్ కంప్లీట్ చేసి పైకి లేచింది.

"వెళ్దామా?" అన్నాడు ప్రేమ్ ఎంతో ప్రేమగా.

"హా ప్రేమ్ వెళ్దాం" అంది నివి మెల్లగా 

ఇద్దరు అక్కడ నుండి ప్రేమ్ కార్ లో తిరిగి ఇంటికి వచ్చేసారు. నిదానంగా రాత్రి 9 అయింది. అయినా కూడా రోహన్ తన రూమ్ నుండి బయటకు రాలేదు. ఇటు నివి, ప్రేమ్ లు కూడా తమ బెడ్ రూమ్ లోకి వెళ్లారు. నిదానంగా బెడ్ మీదకి వాలారు.

"నివి" అంటూ ప్రేమగా పిలిచాడు ప్రేమ్.

నివి నిదానంగా ప్రేమ్ వైపు తిరిగింది. ఆమె మనసులో మాత్రం ఉదయం రోహన్ ని చూసి అలా ఎందుకు బిహేవ్ చేసాను అన్న ఆలోచననే తిరుగుతూ ఉంది. అంతలో ప్రేమ్ మెల్లగా తన చేతిని నివి చెంప మీద వేసి నిమిరాడు. ఆ స్పర్శ కి నివి ఆలోచనలో నుండి బయటకి వచ్చి ఎదురుగా ఉన్న ప్రేమ్ ని చూసింది. ఇద్దరి కళ్ళు ఒక్క క్షణం కలుసుకున్నాయి. అటు ప్రేమ్ కూడా నివిని మనస్ఫూర్తిగా అనుభవించి చాలా రోజులే అవుతుంది. అది కాక నివి అందాన్ని చూస్తూ ఉంటే ఇక ఆగాలి అనిపించలేదు అతనికి, దాంతో మెల్లగా ముందుకు ఒంగాడు. ఇద్దరి ఊపిరి ఒకరినొకరిని తాకుతూ ఉంది. ప్రేమ్ నిదానంగా ముందుకి జరిగి నివి పెదాలని అందుకున్నాడు, దాంతో నివి కూడా మత్తుగా తన పెదాలని తెరిచింది. ప్రేమ్ మెల్లగా నివి పెదాలని నోట్లోకి తీసుకొని సుతిమెత్తంగా చప్పరించటం మొదలుపెట్టాడు. 

అంతలో నివి కళ్ళ ముందు రోహన్ బెంగళూరులో పూల్ దగ్గర పెట్టిన ముద్దు మెదిలి, ఒక్కసారిగా కళ్ళు తెరిచి తన తలని వెనక్కి జరిపింది. దాంతో ప్రేమ్ ఏమైంది అన్నట్టుగా చూసాడు.

"సారీ ప్రేమ్, బాగా తల నొప్పిగా ఉంది. ఏం అనుకోకు ప్లీజ్...." అంది నివి మెల్లగా.

అది విని ప్రేమ్ మొహంలో నిరాశ కొట్టొచ్చినట్టు కనపడింది, కానీ అర్ధం చేసుకుంటూ "సరే నివి" అన్నాడు మెల్లగా.

అతని మొహంలోని నిరాశ చూసి నివి కూడా జాలి వేసింది కానీ, ఆ క్షణం రోహన్ మొహం గుర్తు రావటంతో మనసంతా గిల్టీ ఫీలింగ్ తో నిండిపోయింది. మెల్లగా ముందుకు జరిగి ప్రేమ్ గుండెల మీద తల పెట్టి, అతన్ని గట్టిగా వాటేసుకుని పడుకుంది. అది చూసి ప్రేమ్ మొహంలో కాస్త నిరాశ తగ్గింది. నివి తల మీద చిన్న ముద్దు పెట్టి తాను కూడా ఆమెని గట్టిగా హత్తుకుని పడుకున్నాడు.

********************************************

మరుసటిరోజు రోహన్, తన బెంజ్ కార్ లో నివి ని తీసుకొని ఆఫీస్ కి బయలుదేరాడు. ప్రేమ్ ఆఫీస్ కూడా కొంతదూరం వరకు ఒకటే రూట్ కావటంతో తన డొక్కు కార్ లో, రోహన్ బెంజ్ కార్ ని ఫాలో అవుతూ వెళ్తున్నాడు.

అంతలో ట్రాఫిక్ రెడ్ సిగ్నల్ పడింది. రోహన్ తన కార్ ఆపాడు. సైడ్ మిర్రర్ లో నుండి వెనుకనే ఉన్న ప్రేమ్ ని, అతని కార్ ని చూసాడు.

"నీకు, ప్రేమ్ కి మధ్య గొడవలు తగ్గాయా?" అన్నాడు రోహన్, స్టీరింగ్ మీద తన వేళ్ళతో చిన్నగా కొడుతూ, రోడ్ వైపు చూస్తూ.

"హా తగ్గాయి" అంది నివి మెల్లగా.

"మ్మ్ గుడ్, మరి ఫిసికల్ గా కూడా కలిసారా?" అన్నాడు చాలా క్యాజువల్ గా.

అది విని నివి చేతులు వణికాయి.

