20-05-2026, 07:23 AM
రుద్రం భజే? ఎపిసోడ్ 50
రేపాలా పూజ మొదలుపెట్టడంతో అక్కడి నుంచి దేవత శక్తి ఉన్న నంద వాళ్ళందరూ వెళ్లిపోయారు.
నారదుడు చూపించిన గుహలోకి వెళ్లి పెయింటింగ్స్ చూస్తూ ఇప్పటివరకు జరిగింది ముందు జరగబోయేది ఇక్కడ ఉంది అని చెప్పింది దీప్తి.
*************
గోడల మీద ఉన్న పెయింట్స్ చూస్తూ "ఇక్కడ ఉన్న బొమ్మలని బట్టి మనం వెళ్లే ప్లేస్ లో చాలా పెద్ద ఫైటింగ్ జరుగుతుంది అనిపిస్తుంది. దీంట్లో మనం ఫేస్ చేసే వాళ్ళు ఎవరు మనుషుల్లాగా కనిపించడం లేదు." అని చెప్పింది నీతూ.
"కరెక్టే! కానీ ఈ పెయింటింగ్స్ చూస్తుంటే అర్థమవుతున్నట్లే ఉంది కానీ ఏమీ అర్థం కావడం లేదు." అని అయోమయంగా చూస్తూ చెప్పింది దీప్తి.
ఆ మాటకి అక్కడ ఉన్న నారాదుడు వైపు చూసి "స్వామి! ఈ పెయింటింగ్స్ చూసి మీరు ఏమైనా చెప్పగలరా..?" అని అడిగాడు యోధ.
ఆ మాటకి నవ్వుతూ "ఇది కలికాలం కలిపురుషుడు రాజ్యమేలుతూ ఉంటాడు మనిషిలో ఉన్న రాక్షస గుణాన్ని బయటకు తీస్తాడు, అలా కలి చేతిలో కీలుబొమ్మలుగా మారిన కొంతమంది మనుషులు చేసే వికృతి చేష్టలవల్ల ప్రకృతి విలయతాండవం చేస్తుంది.
అలా జరగకుండా ఉండాలి అంటే రాక్షసులుగా మారిన మనుషులని ఆదిలోనే అంతం చేయాలి, రేపాలా లాంటి మూర్ఖులని తుదముట్టించాలి లేనిపక్షంలో జరిగే అనర్ధాలు చాలా విపరీతంగా ఉంటాయి.
అంతు తెలియని రోగాలు ప్రపంచాన్ని చుట్టుముడతాయి ఈ భూమి మీద గాలి కూడా కలుషితం అవుతుంది ఇప్పుడు నీరు కొనుక్కొని తాగుతున్నారు అప్పుడు గాలి కూడా కొనుక్కునే పరిస్థితి వస్తుంది.
అధికారం డబ్బు కోసం కాకుండా ఆహారం కోసం దేశాల మధ్య యుద్ధాలు జరుగుతాయి ఆ మంటలలో కొంతమంది చలికాచుకుంటారు." అని చెప్పాడు నారదుడు.
"స్వామి! మరి ఇంత జరుగుతుంటే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా వాళ్ళని ఆపలేడా..?" అని అడిగింది దీప్తి.
"ప్రతి మనిషిలో మంచి చెడు లాగా దైవత్వం రాక్షసత్వం రెండు ఉంటాయి పరిస్థితులను బట్టి అవి బయటకు వస్తాయి,
మనసుని, కోరికలని అదుపులో ఉంచుకునేవాడు దేవుడు అవుతాడు అదుపులో ఉంచుకోలేని వాడు రాక్షసుడు అవుతాడు. దేవుడు ఎక్కడో ఉండడు మనిషి రూపంలోనే ఉంటాడు." అని చెప్పాడు నారదుడు.
"అంటే! మేము దేవుళ్లమా..? ఆ రాక్షసులని ఆపగలమా..?" అని అడిగాడు రాఖి.
"మనిషి తలుచుకుంటే చేయలేనిదేముంది మీలో ఉన్న దైవం మీకు తోడుగా ఉంటుంది ఎటువంటి శక్తినైనా మీరు ఎదిరించగలరు ఆ విషయమే ఇక్కడ ఉన్న చిత్రాలలో ఉంది సరిగ్గా చూడండి.
