Thread Rating:
  • 0 Vote(s) - 0 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Drama నేటి బాంధవ్యాలు
#2
మాధవయ్యగారు హరికృష్ణగారి మేనత్త కుమారుడు. వారు... మ్యారేజ్ బ్రోకర్... పురోహితుడు... మంచి మాటకారి.... వాలున తిరగలిని త్రిప్పినా పిండి తనవైపే పడాలనే లక్ష్యవాది. అవసరానికి అబద్ధాలు చెప్పడం అంటే వారికి మంచినీళ్ళను త్రాగడంతో సమానం....
"ఏరా!... హరీ.... బాగున్నారా అంతా!..."


"ఆఁ.....ఆఁ.... రా బావా.... రా... కూర్చో!..."


మాధవయ్యగారు హరికృష్ణ ముందరి కుర్చీలో కూర్చున్నాడు.
"ఏమిటి బావా!.... విశేషాలు!...." చిరునవ్వుతో అడిగాడు హరికృష్ణ.


"అదృష్టం నీ వాకిటిని వెతుక్కుంటూ వస్తూ వుందిరా!..." వికారంగా నవ్వాడు మాధవయ్య.


"నీ మాట నాకు అర్థం కాలేదు బావా!..."


"వివరంగా చెబుతాను విను...."


దీక్షగా హరికృష్ణ మాధవయ్య ముఖంలోకి చూడసాగాడు ఏం చెబుతాడో అని.
"మన ప్రజాపతి!...."


"ఏమయింది వాడికి!..." వ్యంగ్యంగా అడిగాడు హరికృష్ణ


"వాడికేం కాలేదురా!... వాడు మహారాజుయె!..." నవ్వాడు మాధవయ్య.


"నన్ను నీతో మాట్లాడమని పంపాడు..."


" విషయంలో!..."


"తన కొడుకు సీతాపతి... వివాహ విషయంలో!...."


"వాడి కొడుకు వివాహాన్ని గురించి నీవు నాతో ఏం మాట్లాడాలి!..." ముఖం చిట్లించి మాధవయ్య ముఖంలోకి చూస్తూ అడిగాడు హరికృష్ణ.


"నేను చెప్పబోయే విషయాన్ని అలా వుంచు. ముందు నీవు గతాన్ని మరచిపోవాలి..."
"బావా!... మాధవయ్యా!... డొంక తిరుగుడు వద్దు. గతాన్ని నేను అంత సులభంగా మరువలేను. ప్రసక్తి ఇప్పుడు అనవసరం. నీవు చెప్పదలచుకొన్నదేమిటో చెప్పు."


హరికృష్ణలోని ఆవేశాన్ని చూచి మాధవయ్య జంకాడు.
"ఒరే హరీ!... నేనెవరు?.... నీ శ్రేయోభిలాషినే కదా!..."


"అయితే..."


"నేను ఏమి చెప్పినా నీ మంచికే చెబుతాను..."


"ఏమిటా మంచి!..."


"మాటకు మాట ఎలాంటి గ్యాప్ లేకుండా నాపై విసిరితే... నేను నీ గురించి ఏమనుకోవాలిరా!...."


"ఏమైనా అనుకో. అది నీ ఇష్టం... నాకు అభ్యంతరం లేదు..." వ్యంగ్యంగా నవ్వాడు హరికృష్ణ.


"లావణ్యను పిలువు!..."


"మన మధ్యన ఇప్పుడు లావణ్య ఎందుకు?..."


"బిడ్డల బాగోగుల విషయంలో నీకెంత బాధ్యత వుందో... ఆమెకూ అంతే బాధ్యత వుంది కదరా!..."


"నీవు మాట్లాడదలచుకొన్నది బిడ్డ విషయంలో... ఈశ్వరా!.... లేక శార్వరియా!..."


"శార్వరి విషయాన్ని గురించేరా!..."
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply


Messages In This Thread
RE: నేటి బాంధవ్యాలు - by k3vv3 - 12-07-2026, 03:42 PM



Users browsing this thread: 1 Guest(s)