3 hours ago
(Yesterday, 05:58 AM)stories1968 Wrote:థాంక్స్ బ్రో, నీ అభిప్రాయం చాలా బాగా వివరించావు. .నువ్వు చెప్పిన విషయం నాకు పూర్తిగా అర్థమైంది. మన తెలుగు కథల ప్లాట్‌ఫామ్‌లలో (ముఖ్యంగా మన సైట్లు) నిజంగా వల్గర్ కామెంట్స్, బూతులు, అనవసరమైన నెగెటివిటీ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఒక రచయిత ఫ్రీగా తన సమయం కేటాయించి కథ రాసి పోస్ట్ చేస్తే, కనీసం గౌరవంగా చదివి ఎంజాయ్ చేయాల్సింది పోయి, కొందరు అసభ్యంగా మాట్లాడటం, బాడీ షేమింగ్, వ్యక్తిగత కామెంట్స్ తో దాడులు చేయడం వంటివి జరుగుతున్నాయి. ఇది రచయితలను నిరుత్సాహపరుస్తుంది, మంచి పాఠకులను కూడా దూరం చేస్తుంది.హిందీ సైడ్ లో ఇది తక్కువ ఉండటానికి ప్రధాన కారణం వాళ్ళలో కమ్యూనిటీ సెన్స్ కొంచెం ఎక్కువగా ఉండటం, మోడరేషన్ కూడా మంచిగా ఉండటం అని నాకు అనిపిస్తుంది. వాళ్ళ రచయితలు కామెంట్స్‌ని స్పోర్టివ్‌గా తీసుకుని రిప్లై ఇవ్వడం నీకు అనుభవం అయినందుకు సంతోషం. అలాంటి పాజిటివ్ వైబ్ మన దగ్గర కూడా ఎక్కువగా వస్తే బాగుంటుంది.మన తెలుగులో కూడా చాలా మంచి రచయితలు, మంచి పాఠకులు ఉన్నారు. కానీ కొద్దిమంది టాక్సిక్ ఎలిమెంట్స్ వల్ల మొత్తం వాతావరణం పాడవుతోంది. నువ్వు చెప్పినట్టు, కథ చదివి మనకు వచ్చిన ఆలోచనలు/సూచనలు కామెంట్ చేయకుండా ఉండడం చాలా కష్టం. అది సహజం. కానీ ఆ కామెంట్‌ని ఎలా ఫ్రేమ్ చేస్తే రచయితకి ఇబ్బంది కలగకుండా ఉంటుందో కూడా మనం ఆలోచించాలి. . ఇంకా కొంచెం ఎక్కువగా రాస్తే సహజంగా మరింత మెరుగుపడుతుంది. క్రమం తప్పకుండా రాయడం, మంచి రచయితల కథలు చదవడం ద్వారా భాష ఆటోమేటిక్‌గా ఇంప్రూవ్ అవుతుంది.మంచి రచయితలను మాత్రమే ఫాలో చేసి, వాళ్ళ కథలను మాత్రమే చదవడం ఒక మంచి ఫిల్టర్.. కంటిన్యూ రాయ్ బ్రో. మంచి రచనలు ఎప్పటికీ వాటి విలువ కోల్పోవు. మీరు మీ రచనలలో బొమ్మలు పెట్టక పోవడం ఉదా నచ్చిందిమీ రచనలు చదివి ఒక పాటకరాలు తన అభిమానాన్ని
మీరు పాజిటివ్ కామెంట్స్ గురించి చెప్పారు కాబట్టి మొన్ననే ఒక హిందీ కథలో పెట్టిన ఒక కామెంట్ గురించి ఇక్కడ ప్రస్తావిస్తాను, ఎందుకంటే ఒకవేళ అదే కామెంట్ మన తెలుగు కథకి పెట్టివుంటే అది ఎంత పెద్ద దుమారం లేపివుండేదో మీరు ఊహించుకోండి.
నేను కొన్ని హిందీ కథలని చదువుతున్నాను కరెక్ట్ గా చెప్పాలంటే ఓ నాలుగు కథలు. వాటిని కూడా మన తెలుగు లోకి అనువదించాలన్న ఆలోచన వుంది. ఇక టాపిక్ లోకి వస్తాను.
నేను చెప్పిన సదరు కథ కి గత నెల రోజులనుండి అప్డేట్ లు రావడం లేదు. చాలామంది రిక్వెస్ట్ లు చేస్తూ కామెంట్స్ పెడుతున్నారు, కొంతమంది ఏమో కథని మధ్యలోనే ఆపేసినట్లా అని కొంచెం నిష్టూరంగా అడుగుతున్నారు. వల్గర్ గా ఎవరూ కామెంట్ పెట్టలేదు కానీ "మీరు కూడా అసంపూర్తిగా కథని మధ్యలోనే వదిలేసి వెళ్లిన రచయితల్లో ఒకడిగా మిగిలిపోయారు" లాంటి కామెంట్స్ కూడా పెట్టారు.
మొన్ననే ఆ రచయిత ఒక పిక్ ని షేర్ చేసాడు, ముఖాలు కనిపించకుండా సెలూన్ షాప్ లో ఉన్నట్లు, చుట్టూ కట్ చేసి వున్న జుట్టుతో వున్న పిక్ అది. "ప్రస్తుతం ఇక్కడ వున్నాను" అని ఓ కాప్షన్ దానికి పెట్టాడు.
మరుసటి గంటలో ఎవరో ఒక పాఠకుడు దానికి "మీరు పార్ట్ టైం ఈ వుద్యోగం కూడా చేస్తారా ?" అన్న ఒక కామెంట్ ఒక స్మైలీ తో పెట్టాడు. చదివిన నాకే కొద్దిగా ఆ కామెంట్ ఓవర్ గా అనిపించింది. మరుసటి రోజు ఆ రచయిత దానికి ఇచ్చిన సమాధానం "లేదు బ్రో, నెల రోజులనుండి పెరిగిన అనవసర భాగాన్ని (జుట్టు) వదిలించుకోవడానికి వచ్చాను" అని.
అర్ధమైవుంటుంది ఆ రచయిత ఈ ఎక్సట్రా కామెంట్స్ గురించి ఇలా చెప్పాడని. నిజంగా అతని సెన్స్ అఫ్ హ్యూమర్ & అతను టాకిల్ చేసిన పద్దతి & అతని స్పోర్టివ్ స్పిరిట్ చాలా నచ్చింది.
నేను రాసే కథల్లో మాత్రం బొమ్మలు పెట్టకపోవడం గురించి చెప్పారు. నేను నా కథలో బొమ్మలని పెట్టడానికి ఇష్టపడను ఎందుకంటే చదివే పాఠకుడు తనకి నచ్చినట్లు ఊహించుకునే అవకాశాన్ని ఈ బొమ్మలు పాడుచేస్తాయని అనుకుంటాను. కానీ వేరేవాళ్లు ఊహించి పెడితే (మీరు పెడుతున్నట్లు) నాకు అందుకు అభ్యంతరమేమీ లేదు ఎందుకంటే అది మీ వూహ కాబట్టి. అది నేను కూడా ఎంజాయ్ చేస్తాను కాబట్టి.


![[Image: 7nj5z5zuhsch1.gif]](https://i.ibb.co/vx3s7fXz/7nj5z5zuhsch1.gif)
![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)