Thread Rating:
  • 4 Vote(s) - 4 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఏజెంట్ రూహి వాసుదేవ్
#26
ఏజెంట్ రూహి వాసుదేవ్...12


[Image: cover?seriesId=485271&version=e0736d03-4...e122606d44]



అప్పటికి రూహి, ఆ చైనా  వారి స్తావరానికి వచ్చి మూడు రోజులు అయ్యింది. కానీ ఇంత వరకు వారు భారత దేశం మీద ప్రయోగించబోయే ఆయుధం ఏంటో కనిపెట్టలేకపోయింది. అక్కడ అందరికీ కొంచెం కొంచెం అవగాహన మాత్రమే వచ్చేలా పనులు ఇస్తున్నారు. కానీ పూర్తి ప్రాజెక్ట్ గురించి మాత్రం ఎవరికీ తెలియనివ్వడం లేదు. రూహి, అయాన్ ఇద్దరూ వారి కాలేజ్ లో కెమిస్ట్రీ స్పెషలైజేషన్ తీసుకోవడం తో అక్కడ ఏదోలా మేనేజ్ చేస్తున్నారు. లేకపోతే ఈ పాటికి ఎప్పుడో వారికి దొరికిపోయేవారు.

తమ దగ్గర ఎక్కువ సమయం లేదు, ఎలాగైనా సరే వచ్చిన పని త్వరగా పూర్తి చేయాలి అని రూహి కి బాగా తెలుసు. కానీ అదేలాగో అర్థం కావడం లేదు. పైగా అక్కడ సెక్యూరిటీ చాలా కట్టుదిట్టంగా ఉంది. ఎక్కడికి వెళ్లినా అడుగడుగునా చైనా సైనికులు కాపలాగా ఉన్నారు. వారి కళ్ళు గప్పి తిరగడం చాలా కష్టం. సరైన సమయం కోసం ఎదురుచూస్తుంది.

అలా ఆ రోజు రాత్రి రూహి ఆలోచనల్లో ఉండగా... మెల్లగా అయాన్ తన దగ్గరకు వచ్చాడు.

"మేడమ్, ఎలా ఉంది ఇప్పుడు మీకు?" అని నిదానంగా అడిగాడు.

రూహి మొదట ఆశ్చర్యపోయి, తరువాత కంగారుగా ఒకసారి చుట్టూ చూసింది. తమకు కాపలా గా ఎవరూ లేరు. నిజానికి అక్కడికి ఎత్తుకొని వచ్చిన 8 మందికి విడి విడిగా గదులు కేటాయించారు. ఎవరూ మరొకరితో మాట్లాడకూడదు. మాట్లాడితే ఇష్టమొచ్చినట్టు శిక్షించేవారు. ఇప్పుడు అయాన్ వారి కళ్ళు గప్పి రూహి గదిలోకి వచ్చాడు.

"ఏంటి అయాన్. నీకేమైనా పిచ్చా. ఎందుకిలా వచ్చావు. పొరపాటున నిన్ను ఎవరైనా చూస్తే." అని రూహి కంగారుగా అడిగింది.

"మిమ్మల్ని చూడకుండా ఉండలేకపోయాను. అయినా బయట ఎవరూ లేరు లే మేడమ్. మీకెలా ఉంది ఇప్పుడు " అని అడిగాడు.

"దెబ్బలు దాదాపు తగ్గిపోయాయి. ఇప్పుడు కొంచెం పర్లేదు."

ఆ మాట వినగానే అయాన్ కళ్ళలో ఓ ఆనందం కనిపించింది. అది చూసి రూహి మనసులో కూడా సంతోషం కలిగింది.

"మేడమ్. ఆగష్టు 15 ఎంతో దూరంలో లేదు. ఆలోగా వీరి గుట్టు కనిపెట్టి మట్టుబెట్టాలి. మన దగ్గర ఎక్కువ సమయం లేదు. తరువాత ఏం చేయాలో ఏమైనా ఆలోచించారా?" అని అడిగాడు.