"ఇంకా లేదు, కాకపోతే కిస్ వరకు వెళ్ళాం అంతే" అంది నివి మెల్లగా 

"ఎందుకు? అయినా మారాడు అని నువ్వు చెప్తున్నావ్ కదా? మరి తనకి కూడా ఫీలింగ్స్ ఉంటాయి నీ మీద, తన ఫీలింగ్స్ తీరిస్తే తప్పేముంది" అన్నాడు రోహన్ 

"మ్మ్మ్" అంది నివి ఏం సమాధానం చెప్పాలో తెలియక.

"మీ ఆడోళ్ళతో ఇదే సమస్య, ఒకడు మన మీద ప్రేమ చూపిస్తుంటే వాడిని అసలు పట్టించుకోరు. అరేయ్ చాలా తప్పు చేసామని ఎప్పుడు తెలుసుకుంటారు అంటే ఆ ప్రేమ చూపిస్తున్న వాడు పక్కన లేనప్పుడు" అన్నాడు రోహన్.

"నువ్వు అన్నట్టు మేమేం అలా లేము. బాగానే ఉన్నాం. ఒకరినొకరం లవ్ చేసుకుంటున్నాం" అంది నివి 

"అవునా మరి నాకెందుకో అలా ఏం కనిపించట్లేదు. నువ్వు మారాడు అని చెప్తున్నావ్ కానీ ఇంకా అతని కళ్ళు మాత్రం ఇంతకముందులానే అనుమానంగా కనిపిస్తున్నాయి" అన్నాడు రోహన్.

"నీకెందుకు అలా అనిపించింది? నీతో ఎమన్నా గొడవ పడ్డాడా?" అంది నివి మెల్లగా 

"అదేం లేదు, కాకపోతే అవి నువ్వు కావాల్సినంత ప్రేమ చూపించట్లేదని అలా ఉన్నాయేమో" అన్నాడు రోహన్ 

ఆ మాటకి ఏం సమాధానం చెప్పాలో తెలియక సైలెంట్ గా ఉంది నివి.

"అయినా నన్ను చూసినప్పుడు నీ కళ్ళు మెరిసినట్టు, ప్రేమ్ ని చూసినప్పుడు మెరవలేదు, అది కూడా అతను అలా ఉండటానికి కారణం అవ్వొచ్చు" అన్నాడు రోహన్.

అది విని నివి గొంతు తడారిపోయింది. 

"నిజం చెప్పు, ఇలా ఎప్పుడైనా నీ కళ్ళు అతని కోసం మెరిసాయా?" అన్నాడు రోహన్ మెల్లగా నివి ని చూస్తూ 

"ఏమో..... ఇవన్నీ... నా... నాకు తెలియదు" అంది తడబడుతూ, "అయినా చాలా రోజుల తర్వాత నిన్ను చూసా కాబట్టి నేను నవ్వుతూ నిన్ను పలకరించాను. నీకు అది వేరేలా అర్ధం అయింది. అయినా అలా జరిగిన దానికి చాలా గిల్టీ ఫీలింగ్ ఉంది. నువ్వు మంచోడివి కాబట్టే ఇప్పటికి మాట్లాడుతున్నాను" అంది నివి 

"ఒక్క క్షణం ఆగు, గిల్టీ ఫీలింగ్ అంటూ మళ్ళీ నీ పర్సనల్ లైఫ్ ని మధ్యలోకి తీసుకొని రాకు, ఒకవేళ ప్రేమ్, నీ నుండి ఎలాంటి ప్రేమని కోరుకుంటున్నాడో అది అతనికి ఇచ్చేసి, ఎలాంటి గిల్టీ ఫీలింగ్ లేకుండా నాతో రా" అన్నాడు రోహన్ 

అది విని నివి కి ఏం అర్ధం కాలేదు. ఆశ్చర్యంగా అతన్ని చూస్తూ "ఇతనేంటి ఇలా అంటున్నాడు. అంటే ప్రేమ్ కి ప్రేమని పంచి, ఇతనితో బెడ్ ఎక్కమని అడుగుతున్నాడా?" అనుకుంది మనసులో.

నివి మనసులోని భావాన్ని అర్ధం చేసుకున్న రోహన్ మళ్ళీ నోరు తెరిచి "నేనేం చెప్తున్నాను అంటే ఇద్దరం మన మ్యారేజ్ లైఫుల్లో ప్రేమ కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. అలాంటిది ఇప్పుడు నీ లైఫ్ లో ఆ ప్రేమ దొరికింది. ముందు అక్కడ నీ ప్రాబ్లెమ్ క్లియర్ చేసుకుని తర్వాత మన ఫ్రెండ్షిప్ గురించి ఆలోచించు. నా కన్నా నీకు ప్రేమ్ ముఖ్యం" అన్నాడు రోహన్.

అది విన్నాక నివి మనసు కాస్త కుదుటపడింది.

"సో ముందు ప్రేమ్ కి కావాల్సిన ప్రేమని తిరిగి ఇవ్వు" అన్నాడు రోహన్ మళ్ళీ.

