Thread Rating:
  • 15 Vote(s) - 2.73 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance Veera
#67
స్వప్న వైజాగ్ నుంచి వచ్చాక వీర గురించి కొంత మర్చిపోవడం....

ఆ తర్వాత ఇంట్లో అందరూ విమ్ము అంకుల్ కి దొరకడం....

లాస్ట్ ఎపిసోడ్స్ లో చూశాం...

అయితే ఒకరోజు వీర ' స్వప్న ' కారు కి అడ్డంగా బైక్ ఆపుతాడు..

కోపంతో కారు లో నుండి డ్రైవర్ దిగి నీర మీదకు రాబోతుంటే సింహా అతన్ని పక్కకి తీసుకెళ్తాడు...

ఆ తర్వాత:

వీర ని చూసి స్వప్న భయపడుతూ కారు లో నుండి కిందకి దిగింది..

వీర 'ఏంటి స్వప్న ?? అంత భయం వేస్తోందా నన్ను చూస్తుంటే.. అని అడిగాడు సేమ్ మాడిపోయిన పెనం మొహం తోనే

స్వప్న 'చూడండి... మీరు అలా చెప్పడం ఏ మాత్రం కరెక్ట్ కాదు.. నాకు మీ మీద లవ్ కలగదు.... ఇంకెప్పుడూ నన్ను కలిసే ప్రయత్నం చేయకండి.... మా డ్రైవర్ ని వదలండి ప్లీజ్... అన్నది కళ్ళ వెంబడి నీళ్ళతో...

వీర 'ఏయ్! ముందు ఏడుపు ఆపు... నాకు చిరాకు.... సరే... నువ్వు నాకు నచ్చావ్... అదేదో ప్రేమ అంటగా... మా కాళి గాడు అంటున్నాడు.

నాకు ఎందుకో నువ్వు బాగా గుర్తు వస్తున్నావు...? నాకు నిన్నే ఎప్పుడు చూడాలి అనిపిస్తోంది... అంటూ సిగరెట్ వెలిగించాడు..

స్వప్న 'వీర' వైపు భయంగా చూసింది..

బ్లాక్ జీన్స్ ప్యాంట్... లైట్ గ్రీన్ కలర్ షర్ట్
షేవింగ్ లేదు... కళ్ళు మాత్రం కోపంగానో విసుగ్గా నో చూస్తుంటాయి..

వీర 'పొగ' వదుల్తూ...

"చూడు స్వప్న..... నువ్వు నన్ను ఎలా చూసినా... నా గెటప్ మారదు... నా ప్రవర్తన మారదు... నా గురించి నీకు ఏమి తెలియదు కదా.. నేనే చెప్తా... అంటుండగా....

ఈలోపు బైక్ మీద కాలేజి నుండి బయటకు వచ్చిన రవి, విశాల్ 'వీర' ని చూసి అటు వైపు వచ్చారు..

బిందు, నటాషా కూడా వెనకే వచ్చారు..

రవి బైక్ ఆపి దిగి 'వీర' వైపు వచ్చి కోపం గా "ఏయ్!! నువ్వు వీర కదా... అన్నాడు...

నటషా, బిందు ఇద్దరూ స్వప్న ని "ఆర్ యూ ఓకే... అని అడిగారు...

వీర అసలు రవి వైపు చూడకపోగా.... బిందు తో 'ఓ పిల్లా... నా స్వప్న నా దగ్గర సేఫే.... నువ్వెమి పరేషాన్ అవ్వకు... అన్నాడు

రవి " నువ్వే తనని ఇబ్బంది పెడుతూ ఎంటిరా నాటకాలు ఆడుతున్నావ్???? అంటూ వీర ను తోశాడు..

వీర 'ఏంటిరా!!! వీర గాడినే తోస్తావా??? నా మీద చేయి పడితే నాకు సంఖ్య తిరుగుతుంది అంటూ సిగరెట్ అవతల పడేసి

రవి షర్ట్ పట్టుకొని దగ్గర కు లాగి తన తలతో రవి నెత్తి మీద ఒక్కటి ఇచ్చాడు..

అది చూసి విశాల్ తన ఫోన్ తీసి వాళ్ళ ఫ్రెండ్ కి కాల్ చేసి..