"అదే తెలియడం లేదు అయాన్. ఈ ఆపరేషన్ గురించి ఎవరికీ పూర్తిగా తెలీదు. దీనికి సంబంధించిన మొత్తం వివరాలు ఈ బిల్డింగ్ లో ఉన్న ఒక రహస్య గదిలో పెట్టారు. కానీ దాని తెరవాలంటే రెండు కావాలి. ఒకటి తాళం, రెండోది వేలి ముద్ర...
ఆ రెండు ఈ చైనా సైన్యాధ్యక్షుడు చాంగ్ లీ దగ్గర మాత్రమే ఉంటాయి. తనకు తెలియకుండా తన నీడను కూడా తాకలేము. అలాంటిది వాటిని ఎలా తీసుకొని రావాలో తెలియడం లేదు. " అని రూహి పలికింది.

"మరి ఇప్పుడెలా మేడమ్."

"అదే ఆలోచిస్తున్నాను. వాడికి సంబందించిన వాటిలో మనకు పనికొచ్చేది ఒక్కటి దొరికినా చాలు. ఒకే ఒక్క అవకాశం. దెబ్బకు వాడికి చుక్కలు కనిపించాలి."

అప్పుడే అయాన్ కి ఒక విషయం గుర్తొచ్చింది.
"మేడమ్, ఆ చాంగ్ గురించి నేను ఒకటి గమనించాను. వాడికి అమ్మాయిల పిచ్చి చాలా ఉంది. ప్రతి రోజు రాత్రి వాడి గదికి అమ్మాయిలను పిలిపించుకోవడం నేను చూసాను. అదేమైనా మనకు ఉపయోగపడుతుంది అంటారా "

అ మాట వినగానే రూహి ఆలోచనలో పడిపోయింది. చాంగ్ కి అమ్మాయిలంటే ఇష్టమని మొదటి రోజే తనకు తెలుసు. ఎందుకంటే రెండు మూడు సార్లు తనని తినేసేలా చూసాడు. కానీ తను అంతగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు అయాన్ చెప్తుంటే, ఈ ఆపరేషన్ గురించి తెలుసుకోవడానికి అదొక్కటే దారి అనిపించింది.

"సరే అయాన్.. ఒక పని చెయ్. రేపు మనం వర్క్ చేయడానికి ల్యాబ్ కి వెళ్తాం కద. అక్కడ వీలైతే ఎలాగోలా కొంచెం క్లోరొఫారం సంపాదించు. నేను ఈలోగా ఆ చాంగ్ ని ముగ్గులోకి దింపుతాను. వాడి గదికి వెళ్తాను. ఎలాగోలా మనకు కావాల్సిన వాటిని సంపాదిస్తాను. రేపు రాత్రికే వాడికి ముహూర్తం పెట్టాలి. మన దగ్గర అస్సలు సమయం లేదు."

"మేడమ్ మీరు చెప్తుంది చాలా ప్రమాదకరం. ఏ మాత్రం తేడా వచ్చినా..." అంటూ అయాన్ ఆగిపోయాడు.

"మహా అంటే ఏమవుతుంది. వాడు నన్ను అనుభవిస్తాడు. లేదా నా ప్రాణం తీస్తాడు. ఈ రెండిటిలో ఏది జరిగినా నాకు బాధ లేదు. దేశం కోసం ఆయుధం పట్టాను. కానీ ఇప్పుడు అదే దేశం కోసం నా దేహాన్ని ఓ ఆయుధం లా మార్చుకోబోతున్నాను. మన దేశం ముందు నా దేహం ఎక్కువ కాదు. ఓ కుక్క నా మీద చెయ్యి వేస్తె నేను మలినం అయిపోను కద. ఆ మువ్వన్నెల జెండా స్వేచ్ఛగా విహారిస్తున్నంత కాలం ఈ రూహి వాసుదేవ్ ఊపిరి ఆడుతూనే ఉంటుంది." అని స్పష్టంగా పలికింది.