"మ్మ్... అయినా నేను అతనికి కావాల్సినట్టే ఉంటున్నాను. ఇంకేం ఇవ్వాలి. ఇక నువ్వు చెప్పినట్టు ఫిసికల్ గా అంటావా, మన మధ్య బెంగుళూరులో అది జరిగిన దగ్గర నుండి, ఇప్పటికి నా మనసులో అదే తిరుగుతూ ఉంది. నేను నార్మల్ అవ్వటానికి ఇంకొంచెం టైమ్ పడుతుంది" అంది నివి బయటకి చూస్తూ.

అది విని రోహన్ చిన్నగా నవ్వుకున్నాడు.

"ఉఫ్ఫ్.... నివి... ప్రేమ్ హ్యాపీగా ఉండాలి, నీ ప్రేమని కూడా అర్ధం చేసుకోవాలి అంటే చాలా దారులే ఉన్నాయి" అన్నాడు రోహన్ 

"ఇంకేం ఉన్నాయి, అది తప్ప" అంది నివి మెల్లగా 

"నిజం చెప్పనా నువ్వు అసలు ప్రేమ్ ని అర్ధం చేసుకోలేదు. మనం ప్రేమిస్తున్నట్టు చెప్పాలి అంటే సెక్స్ ఒక్కటే కాదు, అతనికి అవసరం అయినవి ఇచ్చినా కూడా మాన్ ప్రేమ అర్ధం అవుతుంది" అన్నాడు రోహన్.

ఆ మాటలు విని ఒక్కసారిగా రోహన్ వైపు చూసింది నివి.

"ఒక్కసారి ఆలోచించు, అతనికి ఏం ఇష్టం, ఏది తన దగ్గర ఉంటే హ్యాపీగా ఫీల్ అవుతాడో" అన్నాడు రోహన్.

నివి మెల్లగా ఆలోచన లో పడింది, కానీ ప్రేమ్ కి ఏం ఇవ్వాలి, అతనికి ఏం ఇష్టమో అసలు అర్ధం కావట్లేదు.

"ఇలా ఆలోచిస్తే అయినట్టే, నిన్న చూసావ్ కదా తన పాత కార్ తో ఎన్ని కుస్తీలు పడ్డాడో, ఇప్పుడు తన కన్నా నువ్వే ఎక్కువ సంపాదిస్తున్నావ్. ఒక మంచి కార్ కొని గిఫ్ట్ ఇవ్వు" అన్నాడు రోహన్ 

"ఏంటి కార్ ఆ?" అంది ఆశ్చర్యంగా 

"హా అవును, బేసిక్ గా మా మగవాళ్ళు ఎలాంటి వారంటే, ఎన్ని అవసరాలు ఎప్పుడు ఎవరికీ చెప్పుకోము. ఉన్న డబ్బంతా ఇంటి కోసమో, లేదా వేరే దానికి ఉపయోగపడుతుందిలే అనుకుని ఎన్ని ఇబ్బందులు అయినా తట్టుకుంటాం. ఇప్పుడు ప్రేమ్ కూడా అలాంటి పరిస్థితిలోనే ఉన్నాడు. సో నువ్వే ఒక మంచి కార్ కొని అతనికి సర్ప్రైజ్ ఇవ్వు" అన్నాడు రోహన్ 

"నిజమే, నువ్వు చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది" అంది నివి 

"హాహా, ఇంతకీ అతనికి ఎలాంటి కార్ అంటే ఇష్టం" అన్నాడు రోహన్ 

"పర్టిక్యులర్ గా నాకు తెలియదు కానీ, ఒకసారి కియా కార్స్ చాలా బాగుంటాయి అని చెప్పాడు" అంది నివి 

"సరే అక్కడికే వెళ్లి మంచి కార్ సెలెక్ట్ చేద్దాం పదా" అన్నాడు రోహన్ 

"ఏంటి ఇప్పుడా?" అంది నివి 

"హా అంతే మరి, ఆలస్యం అమృతం, విషయం అన్నారు పెద్దలు" అన్నాడు రోహన్ నవ్వుతూ 

"హీహీహీ అది విషయం కాదు, విషం" అంది నివి కూడా నవ్వుతూ 

ఇద్దరు అక్కడ నుండి కియా షోరూం కి వెళ్లారు. అక్కడ ఉన్న కార్లలో నివి కి సెల్టోస్ కార్ బాగా నచ్చింది. దాంతో ప్రేమ్ కి నచ్చిన కలర్ కార్, హై ఎండ్ వెరియంట్ ని ఆర్డర్ పెట్టింది. రోహన్ తన ఇన్ఫ్లుయెన్స్ వాడి మరుసటిరోజు ఆ కార్ డెలివరీ అయ్యేలా మాట్లాడాడు. 