ఆ దైవం మీకు దారి చూపించగలదు అంతే సాధించాల్సింది మాత్రం మీరే! కొన్ని కోట్ల మంది జీవితం ఇప్పుడు మీ చేతుల్లో ఉన్నాయి గుర్తుంచుకొని పోరాడండి చెడుని నాశనం చేయండి." అని చెప్పాడు నారదుడు.
"స్వామీజీ చెప్పింది నిజం" దేవుడు వస్తాడు కాపాడుతాడు అని చూస్తూ కూర్చోకూడదు మన ప్రయత్నం మనం చేయాలి ఆ రాక్షసులను సృష్టించింది కూడా మనిషేకదా!
సృష్టించిన వాడికి నాశనం చేయడం కూడా వచ్చు ఆ పని మనం చేద్దాము, పోతే మన 10 మంది ప్రాణాలు తిరిగి వస్తే కొన్ని కోట్ల మంది జీవితాలు చివరి శ్వాస వరకు పోరాడదాము పదండి. " అని చెప్పాడు యోధ.
"కరెక్ట్! మనం పుట్టినందుకు ఏదో ఒకటి సాధించాలి నా ఒంట్లో చివరి శ్వాస ఉన్నంతవరకు పోరాడుతూనే ఉంటాను." అని చెప్పాడు వర్ధన్.
"మీకు ఆ దైవం అండగా ఉంటుంది విజయోస్తు! నాతోపాటు వస్తే ల్యాబ్ దగ్గరకు తీసుకువెళ్తాను." అని చెప్పాడు నారదుడు.
దీప్తి దగ్గర ఫోన్ తీసుకుని నాయక్ కాల్ చేసి "జైహింద్ సార్! మీకు శాటిలైట్ లో కనిపించిన టెర్రరిస్టులు అందరూ చనిపోయారు ఫైనల్ బ్యాటిల్ కి రెడీ అయ్యాము నాతో పాటు వచ్చిన అందరిని వెనక్కి పంపిస్తాను." అని చెప్పాడు యోధ.
"నువ్వు కూడా తిరిగి వస్తావు ఆ నమ్మకం నాకు ఉంది ఇప్పుడు నీకు ఫుల్ పర్మిషన్ ఇస్తున్నాను అక్కడ ఎవ్వడు బతికి ఉండకూడదు." అని చెప్పాడు నాయక్.
"ఎస్ సార్!" అని చెప్పి ఫోన్ పెట్టేసి నారదుడు వెనకాల ల్యాబ్ దగ్గరికి బయలుదేరాడు యోధ.
************
ల్యాబ్ లో ఇంజక్షన్స్ రెడీ చేస్తూ సయ్యద్ వైపు చూసి "నీ మనుషులు ఎక్కడ ఇంకా రాలేదు?" అని అడిగాడు కళింగ.
"ఈ టైమ్ కి ఇక్కడకు వచ్చేయాలి కచ్చితంగా వస్తారు నువ్వు మెడిసిన్ రెడీ చెయ్!" అని చెప్పాడు సయ్యద్.
అక్కడకి వస్తూ "నా పూజ పూర్తయింది ఈ ప్రదేశంలోకి ఎటువంటి దైవ శక్తి ఇంకా అడుగుపెట్టలేదు, ఆ గబ్బర్ దగ్గర ఉన్న వస్తువులు తీసుకోండి ఇప్పుడు ఏ శక్తి అతనికి అండగా ఉంటుందో చూద్దాము." అని చెప్పాడు రేపాలా.
ఫోన్ మాట్లాడుతూ అక్కడికి వచ్చి "ఇండియన్ ఆర్మీ రంగంలోకి దిగింది ల్యాబ్ దగ్గరికి వస్తున్న సయ్యద్ మనుషుల్ని చంపేశారు వాళ్లు కచ్చితంగా మన ల్యాబ్ దగ్గరికి వస్తారు." అని చెప్పాడు చింగ్ యా.
"ల్యాబ్ దగ్గరికి వచ్చిన వాళ్లు ఎవరూ ప్రాణాలతో బయటికి వెళ్లారు." అని అక్కడ ఉన్న బ్లూ కలర్ బటన్ ప్రెస్ చేశాడు కళింగ.
ల్యాబ్ కింద ఉన్న అండర్ గ్రౌండ్ గేట్ ఓపెన్ అవడంతో దాంట్లో నుంచి మనుషులు బయటికి రావడం చూసి "వీళ్ళందరూ చాలా వింతగా నడుస్తున్నారు నువ్వు కనిపెట్టిన మెడిసిన్ ఇంజెక్ట్ చేసావా..?" అని అడిగాడు చింగ్ యా.