అయాన్ కళ్లలో నీళ్లు తిరిగాయి. దేశం కోసం ఒక అమ్మాయి అత్యంత ముఖ్యమైనది గా భావించే శీలం సైతం తృణ పాయంగా వదులుకోడానికి సిద్ద పడిన రూహి ని చూసి గర్వం తో తన గుండె మొత్తం నిండిపోయింది. అలాంటి అమ్మాయిని ప్రేమిస్తున్నందుకు తన మీద తనకే గౌరవం పెరిగింది.

వీరు ఇలా నిలబడి ఉండగానే... వారి గది బయట ఎవరో వస్తున్నట్టు అడుగుల శబ్దం అయ్యింది. ఇప్పుడు ఆ గదిలో అయాన్ ని చూస్తే అంతే సంగతులు. అయాన్ కి ఏం చేయాలో అర్థం కాలేదు. రూహి వెంటనే అయాన్ ని మంచం మీదకు లాగి, ఇద్దరికి కలిపి దుప్పటి కప్పింది. బయట నుంచి చూస్తే ఒకరే పడుకున్నట్టు ఉంది.

ఊహించని ఆ చర్యకు అయాన్ కాసేపు షాక్ అయ్యాడు. కానీ కదలకుండా అలాగే ఉండిపోయాడు. ఇంతలో ఓ చైనా సైనికుడు ఆ గదిలోకి ఒకసారి తొంగి చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.

అయాన్, రూహి మాత్రం అలాగే ఉన్నారు. రూహి పడుకొని ఉంటే, తన మీద అయాన్ ఉన్నాడు. వారి ఇద్దరి మధ్య దూరం కొన్ని అంగుళాలు మాత్రమే. అయాన్ అంత దగ్గరగా ఉండటం తో జీవితంలో అప్పటిదాకా తెలియని సిగ్గు రూహి దరి చేరింది. తన బుగ్గలు మందారం లాగా ఎర్రగా కందిపోయాయి. కనురెప్పలు క్షణానికి ఓ సారి మూసుకుంటున్నాయి. ఇక అధరాలు అదే పనిగా వణికిపోతున్నాయి. అయాన్ పరిస్థితి కూడా అలాగే ఉంది.

ఆ ఏసీ గదిలో కూడా ఇద్దరికి చమటలు పట్టాయి. ఒకరి కళ్ళలోకి మరొకరు చూస్తూ ఉండిపోయారు. వారి మధ్య చేరిన దూరం కూడా మెల్లగా కరిగిపోయింది. అయాన్ అలాగే ముందుకు జరిగాడు. రూహి గుండె వేగం పెరిగింది. తన గుండె చప్పుడు తనకే వినిపిస్తుంది.

రూహి ఆ తీయని అలజడి భరించలేక కళ్ళు మూసుకుంది. అయాన్ అలాగే ముందుకు జరిగి రూహి నుదుటి మీద ఓ ముద్దు పెట్టాడు. రూహి కి దక్కిన మొదటి ముద్దు అది. ఎందుకో తెలీదు తన మనసంతా గాల్లో తేలినట్టు అనిపించింది. కొన్ని క్షణాలు ఇద్దరూ కదలకుండా అలాగే ఉండిపోయారు. కాసేపటికి తేరుకొని అయాన్ ముందుగా పైకి లేచి నిలబడ్డాడు.

రూహి సిగ్గు పడుతూ అలాగే కూర్చుంది. అయాన్ వైపు కూడా చూడలేకపోతుంది.

ఇంతలో అయాన్ మెల్లగా నోరు తెరిచాడు.
"మేడమ్... రేపు ఆ చాంగ్ మీద చేయబోయే సాహసం విజయవంతం అయ్యాక మీకొక విషయం చెప్తాను. ఎన్నో రోజులుగా నాలోనే దాచుకున్న సంగతి అది. రేపు మీ ముందు పరుస్తాను. వెళ్ళొస్తాను మేడమ్ " అని పలికి అయాన్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.

