Thread Rating:
  • 3 Vote(s) - 4.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నేను చదివిన కథలు - అందమైన అబద్ధం
"అవి మేము కాలేజ్ చదివే రోజులు. వినెక్ జాకెట్టులు "లంగా ఓణీలు వేసుకొని కాలేజికి వెళ్ళే వాళ్ళం. కాలేజ్ కి వెళ్ళే దారిలో మీ అమ్మ ఇల్లు ఉండేది. నేనూ.. !, గీత అని ఇంకో ఫ్రెండ్ వుండేది. మేమిద్దరం కలసి మీ అమ్మను పిలుచుకుని కాలేజుకు వెళ్ళేవాళ్ళం. 


 మాముగ్గురులో మీ అమ్మ బాగా చదివేది. నాకు మీ అమ్మకు చదువులో పోటీ వుండేది. అస్సలు చదవలేదంటూ! ఇద్దరం బాగా చదివి బాగా మార్క్స్ తెచ్చుకునే వాళ్లము. 


నేను బాగా నవ్వించి సైలెంట్ గా కుర్చూనేదాన్ని. పాపం మీ అమ్మా..  గీత, లెక్చరర్స్, చేత తిట్లు తినేవాళ్ళు వచ్చే దారిలో నన్ను..  మీ అమ్మా, గీత వ్వించవద్దు మమ్ముల్ని.. ! అని తిట్టేవాళ్ళు. 
 
శనివారం మా కాలేజీ కి హాఫ్ డే. మధ్యాన్నం పక్కన వుండే టౌన్ లో రిక్షా ఎక్కి సినిమాకి వెళ్ళేవాళ్ళం. ఆరోజులే వేరు సారిక. మొదట నా పెళ్లి అయిపోయింది. మీ అమ్మ ఒక్కతే కూతురు. మీ తాతా, అమ్మమ్మ వాళ్లు కూలి నాలి చేసి చదివించేవారు. మీ అమ్మ అపుడు చెప్తూ.. వుండేది. నేను మంచి జాబ్ తెచ్చుకుని మా అమ్మానాన్నలను చూసుకోవాలని. 
 
 నేను మా వూరు వెళ్ళినప్పుడు మీ తాత కనపడి చెప్పాడు. మీ అమ్మకి జాబ్ వచ్చిందని, పెళ్లి అయిందనీ. తర్వాత మావారికి అమెరికాలో జాబ్ రావటం వల్ల నేను ఇటు వచ్చేసాను. మా అమ్మ వాళ్ళు కూడా  ఊరిలో లేక పోవటం వల్ల మీ అమ్మ విషయాలు ఏమి తెలీదు? తర్వాత నాకు. 


 మొన్న ఇండియ వచ్చినప్పుడు నే పుట్టిన వూరు చూద్దామని వెళ్ళాను. మీ అమ్మమ్మనీ వెళ్ళి పలకరించా. అపుడు ఏడుస్తూ చెప్పింది "నాపిల్లని చంపేసారమ్మా!  ఇల్లు అదే కట్టించింది. మాకు డబ్బులు కూడా పంపేది. ఇపుడు మమ్మల్ని ఎవరు చూస్తారమ్మా?" అని ఏడిచింది. "ఎంతమంది పిల్లలు రమణకు.. !" అంటే "ఇద్దరు అమ్మా.. !" అంది. 


 పాప ఫోన్ నంబర్ ఇవ్వమంటే.. నీ నంబర్ ఇచ్చింది. నువ్వు అమెరికాలో వున్నావని చెప్పింది. అపుడు ఆనంబర్ కి నీకు కాల్ చేశా. ఇపుడు ఇంక మీ అమ్మ సంగతి చెప్పు!" అంది వసంత


 మా అమ్మకు జాబ్ వచ్చిన తర్వాత మానాన్న పెళ్లి చేసుకున్నాడు. పెళ్లికి ముందే మా అమ్మానాన్నను చూసుకుంటానని చెపితే.. మా నాన్న దానికి ఒప్పుకుంటేనే.. పెళ్లి చేసుకుంది అమ్మ. 