"ప్రేమ్ కి చెప్పనా?" అంది నివి 

"పిచ్చా, సర్ప్రైజ్ అనేది సర్ప్రైజ్ లానే ఉండాలి. రేపు ఈ కార్ తీసుకొని తన ఆఫీస్ దగ్గరికి వెళ్ళు, బయటకు తీసుకొని వచ్చి తన చేతిలో కార్ కీస్ పెట్టు" అన్నాడు రోహన్ 

"అసలు ఇలాంటి ఐడియాస్ ఎలా వస్తాయి నీకు" అంది నివి మెచ్చుకోలుగా 

"హాహా ఎదో అలా, అయినా ఐడియా ఇచ్చా కదా అని రేపు నన్ను కూడా రమ్మని చెప్పకు. ఇది నీ ప్రేమ కోసం, నువ్వు ఎఫర్ట్స్ పెడుతున్నావ్. సో నువ్వే వెళ్ళాలి" అన్నాడు నవ్వుతూ 

దానికి నివి చిన్నగా నవ్వింది.

మరుసటి రోజు కార్ తీసుకొని ప్రేమ్ ఆఫీస్ కి వెళ్ళింది నివి. మెల్లగా ఆఫీస్ లోపలికి వెళ్లి ప్రేమ్ ముందు నిలబడింది. సడెన్ గా నివి ని చూసి షాక్ అయ్యాడు ప్రేమ్. అంతలోనే తేరుకుని చిన్నగా నవ్వి ఆమె దగ్గరికి వచ్చాడు. 

"ఏంటి నివి ఏమైంది?" అన్నాడు ప్రేమ్, ఎందుకు వచ్చిందో అర్ధం కాక 

"ఏం లేదు" అంటూ మెల్లగా ప్రేమ్ వెనక్కి వెళ్లి తన చేతులతో అతని రెండు కళ్ళు మూసేసింది. "నీ కోసం చిన్న సర్ప్రైజ్" అంటూ అతన్ని తీసుకొని పార్కింగ్ దగ్గరికి వెళ్ళింది.

మెల్లగా తన చేతులు తీసి "సర్ప్రైజ్" అంది నవ్వుతూ.

ఎదురుగా తన పాత కార్ పక్కన పార్క్ చేసి ఉన్న కొత్త కార్ ని చూసి ఆశ్చర్యపోయాడు ప్రేమ్.

"నివి....?" అంటూ అలానే నోరు తెరిచి ఆమెని చూస్తూ ఉన్నాడు.

"హాహా, ఇప్పుడు ఇదే నీ కార్. ఇవి తీసుకో ప్రేమ్" అంటూ తన చేతిలో ఉన్న కార్ కీస్ ని ప్రేమ్ కి ఇచ్చింది నివి.

ఆ క్షణం ప్రేమ్ మనసు సంతోషంతో కుప్పిగంతులు వేసింది. వెంటనే నివి చేతిలోని కీస్ తీసుకొని కార్ దగ్గరికి నడిచాడు. దానిని తన చేతి వేళ్ళతో తాకుతూ కార్ చుట్టూ ఒక రౌండ్ వేసి, కార్ డోర్ ఓపెన్ చేసాడు. లోపల ఇంటీరియర్ చూసి మతిపోయింది. దాని నుండి వస్తున్న వాసనని గట్టిగా పీల్చుకుని వెంటనే లోపల కూర్చున్నాడు. తల ముందు వెనక్కి తిప్పుతూ, మొత్తం చూస్తూ తన చేతులతో స్టీరింగ్ పట్టుకున్నాడు. రిమోట్ కార్ కొన్న చిన్నపిల్లోడిలా ఉంది ఇప్పుడు అతని మనసు. కార్ స్టార్ట్ చేసి యాక్సిలిరేటర్ మెల్లగా నొక్కాడు. దాని నుండి వస్తున్న ఇంజిన్ సౌండ్ విని అతనిలో ఇంకా ఆనందం పెరిగింది. నివి కూడా తన గురించి ఆలోచిస్తుంది అన్న ఊహకే అతని ఆనందం డబల్ అయింది. ఇన్ని రోజులు ఆమెని తప్పుగా అర్ధం చేసుకున్నాను కొంచెం బాధ పడ్డాడు.

మళ్ళీ కార్ దిగి నివి దగ్గరికి వచ్చి గట్టిగా ఆమెని హత్తుకున్నాడు.

"థాంక్స్ నివి" అన్నాడు సంతోషం నిండిన గొంతుతో 

అతని కళ్ళలో కనపడుతున్న ఆనందం, సంతోషం చూసి నివి మనసు కూడా ఉప్పొంగింది.

తన చేత్తో అతని తల నిమురుతూ, మెల్లగా అతని నుదిటి మీద ముద్దు పెట్టింది. మనసులో రోహన్ కి థాంక్స్ చెప్పుకుంది.

"అసలు ఈ ఐడియా ఎలా వచ్చింది?" అన్నాడు నవ్వుతూ 

"నిన్న ఎంత ఇబ్బంది పడ్డావో చూసాను కదా" అంది నివి 

"థాంక్స్ నివి, అయినా ఒన్ డే డెలివరీ ఎలా పొజిబుల్ అయింది" అన్నాడు ఆశ్చర్యంగా 

నివి కి ఏం చెప్పాలో అర్ధం కాలేదు. అంతలో ప్రేమ్ మళ్ళీ మాట్లాడుతూ 

"రోహన్ హెల్ప్ చేశాడా?" అన్నాడు.