రూహి తననే చూస్తూ ఉండిపోయింది. తన మనసులో రేపు అయాన్ ఏం చెప్తాడో బాగా తెలుసు. ఆ మాట వినే క్షణం కోసం మది ఇప్పటి నుంచే తెగ మురిసిపోయింది. జీవితంలో ఇదివరకు ఎన్నడూ తెలియని హాయి అది. ఎలా మదిని ఆపాలో తెలియక రూహి ఉక్కిరి బిక్కిరి అయ్యింది.
అలా రేపటి గురించి ఆలోచిస్తూ మెల్లగా నిద్రలోకి జారుకుంది.

-----------------------------------------------------------

హైదరాబాద్...

"అరేయ్ ఏమంటున్నార్రా... నలుగురు రౌడీలు వెళ్లి ఒక్క ఆడ పిల్లను చంపలేక, దాని చేతిలో చావు తప్పించుకొని వచ్చారా?" అంటూ జలంధర్ కోపంగా అరిచాడు.

"అన్నా.. తను ఆడపిల్ల కాదు. ఆడ పులి లాగా ఉంది. మేము ఎదురుగా నిలబడి ఉన్నప్పుడు తన కళ్ళలోకి చూడాలి. అసలు భయమన్నదే లేదు. పైగా తెగించి బరిలోకి దిగిన సైనికుడి లాగా నుంచుంది. నా చిన్నప్పుడు రుద్రమదేవి పరాక్రమం గురించి చదివినా, కానీ మొదటి సారి రాత్రే చూసినా..." అంటూ భయపడుతూ ఓ రౌడీ చెప్పాడు.

"అంత ధైర్యవంతురాలా తను... అయితే ఆ ధైర్యం నేను కూడా తప్పకుండా చూడాల్సిందే. కానీ దాన్ని చంపే ముందు ఒక్కసారి తనివితీరా కోరిక తీర్చుకొని చంపాలని ఉంది. అలాంటి ఆడదాన్ని అనుభవిస్తేనే మజా.."

"అన్న... ఆ సుజిత దాని ఇంట్లో ఉన్నంతవరకు మనం ఏమి చేయలేము. అది కాక ఇప్పుడు తనకు మనం మళ్ళీ వస్తామని బాగా తెలుసు. తప్పకుండా తన జాగ్రత్త లో తను ఉండే ఉంటుంది. తొందరపడి అక్కడికి వెళ్తే అందరం దొరికిపోతాం"

"నువ్వు చెప్పింది నిజమే. సరే ఒక పని చేయండి. ఎవరైనా కొత్త కుర్రాడికి చెప్పి తన కదలికల మీద నిత్యం ఓ కన్ను వేసి ఉంచమని చెప్పు. సరైన సమయం దొరకగానే ఎత్తుకొని మన స్తావరానికి వచ్చేయండి. దానికి మన సత్తా ఏంటో చూపిద్దాం." అంటూ జలంధర్ పళ్ళు కొరుకుతూ పలికాడు.

"సరే అన్న.. " అంటూ ఆ రౌడీలు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

జలంధర్ ఆలోచనలో పడిపోయాడు. సుజిత మీద కోపం ఎక్కువగా ఉంది. తనకు అప్పజెప్పిన పని ఆగిపోవడం అంటూ ఉండదు, అలాంటిది మొదటిసారి సుజిత మూలంగా జరగకపోవడం తో పట్టరాని కోపం కలిగింది. తనని ఎత్తుకొని వచ్చాక నరకం చూపించి మరీ చంపాలి అని కసిగా అనుకున్నాడు.


" . ఏజెంట్ రూహి వాసుదేవ్...12 " రచనకు రేటింగ్ ఇవ్వండి
[+] 8 users Like SivaSai's post
Like Reply


Messages In This Thread
RE: ఏజెంట్ రూహి వాసుదేవ్ - by SivaSai - 17-05-2026, 07:26 AM



Users browsing this thread: