Thread Rating:
  • 2 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
"ఎవరు ?" - 9
#16
"ఎవరు ? - 9"



కృష్ణే దోషి అని తేలడంతో అతని ఊరిలో అతని ఇంటి పై దాడులు మొదలయ్యాయి. ఇక్కడి నుండి వచ్చారో తెలియని కొందరు సరిత సానుభూతి పరులు ఆ దాడిలో భాగమయ్యారు.
అతను అలాంటి వాడు కాదని, చిన్నప్పటి నుండి తను ఎంతో సంస్కారంగా పెరిగాడని, అలాంటి కృష్ణ తప్పు చేశాడు అంటే, ఇక్కడేవరు నమ్మలేకపోతున్నామని ఆ చుట్టూ పక్కల వాళ్ళు... ఆందోళన కారులకు ఎంత నచ్చజెప్పినా...
ప్రయోజనం లేకుండా పోయింది. అవేం పట్టించుకోకుండా ఆవేశంతో ఇంట్లో ఉన్న వస్తువులను ధ్వంసం చేశారు వాళ్ళు.

అది తెలిసి కృష్ణ దగ్గర హాస్పిటల్ లో ఉన్న తండ్రికి అవమాన భారంతో గుండె నొప్పి, తల్లికి ఆరోగ్యం క్షీణించింది.
ఇదిలా జరుగుతుండగా...
ఇంతలోనే షాకింగ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది.
సరిత తల్లిని ఇంటర్వ్యూ చేసిన ఒక ప్రముఖ న్యూస్ చానల్ తో ఆమె విస్తుపోయే నిజాలు పంచుకున్నారు.

అవి విని యావత్ భారతదేశం ఒక్కసారిగా స్తంభించిపోయింది.
అది విన్న ప్రజల్లో కృష్ణకు వ్యతిరేకంగా చేస్తున్న తమ ధర్నాలు, నిరసనలో ఎలాంటి ధర్మం లేదనిపించింది.
అది విని ఆందోళన కారులు ఒక్కసారిగా తమ నిరసనల దారిని మరుల్చుకున్నారు...

సరిత తల్లి మీడియాతో మాట్లాడుతూ పంచుకున్న వాస్తవాలు ఏంటంటే,
"ఈ కేసులో ఎవరినో తప్పించడానికి సెక్యూరిటీ ఆఫీసర్లు, హాస్పిటల్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారని,
అలాగే ఆ పోస్టు మార్టం రిపోర్ట్ లో కూడా తప్పులున్నట్టు తనకి అనిపిస్తుందనీ అన్నారు.

దానికి గల కారణాలు ఆమె వివరిస్తూ....
మాకు ముందు నుండి అసలు జరిగిన విషయం ఏమిటో చెప్పలేదు. "జస్ట్ చిన్న ఆక్సిడెంట్ అయ్యింది, ఏం పర్లేదు ముందు మీరు తొందరగా ఇక్కడికి రండి ",అని మాత్రమే చెప్పి, ఏదో హడావిడిగా కాల్ కట్ చేశాడు ఆ ఎస్ఐ.
మేము హాస్పిటల్ లోపలికి వెళ్ళిన తర్వాత చాలా సేపటి వరకూ బాడీని చూపించకుండా మమ్మల్ని వెయిట్ చేయించారు హాస్పిటల్ వాళ్ళు.
చాల సేపటి తర్వాత మాకు విషయం చెప్పి మమ్మల్ని బాడీని చూడడానికి అనుమతి ఇచ్చారు.
సరిగ్గా అప్పుడే నేను నా కూతురిని ఆ దుస్థితిలో చూసి,
స్పృహ తప్పి పడిపోయాను.

అలా పడిపోయిన నన్ను, అక్కడే అదే హాస్పిటల్ లో ఒక రూములో పడుకొబెట్టి విశ్రాంతిచ్చి చికిత్స అందించారు.
అప్పుడు అక్కడ నాకు చికిత్స అందిస్తున్న కొంతమంది నర్సులు తమలో తాము మాట్లాడుకుంటూ...
"ఇది రేప్ కాదని, గ్యాంగ్ రేప్ అని,
కేసులో అసలు దోషులని తప్పించి, అక్కడ స్పాట్ లో దొరికిన వాడిని బలి చేస్తున్నారని" వాళ్ళు మాట్లాడుకోవడం ...
అప్పుడే కొద్ది కొద్దిగా స్పృహలోకి వస్తున్న నా చెవిలో పడ్డాయి.
కళ్ళు మూసి ఉండడం వలన నేను వాళ్ళని చూడలేదు.

