Thread Rating:
  • 15 Vote(s) - 2.73 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance Veera
#77
వీర ' స్వప్న ' ' వైపు నార్మల్ గా చూసేసరికి...

వీర ఫోన్ రింగ్ అయ్యింది ....

స్వప్న గుండె లో అలజడి మొదలైంది...

వీర లిఫ్ట్ చేసి... "చెప్పు... అన్నాడు సీమ్ మాడిపోయిన పెనం మొహం తోనే

స్వప్న "అమ్మో... ఇతనేంటి??? ఇక్కడ అంటూ లటుకున్న బండి స్టార్ట్ చేయబోయింది.

అబ్బే మనోళ్ళు అంటున్నట్లు డిజైనర్ పాప కి టైం అస్సలు బాగోలేదు...బండి స్టార్ట్ అవ్వలేదు...

వీర 'సింహా' తో టాకింగ్ చేస్తూ...

'రేపే వెళ్ళమంటే... ఎలాగా??? దొబ్బేయను బే... అంటూ అరుస్తున్నాడు..

డిజైనర్ పాప ఎంత ట్రై చేసినా....

బండి స్టార్ట్ అవ్వటం లేదు...

వీర సార్ కి సంఖ్య తిరుగుతోంది..

ఒక్కపక్క సింహా ముఖ్యమైన పని మీద.... త్రినాధ్ అంకుల్... 'వీర' ని అర్జెంట్ గా చెన్నై వెళ్ళమని చెప్పాడంట....

వీర ఏమో ఇంకో డీల్ కోసం... ఇక్కడ వేరే ప్లాన్ వేసుకొని వున్నాడు .... అవతల ఎమౌంట్ కూడా తక్కువ ఏమి కాదు... ఈ చిరాకులో... ఆ బండి సౌండ్ విని... 

వీర 'ఏయ్!!! పిల్లా... జరా ఆపు. ఆ సౌండ్ బండి స్టార్ట్ అవ్వకపోతే.... నడిపించుకుంటూ పో.... అంటూ అరిచాడు..

స్వప్న (కదా... ఛా.... ఇతన్ని దెబ్బకి నా మైండ్ పని చేయడం లేదు...) అనుకుంటూ బండి నడిపించుకుంటూ కొంచెం దూరం వెళ్ళాక... 

సుమ వచ్చి 'వీర' ని చూస్తూ.... "అన్నా... ఇక్కడకి ఒక మేడమ్ వచ్చారా??? అని అడిగింది.

వీర 'ఫోన్' మాట్లాడుతూ... "చూడలేదు"... అంటూ సైగ చేసాడు... సుమ ఫోన్ తీసి... "స్వప్న" నెంబర్ కి కాల్ చేసింది... స్వప్న మళ్ళీ మళ్ళీ ట్రై చేసేసరికి బండి స్టార్ట్ అయ్యింది.. హమ్మయ్యా.... అనుకుంటూ వెళ్తుంటే .... ఫోన్ రింగ్ అయ్యింది.... సుమ కి వినబడింది ఆ సౌండ్... వెనుక నుండి చూసి... ఈ మేడమేనా అనుకుంటూ... 'మేడమ్.... అంటూ పిలిచింది... స్వప్న 'అమ్మో... ఈ పిల్ల వచ్చినట్లుంది... అంటూ బండి స్పీడ్ పెంచింది .

సుమ 'ఇదేంటి... ఈమె కి వినపడలేదా??? అనుకుంటూ వీర తో 'అన్నా... ఆ మేడమ్ కలవాలి... కాస్తా వెళ్లామా??? అని అడిగింది...

వీర 'పోన్' పెట్టేసి... 'తప్పదా??? అంటూ అడిగాడు చిరాగ్గా ఫేస్ పెట్టి....

సుమ 'తప్పదు... అనేసరికి..

వీర 'సరే... పదా... అని బండి స్టార్ట్ చేసాడు... సుమ ఎక్కగానే....బండి స్టార్ట్ చేసాడు....

స్వప్న కొంచెం ముందుకు వెళ్ళి... బండి స్లో... చేసింది..

అంతే వెనుక నుంచి ఎన్ ఫీల్డ్ "డగ్ డగ్" మని సౌండ్ చేస్తూ వచ్చేసరికి....గుండె గుభేల్ మన్నది....

"అమ్మో... ఈ పిల్ల 'వీర' తో వస్తోందా? లేక.... అతను నన్ను గుర్తు పట్టాడా??? అంటూ బండ్ ఫాస్ట్ పెంచింది...

సుమ 'మేడమ్.... అంటూ పెద్దగా పిలిచింది.. వీర చెవి గుయ్యిమంది.. 'ఏహే! ఎందుకు అలా అరుస్తావ్???? అంటూ సుమ కేసి కోపం గా చూసి.. రెండు నిమిషాలలో ' స్వప్న ' ని క్రాస్ చేసి.... తనకి అడ్డంగా బండి ఆపాడు.. 

