Thread Rating:
  • 3 Vote(s) - 4.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నేను చదివిన కథలు - అందమైన అబద్ధం
భర్త చెప్పిన 'అందమైన అబధ్ధానికి ' మనసులోనే నవ్వుకుంది సుజాత. తన భర్త మనసు గురించి, స్నేహితురాలి గురించి తెలుసు కనుక వాళ్ల మీద తనకేమాత్రం అనుమానం లేదు. పైగా రాధకు తన భర్త చేసిన సాయం విని అతన్ని మనసులోనే మెచ్చుకుంది సుజాత. 



 ఒక ఆదివారం నాడు రాధను తన ఇంటికి భోజనానికి పిలిచింది సుజాత. రాధ రాగానే హరిని, వంశీని పరిచయం చేసింది. రాధను తన స్నేహితురాలిగా భర్తకు పరిచయం చేసింది. ముద్దులొలికే వంశీని చూసి రాధ చాలా ముచ్చట పడింది. రాధా, హరి ఒకళ్లనొకళ్లు ఆనందంతో, ఆశ్చర్యంగా చూడటం గమనించిన సుజాత "మీరిద్దరూ సహొద్యోగులు, మంచి స్నేహితులని రాధ మాటల ద్వారా తెలిసింది. అంతే కాకుండా మీరు ఒక సోదరుడిగా రాధకు చేసిన సాయం కూడా తెలుసు. ఆరోజున హోటల్ లో మీ ఇద్దరినీ చూశాను. మీ ఇద్దరి మంచి మనస్సులు నాకు తెలుసు కనుక ఈరోజు సంతోషంగా రాధను భోజనానికి పిలిచి ఇలా సమావేశం ఏర్పాటు చేశాను " అన్న సుజాత మాటలకు హరి కళ్లు చెమర్చాయి. "అయామ్ సారీ సుజీ. ఆనాడు నేను నీతో అబధ్ధం చెప్పాను. నన్ను క్షమించు. " అని సుజీని దగ్గరకు తీసుకున్నాడు హరి. నవ్వుతూ భర్త కౌగిలిలో గువ్వలా ఒదిగిపోయింది సుజాత. రాధ, వంశీ చప్పట్లతో సుజాత తెప్పరిల్లి సిగ్గుపడి "అందరం సంతోషంగా భోజనాలు చేద్దామంటూ" డైనింగ్ టేబుల్ వద్దకు దారి తీసింది. వంశీని ఎత్తుకొని రాధ, హరి ఆమెను అనుసరించారు. 



కబుర్లతో అందరూ భోజనాలు పూర్తి చేశాక రాధకు మంచి చీర పెట్టి " చూడు రాధా! దేవుడు నాకు హరి లాంటి మంచి భర్తను, నీలాంటి మంచి స్నేహితురాలిని ఇచ్చినందుకు మనస్సులోనే దేవుడికి ధన్యవాదాలను తెలుపుకుంటున్నాను " అని హత్తుకున్న సుజాతను చూసి రాధ కళ్లు, హరి కళ్లు ఆనంద భాష్పాలతో చెమర్చాయి. 



"నీలాంటి స్నేహితురాలు ఉన్న నేను చాలా అదృష్ట వంతురాలిని సుజీ " అని వాళ్ల వద్ద వీడ్కోలు తీసుకుని తన ఇంటికి వెళ్లింది రాధ. 
[font="var(--ricos-font-family,unset)", serif]   ….[/font]సమాప్తం[font="var(--ricos-font-family,unset)", serif].[/font]
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply


Messages In This Thread
RE: నేను చదివిన కథలు - మిస్ యూ అమ్మా.. ! - 2 - by k3vv3 - 10 hours ago



Users browsing this thread: 1 Guest(s)