Thread Rating:
  • 2 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
"ఎవరు ?" - 8
#15
"ఎవరు ? - 8"


"ఎవరు ? - 7" కి
కొనసాగింపు...
చూస్తుండగానే ఆ రోజు మధ్యాహ్నం కావొస్తోంది. ఇటు సరిత తల్లిదండ్రులు, అటు కృష్ణ తల్లిదండ్రులు తమ ఊర్ల నుండి కంగారు కంగారుగా పోలిసు స్టేషన్ కి చేరుకున్నారు.
కానీ, అక్కడ ఎస్ఐ హరినాథ్ లేడు. అప్పటికి వరకూ కేసు విచారణలో మునిగిపోయి ఉన్న అతను, అప్పుడే భోజనానికి వెళ్ళాడు.
అదే విషయం, అక్కడున్న స్టేషన్ సిబ్బంది వాళ్ళకి చెప్పి, అతను వచ్చేవరకూ వెయిట్ చేయమని చెప్పారు.

అసలే తమ పిల్లలకి ఏమైందోనని తల్లడిల్లిపోతున్న ఆ తల్లిదండ్రులు...
సెక్యూరిటీ ఆఫీసర్ వారిని తమ పిల్లల గురించి ఎంత ఆరా తీసినా... వాళ్ళు మాత్రం ఎలాంటి సమాధానం ఇవ్వడం లేదు.
"ఎస్ఐ గారు వచ్చేవరకూ వెయిట్ చెయ్యండమ్మా
ఆయనే మీకు అన్ని వివరాలు చెప్తారు " అంటూ విసుకుంటున్నారు.

సరిగ్గా అదే టైం కి అక్కడికి వచ్చాడు కృష్ణ బంధువైన
ఆ ప్రాకీసు లాయరు కూడా...

అతన్ని కూడా కృష్ణ తండ్రి ఎంత అడిగినా...
అతను కూడా మౌనంగానే ఉండి...
"ఏం కాలేదు చిన్న ఆక్సిడెంట్ అంతే !" అంటూ వాళ్ల దగ్గర అసలు విషయం దాచి, వాళ్ళకి కొంచెం ధైర్యం చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు.

దారిలోనే ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న కృష్ణ మరియు సరిత తల్లిదండ్రులతో వచ్చిన ఆ ఒకరిద్దరు బంధువులు కూడా అసలు విషయం వివరించలేక లోలోపల సతమతమైపోతున్నారు.
ఇక ఈ లోపు SI హరినాథ్ భోజనం ముగించుకుని స్టేషన్ కి వచ్చాడు.
సరిత మరియు కృష్ణ తల్లిదండ్రులు వచ్చారన్న విషయం తెలుసుకుని లోపలికి తన రూం లోకి పిలిచాడు.

వాళ్ళు వెళ్ళడంతోనే అతన్ని ఆరా తీయడం మొదలు పెట్టారు ఆ తల్లిదండ్రులు.
ఇక అతను...
"మీరు కాసేపు టెన్షన్ పడకుండా మౌనంగా ఉంటే, మీకే అన్ని విషయాలు అర్థమవుతాయి." అంటూ హరినాథ్ వాళ్ళని హెచ్చరిస్తాడు.

ముందు మా వాడికి ఏమైందో చెప్పండి అంటూ కృష్ణ తండ్రి ..
ముందు మా అమ్మాయికి ఏమైందో చెప్పండి, తను అసలు ఎక్కడుంది" అంటూ సరిత తండ్రి...
బాధలో ఉన్న ఆవేదనతో హరినాథ్ నీ ప్రశ్నిస్తునే ఉన్నారు.

అసలే కేసు కొలిక్కి రాక చిరాకు లో ఉన్న హరినాథ్...
ఆ కోపాన్ని వాళ్ల పై చూపిస్తూ...
"కాసేపు ఏం మాట్లాడకండి.
సైలెంట్ గా ఉండండి అని చెప్పానా !" అంటూ వాళ్ళని కసురుకున్నాడు.