స్వప్న 'అయిపోయా.... ఇవాల్టి తో నా చాప్టర్ క్లోజ్.... అంటూ ఆగింది..
సుమ బండి దిగి 'మేడమ్... మీరేనా??? అని అడిగింది.

స్వప్న "వీర" వైపు చూస్తూ.... "కాదు... అవును... కాదు... అంటూ ఎదోదే చెప్తుంటే..

సుమ వాలెట్' ఇస్తూ... తీసుకోండి మేడమ్... అన్నది...

అంతే స్వప్న స్కార్స్ లూజ్ అయింది.... వీర 'ఇచ్చావ్ గా... ఇక పదా... అన్నాడు...

 సుమ ' స్వప్న ఏమి మాట్లాడకపోవడం చూసి..... 'ఏమైంది ఈమెకి???? అనుకుంటూ... వీర వెనుక ఎక్కాగానే వీర రివర్స్ చేయగానే.... స్వప్న స్కార్ఫ్ వూడిపోయింది.

స్వప్న ఫాస్ట్ గా స్కూటి స్టార్ట్ చేసి ... వెళ్లి పోయింది...

వీర కి ఎందుకో తేడా కొట్టింది.. ఆ కళ్ళు... ఎక్కడో చూశానే.... అనుకుంటూ... సుమని దిగమని బండి మళ్ళీ రివర్స్ చేసి.... ముందుకు వెళ్ళాడు... రోడ్డు డెండ్ ఎండ్ వరకు వెళ్ళాడు... స్వప్న కనపడలేదు...

'వచ్చింది స్వప్న నా!? కాదా!? అనుకుంటూ అన్ని గల్లీలు తిరిగాడు... ఎక్కడ కనపడలేదు...

మళ్ళీ 'కాళి' వాళ్ళ ఇంటికి వచ్చాడు...

కాళీ బయటకు వచ్చి 'పదా!!! వెళ్తాం అనగానే...

వీర లోపలికి వెళ్ళి... సుమా! అంటూ పిలిచాడు...

సుమ ఎదో ఫోటో చూస్తూ.... 'ఆ... అన్నా.... అన్నది...

వీర 'నువ్వు పర్స్ ఇచ్చింది... స్వప్న కా!!! అని అడిగాడు.. లైట్ గా ఆశ్చర్యంగా.... (వీర సార్ కి ఆశ్చర్చాలు, ఆనందాలు.... ఇంకా ఎక్కలేదులే)

సుమ ఆశ్చర్యంగా ఫేస్ పెట్టి 'ఆ మేడమ్ పేరు నాకు తెలియదు... అనగానే...

వీర 'అసలు తన పర్స్ నీ దగ్గరకు ఎలా వచ్చింది??? అని అడిగాడు...

సుమ జరిగింది చెప్పింది...
వెనుకే వున్న కాళి మొత్తం విని ఆనందంగా... "సుమా! ఆ మేడమే నన్ను వైజాగ్ లో హాస్పిటల్ చేర్చి.... తన పైసలతో నాకు ఆపరేషన్ చేపించింది.... అన్నాడు

వీర 'నీకు ఆపరేషన్... నాకు పరేషాన్ అంటూ గుండె రుద్దుకున్నాడు...

'సుకు 'అవునా అన్నా... ఈ ఫోటో రాత్రి మేడమ్ పర్స్ లో చూసినా... అంటూ ఫోటో చూపించింది..

కాలి కన్నా ముందు వీర లాక్కొని చూశాడు...

స్వప్న,శృతి ఫోటో....

అంతే వీర ఆ ఫోటో ని మధ్యలో కి చింపి శృతి వున్న ముక్కని కింద పడేసి...

స్వప్న వున్న ఫోటోని జేబులో వేసుకుని చక్కాపోయాడు...

సుమ నోరు వెళ్ళి పెట్టుకొని చూస్తుంటే..

''కాళి' వీర ప్రేమించాడని చెప్పానే... ఈ స్వప్న నే... అంటూ వెళ్లిపోయాడు..

సుమ షాక్ తో... కూర్చోని... స్వప్నని గుర్తు తెచ్చుకుంది...

'మేడమ్ ఎక్కడ??? వీర అన్న ఎక్కడ??? అయ్యయ్యో... ఇప్పుడు ఎలా??? అందుకా... మేడమ్ కంగారుగా వెళ్ళిపోయారు..

ఈ లోపు వీర ఫాస్ట్ గా వచ్చి 'నీ ఫోన్ ఏది??? అని అడిగాడు..

సును ఎందుకు??? అని అడిగింది కంగారుగా..

వీర ఇవ్వేహే... అనగానే..సుమ ఫోన్ ఇచ్చింది..

పేర అందులో లాస్ట్ డెయిల్ నెంబర్ చూసి...తన ఫోన్ లో సేవ్ చేసుకున్నాడు...

మై జాన్ .. అని

సుమ 'అయ్యో... వీర అన్నా.... అలా ఎలా నెంబర్ తీసుకుంటావు??? తప్పు కదూ... అని అడిగింది కంగారుగా...

