Thread Rating:
  • 4 Vote(s) - 1 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Misc. Erotica వంచన – ప్రతీకారం - Completed (సమాప్తం)
#19
పల్లవి జీవితం ఒకప్పుడు కలలతో నిండిపోయింది. రాహుల్‌తో ఆమె ప్రేమ, ఆమెకు ప్రపంచమే అనిపించింది.
ప్రతి ఉదయం అతని కాల్‌తో మొదలయ్యేది, ప్రతి రాత్రి అతని మాటలతో ముగిసేది.

కానీ ఒక రోజు, ఆమె కళ్ళలోని నమ్మకం పగిలిపోయింది. రాహుల్ ఫోన్‌లో మరో అమ్మాయి ఫోటోలు, సందేశాలు చూసినప్పుడు ఆమె హృదయం ముక్కలైంది. "నువ్వు ఇలా చేస్తావని ఊహించలేదు రాహుల్..." అని కన్నీళ్లతో పలికింది. రాత్రి గదిలో ఒంటరిగా కూర్చున్న పల్లవి, తన హృదయం పగిలిన శబ్దాన్ని మాత్రమే విన్నది.

"నా ప్రేమ నీకు విలువలేదా?" అని తనలోతనికి ప్రశ్నించుకుంది.

ఆమె కళ్ళలో కన్నీళ్లు, హృదయంలో చీకటి.

రోజులు గడుస్తున్నాయి..కానీ పల్లవిలో మార్పు లేదు..ఒంటరిగా ఉండటం.. ఏడవడం..శివ చాలారోజులు నుండి..పల్లవిని గమనిస్తూన్నాడు..తనకి కూడా రాహుల్ మరియు పల్లవి స్టోరీ తెలుసు..కాలేజీలో ఒకరోజు పల్లవి ఒక్కతే బెంచ్ పైన కూర్చుని ఆలా శూన్యంలోకి చూస్తూ..ఆలా ఉండిపోయింది..

శివ మెల్లగా పల్లవి దగరికి వెళ్లి... ఏమి తెలియనివాడిలా హాయ్ అండి..చాలారోజులు మిములని చూస్తునాను..ఎందుకో ఒంటరిగా ఉంటున్నారు.. అని పలకరించాడు..నా పేరు శివ.. మీ గురిఞ్చి తెలుసు అండి.. మీ పేరు పల్లవి అని...అన్నాడు..

కానీ పల్లవి ఒకమాట కూడా శివతో మాట్లాడలేదు..

పల్లవి కళ్ళలోని బాధను గమనించిన శివ, నిశ్శబ్దంగా దగ్గరికి వచ్చాడు.

"పల్లవి, నీ కళ్ళలో బాధ కనిపిస్తోంది. ఏదైనా చెప్పాలనిపిస్తే చెప్పు." అని ఆత్మీయంగా అన్నాడు.

పల్లవి నిశ్శబ్దంగా, "నా జీవితం చీకటిలో మునిగిపోయింది. నమ్మకం అన్నది ఇక మిగలలేదు." అని చెప్పింది.
శివ చిరునవ్వుతో, ప్రతి ముగింపు కొత్త ఆరంభానికి దారి చూపుతుంది.అని ధైర్యం చెప్పాడు.
  
పల్లవి ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉంది..శివ మళ్లీ మాట్లాడుతూ..పల్లవి మనం నిజాన్ని ఎప్పటికి మార్చలేము..మనకు నచ్చిన నచ్చకపోయినా నిజం, నిజంలాగే ఉంటుంది..మనకోసం అది మారదు..

పల్లవి ఒక్కసారిగా శివ కళ్లలోకి సూటిగా చూసింది..అతని మాటల్లో స్పష్టత, హృదయంలో నిజం ఉంటుంది.అతను ఎవరినీ మోసం చేయడు. ఇతరుల బాధను తనదిగా భావించి, సహాయం చేయడానికి ముందుంటాడు.అతని మాటల్లో ఓదార్పు, చూపులో ఆప్యాయత ఉంటుంది.

పల్లవి (వేదనతో):  నా జీవితంలో మోసం తప్ప మరేం మిగల్లేదు…

శివ (స్నేహపూర్వకంగా, పల్లవిని ఓదారుస్తూ): జీవితం ఒక్క మోసంతో ఆగిపోదు. నీలో ఉన్న బలం నీకు తెలియదు...

శివ… నువ్వు ఎందుకు ఇలా నా కోసం మాట్లాడుతున్నావు? నా గురిఞ్చి నీకు పురిగా తెలియదు కదా....

నువ్వు నాకు తెలియకపోయినా, నీ బాధను నేను చూడగలుగుతున్నాను. నీ కన్నీళ్లు నాకు మాటలకంటే ఎక్కువ చెబుతున్నాయి.

పల్లవి (మనసులో):  "రాహుల్ చేసిన మోసం నా మనసును గాయపరిచింది… కానీ నీ మాటలు నాకు ఓదార్పు ఇస్తున్నాయి."

ఆ మాటలు పల్లవి మనసులో ఒక కొత్త వెలుగును వెలిగించాయి. రాహుల్ చేసిన మోసం ఆమెను చీకటిలోకి నెట్టినా, శివ పరిచయం ఆమెకు వెలుగునిచ్చింది.

మెల్లగా ఆమె మళ్లీ నవ్వడం నేర్చుకుంది. శివతో ఉన్న ప్రతి క్షణం కొత్త జీవితం లాగా అనిపించింది.
[+] 9 users Like nani222's post
Like Reply


Messages In This Thread
RE: వంచన – ప్రతీకారం - by nani222 - 11-07-2026, 11:09 PM



Users browsing this thread: 1 Guest(s)