దాంతో వాళ్ళు కాస్త భయపడి, చేసేదేం లేక మౌనంగా ఉండిపోయి వాళ్ళల్లో వాళ్ళు తల్లడిల్లిపోతున్నారు.
హరినాథ్ కూడా వాళ్ళని ఏమైనా విచారించి ఇంకొన్ని వివరాలు సేకరుద్దాం అనుకున్నాడు. కానీ, వాళ్ళ కంగారు, టెన్షన్ చూస్తుంటే అసలు విచారణకు ఏమాత్రం సహకరించే పరిస్థితి లేరని అర్థం చేసుకుని, తన ఆలోచనను విరమించుకుంటాడు.
కాసేపటికి హరినాథ్ వాళ్ళందరికీ వెహికల్ (కృష్ణ పేరెంట్స్ కి సెపరేట్ గా, సరిత పేరెంట్స్ కి సెపరేట్ సెపరేట్ గా) ఏర్పాటు చేయమని కానిస్టేబుల్స్ నీ ఆదేశిస్తాడు.
వాళ్ళు అలా ఏర్పాటు చేసిన తర్వాత...
వాళ్ళందరినీ ఆ సరిత బాడీ, కృష్ణ ఉన్న హాస్పిటల్ దగ్గరకు తీసుకుని వెళ్తాడు.

ఇక కాసేపటికి అక్కడికి వాళ్ళు చేరుకున్న తర్వాత...
ఆ హాస్పిటల్ను మీడియా వాళ్ళు చుట్టుముట్టడం,
కొన్ని సంఘాల వాళ్ళు అక్కడ ధర్నాలు చేయడం చూసి,
సరిత మరియు కృష్ణ పేరెంట్స్ లలో అనుమానాలు మొదలవుతాయి.
"వాళ్ళది ఆక్సిడెంట్ మాత్రమే అయితే, ఇక్కడ ఇంతమంది ఎందుకున్నారు ?
ఇదంతా ఏంటి ?" అనుకుంటూ వాళ్ళలో వాళ్ళకి సందేహాలు రేకిత్తి, ఆ సందేహాలతో లోలోపల తర్జన భర్జన పడతారు.

వాళ్ళందరి మధ్యలో నుండి ఆ పేరెంట్స్ ని హాస్పిటల్ లోపలికి తీసుకెళ్ళి,
కాసేపటి తర్వాత వాళ్ళకి అసలు విషయం నెమ్మదిగా వివరించి చెప్పి, సరిత డెడ్ బాడిని ఆమె పేరెంట్స్ కి,

ఐసీయు లో  కోమాలో ఉన్న కృష్ణ బాడిని అతని పేరెంట్స్ కి  చూపిస్తారు.
కూతురి మరణ వార్త విని, ఆమె నిర్జీవంగా పడి ఉండడం చూసిన సరిత పేరెంట్స్ గుండె పగిలిపోతుంది. సరిత తల్లి వెంటనే స్పృహ తప్పి పడిపోతుంది.
అల్లారు ముద్దుగా పెంచుకుని, పై చదువులు చదివించి, తనకి నచ్చిన ఉద్యోగం చేస్తున్న ఒక్కగానొక్క కూతురు ఉన్నతస్థాయికి చేరుకుంటుదనుకున్న తన కూతురు,
ఎవడో కామదాహానికి బలై, తన జీవితం అలా అర్థాంతరంగా ముగిసిపోవడం చూసి సరిత తండ్రి గుండెలు పగిలేలా ఆమె బాడీ వద్ద పడి ఏడుస్తాడు.

ఇక ఇటు...
ఎప్పుడూ తన కుటుంబానికి కానీ, తనకి కానీ ఏ మచ్చా తీసుకురాని తన కొడుకు పై అభాండాలు వేస్తూ, తనని ఒక నేరస్థుడిగా చిత్రీకరిస్తున్న కోమాలో ఉన్న తన కొడుకు దుస్థితి
చూసిన కృష్ణ తల్లి దండ్రులు విషయాన్ని జీర్ణించుకోలేక కిందపడి ఒకరినొకరు పట్టుకుని ఏడుస్తూ
"తమ కొడుకు అలాంటి కాదు కాదని, తను ఈ తప్పు చేసి ఉండడని, అన్యం పుణ్యం ఎరుగని తన కొడుకుపై అనవసరమైన అభాండాలు మోస్తూ అతన్ని ఈ కేసులో ఇరుకిస్తున్నారని " కృష్ణ తల్లి దండ్రులు అరుస్తూ వాపోతున్నారు.

వాళ్ల బంధువైన ఆ ప్రాక్టీసు లాయర్...
"ఏం కంగారు పడవద్దని,
తమకు తప్పకుండా న్యాయం జరుగుతుందని,
దాని గురించి తను చూసుకుంటానని, ఏం దిగులు పడవద్దని వాళ్ళకి ధైర్యం చెప్తూ వారిని ఓదారుస్తున్నాడు."

ఇక కాసేపటికి, ఆ తల్లిదండ్రులు కొంచెం కోలుకుని కుదుటపడ్డాక..
సెక్యూరిటీ ఆఫీసర్ వాళ్ళు ఆ పేరెంట్స్ మరియు వారితో పాటు వచ్చిన బంధువుల దగ్గర నుండి కృష్ణ మరియు సరిత కు సంబంధించిన మరిన్ని వివరాలు సేకరించారు.