వీర 'ఫోన్ నెంబర్ ఎవరిదో కాదు.. మీ వదినదే అంటూ కాలర్ వెనక్కి తోసి.... వెళ్ళిపోయాడు..

సుమ 'చచ్చా... ఇప్పుడు ఈయన ఫోన్ చేసి... ఏమన్నా అంటే నా మీదకే వస్తుంది... ఇప్పుడు ఎలా??? అంటూ తల పట్టుకుని కూర్చుంది..

స్వప్న ఇంట్లోకి వెళ్లి గటగటా వాటర్ తాగింది...

తన రూమ్ లో కి వెళ్లి.... పర్స్ తీసి చూసింది...
డబ్బులు వున్నాయి... ఫోటో లేదు..
అంతే షాక్...

శృతి 'ఏమైంది అక్కా... అని అడిగింది...

స్వప్న 'ఏమి లేదు.. అంటూ బెడ్ మీద అలా కూర్చున్నది...

"ఫోటో వుండాలి కదా!!! ఏమైంది??? ఎలా మిస్ అయ్యింది???అంటూ టెన్షన్ పడుతుంటే... చెమటలు కారుతున్నాయి...

అది చూసి శృతి బుక్స్ పక్కన పెట్టి..."అక్కా!! ఆర్ యూ ఓకే!? అని అడిగింది భుజంపై చెయ్యి వేసి...

స్వప్న 'హ. ఓకే అంటూ బాత్ రూమ్ లో కి వెళ్ళింది...

శృతి ' సమ్థింగ్ ఈజ్ రాంగ్... బయటకు వెళ్ళేటప్పుడు బాగానే ఉంది... వచ్చాక ఎందుకో పానిక్ అవుతోంది..

కొంపదీసి ఆ రౌడీ మళ్ళీ వెంటపడ్డాడా??? అంటూ ఎదో ఆలోచన రాగానే..

స్వప్న ఫోన్ తీసి చెక్ చేసింది..

లాస్ట్ నెంబర్ తీసుకుని... ట్రూ కాలర్ చెక్ చేసింది..

సుమ అని వున్నది...

ఆ నెంబర్ తన ఫోన్ లో సేవ్ చేసి సైలెంట్ గా కూర్చుంది...

&&&

వీర ఇంట్లో:

 8.00pm

వాకిట్లో నుండి అరుపులు..

"రేయ్!!! వీర... నిన్నే రా!!! కన్న తండ్రి ని అని చూడకుండా నన్నే గెంటేస్తావా????

రారా బయటికి..... రారేయ్.... అని వీర వాళ్ళ నాన్న..

"సైదులు" ఒకటే గొడవ...

వీర హాల్లో తన ఫోన్ లో.... స్వప్న నెంబర్ చూస్తున్నాడు..

ఆ గొడవ అసలు తన చెవులకి ఎక్కడం లేదు..

కాళి 'ఏంటిరా!!! మీ అయ్య లొల్లి... నువ్వెమో.... ఆయన్ని ఇక్కడ వుండనీయవు....

ఆయనేమో... డబ్బులు కావాల్సినపుడు.... వచ్చి రచ్చ చేస్తాడు... నువ్వు డబ్బులు ఇస్తావు... కాని ఆయన మొహం చూడవు... మధ్యలో నేను అయిపోతున్నా... అంటూ లేచి వెళ్ళి.... 'సైదులు' చేతిలో ఓ వెయ్యి రూపాయలు వుంచాడు..

వెంటనే సదరు సైదులు.'వీర... నువ్వు దేవుడు... నా బంగారు తండ్రి.. అంటూ తూలుతూ వెళ్ళి పోయాడు.

కాళి లోపలికి వచ్చి "ఏరా!! స్వప్న కి ఫోన్ చేస్తావా??? అని అడిగాడు....

వీర 'చేయను.... అన్నాడు సీరియస్ గా...

కాళి 'మరి నెంబర్ ఎందుకు తీసుకున్నావు.. అని అడిగాడు ఆశ్చర్యంగా..

వీర 'నా జాను.... నా స్వప్న నెంబర్ కాబట్టి... నా దగ్గర వుండాలి కాబట్టి.... అంటూ తన రూమ్ లో కి వెళ్ళి పోయాడు..

కాళి తల గోక్కుంటూ... "వీడు కొన్ని విషయాల్లో నాకు ఎప్పటికీ అర్ధం కాడు... అనుకున్నాడు..

&&& 

Next day ... స్వప్న వాళ్ళ కాలేజీ లో...

ఆరోజు తో... వాళ్ళ ఎగ్జామ్స్ అయిపోయాయి...

స్వప్న తప్ప అందరూ హుషారుగా బయటకు వచ్చారు...

నటాషా 'హమ్మయ్యా... మొత్తానికి యమ్.బి.ఏ ఫినిష్ చేశాము... అన్నది ఆనందంగా...