"రేయ్!!! మన వాళ్ళందరిని తీసుకురా..... ఇక్కడ ఎవడో రౌడీ రాస్కెల్ స్వప్న ని ఏడిపిస్తూ... రవి ని కొడుతున్నాడు.... అనగానే..

సింహా వచ్చి 'వీరా!!! వెళ్ళి పోదాం రా... స్టూడెంట్స్ పోరగాళ్ళు అంటే మస్తు మంది రావొచ్చు... అంటూ చేయి పట్టుకొని

లాగాడు..

వీర 'ఆగు ... ఇక్కడ వున్నది వీరా... ఎవడికి భయపడడు అంటూ స్వప్న వైపు చూస్తూ.

"రానీ... ఒక్కక్కడికి బెండు తీస్తా... అనేసి

స్వప్న వైపు చూసి..

"స్వప్న!! నేను ఏమి రౌడిని కాదు. నాకు చదువు లేదు..పదో తరగతి తప్పా...-కాకపోతే డైమండ్స్ స్మగ్లింగ్ లో కింగ్ నీ..

ఇళ్ళు, సైట్స్ నచ్చాయి అనుకో... కబ్జా చేస్తా... అంటూ కళ్ళు ఎగరేశాడు..!

రవి తల విదిలిస్తూ.... 'రేయ్!!! నీదేమైనా సెలబ్రెటీ ఆటోబయోగ్రఫీ నా???? తెగ చెప్తున్నావ్???? అన్నాడు

స్వప్న 'చూడండి వీర గారు... మీదు వెళ్ళండి... ప్లీజ్ మా డ్రైవర్ ని వదలండి... అనగానే..

ఈలోపు కాలేజీ లో నుండి 'ఏ.... అంటు పొలో మంటు ఓ 20 మంది కాలేజి పిలకాయలు క్రికెట్ బ్యాట్స్ పట్టుకొని వచ్చేశారు...

ఎక్కడ నుంచో కాళి, సుబ్బు వచ్చారు...

వీర,సింహా నలుగురు కలిసి అందరినీ కలిసి ఐదు నిమిషాల్లో ఉతికి ఆరేశారు.

'సింహా అయితే 'విశాల్' ని పట్టుకొని "ఏరా ఒక్క నాయాలా!! నువ్వే కదా కాల్ చేసి పిలిచినావ్ వీళ్ళందరిని అంటూ ముక్కు మీద ఒక్కటి పీకాడు...

విశాల్ ముక్కు నుంచి బ్లడ్ బరబరా కారింది...

బిందు అయితే బక్కచిక్కి పోయింది..

వీర తమ వైపై రావడం చూసి.. స్వప్న కన్నా భయంగా వణికిపోయింది...

వీర కాలర్ వెనక్కి నెట్టుకొని 'ఏ పిల్ల !!! ఇంకా ఎవరైనా వుంటే పిలు... అన్నాడు సీరియస్ గా..

స్వప్న తమ ఫ్రెండ్స్ అందరు అలా తన్నులు తినడం చూసి చాలా బాధ పడిపోయి..

'ప్లీజ్ అండి.... వాళ్ళందరిని వదిలేయండి... అన్నది..

వీర ' స్వప్న... నేనా కొట్టాను??? వాళ్ళే వచ్చారు... నువ్వు చూశావుగా.... అంటూ స్వప్న వెనుక దాక్కున బిందు తో

'ఏ అమ్మాయి! అంతేనా???? నేను చెప్పింది కరెక్టే నా???? అని అడిగాడు..

బిందు 'హ.హ. అంటూ నీళ్ళు నమిలింది...

వీర 'సరే... స్వప్న నేను అయితే చెప్పేశా... నాకు నువ్వు కావాలి... కాళి గాడు అన్నాడు పెళ్ళి అయితే నువ్వు నాతో వుంటావ్ అని చెప్పాడు ..

కాబట్టి నీకు వారం టైం... తరువాత మళ్ళీ వస్తా.... నీ అభిప్రాయం చెప్పు... అంటూ రవి వైపు కోపం గా చూస్తూ ...తన బైక్ స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు

' స్వప్న 'రవి' తో 'ఐయామ్ సారి రవి... నా వల్లే మీ అందరికీ దెబ్బలు తగిలాయి.... అన్నది ఏడుస్తూ...

రవి 'హే.. ఊరుకో స్వప్న... అలాంటిది ఏమి లేదు.... నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు... అంటూ తనని కారు ఎక్కించాడు.. అక్కడ భయంగా ఇదంతా చూస్తున్న డ్రైవర్ బాబుతో..