అలా కాసేపటి తర్వాత...
సరిత తల్లిదండ్రుల అనుమతితో ఆమె బాడీకి పోస్టుమార్టం పూర్తి చేశారు డాక్టర్లు.
అంత్యక్రియల నిమిత్తం ఆమె బాడీ నీ
తల్లిదండ్రులకు అప్పగించి, వాళ్ళని అక్కడ నుండి తమ సొంతూరికి తరలించారు.

ఈ తతంగమంతా జరిగే సరికి రాత్రి పది గంటలు దాటింది.
ఆ తర్వాత...
నగర సీపీ, హాస్పిటల్ ఇన్చార్జి ప్రెస్ మీట్ పెట్టీ మీడియా ద్వారా ప్రజలకు కొన్ని సంచలన విషయాలు తెలియచేసారు.

అవేమిటంటే
"పోస్టుమార్టం పూర్తయిన తర్వాత, ఆ అమ్మాయిది గ్యాంగ్ రేప్ కాదు.., కేవలం ఒక వ్యక్తి మాత్రమే అత్యంత దారుణంగా ఆమెను రేప్ చేశాడు.

ఘటనా స్థలంలో దొరికి ప్రస్తుతం కోమాలో ఉన్న కృష్ణ అనే వ్యక్తిని ఈ అఘాయిత్యానికి పాలుపడ్డట్టు అనుమానిస్తున్నాం.
అతను డీఎన్ఏ శాంపిల్స్, అలాగే ఆ అమ్మాయి ప్రైవేటు పార్ట్స్ లో ఉన్న లిక్విడ్ నమూనాలు సేకరించి ల్యాబ్ కి పంపించాం.
ఆమె గోర్లలో ఉన్న చర్మం కృష్ణ దాస్ కాదా అన్నది తెలియాల్సి ఉంది. బహుశా అతను బలాత్కారం చేస్తున్నప్పుడు ఆమె ప్రతిఘటిస్తూ ఉండొచ్చు.

అలాగే అతను గంజాయి అడ్డక్ట్ అని, ఈ దారుణానికి  ఒడిగట్టే కొద్దీ క్షణాల ముందు కూడా అతను గంజాయి తీసుకున్నట్టు అనుమాణిస్తున్నాం.
రిపోర్ట్స్ రావడానికి ఇంకో 24 గంటలు టైం పడుతుంది కనుక,
అవి వచ్చాకా ఒక ప్రాథమిక అంచనాకు వస్తాం.
అప్పటివరకూ దయచేసి ప్రజలంతా సంయమనం పాటించాలని" ప్రజలందరినీ మీడియా ముఖంగా
ఆకాంక్షించారు ఆ సీపీ మరియు ఆ డాక్టర్.

కానీ, అప్పటికే కొన్ని మహిళా సంఘాలు, సామాజిక సంఘాలు, పొలిటికల్ పార్టీలు ఆ హాస్పిటల్ ముందు తమ ధర్నాలు కొనసాగిస్తూ ఆ హాస్పిటల్ ముందు కొవ్వొత్తుల ప్రదర్శన చేస్తున్నారు. ఇక అది నగరంలో ప్రతి వీధి వీధికి వ్యాప్తి చెందింది.
సీపీ మరియు డాక్టర్ ప్రెస్ మీట్ తర్వాత అవి మరింత ఉదృతంగా మారి...
నగరంలోనే కాదు దేశమంతా వ్యాప్తి చెంది, ప్రతి చోటా ప్రజలు వీధుల్లోకి వచ్చి కొవ్వొత్తులతో తమ నిరసన తెలియజేస్తూ సరిత తరుపున తమ సంఘీభావాన్ని తెలియజేస్తున్నారు.
అలాగే ,
సరితను అత్యంత దారుణంగా రేప్ చేసి చంపేసి, కోమాలో ఉండి ఐసియు లో చికిత్స తీసుకుంటున్న నిందితుడికి తక్షణమే చికిత్స ఆపి, అతన్ని కఠినంగా శిక్షించాలని కొందరు, మరణ శిక్ష విధించాలని మరికొందరు రోడ్లపైకి వచ్చి డిమాండ్ చేస్తున్నారు.