విశాల్ ముక్కు చూసుకుంటూ... (అమ్మో... ఈ రవి గాడు శృతి ని రమ్మన్నాడు.... తను వచ్చిదంటే.. అన్నయ్యా.... అంటూ వరుసలు కలుపితే.... నేను ఎస్కేప్ అయిపోతా)..

"సరే... గైస్.... నాకు అర్జెంట్ పని వుంది... నేను వెళ్తున్నా.... మరో రోజు కలుద్దాం... అనేగానే...

బిందు 'ఓ... హలో..... ఎక్కడికి??? ఱగు మూవికి వెళదాం... అనగానే...

నటాషా' ఆ.... అటు నుంచి రెస్టారెంట్ కి వెళ్ళి ఎంచక్కా ఫుడ్ తినేసి వెళదాం....

స్వప్న డల్ గా వుండటం చూసి...

రవి అపూతారా... స్వప్న అలా డల్ గా వుండటం చూసి కూడా... ఎలా ప్లాన్స్ వేస్తున్నారు??? ఫ్రెండ్సే నా మీరు?? అన్నాడు..చిరాగ్గా...

" స్వప్న.... ఇదంతా కాదు.... నీకు ఒక మాట చెప్పాలి... శృతి కి వీర సంగతి తెలిసిపోయింది... అంటూ ఆగాడు..

స్వప్న 'ఏంటి... శృతికి తెలిసిందా??? ఎలా??? అని అడిగింది కంగారుగా...

రవి 'మీ డ్రైవర్ చెప్పాడు.....స్వప్న తను నాతో ఏమి అనలేదు.... అసలు ఏమి అడగలేదు... అనగానే... ఈలోపు శృతి స్కూటీ వచ్చి విశాల్ ముందు ఆగింది...

శృతి అందరితో 'హాయ్!!! అంటూ చేయి వూపింది... 

రవి 'నీ గురించే మాట్లాడుకుంటున్నాం... అనగానే. శృతి బండి దిగి.. "ఏమని??? అని అడిగింది... స్వప్న ' శృతి!!! నువ్వు ఇంట్లో ఎవరితో అనలేదు కదా... అని అడిగింది... కంగారుగా.. 

శృతి 'అనలేదు అక్కా.... అయినా నువ్వు నాకు ఎందుకు చెప్పలేదు... అన్నది
కోపం గా..

బిందు 'చెప్తే మాత్రం ఏం చేస్తావ్!? అతను ఆ వీర ఎంత రౌడీ అనుకున్నావ్???? అంటూ ...

శృతి' ' శృతి... ఇక్కడ... ఎంత రౌడీ అయినా... నేనేమి భయపడను...

నటాషా 'నువ్వు పడక్కర్లేదు... అతను భయపెడతాడు.. అలా వుంటాడు... అంటూ మొహం మాడ్చేసింది....

శృతి 'రవి.. ఏంటి మీ ప్లాన్... ఎక్కడికి వెళదాం... అని అడిగింది..

 విశాల్ 'యూ'... పీపుల్ క్యారీ ఆన్... అంటూ వెళ్ళిపోతుంటే..

శృతి 'విశాల్ బ్రో... ఎక్కడికి???? అని అడిగింది కళ్ళు ఎగరేస్తూ..

విశాల్ (ఛీ... నా బతుకు... నేను ఇష్టపడే అమ్మాయి 'బ్రో' అని పిలవటం )

రవి నవ్వు ఆపుకుంటూ..

"వాడికి ఏదో పని వుందిలే.... వదిలేయ్... అనేగానే.

విశాల్ 'సరే.... బై అంటూ వెళ్లిపోయాడు...

రవి 'చూడు... శృతి... మేము ఎగ్జామ్స్ అవ్వగానే ఏం చేయాలి?! అని ప్లాన్ వేసుకున్నాము... బట్ స్వప్న అలా డల్ గా వుంటే.... ఏమి చేయాలో అర్థం కావటం లేదు... అన్నాడు...

 స్వప్న 'అక్కా... ఆ రౌడీ సంగతి నాకు వదిలేసి... నువ్వు రిలాక్స్ అవ్వు...m అలా డల్ గా వుండకు... పదా మూవికి వెళదాం... అన్నది...

స్వప్న 'అది కాదు.... నిన్న ఏం జరిగింది అంటే...

శృతి 'ఏం జరిగింది??? నువ్వు నీ వాలెట్ కోసం వెళ్తే ఆ వీర కనపడ్డాడు... అంతేనా??? అన్నది కూల్ గా..

స్వప్న 'నీకు ఎలా తెలుసు??? అన్నది ఆశ్చర్యంగా... శృతి 'సుమ చెప్పింది.. అనేగానే... స్వప్న కోపం గా 'అంటే నువ్వు తనని కలిశావా?? అని అడిగింది... 

శృతి 'ష్!!! అక్కా... నేను కలవలేదు... జస్ట్ కాల్ చేశా... అంతే... అనగానే... 

