21-06-2026, 05:50 PM
{My favourite update}
Update #64
ఎంజీబీఎస్ బస్టాండ్, హైదరాబాద్,
మధ్యాహ్నం కరీంనగర్ నుంచి బయల్దేరి, సాయంత్రం హైదరాబాదు చేరుకుని బస్సు దిగింది, పసుపురంగు చూడిదార్ వేసుకుని, అమృతమే తనకి రూపమిమ్మని బ్రహ్మను కోరగా, అమ్మాయి అయ్యి, అందమే ఐశ్వర్యంగా, నవ్వులే సింగారంగా, ముద్దుగా మాట్లాడే చిన్ని పెదవిపై పుట్టుమచ్చ దిష్టిచుక్కలా పెట్టుకున్న సుందరి — అమూల్య.
బస్సుల వరుసలు, ఎగబడి ఎక్కే జెనం. అనౌన్స్మెంట్ మాటలు, పాప్కార్న్ వాసన, అన్నీ చూస్తూ శాంతంగా బ్యాగు పట్టుకొని నడుచుకుంటూ బయటి వచ్చేసరికి తన స్నేహితురాలు సుమలత కాటన్ చీరకట్టులో ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటీ పక్కన ఒక వార్తతో సిద్ధంగా నిల్చుంది.
అమూల్య చిరునవ్వు చేస్తూ సుమను హత్తుకొని పలకరించింది. “ఆకలేస్తుందే ముందు బిర్యానీ తినాలి పదా.”
సుమలత నవ్వుకుంటూ, “తిండిబోతు బిర్యానీ కోసమే వచ్చావా?” అంది.
ఇద్దరూ స్కూటీ ఎక్కారు.
వెనక కూర్చుని అమూల్య తన చున్నీ సర్దుకుంది. “మీకెంటమ్మా, పెళ్లయింది. మొగుడు బాగా సంపాదించి పెడుతున్నాడు. హైదరాబాద్ లో ప్రతి వారం తిని బిర్యానీ బోరు కొట్టుందేమో, నాకలా కాదు కదా.”
“నువు కూడా ఇక్కడే ఎవడినైనా చేసుకోవే, నీకు కూడా నీ మొగుడు పెడతాడు,” అని స్కూటీ స్టార్ట్ చేసింది తోలింది.
అమూల్య తన భుజం నొక్కుతూ, “పెట్టించుకోవాలని బాగానే ఉందే, కానీ దొరకాలిగా నచ్చినోడు,” అని వ్యంగ్యంగా నవ్వింది.
“చి…. డబల్ మీనింగ్ మాటలు మాను ముందు,” అని విసిగింది.
“హహ…”
ఇద్దరూ బిర్యానీ తినడానికి వెళ్లారు.
రెస్టారెంటులో బిర్యానీ తింటూ మాట్లాడుకుంటూ ఉండగా సుమలత ఏదో చెప్పబోయి ఆగిపోతున్నట్టుగా, ప్లేటులో అన్నం మెల్లిగా కలుపుతూ ఉండడం అమూల్య గమనించి, “ఏదైనా ఉంటే చెప్పవే,” అనడిగింది.
దానికి సుమ కూసింత కంగారుగా చూసి, “ముందు చెప్పినట్టు హాస్టల్ లో రూమ్ ఖాళీ చేసి వెళ్ళాక నువు ఉండొచ్చు అనుకున్నాం, కానీ ప్రియా రూమ్మేట్ ఖాళీ చేయలేదంటా, ఇంకో రెండు నెలలు ఉంటాను అన్నదంట. నిన్ను ఇప్పుడు ఎక్కడుంచాలో అని ఆలోచిస్తే ఒక చోటు ఉంది,” అని చెప్పుకొచ్చింది.
“అయినా ఇక్కడ ఉండడానికి గర్ల్స్ pg లు దొరకవా ఏంటి. వెతుకుతే చాలు,” అని అమూల్య మాములుగా అనేసింది.
సుమ మాత్రం ఇబ్బందిగా చూస్తూ, “అది కాదే, ఇప్పటికిప్పుడు వెతకడం అంటే ఈ రాత్రి నువ్వెక్కడుంటావ్ చెప్పు,” అంది.
సుమ వెసులుబాటుకు కారణం, తన ఇంట్లో ఉండేది భర్త మరియూ అత్త. అమూల్య ఉండడానికి వేరే గది లేకపోవడం.
ఈ కారణం అమూల్య కూడా అర్థం చేసుకోగలదు.
“సర్లే సికింద్రాబాద్ లో మా పిన్ని వాళ్ళున్నారు, అక్కడికి పోతాను ఈ రెండు రోజులు,” అని చెప్పింది అమూల్య.
“సికింద్రాబాద్ మళ్లీ అంత దూరం వెళ్లడం దేనికే. నేను ఇక్కడే నా ఫ్రెండ్ ఇంట్లో ఒక గది కాలిగా ఉంది. పేయింగ్ గెస్ట్ లాగా ఉండగలవని అనుకుంటున్న. నీ క్యాంపస్ కి దగ్గర.”
అది విన్నావా అమూల్య కాస్త సమ్మతంగా స్పందించింది. “మరి ఇది ముందే చెప్పలేదేంటే, మంచిగా ఉంటే అక్కడే ఉండొచ్చు. ప్రియా రూమ్మేట్ ఖాళీ చేసేవరకు.”
సుమ అన్నం ముద్ద మింగుతూ, “హ్మ్…. కానీ తనకి ఇంకా చెప్పలేదు. ఒకసారి అడిగి చూస్తాను.”
“సరే అడుగు, ఇటు నుంచి ఇటు పోవచ్చు, ముందు తిను. తిన్నాక కాల్ చేద్దువులే,” అని అమూల్య తినడం పూర్తి చేసుకుంది.
:
Gamelight Badminton Academy,
భరత్ తన జూనియర్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు.
గర్ల్స్ సెక్షన్ నుంచి సెషన్ అయిపోయాక స్వాతి నిన్న భరత్ తో మాట్లాడింది గుర్తొచ్చి, అక్కడే ఆగిపోయి నీళ్లు తాగి, స్వెట్షర్టు విప్పింది.
లోపల తెల్లని స్లీవ్లెస్ టిషర్టుతో తన కండపట్టిన జబ్బలు కనిపిస్తున్నాయి.
టవల్ తీసి చెమట తుడుచుకుని బెంచీలో కూర్చుంది.
మూడు నెలల క్రితం ఇక్కడ బాయ్స్ కి మాత్రమే శిక్షణ ఉండేది. సతీష్ ఆడపిల్లల కోసం కూడా ఒకటి ఉండాలనే ఆలోచనతో ప్రకటన ఇస్తే, స్వాతి వచ్చి దరఖాస్తు పెట్టుకుంది. సతీష్ తనకు అవకాశం ఇచ్చాడు.
కాకపోతే స్వాతి ఒక షరతు పెట్టింది. తాను ఆడవాళ్ళకి మాత్రమే నేర్పుతుంది అని.
సతీష్ ఒప్పుకున్నాక, తర్వాత ఇచ్చిన ప్రకటనతో ఎనమిది మంది ఆడపిల్లలు చేరారు.
ఆడవాళ్ళ షటిల్ హాల్ కి మగవాళ్ళదానికి పూర్తిగా అడ్డుగా ఒక గోడ ఉండి మధ్యలో ఒక తలుపు ఉంటుంది. ఇంకో తలుపు బయట నుంచి ఉంటుంది.
స్వాతి పెట్టిన షరతులో భాగంగా అబ్బాయిలెవ్వరూ అమ్మాయిల ప్లేయింగ్ హాల్లోకి రాకూడదు.
భరత్ ప్రాక్టీస్ చేస్తుండగా ఒక కుర్రాడి గొంతు వినిపించి ఆగి వెనక్కి చూస్తే బాయ్స్ హాల్ తలుపు దగ్గర ఇద్దరు అబ్బాయిలు ఒక చిన్న కుర్రాడిని ఆపుతున్నారు.
అతను నలుపు నిక్కరు వేసుకొని, చేతిలో చాక్లెట్ పట్టుకొని ఉన్నాడు. సుమారు పదమూడు వయసు ఉంటుంది.
“స్వాతిని కలవాలి అన్నయ్య వదులు,” అన్నాడు.
అక్కడున్న ఒక పసుపు టిషర్టు అబ్బాయి, “స్వాతి ఏంట్రా, స్వాతి మేడం. ఆవిడ ఎందుకు నీకు,” అని ఆరాతీశాడు.
ఇంతలో భరత్ తో ఆడే కార్తీక్ చూసి, “హే ప్రణయ్ వాడిని వెళ్ళనివ్వు, పిల్లాడిని ఎందుకురా ఆపుతున్నావ్,” అంటూ కేకేసాడు.
“కానీ బాయ్స్ కి ఎంట్రీ లేదు అటు,” అన్నాడు ప్రణయ్.
అప్పుడా అబ్బాయి చమత్కారంగా, “నన్ను ఆపితే స్వాతి మేడం కి కోపం వస్తది చెప్తున్న,” అని పొగరుగా నవ్వాడు.
కుర్రాడి నవ్వు చూసి భరత్ కు చిరునవ్వొచ్చింది.
“ప్రణయ్ పంపియ్ రా వాడిని చిన్నోడు,” అని భరత్ చెప్పగా ప్రణయ్ వదిలాడు.
ఆ కుర్రాడు తిన్నగా హాలు తలుపు తీసుకొని స్వాతి దగ్గరికి పరిగెత్తాడు.
“హాయ్ బేబీ…. ఎలా ఉన్నావ్?” అంటూ దగ్గరికెళ్లాడు.
అతడిని చూసి స్వాతి నవ్వుతూ దగ్గరికి తీసుకుంది. “బబ్లూ……ఏరా పోయిన వారం రాలేదే?” అని పక్కన కూర్చోపెట్టుకుని దగ్గరికి తీసుకుంది.