అలా వాళ్ల ధర్నాలు, నిరసనలు మూడో రోజుకు చేరుకున్నాయి.
ఇక ఆ డాక్టరు అన్నట్టు రిపోర్ట్స్ కూడా వచ్చేసాయి.
మళ్ళీ ప్రెస్మీట్ పెట్టిన సీపీ మరియు డాక్టర్...
ఆ రిపోర్ట్స్ ద్వారా ఈ హత్యాచారం కృష్ణనే చేసినట్టు వాళ్ళు ధృవీకరించారు. అంతేకాదు అతనో డ్రగ్ అండ్ ఉమెన్ అడ్డిక్టర్ అని నిర్ధారించి, అతను కోలుకున్నాకా చట్టం ద్వారా సరైన శిక్ష విధిస్తామని హామీ ఇచ్చారు.

దాంతో నగరం ఒక్కసారిగా అట్టుడికిపోయింది.
ఇన్ని ఆధారాలు స్పష్టంగా కనిపిస్తున్నా,
నిందితుడిని కఠినంగా శిక్షించకుండా ఇంకా ట్రీట్మెంట్ అందిస్తూ అతను కోలుకున్నాక శిక్షిస్తామనడం దారుణమని,
ప్రభుత్యం అనుసరిస్తున్న విధానం, సెక్యూరిటీ ఆఫీసర్లు అమలు చేస్తున్న తీరు పై ప్రజా సంఘాల నుండి నిరసనలు వెల్లువెత్తుతున్న తరుణంలో...
వాటికి కొన్ని రాజకీయ పార్టీలు కూడా తొడయ్యి...
"ఇదంతా నేరస్తుడిని కాపాడడానికి ప్రభుత్వం చేస్తున్న కుట్ర,
నేరస్తుడికి వెనుక ప్రభుత్వ పెద్దలు ఉండడంతో అతన్ని ఈ కేసు నుండి తప్పించి, బాధితురాలికి అనే తల్లిదండ్రులకు అన్యాయం చేస్తున్నారు" అంటూ ఆ సంఘాలను రెచ్చగొట్టడంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారింది ఆ ప్రొటెస్టు. ఎక్కడికక్కడ ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తూ ధర్నా ముసుగులో అసాంఘిక కార్యక్రమాలు చేపడుతూ ఆ ధర్నాను ఉదృతంగా మార్చేశాయి కొన్ని అసాంఘిక శక్తులు.

అలా ప్రొటెస్ట్లు ఉదృతంగా కొనసాగుతుండటంతో ప్రభుత్వం దాదాపు చేతులెత్తేసింది.
అంతలోనే మరో షాకింగ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది.
అది మరేవరి దగ్గరి నుండో కాదు...
స్వయానా సరిత యొక్క తల్లి దగ్గర నుండి...

సరిత అంత్యక్రియలు ముగిసిన మరుసటి రోజు...
అంటే ఆమె మరణించిన మూడో రోజు...
సరిత తల్లిని ఇంటర్వ్యూ తీసుకోవడానికి వచ్చిన కొన్ని వార్తాపత్రికల తో ఆమె ఏం చెప్పారు ?

అన్నది తెలుసుకోవాలంటే...
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply


Messages In This Thread
"ఎవరు ?" - 8 - by k3vv3 - 06-04-2026, 04:46 PM
RE: "ఎవరు ?" - by k3vv3 - 15-04-2026, 07:24 PM
RE: "ఎవరు ?" - 1 - by Uday - 18-04-2026, 01:00 PM
RE: "ఎవరు ?" - 1 - by k3vv3 - 18-04-2026, 06:13 PM
RE: "ఎవరు ?" - 1 - by k3vv3 - 25-04-2026, 09:48 AM
RE: "ఎవరు ?" - 2 - by k3vv3 - 03-05-2026, 06:47 PM
RE: "ఎవరు ?" - 3 - by junior1972 - 03-05-2026, 11:50 PM
RE: "ఎవరు ?" - 3 - by k3vv3 - 04-05-2026, 08:20 AM
RE: "ఎవరు ?" - 3 - by k3vv3 - 12-05-2026, 10:45 PM
RE: "ఎవరు ?" - 4 - by k3vv3 - 21-05-2026, 01:03 PM
RE: "ఎవరు ?" - 5 - by sunil879 - 23-05-2026, 09:35 PM
RE: "ఎవరు ?" - 5 - by k3vv3 - 30-05-2026, 10:44 PM
RE: "ఎవరు ?" - 5 - by k3vv3 - 30-05-2026, 10:45 PM
RE: "ఎవరు ?" - 6 - by k3vv3 - 10-06-2026, 01:07 PM
RE: "ఎవరు ?" - 7 - by k3vv3 - 24-06-2026, 04:30 PM



Users browsing this thread: 1 Guest(s)