లేచి చూసేసరికి తీరా వాళ్ళు అక్కడ లేరు,
డిశ్చార్జ్ అయ్యి వచ్చే టైంలో బిడ్డ పోయి పుట్టెడు దుఃఖంలో ఉండడం వలన ఆ విషయాన్ని అక్కడ నేను గట్టిగా ఎవర్ని అడగలేకపోయాను.

అక్కడున్న సెక్యూరిటీ ఆఫీసర్లతో అల్నా నర్సుల దగ్గర విన్న విషయం చెప్పినా వారు పెద్దగా పట్టించుకోలేదు.
అక్కడ పోస్టుమార్టం చాలా హడావిడిగా చేయించి,
ఇక్కడ దహన సంస్కారాలు కూడా చాలా వేగంగా చేయిచారు మాతో...

కచ్చితంగా ఇందులో ఏదో పెద్ద కుట్ర దాగున్నట్టు అనిపిస్తుంది.
ఈ కేసుని రాష్ట్ర ప్రభుత్వం కాకుండా సీబీఐ తో విచారణ చేయించాలి. అప్పుడే అసలు దోషులు ఎవరో బయటపడుతుంది. తద్వారా నా బిడ్డకు కూడా న్యాయం జరుగుతుంది. దయచేసి ఈ విషయాన్ని మీడియా ద్వారా ప్రపంచానికి తెలియచెప్పండి. ఎందుకంటే, మాలా న్యాయం కోసం పోరాడలేని ఆడపిల్లల తల్లిదండ్రులు అయినా కనీసం తమ పిల్లలకి ఇలాంటివి మళ్ళీ మళ్ళీ జరగకుండా వారిని కాపాడుకుంటారు."
అంటూ ఆమె చేతులెత్తి బాధపడుతూ వేడుకుంటూ వాపోయింది.

ఈ కేసులో ఇదే కీలక మలుపు.
ఈ విషయం క్షణాల్లోనే మీడియా, సోషల్ మీడియా ద్వారా దేశమంతా పాకింది.
ఒక పక్క హాస్పిటల్ యాజమాన్యం మాత్రం ,
ఆమె చెప్పేదంతా కేవలం ఆమె అపార్థం చేసుకోవడం వలన పొరపాటుగా ఆమెకు ఏర్పడిన అపోహా మాత్రమేనని, అలాంటి తప్పుడు రిపోర్ట్స్ మా హాస్పిటల్ ఇవ్వదని వారి వాదన.

ఇందులో ముమ్మాటికీ కృష్ణ ఇన్వొలెమెంట్ ఉందని,
అతనే ఈ కేసులో సూత్రధారి అని,
సరిత తల్లి ఆ రోజు స్పృహలో లేకపోవడం వలన, పైగా కూతురును పొగిట్టుకున్న దుఃఖంలో ఆమె అలా మాట్లాడి ఉండవచ్చని, ఇందులో అసలు గవర్మెంట్ కి ఏం సంబంధం లేదని, ఆమె చేసేవన్నీ నిరూపణ కాని ఆధారాలని,
ఒకపక్క హాస్పిటల్ వర్గాలు, మరోపక్క సెక్యూరిటీ ఆఫీసర్లు తమ వాదనను ఏకీభవించుకుంటున్నాయి.

అసలే ప్రభుత్వం మీద ఈ సంఘటనతో తీవ్ర వ్యతిరేకతతో ఉన్న ప్రజలంతా...
సరిత తల్లి యొక్క ఆ వివరణతో మరింత తీవ్ర రూపం దాల్చింది.
ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలు అన్ని ఈ ప్రొటెస్ట్ ని మరింత ఉదృతంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారుస్తున్నాయి.

ఆ ధర్నాను అడ్డుపెట్టుకుని కొన్ని అసాంఘిక వ్యక్తులు ఆ హాస్పిటల్ మీద దాడి చేసి, హాస్పిటల్ ఫర్నిచర్ ధ్వంసం చేశారు.
కొంతమంది హాస్పిటల్ సిబ్బంది మరియు హాస్పిటల్ లోని పేషంట్స్ చాలా ఇబ్బందికి గురయ్యారు.

అలాగే కొంతమంది ఆందోళన కారులు,
సెక్యూరిటీ ఆఫీసర్లు ప్రవర్తించిన పనితీరు మీద అసహనం వ్యక్తం చేస్తూ, కూకట్పల్లి పరిధిలోని సెక్యూరిటీ ఆఫీసర్స్టేషన్ పై  అక్కడున్న కానిస్టేబుల్స్ పై దాడి చేసి, తమ నిరసనలు తెలియజేస్తున్నారు.