రవి 'నువ్వు ఇక్కడ జరిగింది ఏది ఇంట్లో చెప్పకు.... భయపడతారు... అనేగానే అతను సరేనని తల వూపి కారెక్కాడు......

రవి 'విశాల్' తో "అయ్యాయో... ముక్కు కి బాగా దెబ్బ తగిలే సింది... నువ్వు డాక్టర్ దగ్గరకు వెళ్లు... నేను స్వప్న వెనకే వెళ్తా అంటూ స్వప్న కారు వెనకే వెళ్ళాడు..

డ్రైవర్ ఫాస్ట్ గా కారు ని పోనిచ్చాడు

&&&&&&&&&&&&&&&&

స్వప్న కళ్ళు తుడుచుకుంటూ 'రాము... ఈ విషయం ఇంట్లో చెప్పకు... నీకు తెలుసు కదా నాన్నగారికి తెలిస్తే ఇంక కాలేజీ కి పంపించరు... అనేగానే

అతను "అది కాదు మేడమ్... వాడు రౌడీ లాగా వున్నాడు..... ఇప్పుడు కాని ఈ విషయం మీరు చెప్పకపోతే మిమల్ని ఇంకా టార్చర్ పెడతామో...

స్వప్న 'సరే... ఈసారి చుద్దాం... నువ్వు మాత్రం ఎవరితో అనకు.... అన్నది

&&&&&&&&&&&&&&&&&

ఇంటికి వెళ్ళాక తన భాద ని, టెన్షన్ ని లోపల దాచి అందరితో నవ్వుతూ మాట్లాడింది...

ఆ నెక్స్ట్ డే సుచిత్ర, లాస్య "యూకే" వెళ్ళిపోతున్నారు...

వాళ్ళ కోసం జాను, గౌతమి, తాతగారు పచ్చళ్ళు, పిండివంటలు ప్యాక్ చేసే పనిలో పడ్డారు...

స్వప్న ఫ్రెష్ అయ్యి వచ్చి తను కూడా హెల్ప్ చేసే పనిలోపడింది..

అసలు స్వప్న స్పెషల్ ఏంటి అంటే... ఎంత బాధని అయినా లోపల దాచేస్తుంది...

సుచిత్ర 'ఏ మాటకి ఆ మాటే అమ్మా.... ప్రపంచంలో అందరి కన్నా అదృష్టవంతురాలైన అత్తగారు ఎవరంటే.. నేనే అని గర్వంగా చెప్తా..... అన్నది..

జాను 'అబ్బో... నీ కన్నా ముందు ప్లేస్ నాది.... అన్నది మూతి తిప్పుతూ

లాస్య కిందికి వచ్చి 'మామ్!!!! నాకు బయట పని వుంది... వెళ్ళేసి వస్తా..... స్వప్న ని కూడా నాతో తీసుకెళ్తా.... అని అడిగాడు...

స్వప్న కి హార్ట్ బీట్ పెరిగింది..

"ఎవరు ఒప్పుకోకపోతే బాగుండు.... అసలే ఆ వీర ఇచ్చిన షాక్ కి భయపడి చూస్తుంటే... మళ్ళీ లాస్య తో బయటకా???? వీర మళ్ళీ నన్ను చూస్తే ఇంకేమైనా వుందా???? అనుకున్నది...

సుచిత్ర ' స్వప్న '' వైపు చూసి... 'ఏ స్వప్న.... నీకు ఓకేనా???? అని అడిగింది...

స్వప్న 'లేదు అత్తా.... కొంచెం హెడ్ ఎక్ గా వుంది.... అన్నది..

లాస్య 'వుండదా మరి.... ఎప్పుడు చూడు .. కాలేజీ ఇల్లు... ఇల్లు కాలేజీ.... ఫ్రెండ్స్ సరదాలు షికార్లు వుండాలి...

జాను ' అయ్యో.. లాస్య.. స్వప్న కి ఫ్రెండ్స్ లేరని ఎందుకు అనుకుంటున్నావ్????

దానికి సరదాలు, షికార్లు కూడా ఎక్కువే..

కాకపోతే విమ్ము కి నచ్చవు కాబట్టి ఇవన్ని చెప్పము... అంతే..

లాస్య 'ఓఫో!!! గ్రాని.... మా జనరేషన్ వాళ్ళతో చూసుకుంటే స్వప్న చాలా తక్కువ ఎంజాయ్ చేస్తుంది

అదే ఆ రాక్షసి శృతి చూడు... కాలేజి పేరు చెప్పి.... నైట్ వరకు సినిమాలు, షికార్లు.... అన్నాడు

తాతయ్య " లాస్య... దాని సంగతి నీకు ఎందుకు ?! వినదంటే ఉప్పు పాత్ర వేస్తుంది.

లాస్య 'నాతో కాదు తన వేషాలు...

(అసలే స్వప్న కోసం తెచ్చిన చైన్ తీసుకుని తన మెడలో వేసుకుంది దెయ్యం మొహంది )

గౌతమి 'ఇదంతా కాదు కానీ... స్వప్న లాస్య అంతలా అడుగుతుంటే... ఎందుకు వెళ్ళనంటున్నావ్!! లే రెడి అయ్యి వెళ్ళేసి రా!!!

సుచిత్ర 'ఆ.. బంగారం మొహం చూడు ఎలా అయిపోయిందో... బయట అలా తిరిగి ఏదైనా రెస్టారెంట్ లో డిన్నర్ చేసి రండి.....

జాను 'అవును..... తల్లి లే వెళ్ళు అనగానే...

స్వప్న చేసేది లేక... తన రూం లోకి వెళ్లింది...

సుచిత్ర 'మ్.... అసలు రిషి వాళ్ళ ఫ్యామిలీని కూడా పిలిపించి రిషి కి,స్వప్న కి ఎంగేజ్మెంట్ చేసుకొని వెళదాం... అంటే సురేంద్ర ఇప్పుడు కాదు... అర్జెంట్ పని వుంది... రమ్మన్నాడు... ఏం చేస్తాం అంటూ నిట్టూర్చింది.

గౌతమి ' అలా అంటావ్ ఏంటి సూచి..!స్వప్న మా దగ్గర ఉండేది కొన్ని రోజులేగా..తరవాత తన బాధ్యత నీదే కదా.! 

జాను 'అవును.. సుచి నువ్వేమి ఫీల్ అవ్వకు.... ఈసారి ఏకంగా పెళ్ళి కి ముహుర్తాలు పెట్టించేద్దాం.


స్వప్న తన రూమ్ కి వెళ్ళాక...

శృతి కి కాల్ చేసింది...

శృతి లిఫ్ట్ చేసి.. "అక్కా!!! ఏంటి??? ఈ టైం లో అని అడిగింది....

స్వప్న ' శృతి... ఎక్కడ వున్నావ్??? అని అడిగింది..

శృతి 'బ్యూటి పార్లర్ లో.... పెడిక్యుర్....

స్వప్న ' లాస్య .. బయటకు వెళదాం అంటూ అమ్మ వాళ్ళ ద్వారా చెప్పించింది... అన్నది డల్ గా..

శృతి "అక్కా!!! నీకు ఎన్ని సార్లు చెప్పాను... నీకు నచ్చని పని ఎవరికోసం ఒప్పుకోకు... అని... చెప్పేసేయ్... రానని...

స్వప్న చూడు శృతి నీకు తెలుసు అమ్మ నాన్న ఏదైనా చెప్తే యస్ అనడమే కానీ... నో అనడం నాకు రాదని....

శృతి 'ఇష్.... నిన్ను బాగు చేయడం నా వల్ల కాదు అక్కా... ఇప్పుడు ఏం చేయమంటావ్???

స్వప్న 'మేము ఎక్కడికి వెళ్ళేది లొకేషన్ షేర్ చేస్తాను... రెస్టారెంట్ కి వెళ్ళగానే... నువ్వు వచ్చేయి...

శృతి 'అక్కా... నాకు ఓ డౌట్... అడగనా??? 'నీకు రిషి నీ పెళ్ళి చేసుకోవడం ఇష్టమా? కాదా?అంటే రిషి తో నీ పెళ్లి విషయం కూడా తెచ్చింది లాస్య నే కదా..

లాస్య తో బయటికి వెళ్ళడానికే ఇంత ఇబ్బంది పడుతున్నావ్..! ఒకవేళ లాస్య తీసుకువచ్చిన రిషి మ్యారేజ్ ప్రపోజల్ యాక్సెప్ట్ చేసి మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఏం ఐన ఇబ్బంది వస్తె ఏం చేస్తావ్...!?

స్వప్న ' నాకు అత్త, మామ ఎలాగో ,లాస్య అంతే..... ఇంక పెళ్ళి అంటావా??? చెప్పాగా 'నాన్న' అమ్మ తాత, బామ్మ ముఖ్యంగా అత్త కోసం ఒప్పుకున్నా...

పెళ్ళి అయ్యాకా రిషిని నా భర్త గా ఇష్టపడతాను...

శృతి ' హ్మ్మ్.... సరే నువ్వు అయితే లొకేషన్ షేర్ చెయి.... బాయ్ అంటూ కాల్ కట్ చేసింది ..

తరువాత స్వప్న,లాస్య స్వప్న కారులో బయటకు వెళ్ళారు...

లాస్య డ్రైవర్ ని వద్దని చెప్పటంతో.... అతను ఆగిపోయాడు..

గౌతమికి చెప్పేసి డ్యూటీ దిగి... ఇంటికి బయలు దేరాడు..

కొంత దూరం వెళ్ళేసరికి... శృతి నుంచి కాల్ వచ్చింది..

లిఫ్ట్ చేసి 'మేడమ్... అన్నాడు..

శృతి 'రాము... కారులో మొన్న కొన్ని పేపర్స్ పెట్టాను.. నువ్వు ఎటు ఇప్పుడు బయటకు వెళ్తున్నావు కదా... జిరాక్స్ తీసి సేమ్ ప్లేస్ లో పెట్టు.... అనేగానే

రాము 'మేడమ్... లాస్య మేడమ్ నన్ను వద్దని ఆవిడే డ్రైవ్ చేస్తానన్నారు .. నేను రేపు మార్నింగ్ తీయించుతా... మేడమ్... అనేగానే.

శృతి 'ఓ.... అవునా సరే... అంటూ ఫోన్ కట్ చేయబోతుంటే..

రాము 'మేడమ్..... మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి... అంటూ నీళ్ళు నమిలాడు...

శృతి 'ఏంటి రాము??? అని అడిగింది ఆశ్చర్యంగా... రాము 'మేడమ్ అది మరి... అంటూ వీర సంగతి చెప్పేశాడు.. అంతా విని శృతి ఒక్క నిమిషం షాక్... వెంటనే తేరుకుని "వ్వాట్... అంత పెద్ద ఇష్యూ జరిగితే... ఇంట్లో చెప్పలేదా??? అని అడిగింది పెద్దగా..

రాము ' స్వప్న మేడమ్ వద్దన్నారు అంటూ సైలెంట్ అయ్యాడు...

శృతి 'షిట్!!! అక్క అలా ఎలా అన్నది... సరే కనీసం నాకైనా చెప్పావ్...

అవును వాడి పేరు ఏమన్నావ్???

రాము 'వీర.... అంటమ్మా...

శృతి 'ఫోటో తీశావా???

రాము 'నేను ఫోన్ కారులో పెట్టాను... మేడమ్... వాడు సడెన్ గా వచ్చేసరికి.. దిగి అతన్ని కొట్టబోతుంటే అతని మనుషులు నన్ను పక్కకి తోసేశారు..

శృతి 'రవి వాళ్ళంతా ఓకే నా????

రాము 'అతను పర్లేదు కానీ విశాల్ బాబుకి ముక్కు పగిలిపోయింది....

శృతి 'అజజో.... సరే... నాకు వదిలేయ్... నేను చూసుకుంటా.. నువ్వు ఒక పని చేయి..

ఈసారి వాడు వస్తే... అడ్రస్ షేర్ చేయి... అండ్ వాడి ఫోటో తీయి... అంటూ కాల్ కట్ చేసింది..

వెంటనే రవి కి చేసే 'రవి||| ఎంటి ఎవడో రౌడి రాస్కెల్ వచ్చాడంటా??? అంటూ హడావిడిగా అడిగింది.. రవి రాము చెప్పాడా శృతి... అని అడిగాడు కంగారుగా..

శృతి 'హా!!!

రవి పక్కనే వున్న విశాల్ ' శృతి ' నేమ్ వినగానే గుండె గంట కొట్టింది...

శృతి 'హ... రవి అసలు ఎవడాడు??? అక్క ని ఎక్కడ చూశాడు???