 నాన్నతో పెళ్లయిన కొన్నాళ్ళు సుఖపడింది అంతే అమ్మ.. !. 


 మా నాయనమ్మ వాళ్లకు మా అమ్మ అంటే..  ఇష్టం లేదు. ఆమెకు మా నాన్న ఒక్కడే అబ్బాయి. ఆమెకు పెద్ద కూతురు, కూతురుని నాన్న చేసుకోలేదని కోపం. ఇంకో కూతురు మాకు దగ్గరలోనే వుంటుంది. ఆమెకు ఇద్దరు అబ్బాయిలు. మా అక్క పుట్టిన దగ్గర నుండి అమ్మకు కష్టాలు మొదలయ్యాయి. మా నాయనమ్మ వాళ్ళు అమ్మకు అబ్బాయి పుట్టలేదని గొడవ. ఇంకా నాన్నకు అమ్మ మీద లేనిపోనివి చెప్పేవాళ్ళు. నాన్న వాళ్ళు చెప్పింది కరెక్ట్ అని అమ్మను తిడుతూ.. ! వుండేవాడు. దానికి అమ్మా.. వాళ్ళను ఏమనలేక.. మనసులోనే కుమిలిపోయేది
 
"అవును మీ అమ్మ చాలా సెన్సిటివ్. చాలా కరెక్ట్ గా వుండేది, ఎదుటి వాళ్ళు కూడా అలా వుండాలనుకొనేది. ముక్కుసూటి మనిషి. ఒక్కోసారి మనం పరిస్థితులకు మారాలి అంటే "నేను అలా మారలేను అనేది, అవసరానికి ఒక రకంగా తర్వాత ఒక రకంగా నేనుండలేనూ! అనేది. మాట మార్చే వాళ్ళను మీ అమ్మ చాలా దూరంగా వుంచేది"
 
"భలే కరెక్ట్ గా చెప్పారు ఆంటీ.. ! మా అమ్మ మెంటాలిటీ. దీన్ని నాయనమ్మ వాళ్ళు బాగా క్యాష్ చేసుకున్నారు. పని చేయించుకునే వారు. మళ్ళీ మాకు ఒక్కవసరానికి కూడ ఉపయోగపడే వాళ్ళు కారు. 
మా నాన్నకు, ఈగో కొంచం ఎక్కువ. మా తాత ఆస్థిని మా నాయనమ్మ తదనంతరం మా నాన్నకు దక్కేలా! రాశారు. దీనితో మా నాన్నకు తనకి ఆస్తి ఇవ్వదనీ వాళ్లమ్మ.. ! ఏది చెపితే, అది రైట్ అనేవాడు. 


వాళ్ళు చాలా మెత్తగా మీ ఆవిడ సంపాదించింది అంతా మీ అత్తామామలకు ఇస్తుందని చెప్పేవారు. దానితో ఆయన అమ్మను తిట్టటం. అపుడు అమ్మ "మా వాళ్ళకు నేను ఒక్కదాన్నే.. ! వాళ్ళని చూసుకుంటాను అంటే మీరు ఒప్పుకునే.. నన్ను చేసుకున్నారు. ఇపుడు మాట మారుస్తున్నారు" అని అరిచేది. 
 
 నేను మా అమ్మానాన్నలను చూసుకోలేకపోతున్నాను అని బాధ పడేది. లోన్ తీసుకొని వాళ్లకు చిన్న ఇల్లు కట్టించింది. కొంత డబ్బు పంపేది. ఇది తెలిసి నాన్న అమ్మ జీతం తనకు ఇవ్వాలని గోల చేసేవాడు. 
=================================================================
ఇంకా వుంది..
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply


Messages In This Thread
RE: నేను చదివిన కథలు - అక్షర - by k3vv3 - 30-05-2026, 04:20 PM



Users browsing this thread: 1 Guest(s)