"అవును! ఒక్కొక్కడు పదిమంది సోల్జర్స్ తో సమానం బుల్లెట్స్ కి కూడా వాళ్ళు చావరు ఒంట్లో నుంచి రక్తం బయటకు వస్తే శక్తి మరింత పెరుగుతుంది.
అంతేకాదు వాళ్ళ మైండ్ మొత్తం నా కంట్రోల్ లోనే ఉంటుంది నేను ఏది చెప్తే అది చేస్తారు." అని నవ్వుతూ చెప్పాడు కళింగ.
"ఒకవేళ! వాళ్ళని కూడా దాటుకుని ఆ సోల్జర్స్ లోపలికి వస్తే తోడేళ్లు ఒక్కొక్కరిని చీల్చి చెండాడుతాయి." అని కసిగా చూస్తూ చెప్పాడు సయ్యద్.
"ఆ తోడేళ్లని కూడా దాటగలిగితే హిడిచి నీ ఎదుర్కోవాలి అది ఎవరి తరం కాదు." అని చెప్పాడు రేపాలా.
"సయ్యద్" నువ్వు వెళ్లి ఆ గబ్బర్ ని తీసుకురా ఆ పద్మం నుంచి అలకాపురి నగరం దగ్గరికి వెళదాము." అని చెప్పాడు రేపాలా.
"మరి అక్కడ మనకి తోడుగా ఎవరు ఉంటారు? సయ్యద్ మనుషులు రాలేదు కదా!" అని అనుమానంగా అడిగాడు చింగ్ యా.
"మన దగ్గర ఇండియన్ సోల్జర్స్ 12 మంది ఉన్నారు కదా వాళ్ళని మనకి సెక్యూరిటీగా తయారు చేస్తాను అవసరం అయితే రేపాలా తన పూర్వీకులను నిద్ర లేపుతాడు." అని చెప్పాడు కళింగ.
"అది ఆఖరి అస్త్రం మన ప్రాణాల మీదకి వచ్చింది అంటేనే దానిని ఉపయోగించాలి వాళ్లతో రాబోయే కాలంలో చాలా పని ఉంది." అని చెప్పాడు రేపాలా.
"సరే! నేను వెళ్లి ఆ పద్మన్ని తీసుకువస్తాను." అని రూమ్ లోకి వెళ్లి గురక పెట్టి నిద్రపోతున్న గబ్బర్ ని చూసి దగ్గరకు వెళ్లి
"సార్! రెస్ట్ తీసుకుంటున్నారా..? మనం డీల్ మాట్లాడుకుందాము అన్నారు." అంటూ చుట్టూ చూసి "యంగ్ భూపాల్ సింగ్ ఎటు పోయారు." అని కంగారుగా బయటికి వచ్చి "సైంటిస్ట్! లోపల యంగ్ లేడు." అని చెప్పాడు సయ్యద్.
"ఈ ల్యాబ్ లో నుంచి ఎక్కడికి పోతాడు సరిగ్గా చూడు ఏ రూమ్ లోనే ఉంటాడు." అని చెప్పాడు చింగ్ యా.
ఆ మాట విని లోపల ఉన్న రూమ్స్ మొత్తం చెక్ చేసి "ఎక్కడ లేడు ఈ గబ్బర్ తన శక్తితో యంగ్ ని ఎక్కడో దాచాడు." అని చెప్పాడు సయ్యద్.
"అవునా? ముందు వాడిని నిద్ర లేపు ఆ గురక సౌండ్ వింటేనే ఇరిటేషన్ వస్తుంది." అని కోపంగా చూస్తూ చెప్పాడు కళింగ.
ఆ మాట విని గ్లాస్ తో నీళ్లు తెచ్చి గబ్బర్ మోహనా కొట్టేడు చింగ్ యా.
నీళ్లు పడడంతో ఉలిక్కిపడి లేచి ఎదురుగా ఉన్న రేపాలా వాళ్ళని చికాకు చూస్తూ "ఏంట్రా! పిచ్చిపిచ్చి వేషాలు వేస్తున్నారు నాకు కోపం వస్తే అందరిని మడతపెట్టి సంకలో పెట్టుకుని వెళ్ళిపోతాను." అని అక్కడ ఉన్న చింగ్ యా వైపు చూసి
"వీడెవాడు ఇక్కడ గుర్కా నా..? నా వైపు అదోలా చూస్తున్నాడు ఎందుకు, అయ్యినా వీడిని నా రూమ్ లోకి ఎందుకు తీసుకువచ్చారు?" అని కోపంగా అడిగాడు గబ్బర్.