రవి 'ఎక్కడ చూశాడో! ఎప్పుడు చూశాడో! తెలియదు... శృతి..

మాకు మాత్రం వైజాగ్ లో తగిలాడు...అంటూ జరిగింది చెప్పాడు...

అంతా విని శృతి 'ఓ మై గాడ్... ఇంత జరిగినా అక్క మాకు ఎందుకు ఏమి చెప్పలేదు.... అని అడిగింది కంగారుగా..

రని 'మేము వాడు వైజాగ్ లోకల్ వాడెమో.... అక్కడేదో తగిలాడు... ఇక్కడికి రాడు అనుకొని వదిలేశాము..

కాని.... మా అంచనాలను తల క్రిందులు చేస్తూ ఇవాళ ఇక్కడ ప్రత్యక్షం అయ్యాడు...

పక్కనుంచి విశాల్ 'ముక్కు' చూపిస్తూ నాకు దెబ్బ తగిలింది అని చెప్పు అని సైగ చేసాడు..

రవి (ఆగరా....బాబు నువ్వు ఒకడివి అంటూ తల కొట్టుకున్నాడు)

శృతి 'ఇప్పుడు ఏం చేద్దాం... వాడు మళ్ళీ వస్తే....ఎలా???

రవి 'అదే ఆలోచిస్తున్నా... ఎటు ఎల్లుండి తో ఎగ్జామ్స్ అయిపోయాయి ... వాడెమో ఒన్ వీక్ టైం ఇచ్చాడు.. నువ్వు ఎల్లుండి వచ్చేసేయ్...ఏం చేయాలో ప్లాన్ చేద్దాం.... ఓకేనా??? అని అడిగాడు.

శృతి 'ఓకే... అవును... విశాల్ కి ఎలా వుంది??? అని
 అడిగింది నార్మల్ గా..

రవి 'ఇదిగో వాడి దగ్గరే వున్నా... ఇస్తున్నా అంటూ ఫోన్ ఇచ్చాడు... విశాల్ మొహం వెలిగిపోయింది.

ఫోన్ తీసుకుని "హలో... శృతి!!! అన్నాడు

శృతి 'ఆ... విశాల్ ఎలా వున్నావ్ బ్రో!!! అని అడిగింది

అంతే మనోడు షాక్ :|

తేరుకోవడానికి టైం పడుతుంది.... 
[+] 9 users Like Ranvijaysingh2's post
Like Reply


Messages In This Thread
Veera - by Avengers35 - 17-06-2024, 09:25 PM
RE: Veera - by sri7869 - 17-06-2024, 09:56 PM
RE: Veera - by dombull7 - 17-06-2024, 10:58 PM
RE: Veera - by hijames - 18-06-2024, 01:05 AM
RE: Veera - by Avengers35 - 18-06-2024, 02:01 PM
RE: Veera - by Avengers35 - 18-06-2024, 02:02 PM
RE: Veera - by hijames - 18-06-2024, 02:19 PM
RE: Veera - by Avengers35 - 19-06-2024, 12:07 PM
RE: Veera - by hijames - 19-06-2024, 12:33 PM
RE: Veera - by Avengers35 - 20-06-2024, 01:41 AM
RE: Veera - by Saikarthik - 20-06-2024, 10:40 AM
RE: Veera - by appalapradeep - 20-06-2024, 11:59 AM
RE: Veera - by sri7869 - 20-06-2024, 07:24 PM
RE: Veera - by hijames - 20-06-2024, 08:24 PM
RE: Veera - by Avengers35 - 20-06-2024, 08:33 PM
RE: Veera - by hijames - 20-06-2024, 09:38 PM
RE: Veera - by sri7869 - 20-06-2024, 09:45 PM
RE: Veera - by ramd420 - 20-06-2024, 10:10 PM
RE: Veera - by Avengers35 - 21-06-2024, 08:24 PM
RE: Veera - by Saikarthik - 21-06-2024, 09:18 PM
RE: Veera - by sri7869 - 21-06-2024, 09:43 PM
RE: Veera - by dombull7 - 21-06-2024, 11:29 PM
RE: Veera - by hijames - 22-06-2024, 03:38 AM
RE: Veera - by Avengers35 - 22-06-2024, 09:02 PM
RE: Veera - by sri7869 - 22-06-2024, 09:04 PM
RE: Veera - by hijames - 23-06-2024, 04:30 AM
RE: Veera - by Saikarthik - 23-06-2024, 10:42 AM
RE: Veera - by Avengers35 - 23-06-2024, 07:22 PM
RE: Veera - by hijames - 23-06-2024, 08:11 PM
RE: Veera - by sri7869 - 23-06-2024, 10:28 PM
RE: Veera - by Avengers35 - 08-07-2024, 07:31 PM
RE: Veera - by hijames - 08-07-2024, 07:36 PM
RE: Veera - by Avengers35 - 08-07-2024, 08:43 PM
RE: Veera - by hijames - 08-07-2024, 09:50 PM
RE: Veera - by sri7869 - 09-07-2024, 05:00 AM
RE: Veera - by Saikarthik - 09-07-2024, 09:00 AM
RE: Veera - by Avengers35 - 20-07-2024, 09:43 PM
RE: Veera - by Avengers35 - 20-07-2024, 10:00 PM
RE: Veera - by 3sivaram - 20-07-2024, 10:38 PM
RE: Veera - by Avengers35 - 21-07-2024, 06:54 AM
RE: Veera - by sri7869 - 20-07-2024, 10:21 PM
RE: Veera - by Uday - 21-07-2024, 03:04 PM
RE: Veera - by Avengers35 - 21-07-2024, 04:23 PM
RE: Veera - by Uday - 21-07-2024, 07:08 PM
RE: Veera - by sri7869 - 22-07-2024, 11:25 AM
RE: Veera - by Avengers35 - 10-08-2024, 10:53 PM
RE: Veera - by sri7869 - 11-08-2024, 01:00 PM
RE: Veera - by vrao8405 - 01-09-2024, 11:49 PM
RE: Veera - by Avengers35 - 17-11-2024, 01:36 PM
RE: Veera - by বহুরূপী - 17-11-2024, 05:08 PM
RE: Veera - by Avengers35 - 17-11-2024, 05:19 PM
RE: Veera - by sri7869 - 17-11-2024, 06:38 PM
RE: Veera - by Avengers35 - 21-11-2024, 07:59 AM
RE: Veera - by sri7869 - 21-11-2024, 10:23 AM
RE: Veera - by BR0304 - 21-11-2024, 01:41 PM
RE: Veera - by Ranvijaysingh2 - 08-09-2025, 04:46 PM
RE: Veera - by Ranvijaysingh2 - 08-09-2025, 04:49 PM
RE: Veera - by utkrusta - 08-09-2025, 06:40 PM
RE: Veera - by Ranvijaysingh2 - 09-09-2025, 10:12 PM
RE: Veera - by Dragon09 - 09-09-2025, 10:45 PM
RE: Veera - by Ranvijaysingh2 - 16-09-2025, 09:11 PM
RE: Veera - by Ranvijaysingh2 - 16-09-2025, 09:15 PM
RE: Veera - by Ranvijaysingh2 - 17-09-2025, 10:31 PM
RE: Veera - by Ranvijaysingh2 - 05-06-2026, 05:20 PM
RE: Veera - by lohith22 - 06-06-2026, 07:04 AM
RE: Veera - by 9888943338 - 06-06-2026, 01:07 PM
RE: Veera - by Ranvijaysingh2 - 07-06-2026, 11:26 PM
RE: Veera - by ash.enigma - 08-06-2026, 12:15 PM
RE: Veera - by lohith22 - 08-06-2026, 04:05 PM
RE: Veera - by yekalavyass - 08-06-2026, 08:10 PM
RE: Veera - by Ranvijaysingh2 - 09-06-2026, 01:06 PM
RE: Veera - by Ranvijaysingh2 - 09-06-2026, 01:08 PM
RE: Veera - by VijayPK - 09-06-2026, 01:48 PM
RE: Veera - by Durga reddy - 09-06-2026, 01:54 PM
RE: Veera - by ash.enigma - 09-06-2026, 02:11 PM
RE: Veera - by lohith22 - 09-06-2026, 07:47 PM
RE: Veera - by Ranvijaysingh2 - 11-06-2026, 04:11 PM
RE: Veera - by ash.enigma - 11-06-2026, 07:09 PM
RE: Veera - by lohith22 - 11-06-2026, 11:11 PM
RE: Veera - by VijayPK - 12-06-2026, 12:29 AM



Users browsing this thread: 1 Guest(s)