“క్షమించు బేబీ… డాడీ తీస్కపొమ్మంటే పనుంది అంటాడు, నేనొక్కడినే వస్తా అంటే వద్దంటాడు. అందుకే ఇవాళ మమ్మీని తీసుకొని వచ్చాను.”
“అవునా…. లోపలికి రాలేదా?” అని అడిగింది తలుపు వైపు చూసి.
“ మమ్మీ బయట ఉంది, రా పోదాం,” అని లేచి స్వాతి చేతు పట్టుకొని తీసుకెళ్లాడు.
స్వాతి బబ్లూ ఇద్దరూ బయటి వెళ్ళాక అక్కడ సంచితో నిల్చున్నావిడను చూసింది.
“హాయ్ కుమారి అక్కా….,” అంటూ పలకరించింది.
“బాగున్నావా స్వాతి….”
“హాపీ వెడ్డింగ్ యానివర్సరీ అక్కా,” అని హత్తుకుంది.
“థాంక్స్…”
“ఓహో మర్చిపోయావ్ అనుకున్న బేబీ…” అన్నాడు బబ్లూ.
స్వాతి అతడి బుగ్గ గిల్లుతూ, “నేనెందుకు మర్చిపోతారా….”
“మరి నువు మాతో ఇవాళ ఇంటికి రావాలి,” అనడిగాడు.
కుమారి కూడా స్వాతి చేతు పట్టుకుంది. “అవును, రా స్వాతి. ఇక్కడికొచ్చి మూడు నెలలు అవుతుంది, అటు వైపే రాలేదు.”
బబ్లూ అలక మొహం పెట్టుకుని, “రాక పోతే బాగోదు బేబీ చెప్తున్న,” అన్నాడు.
బబ్లూ అలక చూడలేని స్వాతి వొంగి పిల్లాడి నుదుట ముద్దిచ్చింది. “ఇంత చెప్పాక రాకుండా ఉంటానా.”
బబ్లూ సంతోషంగా స్వాతి బుగ్గ ముద్దిచ్చి, ఉమ్ నాకు తెలుసు నువు వస్తావని,” అంటూ గంతేశాడు.
కుమారి క్యాబ్ డ్రైవర్ కు పదమని సైగ చేసి, “వీడేమో స్వాతి స్వాతి గోల, సాయంత్రం రాగానే పోదాం అనడం, ఆయనేమో తీసుకురాడు, నువ్వేమో కుదరదు అంటావ్. అందుకే క్యాబ్ చేసుకొని వచ్చేశాము.
“అసలు ఫోను చేస్తే నేనే వచ్చేదాన్ని కదా,” అంది స్వాతి.
బబ్లూ స్వాతి నడుము గిల్లేశాడు పెదాలు ముడుచుకొని. స్వాతి, “ఔచ్…” అని ఊగింది. “ఏంట్రా గిల్లేసావ్.”
ముక్కు సూటిగా గుణుగుతూ, “మరి ఫోను చేస్తేనే రేపు మాపు అంటున్నావ్, అందుకే వచ్చాను. పదా పోదాం,” అన్నాడు.
వాడి తల నిమురుతూ, “ఆహా పెద్దగయ్యేకొద్ది అల్లరి ఎక్కువైతుంది పోరడా,” అని నవ్వింది. “ఉండండి నేను చెప్పి వస్తాను.
స్వాతి కోర్టులోకి వచ్చి అక్కడ చెప్తాం అనుకుంటే అప్పుడే భరత్ ఆమెను కలవడానికి వచ్చాడు. “గుడ్ ఈవెనింగ్ మేడం.”
“హా భరత్ నేను వెళ్ళాలి మావాళ్ళు వచ్చారు, ఏమనుకోకుండా కాస్త నువ్వే లాక్ చేసి వెళ్తావా?” అని కాస్త మొహమాటంగా అడిగింది.
భరత్ నిమిత్తంగా చూస్తూ, “ఊ సరే మేడమ్, రేపు వస్తారా?” అనడిగాడు.
“హా రేపు వస్తాను. ఈవెనింగ్ కలుద్దాము, బై….” అని చెప్పి భరత్ కు అప్పజెప్పేసి అక్కడినుంచి స్వెట్షర్ట్ వేసుకొని కుమారి వాళ్ళ కార్ ఎక్కి బయల్దేరింది.
స్వాతి వెళ్లిపోగానే, భరత్ కు సుమలత నుంచి కాల్ వచ్చింది.
కాల్ ఎత్తి, “ఏంటి చెల్లెమ్మా, బాగున్నారా? మాతో అవసరం తీరిపోయినట్టుంది కాల్ చెయ్యడం లేదు ఈ మధ్య?” అని హాస్యంగా స్పందించాడు.
అటు నుంచి సుమ నవ్వుతూ, “లేదు అన్నగారు, మళ్లీ మీతో పని పడింది. ఉన్నావా ఇంట్లో?”
“ముందు పనేంటో చెప్పు తల్లీ. నువు చెప్పేదాని బట్టి ఓకే నా కాదా చెప్తాను.”
“కలిస్తేనే చెప్పేది, ఇంటికి ఎప్పడు రమ్మంటావో చెప్పు.”
