27-05-2026, 09:43 AM
వేణు మాటలకు వాణికి వెళ్లడం అస్సలు ఇష్టం లేకపోయినా, భర్త నిర్ణయానికి గౌరవం ఇస్తూ మెల్లగా తలాడించింది. అయితే, వేణు మనసులో ఒక బలమైన నమ్మకం, ఒక రహస్యం దాగి ఉన్నాయి.
నిజానికి మూడేళ్ల క్రితం, వేణు ఎవరికీ చెప్పకుండా ఒరిస్సా బోర్డర్ వైపు వెళ్లాడు. అక్కడ కొన్ని గిరిజన ప్రాంతాల్లో, సరిహద్దు గ్రామాల్లో తిరుగుతూ ఎవరికీ తెలియని కొన్ని కొత్త పూజా విధానాలు, ప్రత్యేక పరిహార పూజలు నేర్చుకున్నాడు. ఈ విషయం వాణికి కానీ, అతని తండ్రికి కానీ, ఊర్లో ఎవరికీ తెలియదు. ఆ పూజల వల్లే తను టౌన్ కి వెళ్తే కచ్చితంగా గుర్తింపు తెచ్చుకోగలననే నమ్మకం వేణుకి బలంగా ఉంది.
ఆ తర్వాత వేణు అనుకున్నట్టే ఒక్కడే టౌన్ కి బయలుదేరాడు. అక్కడ తన సంపాదనకు తగ్గట్టుగా, ఒక చిన్న లోకాలిటీలో ఒక చిన్న ఇల్లు చూసి అద్దెకు తీసుకున్నాడు. ఇల్లు మాట్లాడటం, అడ్వాన్స్ ఇవ్వడం అన్నీ పూర్తయ్యాక మళ్లీ ఊరికి వచ్చాడు.
####₹
సరిగ్గా వారం రోజుల తర్వాత...
వేణు తన భార్య వాణిని, చిన్న పాపను తీసుకుని టౌన్ లోని ఆ చిన్న లోకాలిటీకి షిఫ్ట్ అయ్యాడు.
సామాన్లు అన్నీ సర్దుకున్నాక, వాణి ఆ కొత్త ఇల్లంతా చూసింది. ఇల్లు చాలా చిన్నదే, చుట్టుపక్కల వాతావరణం అంతా కాంక్రీట్ కట్టడాలు. తను పుట్టి పెరిగిన పచ్చని పల్లెటూరు గుర్తొచ్చి ఆమె మనసు కొంచెం విలవిలలాడింది. ఇంటర్ వరకు చదివిన వాణికి ఇక్కడి వాతావరణానికి అలవాటు పడటం కొంచెం కష్టంగానే అనిపించింది.
పాపను మంచం మీద పడుకోబెట్టి, వాణి కాఫీ గ్లాసుతో వేణు దగ్గరికి వచ్చింది.
"ఇల్లు చాలా చిన్నదండీ. చుట్టుపక్కల వాళ్లెవరూ పెద్దగా పలకరించడం కూడా లేదు. మన ఊర్లో అయితే ఈపాటికి అందరూ వచ్చి పలకరించేవాళ్లు" అంది వాణి కాఫీ గ్లాస్ అందిస్తూ, గొంతులో ఇంకాస్త నిరాశతో.
వేణు కాఫీ సిప్ చేస్తూ నవ్వాడు. "ఇది టౌన్ కదా వాణీ, ఇక్కడ ఎవరి గొడవ వారిదే. మొదట్లో ఇలాగే ఉంటుంది. కానీ చూస్తూ ఉండు, త్వరలోనే మన ఇంటి ముందు పూజల కోసం జనం క్యూ కడతారు. అప్పుడు నీకే తీరిక ఉండదు" అన్నాడు చాలా నమ్మకంగా.
వాణి అతని వైపు కాస్త ఆశ్చర్యంగా చూసింది. "ఊర్లో పెద్దగా పూజలు రానిదే, ఇక్కడ టౌన్ లో అంత నమ్మకంగా ఎలా చెప్తున్నారు?" అని అడిగింది.
వేణు లోపల ఉన్న ఒరిస్సా బోర్డర్ రహస్యాన్ని అప్పుడే బయటపెట్టకూడదు అనుకున్నాడు. భార్య తల నిమిరి, "అదంతా నాకొదిలేయ్. రేపు ఉదయం మన ఇంట్లో చిన్నగా ఒక వినాయకుడి పూజ చేసి, ఆ తర్వాత బయట వాళ్లకి పూజలు చేయడం మొదలుపెడతాను. అంతా మంచే జరుగుతుంది" అన్నాడు.
వాణి భర్త ముఖంలో ఉన్న ఆ వింతైన నమ్మకాన్ని చూస్తూ ఉండిపోయింది. చదువు రాకపోయినా ఆయనకి పూజల మీద ఉన్న ఆ పట్టుదల, ఏదో తెలియని రహస్య ధీమా ఆమెకు కొత్తగా
అనిపించాయి.

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)