స్వప్న ' అ అమ్మాయి... అతని చెల్లి అనుకుంటా.... అనగానే.. బిందు 'హలో... సిస్టర్స్ కాస్త తెలుగులో మాట్లాడతారా????

శృతి 'బిందు అక్కా... టూ మచ్ చేయకు. మేము మాట్లాడేది తమిళమా????

నటాషా 'అది కాదు... అసలు సుమ ఎవరు?7? ఏం జరిగింది??? చెప్పమని దీని బాధ అంటూ బిందు నెత్తి మీద ఒక్కటి ລ້໐໖...

స్వప్న జరిగింది చెప్పింది....

అంతా విని బిందు'అంటే... ఆ రాక్షసుడు నిన్ను గుర్తు పట్టలేదా??? అంటూ వణుకుతూ అడిగింది..

స్వప్న 'ఏమో... నేను అయితే... చాలా స్పీడ్ గా వచ్చేశా..... బిందు 'అయినా... వదలడే.... అన్నది ఎటో చూస్తూ.. నటాషా 'అవునే... కరెక్టే... అడుగో వచ్చేశాడు....

బిందు 'అమ్మో... అంటూ స్వప్న కారు వెనుక దాక్కుంది...

స్వప్న టెన్షన్ గా చూసేసరికి వీర కనపడలేదు.

నటాషా నవ్వుతూ... 'చూశారా.. పారిపోవాల్సిన స్వప్న ఇక్కడే వుంది... బిందు దాక్కుంది... అనగానే...

రవి 'ఏహే... ఆపు... నువ్వు నీ వేషాలు... అనగానే బిందు వచ్చి "నటాషా" వీపు ని మోత మోగించింది.

శృతి 'రవి... ఇక్కడ కాదు... పదండి ఏదైనా రెస్టారెంట్ కి వెళ్ళి... ఫుల్గా తినేసి అప్పుడు ఆలోచిద్దాం.....

స్వప్న 'వద్దు... ఇంటికి వెళ్ళిపోదాం పదా.... ఎగ్జామ్స్ అయిపోయాయి... ఇప్పట్లో కాలేజీకి రాను.. అతనికి కాలేజి,నా పేరు తప్ప ఇంకేమి తెలియవు...

సో..కనపడ..డు..అంటూ ఆగి అందరి వైపు టెన్షన్ గా చూసింది..

రవి 'ఏమైంది???? అంటూ కళ్ళు ఎగరేశాడు..

స్వప్న 'ఒకవేళ సుమ అతని చెల్లి అయితే... నా ఫోన్ నెంబర్ తీసుకుంటే..

శృతి 'ఊరుకో... అక్కా ఆ రౌడి కి అంత తెలివి వుంటుందని నేను అనుకోవడం లేదు...

నటాషా 'నేను కూడా... అదే అనుకుంటున్నాను.... బిందు 'నేను అయితే... స్వప్న చెప్పిందే కరెక్ట్.. అనుకుంటున్నా....

రవి 'ఏంటి కరెక్ట్??? ఒకవేళ తీసుకొని వుంటే... ఈపాటికి కాల్ చేసేవాడు కదా

శృతి "అదే కదా... సో.. మై డియర్ స్వీట్ అక్కా... ఇంక నువ్వు ఆ విషయం మర్చిపో....

స్వప్న 'సరే.... కాని రెస్టారెంట్స్ అవి వద్దు....

బిందు 'సరే... అయితే మా ఇంటికి వెళ్లాం పదండి... అమ్మ నాన్న... కి నో ప్రాబ్లం... అనేగానే..

శృతి 'అలా అయితే... వంట మాత్రం నువ్వు చేయకూడదు.. అన్నది నువ్వు ఆపుకుంటూ...

బిందు కళ్ళ' తోనే సైగ చేసింది... నో అని..

నటాషా 'ఏయ్....ఎదో వుంది... చెప్పండి అనగానే...

స్వప్న 'అదేం లేదు... పదండి వెళ్లాం... అంటూ తను కారు ఎక్కింది... శృతి 'రాము... ఏడి అక్కా.... అని అడిగింది

స్వప్న తన ఫోన్ తో డ్రైవర్ రాముడుకి రింగ్ ఇచ్చింది..

అతను రెండు నిమిషాల్లో వచ్చాడు..

శృతి 'రాము... నువ్వు స్కూటీ వేసుకొని ఇంటికి వెళ్ళు... కారు కీస్ ఇటివ్వు.... అనగానే...అతను ఇచ్చాడు..

బిందు 'ఎవడో చచ్చాడు... అన్నది....

శృతి 'నీ వంట తిని చచ్చేకన్నా నా డ్రైవింగ్ వలన చావడం నయం...అంటూ కారు ఎక్కింది...

బిందు, నటాషా కుడా కారు ఎక్కారు...తన బైక్ స్టార్ట్ చేయగానే..విశాల్ వచ్చి వెనుక ఎక్కాడు..