“ఎనమిది గంటలకురా.”
“సరే వస్తాను….,” అని చెప్పి సుమ కాల్ కట్ చేసింది.
సుమ కలుస్తానని చెప్పినందుకు ఇక్కడ పని చూసుకొని బ్యాగు సర్దుకుని ఇంటికి బయల్దేరాడు.
ఇంట్లో వంటగదిలో స్టవ్ ఆన్ చేసి, కోడిగుడ్డు కొట్టేసి ఆమ్లెట్ వేసుకొని, పక్కనే రైస్ కుక్కర్లో అన్నం వడ్డించుకుని, డబ్బాలో మాడికాయ తొక్కు రెండు స్పూన్లు వేసి అలా కలుపుకుంటూ వచ్చి టీవీ ముందు కూర్చున్నాడు.
“
ముఖ్యాంశాలు:
ఆపిల్ మాకింటోష్ మాక్స్ మానవ సాధారణ అవసరాలను మించిందని, ప్రొఫెషనల్ వాడకంలో nvidia చిప్స్ చాలని, ఇక ఆపిల్ మాకింటోష్ వాడకంలోకి రాదని కేవలం షోకేస్ ఐటెంగా అయిపోయిందని, ఆపిల్ సీఈఓ విలియా వాక్ దాని మాన్యుఫ్యాక్టైరింగ్ ఆపేశామని నిర్ధారించారు.”
ఐస్లాండ్ ద్వీపంలో హాట్స్ప్రింగ్స్ తెర్మల్ పవర్ జనరేషన్ సంస్థను అమెరికా ఆధిపత్యంగా ఆక్రమించుకొని, ఈరోజుతో అట్లాంటిక్ దాటుకుని అమెరికా వ్యాపార విస్తీర్ణం అయినందుకు, యూరోపియన్ కూటమి తగిన చర్యలు తీసుకుంటామని చర్చలు జరిపింది. అక్కడ భద్రతా బలగం పేలుడులో కుప్పకూలి పాతికమంది పైగా మరణించారని తెలిసింది.
భూపాలపల్లి బైఎలక్షన్స్ లో భాజపా పార్టీ గెలిచి, ఎమ్మెల్యే గారు మాజీ ప్రధాని స్వర్గీయ మోదీ గారికి నివాళి అర్పించారు.
భారత్ చైనా న్యూక్లియర్ రన్వే మెట్రో ఒప్పందంలో చైనా అధ్యక్షుడు భారత్ రాబోతున్నట్టు ప్రకటించారు. అందుకు కావలసిన భద్రతా ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.”
(ఏదో రాసిన టైంపాస్ కి, హహ)
అలా టీవీ చూస్తూ తింటూ ఉండగా, భరత్ ఫోనులో నోటిఫికేషన్ వచ్చింది.
చూస్తే, మిస్: రిప్లై ఇవ్వురా, కాల్ లిఫ్ట్ చేయ్.
మిస్ పేరుతో ఫోను రింగ్ అయ్యి కట్ అయ్యింది.
దానికి స్పందించకుండా తింటూ కూర్చుని భోజనం ముగించాడు.
తిరిగి వంటగదిలోకి సింకులో ప్లేట్ కడుగుతూ ఉండగా, “ట్రింగ్ ట్రింగ్,” అని ఇంటి బెల్లు మ్రోగింది.
చేతులు కడుక్కొని వెళ్లి తలుపు తెరిచాడు.
సుమలత చిరునవ్వుతో, “హాయ్ బ్రో… అంత బాగేనా?” అని హుషారుగా పలకరించింది.
భరత్ బోరుగా నిట్టూర్చి, “హ్మ్ రా లోపలికి. బావ రాలేదా?” అంటూ ఆహ్వానించాడు.
“ఆయన వచ్చే పని కాదులే ఇది. తిన్నావా?”
“హా ఇప్పుడే తిని చేతులు కడుక్కున్న. ఏంటి సంగతి?”
సుమ అమూల్య విషయం చెప్పుకొచ్చింది.
“అదీ…. మా ఫ్రెండ్ ఇక్కడే మాస్టర్స్ చేయడానికి వచ్చింది. ముందే హాస్టల్ చూసాము, రూమ్ ఖాళీ అవుతుంది అనుకుంటుంటే ఇప్పుడు కాలేదు. ఒక నెల రోజులు ఎక్కడైనా ఉండడానికి చోటు దొరుకుతుందా అనుకుంటే, నీ ఇంట్లో ఒక రూమ్ ఖాళీగా ఉందని గుర్తొచ్చింది.”
అది విని భరత్, “అయినా ఎన్నో హాస్టల్స్ ఉన్నాయి, వేరే వాటిలో దొరకవా?” అనడిగాడు అనుమానంతో.
“అంటే ఇప్పటికిప్పుడు కష్టం, తను కూడా నువు పోయే యూనివర్సిటీ ఏ. దగ్గర్లో హాస్టల్స్ లేవు. యూనివర్సిటీ హాస్టల్ లో ఉండడం తనకి నచ్చదు.”
భరత్ వింటూనే కాస్త విసుగుపడ్డాడు. “ఆపు…. ఇప్పుడేంటి నా ఇంట్లో నీ ఫ్రెండ్ కి రూమ్ ఇవ్వాలా. అయినా ఆడపిల్ల నాతో ఉండడం ఏంటి. అస్సలు బాగోదు. కలవదు,” అని చెప్పేసాడు.
“అర్థం చేసుకోరా, పాపం అది ముందే వెతుక్కుంటా అని చెప్పింది, నేనే ఆల్రెడీ ఉంది అని కమిట్ చేసి ఇప్పుడు లేదని హర్ట్ చేసాను. అమాయకపు పల్లెటూరు పిల్లరా.”
భరత్ ఆపమని చేయి అడ్డం పెట్టి, “ఏందే ఇది, బృందావనం సినిమాలో సమంత కాజల్ ని తీసుకొచ్చి ఎన్టీఆర్ ని ఇరికించినట్టు. గోకకు నన్ను,” అన్నాడు.
సుమ భరత్ చేతులు అందుకొని, “ప్లీజ్ అన్నయ్య ఒప్పుకో ప్లీస్…. నువు మంచోడివి అనే నమ్మకంతో తీసుకొచ్చాను. అలా అనకు. ఒక్కనెల. కావాలంటే దాని అద్దె నేను కడతాను,” అని మారాం చేయసాగింది.
“అంటే ఏంటే నీకు నువ్వే ఫిక్స్ చేసేస్తున్నావా, ఎవరో ఏంటి పరిచయం లేకుండా ఎలా ఒప్పుకునేది?”
“ఇక్కడే ఉంది పిలుస్తాను ఉండు,” అంటూ సుమ తలుపు దిక్కు చూసి, “అమ్మూ….,” అని పిలిచింది.
తలుపు దిక్కు చూస్తే, అక్కడ పసుపురంగు పంజాబీ డ్రెస్సులో, మొహమాటంగా నెమ్మదిగా తలుపు దగ్గరికి వచ్చింది అమూల్య.
![[Image: bdHH3.jpg]](https://s13.gifyu.com/images/bdHH3.jpg)
అమూల్యను చూసి భరత్ బిగుసుకుపోయాడు.
మొహం పైకి ఎత్తి ఇటు చూడగా భరత్ కనిపించగానే తన గుండె ఝల్లుమని తుర్రుమని పారిపోయింది.
సుమ లేచి కంగారుగా అమూల్య కోసం బయటకెళ్లి అక్కడ వరండా స్తంభం వెనక దాక్కున్న అమ్మూ దగ్గరికెళ్లి, “ఏమైందే?” అని అడిగింది.
అమూల్య వేళ్ళు నలుపుకుంటూ సతమతంగా, “ఫ్రెండ్ అంటే ఎవరో అనుకున్న, ముందు చెప్పవా?” అని కోప్పాడింది.
“ముందు చెప్తే నువు వస్తావా? రావే పరిచయం చేస్తాను,” అంటూ సుమ తన చేయి పట్టుకులాగింది.
అమూల్య గింజుకొని, “ఊహు నేను రాను. వెళ్ళిపోదాం పా, ఇంకెక్కడైనా ఉండొచ్చు?” అని ఇబ్బందిగా చున్నీ నలుపుకుంటూ మొహం దాచుకుంది.
సుమ నచ్చజెప్పుతూ, అమూల్య చేతులు పట్టుకొని, “ఓయ్ ఎందుకే ఉన్నట్టుండి చిన్నపిల్లలా ములుగుతున్నావ్. ఒక నెల ఉండలేవా? తనేం చెడ్డవాడు కాదు, నాకు తెలుసు,” అంది.
అమూల్య అటు మొహం చేసి గోడకు తల గుద్దుకుంటూ, “అయ్యో నీకెలా చెప్పాలి,” అని గుస చేసింది.
“ఏందే నీ గోస, ఇష్టమే కదా నీకు, భరత్ భరత్ అని మొన్న ఛాంపియన్షిప్ అప్పుడు విసిగించినావ్ కదా?”
అమ్మూ ఏడుస్తున్నట్టు గొణుగుతూ, “ఎందుకే ఇక్కడికి తీసుకొచ్చావు. అతడిని చూస్తూ నేను తట్టుకోలేనే, నాలాంటి సెన్సిటివ్ మనిషిని ఈ జైల్ లో వెయ్యవద్దు. చూడలేక, మాట్లాడలేక విలవిలలాడిపోతానే. ఈ ప్రేమికురాలి వ్యధ నీకేం తెలుసు,” అంటూ డ్రామా చేసింది.
“పిచ్చిమొద్దు తన ఇంట్లోనే ఉండి వాడిని వలలో వేసుకో, అద్దెకి వచ్చినదానివి పర్మినెంట్ హౌస్ ఓనర్ అవ్వు,” అంటూ వెక్కిరించింది సుమ.