ఇప్పుడు లేదు అంటే మళ్ళీ అనుమానం వస్తుంది, చేసాడు అంటే ఏమనుకుంటాడో. అయినా అబద్దం చెప్పటం ఎందుకు, నిజమే చెప్తాను అనుకుంటూ 

"అవును ప్రేమ్, నిన్న నీ ఇబ్బంది చూసి రోహన్ కి చెప్పాను. ఇలా ప్రేమ్ కి కార్ ఇవ్వాలి అనుకుంటున్నట్టు. దాంతో అతను తనకి తెలిసిన వాళ్ళ ద్వారా వెంటనే డెలివరీ చేసేలా హెల్ప్ చేసాడు" అంది 

కానీ మనసులో మాత్రం ప్రేమ్ కి అనుమానం వస్తుందా ఏంటి అనుకుంది.

అది విని ప్రేమ్ కి ఎలాంటి అనుమానం రాలేదు. జస్ట్ కార్ త్వరగా రావటానికి అతని హెల్ప్ తీసుకుంది. రోహన్ కూడా పాపం హెల్ప్ చేసాడు అనుకుని చిన్నగా నవ్వాడు.

"హా నివి, ఒక రౌండ్ వెళ్దామా?" అన్నాడు ప్రేమగా.

ప్రేమ్ అలా అడిగేసరికి నివి కి కూడా చాలా ఆనందంగా అనిపించింది. వెంటనే సరే అంటూ తల ఊపింది.

ఇద్దరు అక్కడ నుండి ఔటర్ రింగ్ రోడ్ మీదకి వచ్చారు. విశాలంగా ఉన్న రోడ్ మీద తన కొత్త ఊరకలు వేస్తూ వేగంగా వెళ్తుంటే ప్రేమ్ కి కలుగుతున్న ఆనందాన్ని మాటల్లో ఎలా చెప్పాలో అర్ధం కావట్లేదు. నివి పక్కన కూర్చుని అతని మొహంలో కనపడుతున్న సంతోషం చూసి మురిసిపోయింది. మెల్లగా ఇద్దరు మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. ప్రేమ్ తన పాత కార్ ఎలా ఉండేది, ఇప్పుడు ఈ కార్ ఎలా ఉంది అన్నీ చెప్తూ ఉంటే నివి నవ్వుతూ అతన్ని చూసింది. కాసేపటికి మెల్లగా అతని చేయి పట్టుకొని అతని భుజం మీదకి వాలింది.

అది చూసి ప్రేమ్ ఇంకా ఆనందపడ్డాడు. ముందుకు ఒంగి నివి తల మీద ముద్దు పెట్టాడు. నివి నిదానంగా తన తలని పైకి లేపి ప్రేమ్ కళ్ళలోకి చూసింది. ఇద్దరి కళ్ళలో ఒకరి మీద మరొకరికి ఉన్న ప్రేమ స్పష్టంగా కనపడుతూ ఉంది. అంతలో ప్రేమ్ నోరు తెరిచి 

"ఇన్ని సంవత్సరాలు నిన్ను చాలా బాధ పెట్టాను, అసలు మళ్ళీ నువ్వు నన్ను క్షమించి, తిరిగి ప్రేమిస్తావని అసలు అనుకోలేదు" అన్నాడు.

దానికి నివి ఏం సమాధానం చెప్పకుండా సైలెంట్ గా అలానే అతన్ని చూసింది.

"కానీ ఒక్కటి మాత్రం చెప్పాలి నివి నీకు, బయట జరుగుతున్న వాటిని చూసి, అలాంటి మనుషులని చూసి నాకు నీ విషయంలో చాలా భయం వేసింది. అందుకే నీతో అలా ఉన్నాను. నేను అలా ఉండటం నీకు ఇబ్బంది అవుతుంది అన్న సంగతే మర్చిపోయాను. నేను నీ మీద పెడుతున్న ఒత్తిడి వల్ల నీకు జైలులో ఉంటున్నట్టు అనిపిస్తుందని అసలు అనుకోలేదు" అన్నాడు ప్రేమ్ మెల్లగా.

అదంతా విని అప్పటికే నివి కళ్ళు మెల్లగా చెమర్చాయి.

"ఇదంతా నీకు ఎలా అర్ధం అయింది ప్రేమ్" అంది నిదానంగా 

"ఏమో నివి అలా అనిపించింది, దేవుడి దయ వల్ల నా మీద నీకు కోపం, అసహ్యం రాలేదు" అన్నాడు ప్రేమ్.

"నీ మీద నాకు ఎప్పటికి కోపం, అసహ్యం అనేవి రావు ప్రేమ్. ఇద్దరి మధ్య అప్పుడప్పుడు ఏమన్నా చిన్న గొడవలు, సమస్యలు రావొచ్చు కానీ ఇద్దరం దూరం అయ్యేలా ఎప్పటికి జరగదు" అంది నివి కూడా ప్రేమ నిండిన గొంతుతో.