 రవి 'వెళ్తా... అన్నావ్.. విశాల్' ఆ... అనే వెళ్ళా... బట్ బిందు, స్వప్న, నటాషా ల కోసం మళ్ళీ వచ్చా.... రవి 'అంతేనా... లేకపోతే.... శృతి.... విశాల్ ' నువ్వు పోని.... అన్నాడు సీరియస్ గా.. అందరు బిందు వాళ్ళ ఇంటికి కి వెళ్ళారు. 

&&&&&&&&&&&&&&

త్రినాధ్ ఫామ్ హౌస్....రోని 'ఇంకా ఎంతసేపు ఎదురు చూడాలి... వాడి కోసం... నీకు లక్ష సార్లు చెప్పా... దాదా.... వాడు చేసే ఏం పని అయినా... నేను చేయగలను... అంటూ కల్లు తాగినా కోతిలా... చిందులేస్తున్నాడు...

త్రినాధ్ పిఏ.... పెద్దగా నవ్వటం చూసి...

రోనికి ఇంకా కోపం పెరిగింది..

అంతే అతని దగ్గరకు వెళ్లి కాలర్ పట్టుకుని 'ఎరా!! తమాషా గా వుందా??? అన్నాడు కోపం ח..

పిఏ బాబు 'ఉట్టికి ఎక్కలేనమ్మా.... స్వర్గానికి ఎక్కుతా... అన్నాడంట నీలాంటి వాడే... అంటూ కాలర్ విడిపించుకున్నాడు....

ఫోన్ లో ఏదో సీరియస్ గా చూస్తున్న త్రినాధ్ తో 'చూశావా... నీకే నేనంటే లెక్క లేదు... అందుకే ప్రతి ఔలాగాడికి చులకన అయిపోయా... అంటూ ఫోన్ లాక్కున్నాడు..

త్రినాధ్ 'ఎహే... ఇటివ్వు.... అంటూ ఫోన్ తీసుకుని..

'ఏంటిరా!? నీ ప్రాబ్లం??? అని అడిగాడు...

రోని 'ఈరోజు... వీర గాడిని చెన్నై పంపిస్తున్నావంట..... ఏం??? నేను చేయలేనా??? ఆ మాత్రం డీలింగ్స్!!!! అంటూ పళ్ళు కొరికాడు...

త్రినాధ్ 'చేయలేవు... నీ వల్ల కాదు... అది కేవలం వీర మాత్రమే చేస్తాడు... నెక్స్ట్!? అంటూ ఫోన్ లో తల దూర్చాడు...

దోని 'నేను కొంచెం లేట్ వస్తే ఓ మస్త్ తిడతావ్.... వాడు ఎంత లేట్ వచ్చినా... ఏమి అనవు... ఎందుకు??? అనగానే..

"ఎందుకంటే.... నువ్వు దాదా కింద పని చేసే.... పనివాడివి.. అని వినపడి పక్కకి చూసేసరికి..

వీర తను వైపే సీరియస్ గా చూస్తూ వచ్చి త్రినాధ్ పక్కనే వున్నా చైర్ లో కూర్చుని కాలు మీద కాలు వేసాడు..

రోని 'త్రినాధ్' వైపు చూసి...

"చూశావా!!! నేను పని వాడిని అంటా... మరి వాడు???

వీర 'రేయ్!!! తాట తీస్తా... నేను ఎవరి కిందా పని చేయను... నీకు నాకు మస్తు తేడా.... నేను... కింగ్.... నా రూల్స్ నాకు వుంటాయి......అంటూ సిగరెట్ తీశాడు..

రోని 'చూశావా! నువ్వు వాడిని నెత్తిన పెట్టుకున్నావు....ఎదో ఒకరోజు నిన్ను బద్నామ్ చేస్తాడు

వీర 'ఆపు .... అంటూ త్రినాధ్ తో 'చెన్నై లో ఎక్కడా???? అని అడిగాడు...

త్రినాథ్ పిఏ వైపు చూశాడు... అతను చిన్న స్లిప్ ఇచ్చాడు..... వీర అది చూసి... ఓకే.... అయితే ఈసారి రిస్క్ ఎక్కువగా వుంది.... 60-40 వేస్కో... అంటూ పైకి లేచాడు... రోని, పిఏ బాబు నోరు తెరచి 'త్రినాథ్' వైపు చూశారు... 

త్రినాధ్ 'సరే... ఆ సుదీప్ సైట్ విషయం ఏమి తేల్చావ్???? అన్నాడు..

వీర "సైట్ మాత్రమేనా??? వాళ్ళ ఇల్లు కూడా కొట్టేస్తా

రేని 'హా.. మరే... నువ్వు ఏమైనా అల్లుడివా??? పిల్లతో పాటు ఆస్తులు ఇవ్వటానికి.... అన్నాడు వెటకారంగా...

వీర ' చూడు... !!! చెన్నై నుంచి రాగానే ఆ సుదీప్ సంగతి చూస్తా.... అంటూ వెళ్ళిపోయాడు...