అమ్మూ కళ్ళలో నక్షత్రాలకు తిరుగుతూ మళ్లీ ఇటు తిరిగి, “ప్లాన్ బాగుంది, పోనీ ఈ రాత్రికే రేప్ చేసేయనా?” అంటూ కుందేలులా గంతేసింది.
సుమ చిరుకోపంగా, “మెంటల్ ముండ, అలా ఐతే వాడు నిన్ను వాడుకొని వదిలేస్తాడు,” అని మొట్టికాయ వేసింది. “మెల్లిగా లవ్ లో దింపాలి.”
అమూల్య చిన్ని కుందేలులా మూతి ముడుచుకుని, “ఊ…. కానీ తనకి ఎవత్తైనా రిలేషన్ ఉంటే నేనేం అయిపోతానే,” అని వాలిపోయింది.
“ముందు పదా లోపలికి. మంచిగా ప్లాన్ వేస్తే చూడగానే ఉరుకొచ్చినవ్,” అని చేయి పట్టుకొని లోపలికి లాక్కెళ్లింది.
తలుపు దగ్గరికి నడుస్తుంటే, అమూల్య ఒళ్లు తుత్తర పుడుతూ సిగ్గొచ్చేసింది. కానీ భరత్ ముందు అలా ఉండడం తనకిష్టం ఉండదు. మనసు అదుపులో పెట్టుకుని మామూలు అయ్యి సుమ వెంట లోపలికి వెళ్లింది.
లోపల భరత్ అమూల్య తనకి అసలు తెలీనట్టు మొహం పెట్టి నాటకం మొదలు పెట్టాడు.
చేతులు ముడుచుకుని నిల్చున్నాడు.
అమూల్య తన స్నేహితురాలు సుమలత చాటు నిల్చుని మొహమాటంగా ఉంది.
సుమ నోరు విప్పి, “తను అమూల్య… నీకు గుర్తుందో లేదో… మనం ఇంటర్మీడియట్ ఒకే కాలేజ్ లో చదువాము,” అని చెప్పింది.
భరత్ ఒకసారి అమూల్యను కింద నుంచి పైకి చూసాడు.
నాజూకుగా, ఐదున్నర అడుగుల ఎత్తుగా, చూపు కిందకి దించుకొని మొహమాటపడుతున్న తెల్లని పావురంలా నిల్చుని ఉంది.
అప్పుడే అమూల్య కనురెప్పలు ఎత్తి భరత్ వంక చూసింది.
“వంటొచ్చా?” అనడిగాడు.
అమ్మాయిలిద్దరూ ఆశ్చర్యంగా చూసారు.
సుమ మాట కలుపుతూ, “ఎందుకు?” అనడిగింది.
చేయి అడ్డు పెట్టి సుమని ఆపి, “వచ్చా రాదా?” అని అమూల్యను సూటిగా చూస్తూ అడిగాడు.
అమూల్య తల ఆడిస్తూ, “ఊ వచ్చండీ….,” అని చిన్నగా బదులిచ్చింది.
“హ్మ్…. అండీ గిండీ వద్దు, భరత్ అను. నాకు రెంటు అక్కర్లేదు కానీ వంట చేసి పెట్టు,” అన్నాడు.
అమూల్య సుమ చెవిలో, “ఒసేయ్ పెళ్ళాం అని చెప్పి పనిమనిషిని చేస్తున్నావ్ కాదే,” అని గుసగుసలు పెట్టింది.
సుమ ఆమె మాటలు కొట్టేసి, “ఓవర్ చెయ్యకు బ్రో, వంట తను ఎందుకు చేస్తుంది?” అని వాదించింది.
భరత్ అలాగే చూస్తూ, “నాకు వంట చేసుకుంటే టైం సరిపోవడం లేదు, ఎలాగో ఒకే ఇంట్లో ఉంటాము, తను కూడా బయట తినేబదులు ఇక్కడే వంట చేస్తే ఇద్దరికీ హెల్తీగా ఉంటాము కదా?” అని కారణమిచ్చాడు.
సుమ ఏదో చెప్పేలోపు, అమూల్య తొందర పాటుగా, “సరే చేస్తాను,” అని ఒప్పేసుకుంది.
భరత్ తనలో తాను నవ్వుకున్నాడు.
ముందుకు వచ్చి, అమూల్యను దీర్ఘంగా చూస్తూ, ఆమె చూపు కిందకి దించుకున్నాక, “నీ కంఫర్టులో నువ్వుండు. ఏదైనా ఎలాగైనా వాడుకో, కానీ నా పెయింటింగ్స్ ముట్టకూడదు, నా రూంలోకి రాకూడదు. అతి ముఖ్యంగా, బాయ్ఫ్రెండ్ ఉన్నా లేకున్నా నాకనవసరం రాత్రి పదిలోపు ఇంట్లో ఉండాలి లేకుంటే డోర్ తీయను,” అని హెచ్చరించాడు.
అమూల్య అది విని పొగరుగా ముక్కు విరిచి, “హ్మ్ ఒకే, కానీ మీరు కూడా నా గదిలోకి రాకూడదు,” అంది.
భరత్ కి నవ్వొచ్చింది.