"ఇప్పటి వరకు జరిగిన అన్నిటికీ సారీ నివి" అంటూ గట్టిగా నివి ని తనకేసి హత్తుకుని "ఈ రోజు నుండి నిన్ను ఇక బాధ పెట్టను. నీకు నచ్చినట్టు ఉండు, నచ్చిన వర్క్ చెయ్" అన్నాడు ఆమె తల నిమురుతూ 

నివి మనసులో మాత్రం గిల్టీ ఫీలింగ్ అలానే ఉంది. కానీ అది ప్రేమ్ కి చెప్పి తనని బాధ పెట్టాలి అనుకోలేదు. ఆ బాధని అలానే తనలో దాచుకుని ఇక నుండి ప్రేమ్ కోసమే ఉండాలి అనుకుంది.

కాసేపటికి ఇద్దరు విడిపోయారు. ప్రేమ్ చాలా హ్యాపీగా ఉన్నాడు. అటు నివి పూర్తిగా దగ్గర అయినందుకు, మరోవైపు కొత్త కార్ వచ్చినందుకు. మెల్లగా తన నోరు తెరిచి 

"ఇప్పుడు ఆఫీస్ కి వెళ్లాలా నువ్వు?" అన్నాడు. 

"లేదు" అంది నివి.

"అలా లంచ్ కి వెళ్దామా?" అన్నాడు ప్రేమగా 

"అది కూడా అడగాలా?" అంది నివి మెల్లగా నవ్వుతూ.

దాంతో ప్రేమ్ కూడా నవ్వి కార్ ని ముందుకి పోనిచ్చాడు. కొంతసేపటికి కార్ ఆధ్య వాళ్ళ కాలేజ్ ముందు ఆగింది.

"ఆధ్య ని కూడా తీసుకొని వెళ్దాం" అంటూ ప్రేమ్ కార్ దిగాడు. దాంతో నివి కూడా నవ్వుతూ కార్ దిగింది. ఇద్దరు లోపలికి వెళ్లి ఆధ్య ని తీసుకొని బయటకు వచ్చారు. ఎదురుగా ఉన్న కొత్త కార్ ని చూసి ఆధ్య కూడా చప్పట్లు కొడుతూ మురిసిపోయింది.

దాంతో ముగ్గురు కలిసి ఒక మంచి రెస్టారెంట్ కి వెళ్లారు. నచ్చిన ఫుడ్ ఆర్డర్ పెట్టుకుని సంతోషంగా తిన్నారు. 

సాయంత్రం కొత్త కార్ ని రోహన్ కి చూపించాడు ప్రేమ్. రోహన్ కూడా అది చూసి హ్యాపీగా ఫీల్ అయ్యాడు. 

"డ్రైవ్ చెయ్ రోహన్ ఒకసారి" అన్నాడు ప్రేమ్.

"హా సరే ప్రేమ్, అందరం వెళ్దాం. అలా వెళ్లి ఎమన్నా తినేసి వద్దాం" అన్నాడు రోహన్ 

దాంతో అందరూ కలిసి అలా కార్ లో ఒక రౌండ్ కి వెళ్లారు. రోహన్ నడుపుతూ ఉంటే పక్కన సీట్లో ప్రేమ్ కూర్చున్నాడు. వెనుక నివి, ఆధ్య కూర్చుని ఉన్నారు. ఆ విధంగా ఆ రోజు గడిచిపోయింది.

మరుసటి రోజు ఎప్పటిలానే నివి ని తన కార్ లో తీసుకొని ఆఫీస్ కి బయలుదేరాడు రోహన్. వెనుక ప్రేమ్ తన కొత్త కార్ లో బయలుదేరాడు. కొంత దూరం వెళ్ళాక రోహన్ తన నోరు తెరిచి మాట్లాడటం మొదలుపెట్టాడు.

"చూసావా ప్రేమని చూపించటం ఎంత తేలికో, ప్రేమ్ కూడా చాలా హ్యాపీగా ఉన్నాడు" అన్నాడు రోహన్ 

"మ్మ్మ్" అంటూ చిన్నగా నవ్వింది నివి 

"బేసిక్ గా అమ్మాయిలు, వాళ్ళకి ఏం కావాలో నోటితో అడుగుతారు. అబ్బాయి మాత్రం పైకి చెప్పుకోరు. వాళ్ళని అర్ధం చేసుకుని ఇవ్వాల్సిన బాధ్యత అమ్మాయిలకే ఉంటుంది" అన్నాడు రోహన్ 

ఆ మాటలు నివి మనసుని తాకాయి. ప్రతీ రోజు ప్రేమ్ బెడ్ మీద తనని తాకుతూ ఉంటే అతనికి ఏం కావాలో తనకి అర్ధం అవుతూనే ఉంది. కానీ బెంగుళూరులో రోహన్ తో అలా జరిగిన దగ్గర నుండి, ఆ సంఘటన మర్చిపోయి, ప్రేమ్ కి కావాల్సింది ఇవ్వటం తనకి చాలా కష్టంగా ఉంది. ఆ ఊహ వస్తేనే కళ్ళ ముందు రోహన్ కనపడుతున్నాడు. ప్రస్తుతం ప్రేమ్ తనని అర్ధం చేసుకుని బలవంతం చేయట్లేదు. అలాంటిది ఒకవేళ బలవంతం చేస్తే, లేదా నేనే ఇక ఆపుకోలేక తనకి బెంగళూరులో జరిగిన దాని గురించి నిజం చెప్పేస్తే ప్రేమ్ తట్టుకోగలడా? అనే ఆలోచన, భయం ఒకేసారి కలిగాయి. ఆమె మనసు మొత్తం ఆలోచనలతో నిండిపోయింది.

