27-05-2026, 09:51 AM
టౌన్ కి వచ్చిన కొద్ది రోజుల్లోనే వేణు తన నిత్యకృత్యాలను ఒక దారికి తెచ్చాడు. చదువు రాకపోయినా, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండటంతో... ముందుగా పాప భవిష్యత్తు గురించి ఆలోచించాడు. వారి ఇల్లు ఉన్న చిన్న లోకాలిటీకి ఒక రెండు వీధుల అవతల ఉన్న ఒక చిన్న ఎల్.కే.జీ (LKG) స్కూ.ల్లో పాపను చేర్పించాడు.
వాణి ఇంటర్ వరకు చదివి ఉండటం వల్ల, పాప చదువు విషయంలో తనే శ్రద్ధ పెట్టాలనుకుంది. ఊరు వదిలి వచ్చిన బాధ ఉన్నప్పటికీ, పాప కాలేజీ బాధ్యతలను తనే తీసుకుంది. రోజూ ఉదయాన్నే పాపను తయారు చేసి నడుచుకుంటూ వెళ్లి కాలేజ్లో దింపడం, మళ్లీ టైంకి వెళ్లి తీసుకురావడం వాణి దినచర్యగా మారింది. అలా వెళ్తున్నప్పుడల్లా దారిలో పల్లెటూరి జ్ఞాపకాలు గుర్తొచ్చినా, పాప కోసం వాణి ఆ కొత్త వాతావరణానికి మెల్లగా అలవాటు పడటం మొదలుపెట్టింది.
###
మరోవైపు వేణు అస్సలు ఖాళీగా కూర్చోలేదు. తన దగ్గరున్న పాత సైకిల్ వేసుకుని ఆ టౌన్ లోని గల్లీలన్నీ తెగ తిరగడం మొదలుపెట్టాడు. ఎక్కడ ఏ చిన్న టెంపుల్ ఉన్నా, ఎక్కడ జనం గుమికూడినా అక్కడికి వెళ్లి మాట్లాడేవాడు.
టౌన్ లో పూజలు చేసేవాళ్లు, పురోహితులు కొందరు ఒకరికొకరు పరిచయం ఉండి గ్రూపులుగా ఉంటారు.
వేణు కూడా అలా తిరుగుతూ కొందరితో గ్రూప్ గా చేరాడు. ఎక్కడైనా పెద్ద పూజలు, వ్రతాలు ఉన్నప్పుడు ఎక్కువ మంది కావాల్సి వస్తే, ఆ గ్రూప్ వాళ్లు వేణుని కూడా పిలిచేవారు.
అలా అందరితో కలిసి వెళ్లి, తనకు వచ్చిన సాధారణ పూజలు, వ్రతాలు చేస్తూ డబ్బులు సంపాదించడం మొదలుపెట్టాడు.
రోజూ ఉదయం లేవడమే తరువాయి... సైకిల్ ఎక్కి ఎక్కడ పూజ ఉంటే అక్కడకి తెగ తిరుగుతూ బిజీ అయిపోయాడు.
ఒకరోజు సాయంత్రం వేణు సైకిల్ మీద బాగా అలసిపోయి ఇంటికి వచ్చాడు. ముఖమంతా చెమటలు పట్టినా, జేబులో డబ్బులు ఉండటంతో ముఖంలో తృప్తి కనిపించింది. లోపలికి వచ్చి ఆ డబ్బులు తీసి వాణి చేతిలో పెట్టాడు.
"ఇదిగో వాణీ, ఈరోజు ఒకరి ఇంట్లో వ్రతం, తోటలో పూజ ఉంటే మా గ్రూప్ వాళ్లతో కలిసి వెళ్లాను. నా వంతు గా ఇవి ఇచ్చారు" అన్నాడు ఉత్సాహంగా.
వాణి ఆ డబ్బులు అందుకుంటూ, "డబ్బులు వస్తున్నందుకు సంతోషమేనండి. కానీ రోజూ ఆ సైకిల్ మీద అంత దూరం తెగ తిరుగుతున్నారు, ఒళ్లు హూనమైపోతుంది. కొంచెం చూసుకుని వెళ్లండి" అంది భర్త మీద ఆందోళనతో.
"నువ్వేం కంగారు పడకు వాణీ. మనకి ఇక్కడ సొంతంగా ఇల్లు, పొలం ఏవీ లేవు కదా. మొదట్లో ఇలా కష్టపడితేనే కదా రాను రాను మనకంటూ ఒక పేరు వచ్చేది. ఇప్పుడిప్పుడే కొందరు నన్ను నమ్ముతున్నారు" అని వేణు సర్దిచెప్పాడు.
వాణి కూడా భర్త తెస్తున్న సంపాదనను చూసి, పాప స్కూ.లు ఫీజులు, ఇంటి ఖర్చులకి ఇబ్బంది లేకపోవడంతో మనసులో కాస్త ఊరట చెందింది. అలా వారి టౌన్ జీవితం సాధారణంగా సాగిపోతోంది.


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)