సుమ అమ్ము చేయి గిల్లి, “వాడు నీకు అంత మ్యానర్స్ లేనివాడిలా కనిపిస్తున్నాడా పొల్ల,” అని చెప్పింది.
భరత్ చిరునవ్వు చేస్తూ, “అమూల్య…,” అని పలికాడు.
అమ్మూ గోరింట చెంపల్లో సిగ్గు దాచుకుంటూ, “చెప్పండి,” అని పలికింది.
“పేరు బాగుంది, రండి రూమ్ చూపిస్తాను,” అని చెప్పి ఇద్దరినీ వెంట తీసుకెళ్లి రెండో బెడ్రూమ్ కి తీసుకెళ్లి తలుపు తీసాడు.
లైట్ వేశాక, లోపల బెడ్షీట్ లేకుండా ఉన్న బెడ్డు, ఖాళీగా తలుపులు తీసున్న కప్బోర్డులు, ఒక చిన్న టేబుల్ ఉంది.
“ఇంత వరకు ఈ గదిని వాడలేదు. దుమ్ము కూడా ఏం ఉండదులే, పోయిన ఆదివారం దులిపాను. చీపురు తెచ్చుకొని ఊడ్చుకొని నీ సామాన్లు సర్దుకో,” అని భరత్ చెప్పాడు.
అమూల్య మొహం తిప్పుకుని, “బ్యాగు బయట ఉంది తెచ్చుకుంటాను,” అని చెప్పేసి వెళ్ళింది.
అమూల్య నడుచుకుంటూ వెళ్తుంటే, భరత్ ఆమెను ఇష్టంగా చూడడం సుమలత గమనించి, “ఏయ్ బ్రో, మేఘన ఫీల్ అవుద్ది, అలా చూడకు,” అని వ్యంగ్యంగా నవ్వింది.
భరత్ ఇటు చూసి, “ఇంకెక్కడ మేఘనా, వారం రోజుల్లో పెళ్లి కూడా చేసుకుంటుంది,” అని చేతులెత్తేసాడు.
సుమ అతడు గడ్డం పట్టుకొని, “అయ్యో వదిలేసి వెళ్ళిందా, ఏ మా అన్నకి ఏం తక్కువంట?” అని బుజ్జగించింది.
“మన దేశంలో అన్ని సమస్యలకు కారణం డబ్బు, కులం, మతం చెల్లి,” అన్నాడు.
“పోతే పోనీ లేరా, నీకోసం మంచి అమ్మాయిని తీసుకొచ్చాను ఎలా ఉంది?” అంటూ కళ్లల్లోకి చూసింది.
భరత్ ఆశ్చర్యంగా మూతి మీద చెయ్యేసుకున్నాడు. “ఏంటే నువు చెప్పేది?”
“మేఘనని మరచిపోయి, ఈ అమూల్యను చూడు అన్నయ్యా.”
“ఓసినీ తప్పే, అలా నీ వ్యూహంలో నువు అమ్మాయిని తీసుకొచ్చి నా ఇంట్లో పెట్టకూడదు.”
“చాలు ఆపరా, ఛాన్స్ ఇస్తున్న తీసుకో,” అని బుగ్గ గిల్లింది.
“లేదే మేఘన నా మనసుపై మరచిపోలేని వర్షం కురిపించి నన్ను నిండా తడిపేసిన మేఘం,” అని మూతి ముడుచుకున్నాడు.
“నీ బొంగు, ఆమెకు వారంలో పెళ్ళి, శోభనం. పెళ్ళికి పోయి భోజనంలో బొక్క చీకు ఎదవ,” అని తిట్టింది.
భరత్ అదోలా చూస్తూ, “డబుల్ మీనింగ్ ఆ,” అన్నాడు.
“ఎహె అందులో డబల్ మీనింగ్ ఏమీ లేదు. నా మాట విని అమూల్యను చూడు బ్రో,” అని చెప్పింది.
బయట నుంచి అమూల్య బ్యాగు పట్టుకొని లోపలికి వస్తుంటే చూస్తూ, “హ్మ్ చూస్తున్న….. ఉఫ్ అంత ముద్దుగా ఉందేంటే,” అని మైమరచిపోయాడు.
సుమ సైగ చేస్తూ, “చుప్ మెల్లిగా సైట్ కొట్టుకో, తొందర పడి పాడు చేసుకోకు సరేనా?” అని స్నేహంగా సలహా ఇచ్చింది.
“హ్మ్…”
అమూల్య దగ్గరకి రాగానే ఇద్దరూ నిశ్శబ్ధం అయ్యారు. వాళ్లను దాటుకుని గదిలోకెళ్లి బ్యాగు పెట్టుకుంది.
భరత్ చూడడానికి మొహమాటపడుతూ ఇటు తిరిగి, “వద్దే చెల్లి, ఇది చాలా తప్పుగా అనిపిస్తుంది. నేను కంట్రోల్ తప్పితే ఘోరం జరిగిపోద్ది,” అన్నాడు కంగారుగా.
సుమ మనసులో, ఆ పిల్ల కంట్రోల్ తప్పితే నిన్ను కుక్కపిల్లలా ఆడిస్తదిరా ఎదవ అనుకుంది.