ఈ సంఘటనతో నగరం, రాష్ట్రంతో పాటు ఆఖరికి దేశంలో కూడా పరిస్థితులు చేయి దాటి పోయి అట్టుడుకుతుండడంతో
రాష్ట్ర ముఖ్య మంత్రి ఉన్న ఫలంగా ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టు లో విచారించాల్సిందిగా ఆదేశించారు.

ఇక ఆ ఫాస్ట్ ట్రాక్ కోర్టు లో ....
సరిత తరుపున సామాజిక బాధ్యత తీసుకున్న కొంతమంది న్యాయవాదులు...
కృష్ణ తరుపున అతని బంధువైన ప్రాక్టీస్ లాయర్...
అలాగే ప్రభుత్వం తరుపున ప్రభుత్వ లాయర్లు
తమ వాదోపవాదనలు వాడి వేడిగా వినిపించారు.

ఆ సమయంలో...
సెక్యూరిటీ ఆఫీసర్లను సాక్ష్యులుగా, అలాగే వారు సేకరించిన వివరాలను, విచారించిన వ్యక్తుల వద్ద సేకరించిన డిటైల్స్ ను క్షుణ్ణంగా పరిశీలించింది ఆ న్యాయస్థానం.

అంతా బాగానే ఉన్నట్టు న్యాయస్థానం పేర్కొన్నా....
"ఒక్కడే ఈ పనిని చేయడం అసాధ్యమని, ఆమెను అంత అత్యంత దారుణంగా రేప్ చేసి చంపడం, కేవలం ఒకరి వలన కచ్చితంగా జరగదని, అది కచ్చితంగా గ్యాంగ్ రేప్ అని" కృష్ణ తరుపు న్యాయవాది వాదన.
అలాగే అతను వాదిస్తూ
కృష్ణ చాలా సౌమ్యుడని, అతనికి ఎలాంటి చెడు అలవాట్లు లేవని అతని గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా చెప్తారని,
పైగా అతనొక రచయిత. సమాజంలో జరుగుతున్న అరాచకాలు, అక్రమాల మీద తన రచనల ద్వారా గళం విప్పి చెప్పే గుణం అతనిది.
అలాంటి వారిపై గంజాయి, డ్రగ్స్ అడిక్టర్ అంటూ నిందలు మోపి, అతన్ని హత్యాచార నేరస్తుడిగా చిత్రీకరించడంలో
సెక్యూరిటీ ఆఫీసర్లు, డాక్టర్లు పాత్ర ఉందని,
వాళ్ళు ఎవరో ప్రముఖులను సేవ్ చేయడానికి ఈ నిందను కోమాలో ఉన్న కృష్ణ పై అన్యాయంగా తోస్తున్నారని,

అలాగే పోస్టుమార్టం రిపోర్ట్ లో కూడా తప్పులున్నట్టు సరిత తల్లి లాగానే, తనకు కూడా అనుమానాలు ఉన్నాయని, ఈ కేసును సరిత తల్లి చెప్పినట్టుగా కచ్చితంగా సిబిఐ కి అప్పగించాలని,
అప్పుడే అసలు నిజానిజాలు నిగ్గుతేలతాయని" కృష్ణ తరుపు ప్రాక్టీసు న్యాయవాది చాలా బలంగా తన వాదన వినిపించాడు.

ఇక ఇటుపక్క ప్రభుత్వ న్యాయవాదులు మాత్రం...
"ఈ విచారణను సీబీఐ కి అప్పగించమని కృష్ణ తరుపు లాయర్ వాదనని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
ఇలా ప్రతి కేసు సీబీఐ కి అప్పగిస్తే, రాష్ట్ర పరువు ఏమౌతుందని,
రాష్ట్రంలో న్యాయ వ్యవస్థ ప్రశ్నార్థకమవుతుందని,
ఇలాంటి చర్యలు రాష్ట్రానికి సిగ్గుచేటని, రాష్ట్ర సెక్యూరిటీ ఆఫీసర్లు తోనే దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని వారి వాదన..."

ఇక ఇటు...
కృష్ణ తరుపు ప్రాక్టీసు లాయర్...
సీబీఐ కి ఇస్తే ప్రభుత్వ లాయర్లు ఎందుకు అంత భయపడుతున్నారని,
సెక్యూరిటీ ఆఫీసర్లే హంతకులకు కొమ్ముకాస్తున్నట్టు రుజువైందని,
ఈ కేసుని ఇంకా ఇలాగే సాగదీస్తే రాష్ట్ర ప్రభుత్వానికి మంచిది కాదని, ప్రజల ఆగ్రహవేషాలకు ఇంకా లోను కావాల్సి ఉంటుందని....
అతని వాదన....

