Thread Rating:
  • 3 Vote(s) - 4.67 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Comedy హాస్య కథలు - వంకాయ మహత్యం
ఔను- అవసరమే అన్నట్టు తలూపాడతను. ఇక తప్పదన్నట్టు అతడి ప్రక్కన కుదురు గా కూర్చుని చెప్పసాగాను- 



మొత్తం ముగ్గురు అక్కాచెల్లెళ్లు, వైదేహి పెద్దది. వైదేహి యేదో టెక్నికల్ కోర్సులో ఉన్నప్పుడు- యెదురు చూడని దుర్ఘటన సంభవించింది. మామయ్య డ్యూటీ చేస్తూన్న సెక్షన్ లో ఉన్నపాటున బాయిలర్ పేలిపోయింది. మామయ్య అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. దానితో కుటుంబ పరిస్థితి దెబ్బతింది. దాదాపు చితికిపోయింది. నష్ట పరిహారంతో బాటు మా అక్కయ్యకు కంపెనీ మేనేజ్మెంట్ జాబ్ ఆఫరి చేసింది. 



కాని అక్కయ్యకు చెప్పుకోదగ్గ చదువు లేకపోవడాన జాబ్ ఆఫర్ ని అందుకోలేక పోయింది. అప్పుడు యింటికి పెద్దదయిన వైదేహి చదువుతూన్న ప్రొఫెషనల్ కోర్సు నుండి తొలగి జాబ్ లో చేరింది. అప్పట్నించి వైదేహికి పెళ్ళి సంబంధాలు యింటి గుమ్మం వద్దకు రాసాగాయి. కాని- కుటుంబం మరొక దుర్గతి యెదుర్కుంది. చెల్లి పరిమళ ప్రేమ వలలో పడ్డది” 



కాలేజీ రోజుల్లో అమ్మాయిలు ప్రేమ వలలో పడటం సహజమేగా! దీనిని అంత భయానకంగా చిత్రీకరించడం యెందుకోయ్!”



ప్రేమవలలో పడటం అంటే మనసిచ్చి మనసు తీసుకోవడం కాదు. పరిమళ కడుపు తెచ్చుకుంది. తద్ద్వారా ఆ పిల్లను పెళ్ళి పీటలపైన కూర్చోబెట్టడానికి వైదేహి తల్లితో చేరి యమయాతన పడాల్సివచ్చింది. లవ్ మ్యారేజీ అన్న పేరే గాని అన్ని లాంఛనా లూ తు. చ. తప్పకుండా పూర్తి చేయాల్సి వచ్చింది. కాస్తంత అప్పు కూడా చేయాల్సి వచ్చింది. 



ఆ బాదరాబందీలో వైదేహి తన పెళ్ళి కోసం యెలా ఆలోచించగలదు — చేసిన అప్పులన్నీ తీర్చ వద్దూ! ఒకటి తరవాత ఒకటిగా యెదురైన సమస్యల వల్ల వైదేహి తన పెళ్ళి గురించే కాదు- తన వయసు గురించి తలచడం కూడా మరచిపోయింది. మరైతే-- ప్రాయంలో ఉన్న ఆడ పిల్లల్నేగా వయసు వేగంగా తరుముకొస్తుంది! ఆ తరవాత వైదేహి పెళ్ళి సంబంధాల కోసం మా అక్కయ్య వెతికింది గాని కొన్ని కారణాల వల్ల కుదరలేదు. దేనికైనా అదృష్టం కలసిరావాలి కదా! 



ఇప్పుడేమో పొరుగూరు నుంచి చిన్న అమ్మాయి భవానికి పెళ్ళి సంబంధం వెతుక్కుంటూ వచ్చింది. ఈడూ జోడూ కుదిరింది కాబట్టి కట్న కానుకలేవీ వద్దంటూ ముందుకి వచ్చారు పెళ్ళి కొడుకు తరపు వాళ్ళు. ఇక యిటు వంటి సంబంధం మళ్ళీ దొరక్కపోవచ్చని వైదేహి తల్లికి నచ్చచెప్పి ఒప్పించింది. ఇదీ సంగతి—ఇంకేమైనా అడగాలా?”



తల అడ్డంగా ఆడిస్తూ పెదవులపైన నవ్వు తెరల్ని పొరలిస్తూ దీన దయాళు అన్నాడు- “చూసావా ఆడిపిల్ల మనసు! తనకింకా పెళ్ళి కాలేదనే తలంపు లేకుండా తండ్రి లేడన్న కొరత తెలియ నివ్వకుండా తోబుట్టు వుల్ని యెలా చూసుకుంటుందో! అందుకే అంటారు- వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి స్త్రీలోనూ తల్లితనం దాగుంటుందని. సరే—అదలా ఉంచు. నేను మీ అక్కయ్యతో మాట్లాడాలి. ఇప్పుడు కాకపోతే తరవాత కలుసుకుంటాను. ఓకే!” అని లేచాడు దీనదయాళు. 