భరత్ చేతులు పట్టుకొని, “చూడు పరిచయం పెంచుకో, మాటల్లో పెట్టు, ఎక్కువ ఇంట్రావర్ట్ లాగా ఉండకు. నిన్ను నమ్మి తీసుకొచ్చాను”.
ఇంతలో అమూల్య వచ్చి, కొంచెం గుబులుగా భరత్ వంక చూస్తూ, “ఈ రూంకి బాత్రూం లేదండీ”, అని గోరు కొరుక్కుంటూ చెప్పింది.
“ఓహ్ అవును చెప్పడం మర్చిపోయాను, బాత్రూం లేదు. కామన్ బాత్రూం వాడుకోవాలి నువు”, అని స్పందించాడు.
సుమ లోలోపల నవ్వుకుంది.
అమూల్య సుమని గదిలోకి తీసుకెళ్లి, “కష్టమే ఇక్కడ ఉండడం. టవల్ కట్టుకుని ఎలా తిరుగుతామే మగాడి ముందు?” అని గుసగుసగా అడిగింది.
“ఏదో రకంగా సర్దుకోవే పిల్ల,” అంది సుమ.
“ఏయ్ వద్దే పోదాం పదా,” అని గిల్లింది అమూల్య.
సుమ కళ్లు పెద్దచేసి, అమూల్య మొహం పట్టుకొని, “నీకు భరత్ కావాలా వద్దా?” అని కచ్చితంగా అడిగింది.
“ఊ… కావాలి,” అంది.
“ఐతే అడ్జస్ట్ అవ్వు.”
బయట భరత్ మాత్రం నిర్ణయం వాళ్ళకి వదిలేసి తాపీగా కూర్చున్నాడు.
సుమకి ఇంటి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. మాట్లాడి వస్తున్న అని చెప్పి అమూల్యకు సర్ది చెప్పింది.
భరత్ తో కూడా వెళ్ళొస్తాను అని చెప్పి బయటకు వెళ్లగా, అమూల్య ఆమె వెంట పరిగెత్తి ఆపింది. “ఓయ్ ఇంకాసేపు ఉండవే, నువ్ వెళ్తే ఎలా ఉండాలో అర్థం కావట్లేదు.”
“పోవాలి, నువ్వేం ఇబ్బంది పడకు. తనని ఇబ్బంది పెట్టకు. వంట బాగా చేసి పెట్టు, అసలే వాడు కూడా నీలాగే పెద్ద తిండిబోతు.”
“ఊ సర్లే బై….”
సుమలత గేటు దాటి వెళ్లి, స్కూటీ తీసి వెళ్ళిపోయింది.
తర్వాత స్ట్రీట్ లైట్ వెలుగులో, చుట్టూ చిన్న చిన్న మొక్కలు, పురుగుల కీచు శబ్దాలు, చల్లని గాలి, అమూల్య ఒకసారి తల వెనక్కి తిప్పి పైకి చూస్తే భరత్ కట్టుకున్న భవనం నలుపు రంగులో చందమామ వెలుగులో భిన్నంగా వెలుగుతోంది.
తానే వెళ్ళి గేటు మూసి గొల్లెం పెట్టేసింది.
ఇంటికి కుడి వైపు షెడ్డులో ఒక నలుపు జీప్ ర్యాంగ్లర్, ఒక ట్రయంఫ్ బుల్లెట్ బండి ఉన్నాయి.
ఇంత పెద్ద ఇంట్లో భరత్ ఆరు నెలలుగా ఒక్కడే ఉంటున్నాడు, ఇప్పుడు అమూల్య వచ్చింది.
పరిసరాలు చూస్తూ మెల్లిగా నడుచుకుంటూ లోపలికెళ్లింది.
భరత్ ఒక పెద్ద కవర్ పట్టుకొచ్చి ఆమె చేతికందిస్తూ, “ఇందులో కొత్త బెడ్షీట్, బ్లాంకెట్ ఉన్నాయి. నీకు కావాలంటే తీసుకో,” అని చెప్పాడు.
అమూల్య మౌనంగా అవి తీసుకొని తన గదికి నడిచింది.
భరత్ ఇంటి తలుపు మూసి వేసాడు.
తడక్ అని శబ్దం రాగానే అమూల్యకు ఝల్లుమంది. పెళ్ళీడుకొచ్చిన వయసులో ఒక మొగాడితో సహవాసం చేయడం అనేది, భయటకు పొగరుగా ఉన్నా లోపల కాస్త వణుకు తెప్పించింది.
భరత్ అమూల్య గదిని దాటుకుని వెళ్తూ, “గుడ్ నైట్,” అని చెప్తూ అతడి గదిలోకెళ్లిపోయాడు.
అమూల్య కూడా తలుపు మూసుకుంది.
భరత్ గదిలో పెయింటింగ్ కింది టేబుల్ మీద ఫోను రింగయ్యింది.
టక్కున లేచి, మిస్ కాలింగ్ అని చూసి కట్ చేసి పడుకున్నాడు.

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)