నేరస్తుడు రచయిత అయినా ... అతనెంత గొప్పవాడైనా ...
చట్టం దృష్టిలో నేరారోపణలు ఎదుర్కుంటే, అతను నిర్దోషిగా తేలేవరకూ అతన్ని చట్టం దోషిగానే పరిగనిస్తుందని
ఆ న్యాయమూర్తి ప్రాక్టీసు లాయర్ నీ హెచ్చరించాడు.

అలాగే,
"రాష్ట్రంలో న్యాయవ్యవస్థ, సెక్యూరిటీ ఆఫీసర్లు, ప్రభుత్వ పరువు గురించి ఆలోచిస్తున్న...
ప్రభుత్వ న్యాయవాదులు ..
రాష్ట్రంలో ఎన్ని నేరాలు, ఘోరాలు జరుగుతున్నప్పుడు రాష్ట్ర పరువు ఏమౌతుందన్న విషయం గుర్తుకు రాలేదా ?" అంటూ ప్రభుత్వ లాయర్లను ప్రశ్నిస్తూ వారిపై అక్షింతలు వేసింది.

కృష్ణ డ్రగ్ అడిక్ట్ అని ప్రూవ్ చేయడానికి ఒక్క ఆ డాక్టర్ లు ఇచ్చిన రిపోర్ట్ తప్ప, గతంలో అతను డ్రగ్ తీసుకున్నట్టు కానీ, అతను అమ్మాయిలతో మిస్బిహేవ్ చేసినట్టు కానీ, ఎలాంటి ఆధారాలు కోర్టుకు సమర్పించలేకపోయారు ఆ ప్రభుత్వ తరుపు లాయర్లు.
అలాగే సరిత బాడి కి జరిగిన గాయాలు గమనిస్తే, అవి ఒకరి వల్ల జరిగినవి కావని, అందులో ఇంకొంత మంది పాత్ర ఉండొచ్చనే ఆధారాలు ప్రాక్టీసు లాయర్ చూపించడంతో...
రాష్ట్రంలో నిరసనలు దృష్టిలో పెట్టుకొని,
పైగా ఈ కేసులో అనుమానాలు వ్యక్తం చేస్తూ....
ఫాస్ట్ ట్రాక్ యొక్క న్యాయమూర్తి ఈ కేసుని సీబీఐ కి బదిలీ చేశారు.


ఈ కేసుతో నిజంగానే కృష్ణకి సంబంధం  లేదా ?

అతనికి సంబంధం లేకపోతే మరి ఈ కేసులో అసలు దోషులెవరు ?
ఈ కేసుని సీబీఐ కి అప్పగించడంతో కనీసం ఈ కేసు ఇప్పుడైనా ఓ కొలిక్కి వస్తుందా ?

అన్న విషయాలు తెలుసుకోవాలంటే…

"ఎవరు ? - 10"
 
రిలీజ్ అయ్యే వరకు కాస్త ఓపిక పట్టండి....

ఇప్పట్లో రాకపోవచ్చు
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply


Messages In This Thread
"ఎవరు ?" - 9 - by k3vv3 - 06-04-2026, 04:46 PM
RE: "ఎవరు ?" - by k3vv3 - 15-04-2026, 07:24 PM
RE: "ఎవరు ?" - 1 - by Uday - 18-04-2026, 01:00 PM
RE: "ఎవరు ?" - 1 - by k3vv3 - 18-04-2026, 06:13 PM
RE: "ఎవరు ?" - 1 - by k3vv3 - 25-04-2026, 09:48 AM
RE: "ఎవరు ?" - 2 - by k3vv3 - 03-05-2026, 06:47 PM
RE: "ఎవరు ?" - 3 - by junior1972 - 03-05-2026, 11:50 PM
RE: "ఎవరు ?" - 3 - by k3vv3 - 04-05-2026, 08:20 AM
RE: "ఎవరు ?" - 3 - by k3vv3 - 12-05-2026, 10:45 PM
RE: "ఎవరు ?" - 4 - by k3vv3 - 21-05-2026, 01:03 PM
RE: "ఎవరు ?" - 5 - by sunil879 - 23-05-2026, 09:35 PM
RE: "ఎవరు ?" - 5 - by k3vv3 - 30-05-2026, 10:44 PM
RE: "ఎవరు ?" - 5 - by k3vv3 - 30-05-2026, 10:45 PM
RE: "ఎవరు ?" - 6 - by k3vv3 - 10-06-2026, 01:07 PM
RE: "ఎవరు ?" - 7 - by k3vv3 - 24-06-2026, 04:30 PM
RE: "ఎవరు ?" - 8 - by k3vv3 - Yesterday, 12:15 PM



Users browsing this thread: 1 Guest(s)