బయటకు చూస్తూ పరాధ్యానంగా ఉన్న నివి ని చూసిన రోహన్ 

"నివి ఏమైంది? అలా ఉన్నావ్?" అన్నాడు 

"ఏం లేదు, ఇక నుండి నేను ఒక మంచి భార్యలా ఉండాలి అనుకుంటున్నాను" అంటూ ఆపి, ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుని "ఈ రోజు నుండి అన్నీ ఆపేద్దాం" అంది.

"ఆపేద్దాం అంటే? దేని గురించి మాట్లాడుతున్నావ్?" అన్నాడు రోహన్ 

"మన మధ్య ఉన్న అన్నిటినీ" అంది నివి 

"అంటే మన మధ్య ఉన్న ఈ ఫ్రెండ్షిప్, బిజినెస్, బెంగుళూరు డేస్ అన్నా?" అన్నాడు రోహన్ 

"హా అవును, ప్రేమ్ ఇప్పుడు ఒకప్పటిలా లేడు. తన తప్పు తెలుసుకున్నాడు. నేను కూడా తెలిసో తెలియకో నీతో ఒక తప్పు చేసాను. దాని తర్వాత నువ్వు నన్ను ఇబ్బంది పెట్టకుండా, నాకు చాలా టైమ్ ఇచ్చినందుకు థాంక్స్. కానీ మన రిలేషన్ ఇలానే కంటిన్యూ అయితే ఎలాంటి మలుపులు తిరుగుతుందో తెలియదు. అందుకే ఇక్కడితో ఆపితే ఇద్దరికీ మంచిది" అంది నివి గట్టిగా 

"సరే నువ్వు అన్నట్టు అన్నీ ఆపేద్దాం, ఫ్రెండ్షిప్, బిజినెస్, నువ్వు చెప్తున్నట్టు బెంగళూరులో మనం చేసిన తప్పు.. అన్నీ ఆపేద్దాం, కానీ నేను అడిగే వాటికి సమాధానం చెప్పి వెళ్ళిపో" అన్నాడు రోహన్ 

"అడుగు" అంది నివి 

"ఇప్పుడు బిజినెస్ ఆపేద్దాం అని చెప్పావ్? మీ హస్బెండ్ అడిగితే ఏమని చెప్తావ్? బెంగళూరులో ఇలా తప్పు చేసాను, అందుకే ఆపేస్తున్నాను అని చెప్తావా?" అన్నాడు రోహన్ 

"లేదు, అలా చెప్పలేను" అంది నివి మెల్లగా 

"మరి అబద్దం చెప్తావ్ అంతేనా? అది కూడా ఏమని చెప్తావ్. బిజినెస్ చేయటం నా వల్ల కావట్లేదు, ఇక రెస్ట్ తీసుకుంటాను అని చెప్తావా? మీ హస్బెండ్ కంటే నువ్వే ఎక్కువ సంపాదిస్తున్నావ్, అప్పుడప్పుడు నీ మీదనే అతను డిపెండ్ అవుతున్నాడు. అలాంటిది నువ్వు మానేస్తాను అంటే ఎలా తీసుకుంటాడు?" అన్నాడు రోహన్ 

అది విని నివి కి నిజమే అనిపించింది. అప్పుడప్పుడు శాలరీస్ కి అమౌంట్ తగ్గితే తన దగ్గరే తీసుకుంటాడు అనుకుంది.

"నువ్వు అలా సడెన్ గా ఆపేస్తే అతనికి అనుమానం కూడా రావొచ్చు. ఇక సెకండ్ క్వశ్చన్, సరే బిజినెస్ సంగతి పక్కన పెట్టు, నాతో ఫ్రెంషిప్ కట్ చేసావ్ అనుకుందాం. కానీ మన బిజినెస్ లో ఇద్దరం మాట్లాడకుండా, డీల్స్ క్లోస్ చేయాలి అంటే అవ్వదు. నువ్వు పట్టి పట్టనట్టు నాతో ఉంటూ ఉంటే ప్రేమ్ కి కచ్చితంగా ఇద్దరి మధ్య ఎదో జరిగిందని అనుమానం వచ్చేస్తుంది" అన్నాడు రోహన్ 

అవన్నీ వింటుంటే నివి నిజం కళ్ళ ముందు కనపడుతూ ఉంది. నిజమే ఇద్దరూ మాట్లాడకపోతే ప్రేమ్ కి అనుమానం వచ్చేస్తుంది.

"సరే కాసేపు నన్ను, నాతో బిజినెస్ ని వదిలేద్దాం అనుకున్నావ్. అసలు బిజినెస్ చేయటమే నీ డ్రీం కదా. దాని కోసం ఎన్ని కష్టాలు పడ్డావో అన్నీ మర్చిపోయావా? ఇప్పుడు చిన్న చిన్న వాటికి నువ్వు నీ డ్రీం ని కూడా వదిలేయాలి అనుకుంటున్నావు" అన్నాడు రోహన్.