రోని 'హ.హ. నేను చెప్పానా???? నువ్వు చెప్పాల్సిన పర్సెంటేజ్ వాడు డిసైడ్ చేశాడు.... నాకు మాత్రం 30 ఇస్తావ్... అంటూ ఉడుకున్నాడు....

త్రినాధ్ 'రోని.... నీకు ఆలోచన తక్కువ... ఆవేశం ఎక్కువ...

సరే.... నీకు ఒక ఛాన్స్ ఇస్తా!!!! వీర రావడానికి ఎంత కాదన్నా 3,4 రోజులు పడుతుంది...ఈలోపు ఆ సుదీప్ సైట్...పేపర్స్ నా పేరు మీద పెట్టించు.... చూద్దాం!!!! అన్నాడు...

దీని 'అదెంత పని... రేపు ఈపాటికి నీ ముందు వుంటా... అంటూ వెళ్లిపోయాడు.. పిఏ బాబు "సార్.... వర్క్ అవుతుందటారా!? నాకు ఎందుకో డౌటే... 

త్రినాథ్ ' సుదీప్ తో అంత ఈజీ కాదు... అది కేవలం వీర మాత్రమే సాధిస్తాడు... పిఏ అన్నట్లు... మనోడు ఫోన్ చేశాడు... ఆ పిల్ల ది ఈ ఊరు అంటా.... వీర వెళ్ళి ప్రేమ పెళ్లి అని గొడవ చేశాడంట..... త్రినాథ్ నవ్వుతూ.... "చూద్దాం... ఏమవుతుందో... అన్నాడు..

&&&
 
X నుంచి రోని కి ఫోన్ వచ్చింది...

రోని 'చెప్పండి..... చాలా రోజుల తర్వాత...

X ' నీతో చిన్న పని పడింది... అందుకే చేశా....

రోని 'ఏం పనో..

X 'నీకో అడ్రస్ చెప్తా... వెళ్ళి 'వీర' పంపాడని... చెప్పి అక్కడ స్వప్న అని ఓ అమ్మాయి వుంటుంది.... ఆ అమ్మాయి తో 'పెళ్ళి' గురించి ఏం డిసైడ్ చేశావ్???? మర్యాదగా ఒప్పుకో.... లేకపోతే వీర సంగతి నీకు తెలియదు... అంటూ బెదిరించు..

 రోని 'అమ్మాయా!? వీర పంపటం ఏంటి ... నాకు అంతా గలాటా ఉంది.....

X 'హ.హ నా ప్లాన్ లో భాగంగా వీర ' స్వప్న ' అనే బ్యూటిఫుల్ అండ్ సౌండ్ పార్టీ పిల్ల ప్రేమలో ప
డ్డాడు

రోని 'అర్థం అయ్యింది... ఆ పిల్ల ఒప్పుకోలేదు... కాబట్టి నేను ఎంటర్ అయ్యి వీర మీద ఇంకా కోపం పెంచాలి....

X "అంతే..... సరే నీ ఎకౌంటు లో 2 లాక్స్ వేశా.. అడ్రస్ పంపుతా.... చూడు అంటూ కాల్ కట్ చేశారు..

రెండు నిమిషాల తర్వాత తన ఫోన్ లో వచ్చిన అడ్రస్ చూసి "అరే... ఇది ఆ సుదీప్ ఇంటి అడ్రస్...

అంటే వీర లవ్ చేస్తోంది సుదీప్ కూతురినా!?

అయితే నా పని ఇంకా ఈజీ.... అనుకున్నాడు..
[+] 5 users Like Ranvijaysingh2's post
Like Reply


