Thread Rating:
  • 0 Vote(s) - 0 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Love నేను ప్రేమిస్తున్నాను - 2
#2
మర్నాటి నుంచి ఇద్దరి మధ్య స్నేహం బాగా బలపడింది. రోజూ ప్రేమతో పలకరించుకుంటూ.. మంచి ఫ్రెండ్స్ గా ఉండేవారు. స్నేహానికి పునాది పడింది. తరుణంలో కాలేజీ కు ఒక నెల రోజులు సెలవులిచ్చారు. కంప్యూటర్ కోర్స్ కంప్లీట్ అవకపోవడం చేత.. కంప్యూటర్ ల్యాబ్ మాత్రం ఓపెన్ చేసే ఉంచారు. ప్రాక్టీసు చేసుకోవల్సిన వారు ల్యాబ్ స్లాట్ బుక్ చేసుకుని.. వెళ్ళచ్చు. నెలలో మొత్తం అన్నీ స్లాట్లు ఇద్దరూ బుక్ చేసుకున్నారు. సెలవుల్లో కలుసుకోవడానికి ఇంతకన్నా మంచి మార్గం లేదని అనుకున్నాడు వంశీ.. 



మొదటి రోజు ల్యాబ్ లో కలిసినప్పుడు.. విచిత్రమైన సంఘటన జరిగింది. సంఘటన వంశీ కు జీవితాంతం గుర్తుండి పోయే విషయం. అదే రోజు వంశీ కన్నా, స్వాతి ముందుగా వచ్చి ల్యాబ్ బయట నిల్చొని ఉంది. వంశీ మెట్లు ఎక్కి వచ్చేసరికి స్వాతి తన అందమైన చిరునవ్వుతో " హాయ్.. వంశీ" అని అంది. 
"హాయ్ స్వాతి!.. ఎప్పుడు వచ్చావు.. ?" అని వంశీ అడిగాడు 
"ఇప్పుడే వచ్చాను.. "
"బయట ఉన్నావేమిటి.. ?"
"పవర్ లేదు.. లోపల గాలి లేదు.. " అంది స్వాతి



ఐనా.. వంశీ లోపలికి వెళ్దామంటే, ఇద్దరు లోపలికి వెళ్లారు. స్వాతి పక్కనే వంశీ కూర్చొని ఉన్నాడు. ఇద్దరికీ స్నేహం ఉన్నా, ఒకరి పర్సనల్ విషయాలు ఒకరికి తెలియవు. లోపల వెలుతురు తక్కువుగా ఉన్నా.. స్వాతి ముఖంలో వెలుగు.. రూమ్ కి మరింత వెలుగు తెచ్చింది. 



"మీ ఇంటి పేరేమిటి.. ?" అడిగింది స్వాతి
"వంశీ తన బుక్ మీద రాసి చూపించాడు.. "
"ఓకే.. గ్రేట్.. "
"ఫస్ట్ ఇయర్ లో ఎంత పర్సెంటేజ్ వచ్చింది.. ?" అడిగింది స్వాతి
" డిస్టింక్షన్ వచ్చింది.. "
"నాకైతే చూడు.. సెకండ్ క్లాసు వస్తుందేమో.. " అని మూతి తిప్పుతూ.. అంది స్వాతి
"జోకులు వద్దు స్వాతి!"
====================================================================
ఇంకా వుంది.. 
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply


Messages In This Thread
RE: నేను ప్రేమిస్తున్నాను - by k3vv3 - 12-07-2026, 05:26 PM



Users browsing this thread: 1 Guest(s)