ఆ మాట విని కోపంగా చూస్తూ "ఏంటి! నన్ను గుర్కా అంటావా..?" అని అడిగాడు చింగ్ యా.
"సరే కానీ! మనం డీల్ మాట్లాడుకుందాం అనుకున్నాము కదా యంగ్ ఎక్కడ?" అని అడిగాడు కళింగ.
ఆ మాటకి చుట్టూ చూస్తూ "నాకు మాత్రం ఏం తెలుసు ఇప్పటి దాకా ఇక్కడే ఉన్నారు కదా! గాలి పీల్చుకోవడానికి బయటకి వెళ్ళారేమో వస్తారు." అని చెప్పాడు గబ్బర్.
రేపాలా సైగ చేయడం చూసి గబ్బర్ పక్కన ఉన్న సూట్ కేస్ తీసుకుని ఓపెన్ చేసి "సైంటిస్ట్! దింట్లో చిత్తు కాగితాలు ఉన్నాయి వీడు మనల్ని మోసం చేస్తున్నాడు." అని కోపంగా చూస్తూ చెప్పాడు సయ్యద్.
ఆ మాట విని కోపంగా చూస్తూ గన్ తీసి గబ్బర్ నెత్తి మీద పెట్టి "ఆ వస్తువు ఎక్కడ? యంగ్ ఏం చేసావు?" అని అడిగాడు చింగ్ యా.
"నేను మిమ్మల్ని మోసం చేయడం కాదు నన్ను అందరూ కలిసి మోసం చేశారు, కావాలంటే ఈ యామపాశం ఉంచుకొని నన్ను వదిలేయండి." అని కర్ర ని చింగ్ యా చేతికి ఇచ్చాడు గబ్బర్.
ఆ కర్రని తీసుకొని రెండు ముక్కలు చేసి గిరాటు వేసి "నేను చెబుతూనే ఉన్నావు కదా! వీడికి ఏదో శక్తీ సహాయం చేసింది." అని గబ్బర్ వైపు కోపంగా చూస్తూ.
"నన్ను ఒరేయ్ రేపాలా అని పిలుస్తావా? కుక్క బిస్కెట్లు తినమంటావా..? ఇప్పుడు నీ సంగతి చెప్తాను హిడిచి వీడిని రెండు ముక్కలుగా చేసి తినేసేయ్!" అని చెప్పాడు రేపాలా.
ఆ మాట విని కంగారుగా చూస్తూ "నన్ను తినడం ఏమిట్రా మిమ్మల్ని తగలెయ్య!" అని ఏడుస్తూ "మిమ్మల్ని అని ఉపయోగం లేదు మా తాతని అనాలి నాకి ఈ శక్తి ఇవ్వడం వల్లే ఇది అంతా జరిగింది." అని ఏడుస్తూ చెప్పాడు గబ్బర్.
"రేపాలా! వీడిని చంపకు ఆ సోల్జర్స్ తో పాటు ఉంచండి వీడి ఒంట్లో వైరస్ డబల్ డోస్ ఎక్కిస్తాను." అని కోపంగా చూస్తూ చెప్పాడు కళింగ.
"సరే సైంటిస్ట్!' అని గబ్బర్ ని తీసుకువెళ్లి సోల్జర్స్ ఉన్న రూమ్లో ఉంచాడు సయ్యద్.
అక్కడ స్పృహ లేకుండా ఉన్న సోల్జర్స్ ని చూసి "మహారాజా! నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళిపోయరు, ఒకడు రెండు ముక్కలు చేసుకుని తినేస్తాను అంటున్నాడు.
ఒకడు వైరస్ ని డబల్ డోరస్ ఎక్కిస్తాను అంటున్నాడు ఆఖరికి గుర్కా కూడా నా వైపు కోపంగా చూస్తున్నాడు." అని దిగాలుగా కూర్చున్నాడు గబ్బర్ సింగ్.

" రుద్రం భజే? ఎపిసోడ్ 50 " రచనకు రేటింగ్ ఇవ్వండి

![[+]](https://xossipy.com/images/bootbb/collapse_collapsed.png)