లేదు లేదు. ఇప్పుడే యేర్పాటు చేస్తాను” అంటూ లోపలకు వెళ్ళి అక్కయ్యకు విషయం చెప్పాను. 
నాతో మాట్లాడటం యేమిట్రా! వైదేహికి చెప్పి భోజనం యేర్పాటు చేసి పంపించు” అని విస్తుపోతూ అంది. 



నాకు సర్రున కోపం వచ్చింది. “చెప్పింది చెయ్యవే అక్కాయ్! సంబరం తగ్గించి అక్కడ కూర్చో— చిన్న కూతురు కోసం తెగ యిదయి పోకు—” అని గట్టిగా అన్నాను. 



నా గొంతు విని అక్కడకు వేదేహి పరుగున వచ్చింది- “ఏం కావాలి మామయ్యా! ”అంటూ—
నేను అదే టెంపోతో అన్నాను. “నాకేమీ వద్దు. నా సహోద్యోగి దీనదయాళు గారు మీతో మాట్లాడాలంటున్నాడు. ఇక్కడ మీరిద్దరూ కుదురుగా కూర్చోండి. పిలుచుకు వస్తాను” అని బైటకు వెళ్ళి దీనదయాళుని తీసుకువచ్చాను. 



అతణ్ణి చూసి తల్లీ కూతుళ్ళిద్దరూ లేచి నమస్కరించారు. దీనదయాళు నవ్వుతూ యిద్దర్నీ కూర్చోమని సంజ్ఞ చేస్తూ యెదురుగా కూర్చుని వెంటనే సంభాషణ కుపక్ర మించాడు- “వైదేహీ! నీ గురించి మీ మామయ్య చెప్పాడు. విషయాన్ని నాన్చకుండా సూటిగానే ప్రస్తావిస్తున్నాను. నీకు పెళ్ళి చేసుకోవాలన్న తలంపు ఉంది కదూ? ” 



అప్పుడు నేను పుంజుకున్నాను- “అవేం మాటలోయ్! వైదేహి మాత్రం అమ్మాయి కాదా! ఆ పిల్లకు మాత్రం నిండు సంసారం ఉండాలన్న ఆశ ఉండదా? కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల ఆ పిల్ల పెళ్ళి అటూ యిటుగా ఊగిసలాడుతూంది. అంతే—”



దీనదయాళు బదులి వ్వకుండా వైదేహిని తేరి చూసాడు. వైదేహి తల దించుకుంది. 
ఈసారి తలాడిస్తూ స్పందించాడు దీనదయాళు- “దెన్ ఇ టీజ్ ఓకే! ఊళ్ళో మా మేనల్లుడున్నాడు. వాడికి చెప్తాను. ఆ తరవాత యేమి జరగాలో అదే జరుగుతుంది” అంటూ లేవబోయాడు. 
నేను వెంటనే అతడి చేయి పట్టుకుని ఆపాను- “ముఖ్యమైన విషయాన్ని నువ్వుగా కదిపి అలా విసురుగా వెళ్ళిపోతావేంటి? కూర్చో—” అని వైదేహిని ఉద్దేశించి అన్నాను- “ఇంట్లో కాఫీ పొడి ఐపోయిందే మిటి? లేక అతిథులకి కాఫీ యివ్వాలన్నది మరచిపోయావా!” 



ఆ మాటతో వైదేహి ముఖం యెర్రబడింది. “సారీ మామయ్యా! ఏదో మూడ్ లో ఉండి పోయి మరచిపోయాను” అని సర్రున లేచి లోపలకు వెళ్ళింది. అప్పుడు మా అక్కయ్య అందుకుంది- “మరేమీ లేదండి— ఇంతకు ముందు యిటువంటి రెండు మూడు సంబంధాలు వచ్చి పెరడు వేపు నుండి వెళ్ళిపోయాయి. పెళ్ళి ఊసు యెత్తినప్పుడల్లా ప్రాత సంఘటనల్ని తలచుకుని అమ్మాయి అలా ఐపోయుంటుంది. ఇప్పుడు మీరు ప్రస్తావించిన అబ్బాయి గురించి నేనొకటి అడుగుతాను. ఏమీ అనుకోరు కదా! ”



దీనదయాళు తల అడ్డంగా ఆడించి- “అడగండి” అన్నాడు. 
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply


Messages In This Thread
RE: హాస్య కథలు - BSC - by k3vv3 - 03-09-2025, 09:46 PM
RE: హాస్య కథలు - - - by k3vv3 - 19-06-2026, 10:04 PM
RE: హాస్య కథలు - అర మార్కులోడు - by k3vv3 - 19-06-2026, 10:05 PM



Users browsing this thread: 1 Guest(s)