"లేదు అలా కాదు" అంది నివి అయోమయంగా. తన బ్రెయిన్ అసలు పనిచేయట్లేదు. రోహన్ మాట్లాడుతుంటే నిజమే అనిపిస్తుంది.

"సరే ఒకవేళ నాతో బిజినెస్ వదిలేసి నువ్వే వేరే కంపెనీ పెట్టావ్ అనుకుందాం. నేను హ్యాండిల్ చేస్తున్న క్లయింట్స్ నన్ను కాదు అని నీ దగ్గరికి వస్తారా? ఇంత పెద్ద క్లయింట్స్ ని నువ్వు మళ్ళీ తెచ్చుకోగలవా? 0 నుండి మొదలుపెట్టాల్సి వస్తుంది నువ్వు" అన్నాడు రోహన్ 

అతని ప్రతీ మాట తన మనసుని తాకుతూనే ఉంది. చెప్పిన అన్నీ మాటలు నిజమే అనిపిస్తున్నాయి. రోహన్ లేకుండా తను బిజినెస్ చేయటం చాలా కష్టం. 

"ఒక్కటి గుర్తు పెట్టుకో నివి, వదిలేయటానికి క్షణం పట్టదు. కానీ దాని తర్వాత జరిగే పరిణామాలని తట్టుకోవాలి అంటే చాలా ధైర్యం కూడా ఉండాలి. నేనేం చెప్తాను అంటే ఈ ఫ్రెండ్షిప్, ప్రేమ, కోరికలు, లస్ట్ అన్నీ పక్కన పెట్టి ముందు నీ కెరీర్ మీద ఫోకస్ చెయ్" అన్నాడు రోహన్.

అదంతా విన్నాక నివి మళ్ళీ ఆలోచనలో పడింది. బెంగళూరులో అలా జరిగిన తర్వాత కూడా రోహన్ మళ్ళీ తనని ఇబ్బంది పెట్టలేదు. ఇంకా తను కోలుకోవటానికి టైం కూడా ఇచ్చాడు. తనని బాగా అర్ధం చేసుకున్నాడు. ఇప్పుడు ప్రేమ్ కూడా హ్యాపీగా ఉన్నాడు అంటే దానికి కారణం రోహన్ యే. ఇంత మంచి వ్యక్తి గురించి నేనే తప్పుగా అనుకుంటున్నాను. అది కాక నేనే ఎక్కువ ఆలోచిస్తున్నాను అనుకుంది. దాంతో ఆ క్షణం ఆమె మనసులోని భారం మొత్తం దిగిపోయింది.

"సారీ రోహన్, ఎదో ఆలోచిస్తూ అలా అనేసాను" అంది నివి మెల్లగా 

"సారీ లు బాగానే చెప్తావ్" అన్నాడు రోహన్ 

అది విని నివి మెల్లగా నవ్వింది.

"బెంగళూరులో అలా జరిగిన తర్వాత నుండి, మళ్ళీ ఇలా నవ్వుతూ, హ్యాపీగా ఉన్న ఫేస్ ఇప్పుడే చూసాను" అన్నాడు రోహన్ 

అతను మళ్ళీ అలా అనేసరికి ఒక్క క్షణం నివి కళ్ళ ముందు బెంగుళూరులో జరిగింది మెదిలింది. లేదు లేదు నేనే ఎక్కువ ఆలోచిస్తున్నాను అనుకుని సైలెంట్ గా ఉండిపోయింది.

"రెండు రోజుల్లో మళ్ళీ మనం బెంగళూరు వెళ్ళాలి" అన్నాడు రోహన్ 

అది వినగానే ఒళ్ళంతా వణికిపోయింది. మళ్ళీ అక్కడికి వెళ్తే రోహన్ ఏమైనా చేస్తాడా? అనే ఆలోచన ఆమె మనసులో భూకంపం పుట్టించింది. లేదు నేను రాను అని నోరు తెరిచి సమాధానం చెప్పేలోపు 

"ఈ సారి ప్రేమ్ ని కూడా రమ్మని చెప్పు. మనం అక్కడ ఎలా వర్క్ చేస్తామో కూడా అతనికి తెలుస్తుంది కదా. అది కాక ఇద్దరికీ మంచి టైమ్ కూడా దొరుకుతుంది. నువ్వు కూడా కాస్త ఫ్రీ అయ్యావ్ అనుకో అతనికి కావాల్సింది ఇవ్వగలవు." అన్నాడు రోహన్ 

తన మంచి కోసం ప్రతీది చెప్తున్న రోహన్ మీద ఇంకా గౌరవం పెరిగింది నివిలో.

"థాంక్స్ రోహన్" అంది కృతజ్ఞతగా.
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
RE: తప్పు ఎవరిదీ? - by iHellBoy69 - 26-07-2026, 02:55 PM
RE: తప్పు ఎవరిదీ? - by Uday - 25-08-2026, 07:44 PM
RE: తప్పు ఎవరిదీ? - by Uday - 26-08-2026, 12:37 PM



Users browsing this thread: 5 Guest(s)