Messages In This Thread
Veera - by Avengers35 - 17-06-2024, 09:25 PM
RE: Veera - by sri7869 - 17-06-2024, 09:56 PM
RE: Veera - by dombull7 - 17-06-2024, 10:58 PM
RE: Veera - by hijames - 18-06-2024, 01:05 AM
RE: Veera - by Avengers35 - 18-06-2024, 02:01 PM
RE: Veera - by Avengers35 - 18-06-2024, 02:02 PM
RE: Veera - by hijames - 18-06-2024, 02:19 PM
RE: Veera - by Avengers35 - 19-06-2024, 12:07 PM
RE: Veera - by hijames - 19-06-2024, 12:33 PM
RE: Veera - by Avengers35 - 20-06-2024, 01:41 AM
RE: Veera - by Saikarthik - 20-06-2024, 10:40 AM
RE: Veera - by appalapradeep - 20-06-2024, 11:59 AM
RE: Veera - by sri7869 - 20-06-2024, 07:24 PM
RE: Veera - by hijames - 20-06-2024, 08:24 PM
RE: Veera - by Avengers35 - 20-06-2024, 08:33 PM
RE: Veera - by hijames - 20-06-2024, 09:38 PM
RE: Veera - by sri7869 - 20-06-2024, 09:45 PM
RE: Veera - by ramd420 - 20-06-2024, 10:10 PM
RE: Veera - by Avengers35 - 21-06-2024, 08:24 PM
RE: Veera - by Saikarthik - 21-06-2024, 09:18 PM
RE: Veera - by sri7869 - 21-06-2024, 09:43 PM
RE: Veera - by dombull7 - 21-06-2024, 11:29 PM
RE: Veera - by hijames - 22-06-2024, 03:38 AM
RE: Veera - by Avengers35 - 22-06-2024, 09:02 PM
RE: Veera - by sri7869 - 22-06-2024, 09:04 PM
RE: Veera - by hijames - 23-06-2024, 04:30 AM
RE: Veera - by Saikarthik - 23-06-2024, 10:42 AM
RE: Veera - by Avengers35 - 23-06-2024, 07:22 PM
RE: Veera - by hijames - 23-06-2024, 08:11 PM
RE: Veera - by sri7869 - 23-06-2024, 10:28 PM
RE: Veera - by Avengers35 - 08-07-2024, 07:31 PM
RE: Veera - by hijames - 08-07-2024, 07:36 PM
RE: Veera - by Avengers35 - 08-07-2024, 08:43 PM
RE: Veera - by hijames - 08-07-2024, 09:50 PM
RE: Veera - by sri7869 - 09-07-2024, 05:00 AM
RE: Veera - by Saikarthik - 09-07-2024, 09:00 AM
RE: Veera - by Avengers35 - 20-07-2024, 09:43 PM
RE: Veera - by Avengers35 - 20-07-2024, 10:00 PM
RE: Veera - by 3sivaram - 20-07-2024, 10:38 PM
RE: Veera - by Avengers35 - 21-07-2024, 06:54 AM
RE: Veera - by sri7869 - 20-07-2024, 10:21 PM
RE: Veera - by Uday - 21-07-2024, 03:04 PM
RE: Veera - by Avengers35 - 21-07-2024, 04:23 PM
RE: Veera - by Uday - 21-07-2024, 07:08 PM
RE: Veera - by sri7869 - 22-07-2024, 11:25 AM
RE: Veera - by Avengers35 - 10-08-2024, 10:53 PM
RE: Veera - by sri7869 - 11-08-2024, 01:00 PM
RE: Veera - by vrao8405 - 01-09-2024, 11:49 PM
RE: Veera - by Avengers35 - 17-11-2024, 01:36 PM
RE: Veera - by বহুরূপী - 17-11-2024, 05:08 PM
RE: Veera - by Avengers35 - 17-11-2024, 05:19 PM
RE: Veera - by sri7869 - 17-11-2024, 06:38 PM
RE: Veera - by Avengers35 - 21-11-2024, 07:59 AM
RE: Veera - by sri7869 - 21-11-2024, 10:23 AM
RE: Veera - by BR0304 - 21-11-2024, 01:41 PM
RE: Veera - by Ranvijaysingh2 - 08-09-2025, 04:46 PM
RE: Veera - by Ranvijaysingh2 - 08-09-2025, 04:49 PM
RE: Veera - by utkrusta - 08-09-2025, 06:40 PM
RE: Veera - by Ranvijaysingh2 - 09-09-2025, 10:12 PM
RE: Veera - by Dragon09 - 09-09-2025, 10:45 PM
RE: Veera - by Ranvijaysingh2 - 16-09-2025, 09:11 PM
RE: Veera - by Ranvijaysingh2 - 16-09-2025, 09:15 PM
RE: Veera - by Ranvijaysingh2 - 17-09-2025, 10:31 PM
RE: Veera - by Ranvijaysingh2 - 05-06-2026, 05:20 PM
RE: Veera - by lohith22 - 06-06-2026, 07:04 AM
RE: Veera - by 9888943338 - 06-06-2026, 01:07 PM
RE: Veera - by Ranvijaysingh2 - 07-06-2026, 11:26 PM
RE: Veera - by ash.enigma - 08-06-2026, 12:15 PM
RE: Veera - by lohith22 - 08-06-2026, 04:05 PM
RE: Veera - by yekalavyass - 08-06-2026, 08:10 PM
RE: Veera - by Ranvijaysingh2 - 09-06-2026, 01:06 PM
RE: Veera - by Ranvijaysingh2 - 09-06-2026, 01:08 PM
RE: Veera - by VijayPK - 09-06-2026, 01:48 PM
RE: Veera - by Durga reddy - 09-06-2026, 01:54 PM
RE: Veera - by ash.enigma - 09-06-2026, 02:11 PM
RE: Veera - by lohith22 - 09-06-2026, 07:47 PM
RE: Veera - by Ranvijaysingh2 - 11-06-2026, 04:11 PM
RE: Veera - by ash.enigma - 11-06-2026, 07:09 PM
RE: Veera - by lohith22 - 11-06-2026, 11:11 PM
RE: Veera - by VijayPK - 12-06-2026, 12:29 AM



Users browsing this thread: 1 Guest(s)